బొమ్మన్ కార్టూనిస్ట్
| బొమ్మన్ కార్టూనిస్ట్ | |
|---|---|
గారోజు బ్రహ్మం | |
| జననం | 1958 ఫిబ్రవరి 1 గుండుగొలను, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| నివాస ప్రాంతం | కంకిపాడు |
| ఇతర పేర్లు | గారోజు బ్రహ్మం |
| భార్య / భర్త | సూర్య కుమారి |
| పిల్లలు | లక్ష్మీనారాయణ, శ్రీధర్ కుమార్ ఇద్దరు కుమారులు |
బొమ్మన్ తెలుగు కార్టూనిస్ట్, ఇలస్ట్రేటర్.
జీవిత విశేషాలు
[మార్చు]'బొమ్మన్' కలం పేరుతో కార్టూన్లు వేస్తున్న ఈయన పూర్తి పేరు గారోజు బ్రహ్మం, గారోజు నారాయాణాచార్యులు, సరస్వతమ్మ దంపతులకు 7వ సంతానంగా 1958 ఫిబ్రవరి 1 న పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులో పుట్టాడు. 10వ తరగతి వరకు గుండుగొలనులో చదువుకొని, ఇంటర్, బి.ఏ., బి.ఈడి., ఎం.ఏ. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో పూర్తి చేశాడు. 1977-80 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగాను, 1980 నుండి జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేసి జిల్లా ప్రొబేషన్ అధికారిగా 2018లో పదవీవిరమణ చేశాడు.
కార్టూనిస్టుగా
[మార్చు]ఈయన మొదటి కార్టూన్ అనామిక మాసపత్రికలో ఆగస్ట్ 1977లో ప్రచురించాడు. తరువాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వారపత్రిక, జనసుధ, స్వాతి, పల్లకి లాంటి అనేక పత్రికలు వీరి కార్టూన్లు ప్రచురించబడ్డాయి. వీరి కార్టూన్లను ఆదరించి విశేషంగా ప్రోత్సహించిన సంపాదకులలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ (ఆంధ్రజ్యోతి), స్వాతి బలరాం, శంకు(హాస్యప్రియ), మాధవరావుగారు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) ముఖ్యులు.
కార్టూన్ ద్వారా సామాజిక అవగాహన
[మార్చు]1996-2000 సంవత్సరంల మధ్య ప.గో.జిల్లా వయోజన విద్యాశాఖవారిచే నడుపబడుతున్న 'అక్షర దీక్ష పత్రికకు చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించాడు. సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యతా ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలపై కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించి పలువురి ప్రశంసలు పొందాడు. 1986లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 14 వారాలు, 1988లో స్వాతి వీక్లీలో 36 వారాల పాటు స్ట్రిప్ కార్టూన్లు గీశాడు.
బహుమతులు
[మార్చు]- 1985 స్వాతి వీక్లీ కార్టూన్ పోటీలో తృతీయ బహుమతి.
- 1986 ఆంధ్రప్రభ వీక్లీ కార్టూన్ పోటీలో ప్రథమ బహుమతి.
- 1986 అంధ్రజ్యోతి వీక్లీ కార్టూన్ పోటీలో ప్రథమ బహుమతి.
- 'తానా' కార్టూన్ల పోటీలో ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ 2023[1]
ఇతర లింకులు
[మార్చు]- ↑ ABN (2023-01-16). "TANA: తానా ఆధ్వర్యంలో కార్టూన్ పోటీలు.. విజేతలు వీరే." Andhrajyothy Telugu News. Retrieved 2026-01-24.