బొగత వాటర్‌ఫాల్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో బొగత జలపాతం ఉంది.[1]కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి.[2]

ప్రదేశం[మార్చు]

కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్లాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లే బొగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు.

Bogatha Waterfal

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, వాజేడు(ములుగు) (1 September 2019). "'బొగత'లో పర్యాటకుల సందడి". ntnews.com. మూలం నుండి 1 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 1 September 2019.
  2. బొగత వాటర్‌ఫాల్స్. "తెలంగాణ నయాగరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 9 September 2017. Cite news requires |newspaper= (help)