బొమ్మన విశ్వనాథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మన విశ్వనాథం భారతీయ సాహిత్యాన్ని వంగభాషలోనికి అనువదించిన తెలుగువ్యక్తి[1]. ఇతడు 1934, నవంబర్ 7వ తేదీన ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం పట్టణంలో జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా ఇతడు తన పదవయేట కలకత్తా చేరుకున్నాడు. అప్పటి నుండి బెంగాలీ భాషను అభ్యసించాడు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచనలు అధ్యయనం చేయడంతో సారస్వతాభిమానం పెంపొదింది. వంగ సాహిత్యాన్ని అభ్యసించడంతో పాటు ఇతర భారతీయ భాషలలోని సాహిత్యాన్ని చవి చూడాలనే ఆసక్తితో తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు[2].

రచనలు[మార్చు]

ఇతని మాతృభాష తెలుగు అయినా, ఇతడు చిన్నప్పటి నుండి వంగదేశంలోనే వుండడం వలన ఇతడు బెంగాలీ భాషలోనే మొదట స్వతంత్ర రచనలు చేశాడు.

  1. అజ్ కేర్ డాక్
  2. సూచనా (నాటకాలు)
  3. నాటికా (ఏకాంకిలు)
  4. ఆధునిక్ భారతేర్ గల్ప సంచయన్ - 14 భారతీయ భాషలనుండి బెంగాలీలోనికి అనువదించబడిన 14 కథలు.
  5. కేరళార్ గల్పగుచ్చ - 14 ఉత్తమ మళయాల కథలకు బెంగాలీ అనువాదం
  6. ఆంధ్రేర్ గల్పగుచ్ఛ - 7 ఉత్తమ తెలుగు కథలకు బెంగాలీ అనువాదం
  7. ఆధునిక్ భారతేర్ కవితా సంచయన్ - 19 ఉత్తమ కవితల బెంగాలీ అనువాదం.

మూలాలు[మార్చు]

  1. "National Library". Cite web requires |website= (help)
  2. ఎ.ఎస్.రామారావు (15 December 1960). "వంగసాహిత్యంలో వెన్నెలలు వెదజల్లుతున్న ఆంధ్రుడు బొమ్మన విశ్వనాథం". చుక్కాని. Retrieved 7 December 2018.