బొమ్మ వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ వెంకటేశ్వర్లు
బొమ్మ వెంకటేశ్వర్లు

బొమ్మ వెంకటేశ్వర్లు


మాజీ శాసనసభ్యుడు
పదవీ కాలము
1999 – 2004
నియోజకవర్గము ఇందుర్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం మార్చి 18, 2019
హైదరాబాద్, తెలంగాణ
జీవిత భాగస్వామి కమలమ్మ
సంతానము భారతీ, రజనీ, జయశ్రీ (కుమార్తెలు), శ్రీరాం (కుమారుడు)
నివాసము హైదరాబాదు, తెలంగాణ

బొమ్మ వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1999 నుండి 2004 వరకు ఇందుర్తి (హుస్నాబాద్) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ గ్రామంలో జన్మించిన వెంకటేశ్వర్లు, సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.[1]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్రస్థాయి నాయకుడిగా పనిచేశాడు. 1989, 1994 ఎన్నికల్లో దేశిని చిన్నమల్లయ్య పోటీచేసి ఓడిపోయాడిన వెంకటేశ్వర్లు 1999లో గెలుపొంది 2014 వరకు ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి చాడ వెంకటరెడ్డి చేతిలో, 2014లో వేములవాడ నుంచి పోటీచేసి ఓడిపోయాడు.[2][3]

మరణం[మార్చు]

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ 2019, మార్చి 18 సోమవారంనాడు మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, జిల్లా వార్తలు (19 March 2019). "మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు మృతి". మూలం నుండి 19 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 March 2019. Cite news requires |newspaper= (help)
  2. ఎన్ టీవి (18 March 2019). "మాజీ ఎమ్యెల్యే బొమ్మ వెంకన్న కన్నుమూత." మూలం నుండి 19 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 March 2019. Cite news requires |newspaper= (help)
  3. వి6 వెలుగు, తెలంగాణ (18 March 2019). "మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కన్నుమూత". మూలం నుండి 19 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 March 2019. Cite news requires |newspaper= (help)
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 March 2019). "మాజీ ఎమ్మెల్యే వెంకన్న కన్నుమూత". మూలం నుండి 19 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 March 2019. Cite news requires |newspaper= (help)