బొల్లపాడు (వుయ్యూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొల్లపాడు (వుయ్యూరు)
—  రెవిన్యూ గ్రామం  —
బొల్లపాడు (వుయ్యూరు) is located in Andhra Pradesh
బొల్లపాడు (వుయ్యూరు)
బొల్లపాడు (వుయ్యూరు)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′31″N 80°52′47″E / 16.408546°N 80.879846°E / 16.408546; 80.879846
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,638
 - పురుషులు 797
 - స్త్రీలు 841
 - గృహాల సంఖ్య 530
పిన్ కోడ్ 521261
ఎస్.టి.డి కోడ్ 08676

బోళ్ళపాడు , కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 261., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ముదునూరు, కలవపాముల, కడవకొల్లు, అప్పికట్ల, చినపారుపూడి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

ఉంగుటూరు, కంకిపాడు, ఉంగుటూరు, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కలవపాముల, వెంట్రప్రగడ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 33 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, బోళ్ళపాడు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి వంగా రాజ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2014, ఆగష్టు-21, గురువారం నాడు, వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్ళి, పూజాదికాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామవాసులైన శ్రీ తుమ్మూరు వెంకటరమణమ్మ, పిచ్చిరెడ్డి దంపతుల కుమారులైన శ్రీ కోదండరామిరెడ్డి & రమేశ్ చంద్రబోసురెడ్డి, పేద కుటుంబంలో పుట్టినా కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని, అమెరికాలో స్థిరపడినారు. వీరు తమ జన్మభూమిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుచున్నారు. వీరు తమ తల్లిదండ్రుల పేరిట తుమ్మూరి పిచ్చిరెడ్డి & వెంకటరమణమ్మల ట్రస్టు ఏర్పాటు చేసి, గ్రామంలో రు. 30 లక్షలతో ఒక సామాజిక భవనం నిర్మించారు. అందులోనే ఒక ఆసుపత్రి పెట్టి, ఒక వైద్యుడిని నియమించి, గ్రామానికి వైద్య సదుపాయం అందజేస్తున్నారు. ఇవి గాక ఇంకా గ్రామంలో ఉచిత కంటి వైద్యశిబిరాలు, ఉచిత వైద్యశిబిరాలూ నిర్వహించుచున్నారు. పశువైద్యశాలలో షెల్టరు నిర్మాణం చేశారు. దేవాలయాలకు, చర్చిలకూ నగదు వితరణ చేశారు. గ్రామంలో 200 పైగా మరుగుదొడ్లు నిర్మించారు. అంతర్గత రహదారులు నిర్మించారు.[2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,638 - పురుషుల సంఖ్య 797 - స్త్రీల సంఖ్య 841 - గృహాల సంఖ్య 530;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1818.[3] ఇందులో పురుషుల సంఖ్య 920, స్త్రీల సంఖ్య 898, గ్రామంలో నివాస గృహాలు 538 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 210 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "బొల్లపాడు". Retrieved 23 June 2016.
  2. ఈనాడు విజయవాడ,3డిసెంబరు,2013,8వ పేజీ.
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులు[మార్చు]

[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,జులై-27; 2వపేజీ.