బ్యాంకు డిపాజిట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిర్దిష్టమైన రాబడి ఇచ్చే పొదుపు మార్గం బ్యాంకు డిపాజిట్లు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ. 10,000/- వరకు పన్ను ఉండదు. బ్యాంకు డిపాజిట్లు రెండు రకాలు

  1. ఫిక్స్డ్ డిపాజిట్లు
  2. రికరింగ్ డిపాజిట్లు

ఫిక్స్డ్ డిపాజిట్లు[మార్చు]

ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి పొదుపుచేస్తే అటువంటి జమ(డిపాజిట్)లని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 7 రోజుల నుండి 10 సంవత్సారాల వరకు అందుబాటులో ఉన్నాయి. కాలాన్ని బట్టి , జమ చేసే మొత్తాన్ని బట్టి, బ్యాంకును బట్టి వడ్డీ శాతం మారుతూ ఉంటుంది. సాదారణంగా వృద్దులకు (సీనియర్ సిటిజన్స్ – 60 సంవత్సరాలు వయస్సు పైబడినవారు) వడ్డీ 0.25% నుండి 1.0% ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను పిల్లల (మైనర్స్) పేర కూడా తెరవవచ్చు. 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువాకాలానికి జమ చేసే టర్మ్ డిపాజిట్లపై ఆదయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ. 1,50,000/- వరకు ఆదాయంపై పన్ను ఉండదు. వీటిపై వచ్చే వడ్డీపై సంవత్సరానికి రూ. 10,000/- వరకు పన్ను ఉండదు.

ఫిక్స్డ్ డిపాజిట్లు రెండు రకాలు

  1. టర్మ్ డిపాజిట్లు
  2. స్పెషల్ టర్మ్ డిపాజిట్లు

టర్మ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఖాతాదారుని పొదుపు ఖాతాలో జమచేయబడుతుంది. స్పెషల్ టర్మ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ మళ్ళీ అదే డిపాజిట్ ఖాతాకు జమ అవుతుంది అందువల్ల ఖాతాదారునికి వడ్డీ మీద వడ్డీ వస్తుంది. నిర్ణీత కలానికంటే ముందుగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరిస్తే తక్కువ వడ్డీ రావడంతో పాటు కొంత మొత్తాన్ని అపరాధ రుసుం (పెనాల్టీ) రూపంలో కట్టాల్సి ఉంటుంది.

ఖాతాదారుల సౌకర్యార్థం వివిధ బ్యాంకులు టాక్స్ సేవింగ్ డిపాజిట్లను ప్రవేశపెడుతున్నాయి. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

రికరింగ్ డిపాజిట్లు[మార్చు]

ఒకేసారి పెద్ద మొత్తంలో పొదుపు చేయలేని వారికి రికరింగ్ డిపాజిట్లు(ఆర్.డి) ఒక మంచి పొదుపు మార్గము. ఇందులో ఒక నిర్ణీత కాలానికి (ఒక సంవత్సరం మొదలు 10 సంవత్సరాల వరకు) ఖాతాదారుడు ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. . కాలాన్ని బట్టి , జమ చేసే మొత్తాన్ని బట్టి, బ్యాంకును బట్టి వడ్డీ శాతం మారుతూ ఉంటుంది. సాదారణంగా వృద్దులకు(సీనియర్ సిటిజన్స్ – 60 సంవత్సరాలు వయస్సు పైబడినవారు) వడ్డీ 0.25 % నుండి 1.0 % ఎక్కువగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్లను పిల్లల (మైనర్స్) పేర కూడా తెరవవచ్చు. ఇప్పుడు వివిధ బ్యాంకులు ఫ్లెక్సి రికరింగ్ డిపాజిట్లను సైతం అందిస్తున్నాయి. ఫ్లెక్సి రికరింగ్ డిపాజిట్లలో ఖాతాదారుని ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రతినెలా వివిధ మొత్తాన్ని జమచేయవచ్చు. నిర్ణీత కలానికంటే ముందుగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరిస్తే తక్కువ వడ్డీ రావడంతో పాటు కొంత మొత్తాన్ని అపరాధ రుసుం (పెనాల్టీ) రూపంలో కట్టాల్సి ఉంటుంది. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.