బొజ్జవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొజ్జవారిపల్లె, వైఎస్ఆర్ జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలోని దేవాలయాలు

[మార్చు]

శ్రీ గణపతిస్వామివారి ఆలయం:- 2014, జూన్-12, గురువారం నాడు గణపతి విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చేదపండితుల ఆధ్వర్యంలో వేకువఝామునుండి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద యెత్తున తరలివచ్చారు. ఈ ఆలయంలో 2014, జూలై-22 మంగళవారం నాడు, మండల పూజ ఘనంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 41వ రోజు కావడంతో వేదపండితుల సమక్షంలో హోమపూజలు నిర్వహించారు. వేకువఝామునుండియే అభిషేకాలు, హారతులు, ప్రత్యేకపూల అలంకరణలు నిర్వహించారు. మద్యాహ్నం వరకు జరిగిన హోమపూజలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మద్యాహ్నం ఒక వేయిమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

మూలాలు

[మార్చు]