బొడ్డువాని పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°43′16″N 79°58′52″E / 15.721°N 79.981°E / 15.721; 79.981Coordinates: 15°43′16″N 79°58′52″E / 15.721°N 79.981°E / 15.721; 79.981
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంకొరిశపాడు మండలం
విస్తీర్ణం
 • మొత్తం32.87 కి.మీ2 (12.69 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం17,885
 • సాంద్రత540/కి.మీ2 (1,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1012
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్(PIN)523212 Edit this on Wikidata


బొడ్డువాని పాలెం, బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్ నం. 523212., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

సమీప గ్రామాలు[మార్చు]

ఘడియపూడి 4 కి.మీ, మేదరమెట్ల 5 కి.మీ, కొత్తకోట 5 కి.మీ, కొలచనకోట 6 కి.మీ, కీర్తిపాడు 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన మద్దిపాడు మండలం, ఉత్తరాన అద్దంకి మండలం, పశ్చిమాన తాళ్ళూరు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పాలకేంద్రం.

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]

  1. ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015, మే/జూన్ నెలలలో నిర్వహించారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [3]
  2. యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం:- ఈ పథకం నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమగును. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. [2]

శ్రీ మహా గణపతి, పార్వతీ సమేత శ్రీ భవ్య లింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మిచనున్న ఈ ఆలయ నిర్మాణానికి, 2016, ఏప్రిల్-2వ తెదీ సోమవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు, [4]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

బొడ్డువానిపాలెం గ్రామం పచ్ఛని పంటలతో, పాడి పసువులతో చాలా అందంగా ఉంటుంది.ఈ ఊరిలో ముఖ్యంగా రెండు వర్గాల ప్రజలు ఉంటారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 17,885 - పురుషుల సంఖ్య 8,890 - స్త్రీల సంఖ్య 8,995 - గృహాల సంఖ్య 4,794

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,442.[3] ఇందులో పురుషుల సంఖ్య 7,276, మహిళల సంఖ్య 7,166, గ్రామంలో నివాస గృహాలు 3,434 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 3,287 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఏప్రిల్-9; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, జూన్-24; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, మే-3; 2వపేజీ.