బ్యాంకు బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్యాంకు బాబు, కార్టూనిస్ట్ శేఖర్ వ్రాసిన కార్టూన్ పుస్తకం. శేఖర్పుస్తకంలోని కార్టూన్లు అన్నీ ఆనాటి ముఖ్యమంత్రి అయిన నారా.చంద్రబాబు నాయుడు పై వేసినవే. శేఖర్ మొదట ఈ కార్టూన్లను విశాలాంధ్ర దినపత్రిక, ప్రజాశక్తి, ఆంధ్ర ప్రభ వార్తాపత్రికలలో వేసారు, ఆ పత్రికలలో వేసిన కార్టూన్ల సంకలనమే ఈ బ్యాంకు బాబు. చంద్రబాబు నాయుడు కాలంలో ఆయన స్వభావాలు, విధానాలు కలగలిపి రూపుదిద్దుకున్న కార్టూన్లు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి మీద ఒక కుంచె గీసిన కార్టూన్ల సంకలన పుస్తకాలలో ఇది మొదటిది. ఈ కార్టూన్లను పరిశీలిస్తే చంద్రబాబు స్వభావం, వ్యక్తిత్వం, పనితనం, ఎత్తుగడలు, వ్యూహాలు మనకు అర్దమవుతాయి.

చరిత్ర[మార్చు]

శేఖర్ వ్రాసిన బ్యాంకు బాబు కార్టూన్ల సంకలన పుస్తకం అక్టోబరు 2004లో వెలువడింది.చేతన పబ్లిషర్స్ పబ్లిష్ చేసారు. ఈ పుస్తకాన్ని సతీశ్ చంద్ర, కృష్ణయ్య, రవీందర్ రెడ్డి, పాషమ్ యాదగిరి, బాలి ఆవిష్కరించారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]