బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bank of Maharashtra
తరహాPublic
BSE & NSE:MAHABANK}
స్థాపన1935
ప్రధానకేంద్రముBank of Maharashtra,
Lokmangal
Shivajinagar
Pune India
కీలక వ్యక్తులు SHRI A.S. BHATTACHARYA , Chairman
పరిశ్రమBanking
Capital Markets and allied industries
ఉత్పత్తులుLoans, Credit Cards, Savings, Investment vehicles etc.
రెవిన్యూ Rs. 4630 mil
మొత్తం ఆస్తులుRs. 481 bn
వెబ్ సైటుwww.bankofmaharashtra.in

బ్యాంక్ ఆఫ్ మాహారాష్ట్ర (మరాఠీ: बँक ऑफ महाराष्ट्र), భారత దేశములో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ బ్యాంకు.

రూ 10.00 లక్షలు మూలధనముతో 1935, సెప్టెంబరు 16న రిజిస్టర్ చేయబడిన ఈ బ్యాంకు, 1936 ఫిబ్రవరి 8న వ్యాపారము ప్రారంభించింది.

స్థాపించినప్పటి నుంచే సామాన్యుల బ్యాంకు అని పేరొందిన ఈ బ్యాంకు చిన్నపాటి సంస్థలకు చేసిన ప్రారంభ దశ సహాయం వలన అవి ఈనాడు గొప్ప పారిశ్రామిక సంస్థలుగా అభివృద్ధి చెందాయి. 1969లో జాతీయం చేయబడిన అనంతరం, బ్యాంకు వేగంగా విస్తరణ బాట బట్టింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు భారత దేశమంతట 1375 శాఖలు ఉన్నాయి (2008 మార్చి 31 నాటికి). మహారాష్ట్రా రాష్ట్రములోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులలో, అత్యధిక శాఖలు ఉన్న బ్యాంకు ఈ బ్యాంకే. దివంగత వి.జి. కాలే మరియు దివంగత డి.కే. సాతే నేతృత్వంలోని ఒక గొప్ప దీర్ఘదర్శకుల బృందం ఈ బ్యాంకును స్థాపించి, 1935 సెప్టెంబరు 16న ఈ సంస్థను పూణేలో ఒక బ్యాంకింగ్ సంస్థగా నమోదు చేసింది. వారి దీర్ఘదర్శనం ఏమంటే, సామాన్యలకు చేరువయ్యి, వారికి సేవలు అందించి వారి బ్యాంకింగ్ అవసరాలను తీర్చడమే. వరుసగా బ్యాంకుకు నేతృత్వం వహించిన నాయకులు మరియు ఉద్యోగులు ఈ దీర్ఘదర్శనాన్ని నెరవేర్చడానికి కృషి చేసారు. ఈ రోజు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాకు 12 మిలియను కంటే ఎక్కువ ఖాతాదారులను దేశ నలుమూలలో కలిగి ఉండి, 23 రాష్ట్రాలలో మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో తమ 1508 శాఖల ద్వారా సేవలు అందిస్తుంది. - వాస్తవంగా భారతదేశములో దేశవ్యాప్తంగా ఉన్న ఒక బ్యాంకు.

మా దూరదృష్టి[మార్చు]

ఇక చైతన్యవంతమైన, ముందు చూపు కలిగిన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన, ఖాతాదారులకు ప్రాముఖ్యత ఇచ్చి బ్యాంకు సేవలు అందించడము, సమాజములో వివిధ వర్గాలకు సేవలు అందించడము, వాటాదారులకు మరియు సిబ్బందికి విలువను పెంచడము మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడము.

స్వయంప్రతిపత్తి[మార్చు]

ఈ బ్యాంకు, 1935లో స్వయంప్రతిపత్తి హోదాను పొందింది. దీని ద్వారా, సరళీకరించబడిన పద్ధతులతో మరింత ఎక్కువ సేవలను, ప్రభుత్వం జోక్యం లేకుండా, అందించడం సాధ్యమవుతుంది.

సామాజిక అంశం[మార్చు]

ఈ బ్యాంకు సామాజిక బ్యాంకింగ్ సేవల రంగములో అత్యుత్తమ సేవలు అందిస్తుంది, లాబాన్ని పక్కన పెట్టి; ప్రయారిటి రంగానికి ఇచ్చే ఋణంలో ఈ బ్యాంకుకు మంచి వాటా ఉంది. బ్యాంకు యొక్క మొత్తం శాఖలలో, 38% గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి.

ఇతర విశేషాలు[మార్చు]

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఈ బ్యాంకే కన్వీనర్. 131 శాఖలలో బ్యాంకు డెపాసిటరి సేవలు మరియు డీమాట్ సేవలు అందిస్తుంది. భీమా పాలిసీలను అమ్మడం కొరకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరియు యునైటెడ్ ఇండియా ఇన్ష్యూరన్స్ కంపెనిలతో బ్యాంకు పొత్తు పెట్టుకుంది. బ్యాంకు యొక్క అన్ని శాఖలు పూర్తిగా కంప్యూటరీకరణ చేయబడ్డాయి.

భవిష్యత్తు ప్రణాళికలు - విజన్ 2009[మార్చు]

మార్చి 2009 నాటికి, రూ. 85,500/- కోట్ల వ్యాపారాన్ని దాటడం. పొదుపు ఖాతా డిపాజిట్లలో 19.84% అభివృద్ధి సాధించడం మరియు 17.69% సగటు డిపాసిట్ అభివృద్ధి రేటును సాధించడం. కరంట్ ఖాతా డిపాజిట్లలో 19.65% అభివృద్ధి సాధించడం మరియు 17.29% సగటు కరంట్ డిపాసిట్ అభివృద్ధి రేటును సాధించడం. 1% కంటే తక్కువ నికర NPA స్థాయిని సాధించడానికి పద్ధతి ప్రకారం కృషి చేయడం కొత్త వ్యాపార కేంద్రాలలో 64 కొత్త శాఖలు ప్రారంభించాలని ప్రతిపాదన ఉంది. 3 విస్తరణా కౌంటర్ లను పూర్తి స్థాయి శాఖలుగా మార్చడం. 4 కరన్సి చెస్ట్ లను తెరవడం. ATMల సంఖ్యను 345 నుంచి 500 కు పెంచడం కొన్ని ఎన్నుకోబడిన శాఖలలో బయోమెట్రిక్ ATM లను ప్రవేశపెట్టడం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఫోన్ బ్యాంకింగ్ లను ప్రవేశపెట్టడం. వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇచ్చే విశేష SHG లను ప్రోత్సాహించడం మరియు వాటికి నిధులు సమకూర్చడం. దీని ద్వారా, చిన్న పాటి మరియు ఒక మోస్తరు రైతులకు ఆర్థిక సహాయం చేయడం. జనాభాలో బ్యాంకు సేవలను ఇదివరకు అందుకొని వర్గాలకు ఆర్థిక సహాయం చేయడం.[1]

ముందుకు నడవడం[మార్చు]

  • మార్చి 2011 నాటికల్లా, బ్యాంకు యొక్క ATMల సంఖ్యను 500 కు పెంచడం.
  • "మరాఠ్వాడ గ్రామీన్ బ్యాంకు " అనే ఈ బ్యాంకు స్థాపించిన రీజనల్ రూరల్ బ్యాంకు (ఆర్ ఆర్ బి) లో సిబిఎస్ ను అమలు చేయడం.
  • ప్రతి అవసరానికి ప్రతి ఒకరి బ్యాంకుగా నిలవడం మరియు అన్ని ఒకే చోట లభించే ఫైనాన్షియల్ సేర్వీసస్ మెయిల్ గా నిలవడం.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • భారతదేశంలో బ్యాంకింగ్

మూస:Banking in India

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]