బొబ్బిలి యుద్ధం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బొబ్బిలి యుద్ధం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం.

హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్ బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత విజయనగరం రాజులు తప్ప ఉత్తర కోస్తా జమిందారులు ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. అందుచేత బుస్సీ సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. ఇతనికి విజయనగరం రాజు విజయ రామరాజు ప్రధాన సలహాదారుడైనాడు. బొబ్బిలి వారు కూడా ఫ్రెంచి వారికి శిస్తు బకాయి పెట్టారు. విజయనగరానికి, బొబ్బిలికి చాలా కాలం నుండి శతృత్వం ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయనగరం జమిందారు బొబ్బిలిపై కక్ష సాధించదలచి విజయరామరాజు ప్రోద్బలంపై ఫ్రెంచి వారు బొబ్బిలిని ముట్టడించారు. వారికి విజయనగరం, పెద్దాపురం సైన్యాలు తోడ్పడినవి. క్రీ.శ. 1757 జనవరి 24 తేదీన జరిగిన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమిందారైన రంగారావు చంపబడ్డాడు. బొబ్బిలి కోట పతనమైనది. దీనికి ప్రతీకారంగా తాండ్ర పాపారాయుడు

ఇవి కూడా చూడండి[మార్చు]