Jump to content

బైసన్

వికీపీడియా నుండి
బైసన్
దర్శకత్వంమారి సెల్వరాజ్
రచనమారి సెల్వరాజ్
నిర్మాతసమీర్ నాయర్
దీపక్ సీగల్
పా. రంజిత్
అదితి ఆనంద్
తారాగణం
ఛాయాగ్రహణంఎజిల్ అరసు కె.
కూర్పుశక్తి తిరు
సంగీతంనివాస్ కె. ప్రసన్న
నిర్మాణ
సంస్థలు
అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
నీలం స్టూడియోస్
పంపిణీదార్లుఫైవ్ స్టార్ క్రియేషన్స్
విడుదల తేదీ
17 అక్టోబర్ 2025 (2025-10-17)
సినిమా నిడివి
168 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

బైసన్ 2025లో విడుదలైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మించిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ రచించి, దర్శకత్వం వహించాడు. కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, అళగం పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

బైసన్ సినిమాను డిసెంబర్ 2020లో DV03 తాత్కాలిక పేరుతో అధికారికంగా ప్రకటించారు, ఇది ధ్రువ్ కథానాయకుడిగా నటిస్తున్న మూడవ సినిమా, అధికారిక టైటిల్ మే 2024లో ప్రకటించబడింది. అదే నెలలో చెన్నైలో ప్రధాన ఫోటోగ్రఫీ ప్రారంభమై 2025 ఫిబ్రవరి మధ్య నాటికి ముగిసింది. ఈ సినిమాకి నివాస్ కె. ప్రసన్న సంగీతం సమకూర్చాడు, ఎజిల్ అరసు కె సినిమాటోగ్రఫీని, శక్తి తిరు ఎడిటింగ్‌ను నిర్వహించాడు.

బైసన్ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలు అందుకుంది.[2]

కిట్టయ్య (ధ్రువ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ప్రాణం. ఊరిలో కుటుంబ కక్షల కారణంగా సొంత కులం వాళ్ళు ఉన్న జట్టులోకి అతడిని తీసుకోరు. అయితే కిట్టయ్యలోని ప్రతిభను స్కూల్ పీఈటీ మాస్టర్ (మదన్ కుమార్) గుర్తించి శిక్షణ ఇస్తాడు. తమిళనాడులోని మారుమూల గ్రామం నుండి జ‌పాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం తరఫున సెలెక్ట్ అవుతాడు. కానీ అత‌న్ని ఆడ‌నివ్వ‌రు. ఎక్స్‌ట్రా ప్లేయ‌ర్‌గా ఉండ‌మంటారు. కులవివక్ష వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతడికి తన తండ్రి వేలు సామి (పశుపతి), అక్క రాజి (రజిషా విజయన్) ఎటువంటి సహకారం అందించారు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."హద్దే లేని"మరి సెల్వరాజ్
యనమండ్ర రామకృష్ణ
 ఎ. వల్లవన్5:49
2."తీరేనా"మరి సెల్వరాజ్
యనమండ్ర రామకృష్ణ
7:09మనువర్ధన్ 

మూలాలు

[మార్చు]
  1. "Bison". Central Board of Film Certification. Archived from the original on 11 October 2025. Retrieved 11 October 2025.
  2. "రివ్యూ: బైస‌న్‌.. విక్రమ్‌ కుమారుడి సినిమా ఎలా ఉందంటే." Eenadu. 25 October 2025. Retrieved 25 October 2025.
  3. "బైసన్ మూవీ రివ్యూ.. విక్రమ్ తనయుడు తెలుగులో హిట్టుకొట్టాడా.. ?". TV9 Telugu. 24 October 2025. Retrieved 25 October 2025.
  4. "బైసన్ మూవీ రివ్యూ: కబడ్డీ ఆటలో కులం గెలిచిందా? కిట్టయ్య గెలిచాడా?". BBC News తెలుగు. 24 October 2025. Retrieved 25 October 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బైసన్&oldid=4652242" నుండి వెలికితీశారు