Jump to content

బ్యారెన్ ఐలాండ్

అక్షాంశ రేఖాంశాలు: 12°17′N 93°52′E / 12.28°N 93.86°E / 12.28; 93.86
వికీపీడియా నుండి
Barren Island
Barren Island is located in Andaman and Nicobar Islands
Barren Island
Barren Island
Location of Barren Island
Barren Island is located in Bay of Bengal
Barren Island
Barren Island
Barren Island (Bay of Bengal)
భూగోళశాస్త్రం
ప్రదేశంబంగాళాఖాతం
అక్షాంశ,రేఖాంశాలు12°17′N 93°52′E / 12.28°N 93.86°E / 12.28; 93.86
ద్వీపసమూహంఅండమాన్ దీవులు
ప్రక్కన గల జలాశయాలుహిందూ మహాసముద్రం
మొత్తం ద్వీపాలు1
ముఖ్యమైన ద్వీపాలు
  • Barren Island
విస్తీర్ణం8.34 కి.మీ2 (3.22 చ. మై.)[1]
పొడవు3.4 km (2.11 mi)
వెడల్పు3.1 km (1.93 mi)
తీరరేఖ12.38 km (7.693 mi)
అత్యధిక ఎత్తు353 m (1,158 ft)[2]
నిర్వహణ
Districtఉత్తర, మధ్య అండమాన్ జిల్లా
ద్వీప సమూహంఅండమాన్ ఐలాండ్స్
ద్వీప ఉప సమూహంఈస్ట్ వొల్కానో ఐలాండ్స్
తాలూకారంగత్ తాలూకా
జనాభా వివరాలు
జనాభా0 (2017)
జన సాంద్రత0.00 /km2 (0 /sq mi)
అదనపు సమాచారం
సమయం జోన్
PIN744202[3]
Telephone code031927 [4]
ISO codeIN-AN-00[5]
Avg. summer temperature30.2 °C (86.4 °F)
Avg. winter temperature23.0 °C (73.4 °F)
Census Code35.639.0004
బ్యారెన్ అగ్నిపర్వతం
1995 లో బ్యారెన్ ఐలాండ్ విస్ఫోటనం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు353 మీ. (1,158 అ.) Edit this on Wikidata
భౌగోళికం
స్థానంఅండమాన్ ద్వీపాలు
Geology
Mountain typeస్ట్రాటోవోల్కానో, పైరోక్లాస్టిక్కోన్ల తో
చివరిగా విస్ఫోటనం చెందినది2019[6]

బ్యారెన్ ఐలాండ్ అండమాన్ సముద్రంలో ఉన్న ఒక ద్వీపం. బంజరు ద్వీపం అన్ని దీనర్థం. ఇది దక్షిణ ఆసియాలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, [7] సుమత్రా నుండి మయన్మార్ వరకూ ఉన్న అగ్నిపర్వతాల గొలుసులోని ఏకైక చురుకైన అగ్నిపర్వతం. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులలో భాగం. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ నుండి ఈశాన్యంగా 138 కి.మీ. దూరంలో ఉంది.

చరిత్ర

[మార్చు]
1789 లో ద్వీపం చిత్రం

అగ్నిపర్వతపు మొట్టమొదటి విస్ఫోటనం 1787 లో జరిగింది. అప్పటి నుండి, ఇది పది కంటే ఎక్కువ సార్లే విస్ఫోటనం చెందింది. అన్నిటి కంటే చివరిది 2017 లో జరిగింది. 1787 లో మొట్టమొదటిసారిగా విస్ఫోటనం చెందిన తరువాత, 1789, 1795, 1803 – 04, 1852 లలో విస్ఫోటనాలు జరిగాయి. దాదాపు ఒకటిన్నర శతాబ్దపు నిద్రాణస్థితి తరువాత, ఈ ద్వీపంలో 1991 లో మరో విస్ఫోటనం జరిగింది, అది ఆరు నెలల పాటు కొనసాగి, గణనీయమైన నష్టాన్ని కలిగించింది. [8]

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి సంస్థకు చెందిన బృందం 2017 జనవరి 23 న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతున్నట్లు గుర్తించింది. జట్టు అధిపతి అభయ్ ముధోల్కర్ మాట్లాడుతూ, "ఐదు నుండి పది నిమిషాల చిన్న ఎపిసోడ్లలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతోంది. పగటిపూట, బూడిద మేఘాలు మాత్రమే కనిపించాయి. అయితే, సూర్యాస్తమయం తరువాత, ఎర్రటి లావా ఫౌంటైన్లు బిలం నుండి వాతావరణంలోకి చొచ్చుకుపోవడం కనిపించింది. వేడి లావా పర్వతం వాలు గుండా ప్రవహించింది."

బారెన్ ద్వీపం లోని నమూనాలపై ఆర్గాన్-ఆర్గాన్ డేటింగ్ చేసినపుడు, అగ్నిపర్వతపు పురాతన సబ్‌ఏరియల్ లావా ప్రవాహాలు 16 లక్షల సంవత్సరాల నాటివని తేలింది. ఈ అగ్నిపర్వతం సుమారు 1060 లక్షల సంవత్సరాల నాటి సముద్రపు క్రస్ట్‌లో ఉంది. [9] నమోదైన విస్ఫోటనాలన్నీ కూడా అగ్నిపర్వత పేలుడు సూచికపై అతి తక్కువ వైపు ఉన్నాయి. 2017 విస్ఫోటనం సూచికలో 2 గా నమోదైంది. [10]

భౌగోళికం

[మార్చు]

ఈ అగ్నిపర్వత ద్వీపం భారతీయ, బర్మీస్ టెక్టోనిక్ పలకల అంచున ఉన్న అగ్నిపర్వత బెల్ట్ మధ్యలో ఉంది. నర్కొండం ద్వీపం ఈ ప్రాంతంలో నిద్రాణమై ఉన్న అగ్నిపర్వతం. ప్లీస్టోసీన్ కాలం నాటి ఒక తొలి స్ట్రాటోవొల్కానో శంకువు పతనమైనపుడు కాల్డెరా ఏర్పడింది. ఈ శంకువు అవశేషాలు ద్వీపం చుట్టూ ఒక అవక్షేప శిఖరాన్ని ఏర్పరచాయి (దీన్ని కాల్డెరా గోడ అని పిలుస్తారు), పడమర వైపు కొంత ఖాళీ ఉంటుంది. ఈ ద్వీపంలో అత్యధిక ఎత్తు 353 మీ. అగ్నిపర్వతంలో చాలా భాగం నీటి అడుగున (2,250 మీ. లోతున) ఉంది. ద్వీపం వ్యాసం 3 కి.మీ., వైశాల్యం 8.34 చ.కి.మీ.

జీవవైవిధ్యం

[మార్చు]

దాని పేరుకు తగ్గట్టుగానే, ఈ ద్వీపమంతా ఎక్కువగా బంజరు భూమే ఉంది. ఇక్కడ కొద్ది సంఖ్యలో మేకలు ఉన్నాయి. మనుషులు నివసించరు. [11] అలాగే పక్షులు, గబ్బిలాలు, ఎలుకలు అక్కడి కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాయి.

పర్యాటకం

[మార్చు]

బారెన్ ద్వీపం చుట్టుపక్కల ఉన్న జలాలు ప్రపంచంలోని అగ్రశ్రేణి స్కూబా డైవింగ్ గమ్యస్థానాలలో ఒకటి. స్వచ్ఛమైన, పారదర్శకమైన నీళ్ళు, మాంటా రే, ఆసక్తికరమైన బసాల్ట్ నిర్మాణాలు, గత లావా ప్రవాహాల స్థలాకృతి, వేగంగా పెరుగుతున్న పగడపు తోటలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. డైవింగుకు అనుగుణమైన ఈ స్థలం చాలా మూలన ఉంది. ఓడ ద్వారా లేదా హావ్లాక్ ఐలాండ్‌లో ఉన్న స్కూబా-ఆపరేటర్ల వెంట అక్కడికి వెళ్ళవచ్చు. [12] [13]

అడ్మినిస్ట్రేషన్

[మార్చు]

ఇది అండమాన్ నికోబార్ దీవులలో భాగమైన ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాకు చెందినది. [14]

జనాభా

[మార్చు]

ఈ ద్వీపంలో జనావాసాలు లేవు.

చిత్ర గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Andaman. Archived from the original (PDF) on 2017-08-28. Retrieved 2020-02-21.
  2. మూస:Cite enroute
  3. "A&N Islands - Pincodes". 2016-09-22. Archived from the original on 2014-03-23. Retrieved 2016-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "code". Archived from the original on 2019-10-17. Retrieved 2020-02-21.
  5. Registration Plate Numbers added to ISO Code
  6. "Barren Island volcano" (in English). 19 Feb 2018. Archived from the original on 23 జూలై 2019. Retrieved 21 ఫిబ్రవరి 2020.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. Priya Srivastava (2018-11-21). "All about Barren Island, South Asia's Only Active Volcano in Andaman". Times of Indian.
  8. Mallet, F.R. (1895). "Bibliography of Barren Island and Narcondam, from 1884 to 1894". Records of the Geological Survey of India. 28: 34–38.
  9. Ray et al., Bull Volcanol 77: 57, 2015
  10. "Why did Barren Island volcano erupt again?" (in ఇంగ్లీష్). Retrieved 26 February 2017.
  11. G. S. Mudur (3 August 2003). "Mystery that got science's goat - Barren Island puzzle solved: springs, not special kidneys, sustain animals". The Telegraph (Kolkata) (in ఇంగ్లీష్). Retrieved 21 September 2019.
  12. Miranda Krestovnikoff; Monty Halls (17 July 2006). Scuba Diving. DK Publishing. pp. 275–. ISBN 978-0-7566-4063-7.
  13. https://timesofindia.indiatimes.com/india/Scuba-dive-at-an-active-volcano-on-Barren-Island-in-Andamans/articleshow/25837581.cms
  14. "Village Code Directory: Andaman & Nicobar Islands" (PDF). Census of India. Retrieved January 16, 2011.