బొంగరాల ఆట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొంగరాల ఆటకు సంబంధించిన కొన్ని చిత్రాలు

బొంగరములతో ఆడే ఆటను బొంగరాల ఆట అంటారు. బొంగరాల ఆటను ఆంగ్లంలో గేమింగ్ టాప్ అంటారు. భారతదేశం మరియు పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆటను ఎక్కువగా ఆడతారు. బొంగరాలకు ఉండే మేకుల వలన ఈ ఆట ఆడే వారికి లేదా ఈ ఆట ఆడే ప్రదేశంలోని ఇతరులకు గాయాలవుతాయనే ఉద్ధేశంతో పెద్దలు ఈ ఆట ఆడవద్దని పిల్లలకు చెబుతారు. ఈ బొంగరాల ఆట ఆడటానికి నైపుణ్యం మరియు ఆసక్తి అవసరమవుతాయి. ఈ ఆటను పిల్లలు మరియు యువకులు ఎక్కువగా ఆడతారు. మగవారు ధరించే దుస్తులు ఈ ఆటకు అనుకూలంగా ఉండుట వలన ఈ ఆట మగవారు ఆడే ఆటగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆట మరీ ఎక్కువగా ఆడతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఆట అడినట్లయితే చూసే వారికి, ఆడే వారికి చాలా ఆసక్తిగా ఉంటుంది.

బొంగరం యొక్క భాగాలు[మార్చు]

జాటీని చుట్టేందుకు బొంగరం కింది వైపున మేకు ఉండి V ఆకారంలో పైకి మెట్లు మెట్లుగా ఉంటుంది. పై భాగాన డోమ్ వలె ఉండి చేతితో పట్టుకొని విసరడానికి అనువుగా ఉంటుంది. బొంగరానికి జాటీ చుట్టీ విసిరినప్పుడు మేకు కింది వైపున ఉండుట వలన బొంగరం వేగంగా, ఎక్కువ సేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. బొంగరం అందంగా కనపడటానికి డోం వలె ఉన్న పై భాగమున వివిధ రంగులు పూయబడి ఉంటాయి. సాధారణంగా వాడేవి, మొదటి నుంచి ఉన్నవి, అందమైనవి చెక్క బొంగరాలు. ప్రస్తుతం ప్లాస్టిక్ బొంగరాలను కూడా ఉపయోగిస్తున్నారు.

నిబంధనలు[మార్చు]

ఆటల పోటీలు[మార్చు]

బొంగరాల చెట్టు[మార్చు]

బొంగరాల చెట్టుకు కాసిన మొగ్గలు, కాయల యొక్క తొడిమను చేతి వేళ్ళతో పట్టుకొని గిర్రున తిప్పి బొంగరాల ఆట ఆడుకుంటారు.

బొంగరాల చెట్టుగా ప్రసిద్ధి పొందిన గంగరావి చెట్టు కాయలు బొంగరం ఆకారాన్ని పోలి బొంగరం వలె తిరుగుట వలన వీటి కాయలతో బొంగరాల ఆటల పోటీలు ఆడుకుంటారు. ఈ ఆటలో పాల్గొనేవారు అందరు కలిసి ఒకేసారి బొంగరాల చెట్ల కాయలను తిప్పితే ఎవరు తిప్పిన బొంగరం ఎక్కువ తిరుగుతుందో వారు విజేతగా నిలుస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]