Coordinates: 16°15′34″N 80°28′32″E / 16.259344°N 80.475625°E / 16.259344; 80.475625

బొంతపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొంతపాడు గుంటూరు జిల్లా గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

బొంతపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
బొంతపాడు is located in Andhra Pradesh
బొంతపాడు
బొంతపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°15′34″N 80°28′32″E / 16.259344°N 80.475625°E / 16.259344; 80.475625
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522017
ఎస్.టి.డి కోడ్ 0863

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధిచేసి, మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దటానికై, "ఆప్టా", "బి.సి.టీచర్స్ ఫెడెరేషన్" సంయుక్తంగా దత్తత తీసికొన్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పోలేరమ్మ, శ్రీ పోతురాజుస్వామివారల ఆలయం:- ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016, ఫిబ్రవరి-8వ తేదీ సోమవారం నుండి 10వ తేదీ బుధవారం వరకు వైభవంగా నిర్వహించారు. 10వ తేదీ ఉదయం 8-04 గంటలకు పోలేరమ్మ తల్లితోపాటు, పోతురాజు, శిఖర, కలశ ప్రతిష్ఠలు నిర్వహించారు. యంత్రస్థాపన, కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, బింబప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి మొదలగు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామం నుండియేగాక భక్తులు పరిసర ప్రాంతాలైన ఏటుకూరు, అనంతవరప్పాడు, నగర ప్రాంతం వగైరాల నుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=బొంతపాడు&oldid=4130399" నుండి వెలికితీశారు