బోర్డుల ద్వారా సమాచారమును తెలియ చేయుట (సైనేజ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాస్ వేగాస్ యొక్క దక్షిణ భాగానికి లాస్ వేగాస్ సందర్శకులకు స్వాగతం పలికేందుకు ఒక గుర్తు

సైనేజ్ (ఆంగ్లం: Signage) అనేది నిర్దిష్ట ప్రేక్షకుల కొరకు వివిధ రకములైన గ్రాఫిక్స్ తో రూపొందించబడి ప్రదర్శించబడే సమాచారము. ఇవి సాధారణముగా దారిని తెలిపే గుర్తులతో కూడిన సమాచార రూపంలో వీధులలోను లేదా భవంతుల లోపల మరియు బయట మనకు కన్పిస్తాయి.

సైనేజ్ రకములు:

 • ఆయిల్ స్టాక్ గుర్తులు - ఆయిల్ స్టాక్ ను తెలియచేసే పెద్దవైన బోర్డులు.
 • వీదులలో ఉండే సమాచారమును తెలిపే బోర్డులు - గుర్తులు మెటల్ తో చేయబడిన అక్షరములుగా లేదా ముద్రించబడి లేదా ఈ రెండు రకములు గాను ఉంటాయి.
 • కాంతి కలిగి ఉండే బోర్డులు - విద్యుత్ దీపాలు
 • బోర్డులలో క్రమబద్దమైన విధానం - బోర్డింగ్ పని విధానములో ప్రాథమికమైన విభాగములను ముందుగానే రూపకల్పన చేసుకోవాలి.
 • బోర్డుల ద్వారా సమాచారమును సాధారణంగా తెలియ చేయుట - వినియోగదారుని యొక్క ప్రత్యేకమైన అవసరము కొరకు అనువుగా లేదా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కొరకు ఈ గుర్తులు వివిధ మార్పులు సంతరించుకొని రూపొందించబడతాయి.
 • MCFT (మోడ్యులర్ కర్వ్డ్ ఫ్రేమ్ టెక్నాలజీ) — ఆధునిక యుగము ప్రాచీన యుగములకు మధ్యలో సమాచారమును తెలియ చేసే బోర్డుల తయారీ విధానము మార్పులను సంతరించుకున్నది.
 • LEDబోర్డులు (లైట్ - ఎమిట్టింగ్ డయోడ్స్ టెక్నాలజీ ) — LED కాంతి కలిగినవి.
 • కట్టడ నిర్మాణము ద్వారానే సమాచారమును తెలియ చేయుట/దారి వెతికే వ్యవస్థలు - ఉన్నటువంటి సౌకర్యములతో, స్థలములో చెప్పాలనుకున్న దానిని అందముగా ప్రత్యేకముగా తెలియ చెప్పుట. కట్టడములను, గదులను తెలియ చేసే గుర్తులు, దిక్కును మార్గమును తెలియ చేసే గుర్తులు, దారిలో వచ్చే ఎత్తు పల్లములను తెలియ చేయుటకు కూడా గుర్తులు వాడబడేవి. US లో ఈ విధమైన గుర్తులన్నిటిని అమర్చే బాధ్యత ADA నిర్వహించేది.

చరిత్ర[మార్చు]

బార్బెక్ కోట వద్ద కోటుకున్న చేతులు.
సారాసెన్స్ తల : బాత్ లో పబ్ గుర్తు, ఇంగ్లాండ్
ఆమ్స్టర్డేం లోని రెడ్ లైట్ జిల్లా.

ఫ్రెంచ్ పదము enseigne పదము ఆంగ్లములో జండాను సూచిస్తుంది మరియు ఫ్రాన్సులో బేనర్స్ ను అరుదైన గుర్తులు లేదా బోర్డుల ద్వారా సమాచారమును సూచించుటకు మధ్య యుగములో వాడేవారు. దుకాణములు లేదా సత్రముల వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రకటనలు పెయింటింగ్ లేదా చిత్తరువులను మలచుకొనే కళ బాగా తెలిసిన వ్యక్తులచే చేయించబడేది. వారు వివిధ రకములైన గుర్తులతో కూడిన విధానములను ఉపయోగించి ప్రేక్షకుల మనసు దోచుకొనే విధంగా తీర్చిదిద్ది, సరైన ప్రదేశేములో ఉంచేవారు.

పురాతన కాలమున ఈజిప్టియన్స్ మరియు రోమన్స్ ఈ గుర్తులను వాడుట తెలుసుకున్నారు. పురాతన రోమ్ లో ఈ బోర్డులు రాళ్ళ తోను లేదా మట్టి తోను చేయబడేవి మరియు గ్రీక్ లకు కూడా గుర్తులు వాడుట తెలుసు. రోమన్ ల గూర్చి తెలియచేసే చాలా ఉదాహరణలు చూసినట్లైతే పబ్ లను తెలియచేయుటకు కొన్ని గుర్తులను వాడేవారు. అవి "వైన్ అమ్మటానికి మాటలు అవసరం లేదు" లాంటి సామెతల నుండి పుట్టేవి. కొన్ని సందర్భాలలో మూడు బాల్స్ లేక మరి కొన్నిటిని పాన్ బ్రోకర్ కు గుర్తుగాను,ప్రత్యేక గుర్తులను ప్రత్యేక వ్యాపారములకు గుర్తులుగా వాడబడేవి, అవి రాను రాను వ్యాపార గుర్తులుగా స్థిరపడినవి. మిగిలిన గుర్తుల సమూహములు వివిధ విషయముల పుట్టుకను బట్టి ఏర్పడేవి. పురాతన కాలములోని మతపరమైన శిలువలేదా ఇతర గుర్తులు వాడుట క్రైస్తవులను ఎక్కువ ఆకర్షించెను. ఇదే విషయములలో పగాన్స్ కూడా సూర్యుడు లేదా చంద్రుడి చిత్రములను గుర్తులుగా వాడుకున్నారు.

ఇంగ్లండ్ యొక్క రిచర్డ్ III 1389లో ఆస్తి స్వంత దారులు తమ ప్రదేశము బయట కొన్ని గుర్తులను ఉంచవలసినదిగా ఆదేశములు జారీ చేసెను. చట్టము కూడా కొన్ని నిబంధలను విదించుట ప్రారంభించెను. "పట్టణములో అలె అనే బీరు అమ్మేవారు తప్పక దానికి సంభందించిన గుర్తును వేలాడదీయవలసి ఉంటుంది, లేనట్లయితే ఈ అలె బీరును వదులుకోవలసి వస్తుంది."[ఉల్లేఖన అవసరం] ఈ ఆజ్ఞల వల్ల అటుగా వెళ్ళే ఇన్స్పెక్టర్స్ కు వ్యాపారస్తులు ఇచ్చే అలె యొక్క నాణ్యత తేలికగా తెలుస్తుంది. (ఆ కాలములో త్రాగే నీరు మాత్రమే ఎల్లప్పుడూ త్రాగాల్సిన అవసరము లేదు, దానికి బదులుగా అలెని త్రాగవచ్చును). తరువాత, కోటు యొక్క చేతి బాగములు లేదా గౌరవ కుటింబీకులు వాడే బేడ్జేస్ అనేవి సాధారణముగా మారినవి. వీటి సృష్టి కర్త అయిన హేరల్డ్రై యొక్క బాషను పరిగణించకుండానే కొద్దిమంది వీటిని వివరించారు. వీటిలో కొన్ని గుర్తులైన ఎర్ర సింహం, గ్రీన్ డ్రాగన్ మొదలైనవి ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. వాటిలో ప్రత్యేకమైనవి పబ్ గుర్తులు.

పెద్ద పెద్ద పట్టణములలో ఒకే వ్యాపారాన్ని చాలా మంది చేయుటవల్ల, అదీ ఒకే వీధిలో అగుటవల్ల రద్దీ పెరిగి, సాదారణమైన గుర్తులు గల బోర్డులు ఆకర్షణ లేక వెలవెల బోయేవి. దీనివల్ల కొత్తదనాన్ని తెలియచేసే గుర్తులుగల బోర్డులను ప్రదర్శించుట ప్రారంభమై కొన్ని సందర్భాలలో వ్యాపారస్తులు రిబస్ అనే పజిల్ ను స్వంత పేరులా వాడుకున్నారు. (ఉదాహరణకు కాక్స్ పేరుకు బదులుగా రెండు కోడి పుంజుల బొమ్మలను వాడుట) కొన్ని సందర్భాలలో జంతువుల పేర్లను వాడుట లేదా ఇతర వస్తువుల పేర్లను లేదా ప్రముఖ వ్యక్తుల చిత్రాలను వినియోగదారులను ఆకర్షించుటకు వాడుకోవటం జరిగేది. మిగిలిన గుర్తులు విభిన్నత కలిగిన సాధారణ కలయికలతో కూడి (రిబస్ కు ప్రాతినిధ్యము వహించేవి) మరికొన్ని సందర్భాలలో కొద్ది అసాధరణతతో కూడిన కలయికను కలిగి ఉండేవి, కానీ కొంతమంది ఈ గుర్తులను అర్ధరహితముగా ఉన్నాయని చెప్పుట జరిగినది (ఉదాహరణకు కాలు మరియు నక్షత్రముల చిత్రముల ద్వారా ఆడ మగ ధరించే మోకాళ్ళ వద్దకుండే దుస్తులకు ప్రకటన చూపించేవారు) లేదా ప్రముఖుల ఉపన్యాసములో ఉన్న తప్పులను ఎత్తిచూపుటకు (ఉదాహరణగా మేక మరియు దిక్కులను తెలియచేసే కంపాస్స్ ను చిత్రీకరించి దాని ద్వారా దేవుని సృష్టిలో మర్పులు చేయుట) లాంటి అర్ధాన్ని వెదుక్కోవలసి వచ్చేది.

అయినప్పటకీ బోర్డుల వాడుక అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉండేది. బోర్డులు తయారుచేసే కాంట్రాక్టర్స్ విబిన్నతను చూపించేవారు. 14వ శతాబ్దముకు ముందుగా చట్టము యొక్క నిభందనలకు కట్టుబడి బోర్డులను ప్రదర్శింపవలసి వచ్చేది, 1393న ప్రజల పిర్యాదు ప్రకారము చట్టమున నమోదు చేయుట రద్దు అయినది. ఫ్రాన్స్ లో చట్టము కూడా 1567 మరియు 1577న వీటికి ముగింపు ఇచ్చింది.

అప్పటి నుండి సైన్ బోర్డ్స్ ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. తయారు చేసేవారు అత్యంత జాగ్రత్త తీసుకొని పనిచేసేవారు. ఇవి మామూలు గుర్తులుగా కాక కొన్ని సందర్భాలలో తెలివి, సృజనాత్మకత రంగరించి (ప్రత్యేకముగా 16 మరియు 17వ శతాబ్దములలో వారి ప్రతిభని చూపించి అద్బుతలను సృష్టించారు) మెటల్ సహాయముతో ఇంటి ముందు భాగమున వీధుల వద్ద వేలాడదీయబడేవి. తరచుగా అత్యంత అందముగా తీర్చిదిద్దబడి, అందమైన ఆకృతి కలిగి ఇనప ఊచల సహాయముతో వేలాడదీయబడిన అనేక ఉదాహరణలు ఐరోపా,ఇంగ్లండ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ లండన్ వీధులలో బోర్డులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడ మరియు పెద్ద పట్టణములలో కూడా కొన్నిచోట్ల ఈ బోర్డులు ప్రమాదకరముగా మారుటయే కాక ఇరుకు రోడ్డులలో ఇవి చికాకు కూడా కలిగిస్తున్నాయి. ఫ్రాన్సు దేశమున 1669లో ఈ పెద్దవైన బోర్దులను వీదులలో అడ్డుగా ప్రదర్సించుటకు వ్యతిరేఖముగా రాయల్ చట్టమును చేసెను. 1761లో పారిస్ లో కూడా 1762 -1773 చట్టము ప్రకారము ఫ్లాట్స్ యొక్క గోడలకు ఈ బోర్డులను కొత్తగా అమర్చుట మాని వేయుట, ఉన్నవాటిని తొలగించుట చేయవలసి వచ్చింది.

ఈ బోర్డులు తయారుచేసేవారు ముఖ్యముగా హోటల్స్ వ్యాపారము పై ఆధారపడే వారు. సాధారణముగా గొప్పవారైన కళాకారులు ఈ బోర్దులకు పెయింటింగ్ చేస్తూ ఎక్కువగా హోటల్స్ బోర్డులను చిత్రీకరించేవారు. తదనంతర కాలములో ఈ బోర్డుల తొలగింపు కొనసాగి, 18వ శతాబ్దములో లండన్ లో ఇంటికి గుర్తుగా సంఖ్యలను వ్రాయుట ప్రారంబించారు. 1512లో పారిస్ లో కూడా ఇవి ప్రారంభమై 18 శతాబ్దము ముగిసే నాటికి ప్రపంచ వ్యాప్తముగా కొనసాగి, 1805 నాటికి ఇంటికి గుర్తుగా సంఖ్యలు వ్రాయుట అనేది నిబంధనగా మారింది. మధ్య యుగమున ఇంకొక ముఖ్యమైన కొత్త ఆచరణ ప్రారంభమైనది, ఎక్కువ మంది ప్రజలు నిరక్ష్యరాసులు అవటం వల్ల అక్షరములు వ్రాయుట కంటే బొమ్మలను చిత్రీకరించుట ద్వారా సత్రములను గుర్తించుట జరిగేది. ఈ కారణముల వల్ల బోర్డులలో అక్షరముల ద్వారా వ్యాపారమును ప్రదర్శించుట తగ్గి ఈ హోటల్స్ లేదా సత్రములు పేరు లేకుండానే ప్రారంభమయ్యేవి - ఆ తరువాత పెట్టే పేరు కూడా ఆ బొమ్మల నుండి తీసుకోబడేది. ఈ కారణముల వల్ల ఇప్పటి పబ్ గుర్తులు అనేవి అప్పుడు ప్రదర్శింపబడ్డ బోర్డులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

19వ శతాబ్దం నడుమ, కొద్దిమంది కళాకారులు ఈ బోర్డులను చిత్రీకరించుటలో ప్రత్యేకతను చూపించారు, ఉదాహరణకు అస్ట్రో - హంగేరియన్ బోర్డును చిత్రీకరించిన కళాకారునిగా డిమటర్ లొక్కటరీస్ ను చెప్పుకోవచ్చు. ఈ అభివృద్ధితో పాటు, డాక్టర్స్ కు సంబంధించిన క్లినిక్స్ మరియు మందుల దుకాణాల వలె ఇళ్ళలో రాత్రి పూట వ్యాపారము చేయువారు (ఉదాహరణకు కాఫీ హౌస్ వేశ్యా గృహం మెదలైనవి) ప్రత్యేకమైన విద్యుత్ దీపాలతో అలంకరించే వారు మరియు ఇవి ఇప్పటికీ కొంత వరకు మనుగడలో ఉన్నాయి.

ప్రస్తుతం, 100 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉండి, ప్రపంచములో గొప్పగా చెప్పుకునే బోర్డు, వన్ టైమ్ స్క్వేర్, న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది లెక్కలేనన్ని సినిమాలలో కూడా చూపించబడినది మరియు కొత్త సంవత్సరాల సంబరాలు ఇక్కడే జరగుతాయి. ఆధునిక వార్తావాహినికి ఇది ఆవాసం.

చట్టబద్దత కలిగిన బోర్డుల ద్వారా సమాచారమును తెలియ చేయుట[మార్చు]

బోర్డుల ద్వారా సమాచారమును తెలియచేసే కాలములో బొమ్మలను బోర్డుల పై ప్రదర్శించి గుర్తుల ద్వారా సమాచారమును తెలియ చేసేవారు. చట్టబద్దమైన సమాచారమును బొమ్మల ద్వారా బోర్డుల పై ప్రదర్శించుట కొరకు ప్రత్యేకమైన రంగులు, ఆకారము మరియు బోర్డుల పరిమాణంలలో కొన్ని నియమాలు పాటించవలెను. UK మరియు EU లకు సంబంధించిన గుర్తులలో బొమ్మల పరిణామమున 80% ఎత్తు కలిగి ఉండి ముద్రణకు అనుకూలత కలిగి ఉండాలి. USలో అయితే, బొమ్మల ద్వారా రూమ్ లేదా స్ధలమును గుర్తించటానికి (అనగా బొమ్మల ద్వారా మగ, ఆడ ల యొక్క విశ్రాంతి గదుల సమాచారమును గుర్తుల ద్వారా తెలియ చేయుట) తప్పక కొన్ని ప్రత్యేక నిభందాలను పాటించవలసి ఉంటుంది. ఇతర బొమ్మల ద్వారా సమాచారమును తెలియ చేసే విధానములో నాలుగు "గుర్తులు మాత్రమే పరిమితము చేయబడ్డ" నియమాలను పాటించాలి, వీటి వివరములు ADA నియమాలలో తెలియ చేయబడ్డాయి. *ADA గుర్తుల కొరకు వ్యాసము చూడండి.

ఉదాహరణకు: A4 సైజు పటమున UK / EU చట్టబద్దమైన నిబందనల ప్రకారము గుర్తులు (210 X 297 mm) 2/3వ వంతు స్థలమును మాత్రమే బొమ్మను ప్రదర్శించుటకు 210 w x 198 H (mm) మరియు 1/3 అక్షరములు ప్రదర్శించుటకు వాడాలి, బొమ్మలు 158.4 mm వెడల్పులో (198 mm కు 80%) ఉండాలి.

USలో పైన వర్ణించబడిన చిత్తరవు ఉబ్బెత్తు అక్షరాలతో సరైన స్ధానంలో, 6-inch-high (150 mm)స్పృష్టమైన ప్రదేశంలో ఉండాలి మరియు బ్రెయిలీ ప్రదేశానికి కిందగా ఉండాలి.

బొమ్మల ద్వారా విషయాన్ని చెప్పే పద్ధతి తొందరగా అందరికీ అర్ధమయ్యి గుర్తింపు పొందినది. ఈ పని విధానములో ఉన్న బొమ్మలు మాత్రము మార్పు లేకుండా స్థిరముగా ఉంటాయి. ఇందులో అక్షరముల సహాయము లేకుండా కూడా బోర్డు పై బొమ్మల ద్వారా మాత్రమే విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పగలుగుతారు. సాధారణమైన రంగులను వాడుట మరియు ఆకారము విషయములో శ్రద్ధ తీసుకోని బొమ్మల ద్వారా మరియు గుర్తుల ద్వారా అందరికే అర్ధ మయ్యేలా వివరించుట.

"డిస్కవరీ - బేస్డ్ రిటైల్ ," ఈ పుస్తకము ఆధారముగా బొమ్మల ద్వారా సమాచారమును తెలియచేసే బోర్డుల విధానము మూడు విభాగాలుగా విభజింపబడినది: ఆకర్షణ కలిగి ఉండేవి, ఉన్న రంగులు కంటికి ఇంపు కలిగించేవిగా ఉండుట ; సరైన సమాచారమును అందించేవి లేదా దిక్కులను సూచించే విధానమున సహాయకారిగా ఉండుట.

ఆకారపు ఉపయోగము[మార్చు]

గుర్తులు ప్రత్యేకమైన ఆకారములలో ఉంటాయి. ఈ గుర్తుల యొక్క ఆకారముల వల్ల సమాచారము ప్రేక్షకుడుకి అర్ధమయ్యి నియమాలను అవగాహన చేసుకొని అనుసరించుట వల్ల బోర్డుల ద్వారా సమాచారమును తెలియచెప్పే విధానము అభివృధి చెందినది. నిర్దిష్ట ఆకారాలు ప్రపంచంలో వివిధ భాగాలలో వైవిధ్యంగా ఉంటాయి.

దీర్ఘచతురస్రం గుర్తులను ప్రేక్షకుడికి సమాచారము తెలియచేయుటకు వాడేవారు. ఇవి ఎటువంటి ఇబ్బందినీ కలిగించవు, వీటిని ప్రజలకు సమాచారము తెలియచేయుటకు మరియు నిప్పు సంభంద మైన వస్తువులను తెలియచెప్పే గుర్తులుగా వాడతారు. వీటివల్ల ప్రేక్షకుడుకి పూర్తి సమాచారము అందించగలరు. ఎక్కడ ఏది ఉన్నది, అది ఏమిటి మరియు దానికి సంభందమైన సమాచారమును గుర్తుల ద్వారా చెప్పగలరు.

వీటికి భిన్నముగా, గుండ్రముగా గుర్తించబడిన గుర్తులున్న సూచనలు తప్పక పాటించవలెను. తప్పక ఆచరించవలసినవి మరియు అనుసరించరానివైన రెండు రకముల గుర్తులను నిర్లక్ష్యం చేయుటకు వీలులేదు.

చివరగా, త్రిభుజాకారము లేదా హెచ్చరిక గుర్తులు ఉన్నాయి. ఇవి ప్రమాదాన్ని సూచించటానికి వాడబడతాయి. వీటి ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకొనే అవకాశముతో పాటు తొందరగా చర్యలు తీసుకొనుట వీలౌతుంది.

గుర్తుల సాంకేతికశాస్త్రం[మార్చు]

నియాన్ గుర్తులు[మార్చు]

నియాన్ గుర్తులు 1910 పారిస్ ఎగ్జిబిషన్ లో మొట్టమొదటిగా ప్రదర్శించబడ్డాయి. ఇది గాజు గొట్టాన్ని కావలసిన ఆకృతిలోకి మార్చుకొనే విధానము. వీటిని తీర్చిదిద్దే పనివాని నైపుణ్యత, తెలిసి ఉన్న పని విధానమును బట్టి గాజు,నియాన్, గొట్టాలను ఉపయోగించవచ్చును.

LED గుర్తులు[మార్చు]

లైట్ - ఎమిట్టింగ్ డియోడ్ (LED) సాంకేతిక శాస్త్రం ఉపయోగించి గుర్తులను చేయవచ్చు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • సమాచారమును తెలిపే గుర్తులు.
 • వ్యాపార నిమిత్తము సమాచారమును బోర్డుల ద్వారా తెలియ చేయుట
 • గుర్తులు గల బోర్డు
 • వ్యాపార సంభంద పేరును ప్రదర్శించుట
 • అడ్వాన్స్డ్ డెసిషన్ అర్కిటెక్స్ యొక్క బోర్డులు
 • బోర్డుల ద్వారా సమాచారమును తెలియ చేసే విధానము.

సూచనలు[మార్చు]

 • Sutton, James (1965). Signs in Action. London: Studio Vista Limited.
 • యునైటెడ్ నేషన్స్, ప్రమాదకరమైన వస్తువులు రవాణా జరిగే సందర్భములో వాడుటకు సిఫార్సు చేయబడిను . యునైటెడ్ నేషన్స్ పబ్లికేషన్ : 2005 (ISBN 978-92-1-139106-0)
 • వెంజెల్, పాట్రిక్. సైనేజ్ ప్లానిగ్ మాన్యువల్ . హుఎన్ స్టేట్టన్, 2005. ISBN 0262081504

బాహ్య లింకులు[మార్చు]