బొమ్మరాసుపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బొమ్మరాసుపేట
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో బొమ్మరాసుపేట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో బొమ్మరాసుపేట మండలం యొక్క స్థానము
బొమ్మరాసుపేట is located in Telangana
బొమ్మరాసుపేట
తెలంగాణ పటములో బొమ్మరాసుపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°10′11″N 77°44′39″E / 17.169659°N 77.744293°E / 17.169659; 77.744293
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము బొమ్మరాసుపేట
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,937
 - పురుషులు 27,858
 - స్త్రీలు 28,079
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.61%
 - పురుషులు 46.99%
 - స్త్రీలు 22.64%
పిన్ కోడ్ 509338
బొమ్మరాసుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండలం బొమ్మరాసుపేట
ప్రభుత్వము
 - సర్పంచి కవిత
పిన్ కోడ్ 509 338
ఎస్.టి.డి కోడ్

బొమ్మరాసుపేట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509 338. ఇది కోడంగల్ నుంచి హైదరాబాదు వెళ్ళు ప్రధాన మార్గమునకు ఎడమవైపున 2 కిలోమీటర్ల లోనికి ఉంది.

భౌగోళిక పరిస్థితి[మార్చు]

బొంరాస్‌పేట మండలం జిల్లాలో వాయువ్యాన రంగారెడ్డి జిల్లా సరిహదులో ఉంది. మండల విస్తీర్ణం 22079 హెక్టార్లు. అందులో 2494 హెక్టార్లు (11%) అటవీప్రాంతము.[1] సాగుభూమి 14801 హెక్టార్లు (67%).

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 55647. ఇందులో పురుషుల సంఖ్య 27766, స్త్రీల సంఖ్య 27881. అక్షరాస్యుల సంఖ్య 22968.[2]

విద్యాసంస్థలు[మార్చు]

2002-03లో స్థాపించబడిన స్వర్ణభారతి జూనియర్ కళాశాల ఉంది.

నీటిపారుదల[మార్చు]

మండలంలో 14 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 1645 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]

పశుసంపద[మార్చు]

1997 నాటి పశుగణన ప్రకారం మండలంలో 20వేల గొర్రెలు, 24వేల మేకలు, 600 పందులు, 780 కుక్కలు, 229500 కోళ్ళు, 12వేల గున్నపోతులు ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కవిత ఎన్నికయింది.[4]

కొన్ని విషయాలు[మార్చు]

  • శాసనసభ నియోజకవర్గం: కొడంగల్.
  • లోకసభ నియోజకవర్గం; మహబూబ్ నగర్.
  • జడ్పీటీసి : మల్కి రెడ్డి
  • మండల అధ్యక్షుడు : గోబ్రియా నాయక్

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Handbook of Statistics, Mahabubnagar Dist, 2009, P.No. 53
  2. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, ఫగె ణొ 125
  3. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013