బొమ్మల కొలువు (సినిమా)
| బొమ్మల కొలువు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
| తారాగణం | చంద్రమోహన్ , జగ్గయ్య, కవిత |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | అప్సర ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
బొమ్మల కొలువు 1980, జూన్ 26న విడుదలైన తెలుగు సినిమా. కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో వాసిరాజు ప్రకాశం నిర్మించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చాడు.[1]
నటీనటులు
[మార్చు]- చంద్రమోహన్
- కవిత
- జగ్గయ్య
- జయమాలిని
- కాంతారావు
- రాజబాబు
- పొట్టి ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: కె.ఎం.అబ్బాస్
- మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
- పాటల రచన: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
- నేపధ్యగానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, సుశీల, జానకి
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- నిర్మాత: వాసిరాజు ప్రకాశం
- దర్సకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
- నృత్యం: హీరాలాల్, సంపత్
- కళ: కళాధర్
- ఎడిటింగ్: ఎ. మోహన్
కథ
[మార్చు]వ్యాపారవేత్త అయిన ధర్మారావు (జగ్గయ్య)కు ఇద్దరు కుమార్తెలు. ధర్మారావును కాపాడే ప్రయత్నంలో అతని డ్రైవర్ వీరయ్య చనిపోతాడు. వీరయ్య కొడుకు రామదాసును తన బిడ్డలా చూసుకుంటానని చనిపోయే ముందు వీరయ్యకు మాట ఇస్తాడు. గయ్యాళి అయిన అతని భార్య శోభ రామదాసు (చంద్రమోహన్) తో ఇంటిపనులు చేయిస్తుంది. పెద్ద కుమార్తె స్వీటీ (జయమాలిని) దీపక్ ను ప్రేమిస్తుంది. అతని వల్ల మోసపోయిన స్వీటీని చేసుకోవాలంటే దీపక్ పేరున ఆస్తి మొత్తం రాయాలని అతని తండ్రి ముకుందం షరతు విధిస్తాడు. దీన్ని తట్టుకోలేక ధర్మారావు గుండెపోటుతో మరణిస్తాడు. ఆ కుటుంబం చెల్లా చెదురు అవుతుంది. ధర్మారావు ఇద్దరి కుమార్తెల కుటుంబాలను రామదాసు ఎలా చక్కదిద్దాడు అనేది చిత్రం తదుపరి కథ.
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట నిడివి |
|---|---|---|
| 1. | "మల్లెపూవు మల్లెపూవు అంటారు" | 04:09 |
| 2. | "ఊనతం పూనిందోయమ్మా" | 03:26 |
| 3. | "బొద్దు పొడుగు" | 04:07 |
| 4. | "బొమ్మల్లారా బొమ్మల్లారా" | 03:30 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Bommala Koluvu (Kommineni Seshagiri Rao) 1980". ఇండియన్ సినిమా. Retrieved 18 November 2022.