బ్రజేశ్ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రజేశ్ మిశ్రా
Mishra in 2001.
భారతదేశ మొదటి జాతీయ భద్రతా సలహాదారు
In office
నవంబర్ 19, 1998 – మే 22, 2004
ప్రథాన మంత్రిఅటల్ బీహారీ వాజపేయి
అంతకు ముందు వారుOffice established
తరువాత వారుజె. ఎన్. దీక్షిత్
9 వ భారత ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి
In office
మార్చి 19, 1998 – మే 22, 2004
ప్రథాన మంత్రిఅటల్ బిహారీ వాజపేయి
అంతకు ముందు వారుఎన్. ఎన్. వొహ్రా
తరువాత వారుటి. కె. ఎ. నాయర్
ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి
In office
జూన్ 1979 – ఏప్రిల్ 1981
వ్యక్తిగత వివరాలు
జననం
బ్రజేశ్ చంద్ర మిశ్రా

సెప్టెంబర్ 29, 1928
మరణంసెప్టెంబర్ 28, 2012 (aged 84)
న్యూఢిల్లీ
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (1991–98)
వృత్తిదౌత్యవేత్త, రాజకీయ నాయకుడు.

బ్రజేశ్ మిశ్రా (సెప్టెంబర్ 29, 1928 - సెప్టెంబర్ 28, 2012) ఈయన భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. ఈయన పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1928 సెప్టెంబర్ 29 న జన్మించాడు. ఈయన తండ్రి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ద్వారక ప్రసాద్ మిశ్రా.[2] ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిగా, ఇందిరా గాంధీ కి సన్నిహితుడు.[3]

దౌత్య వృత్తి[మార్చు]

ఈయన 1951 లో భారత విదేశాంగ సేవలో చేరారు. 1962 చైనా - ఇండియన్ యుద్ధం తరువాత బీజింగ్‌ లో ఛార్జ్ డి అఫైర్‌ గా, ఇండోనేషియా లో భారత రాయబారిగా, జెనీవాలో రాయబారి, భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. ఈయన చివరి పోస్టింగ్ జూన్ 1979 నుండి ఏప్రిల్ 1981 వరకు ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. ఈయన శాశ్వత ప్రతినిధిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యొక్క ఆరవ అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ పై సోవియట్ దండయాత్రపై భారతదేశం తరపున స్వరం వినిపించాడు.[4]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈయన ఏప్రిల్ 1991 లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఈయన ఆనాటి భారత ప్రధానమంత్రికి 9వ ప్రధాన కార్యదర్శి గా నియమించడంతో, 1998 మార్చిలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు. ఈయన నవంబర్ 1998 నుండి మే 23, 2004 వరకు మొదట జాతీయ భద్రతా సలహాదారుగా, జాతీయ భద్రతా నిర్వహణ కోసం సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈయన పోఖ్రాన్ -2 నుండి కాశ్మీర్ వరకు వాజ్‌పేయి పాకిస్థాన్ పర్యటన నుండి అమెరికాను వ్యూహాత్మక సంభాషణలో నిమగ్నం చేయడం వరకు అన్నింటిలోనూ భారత విదేశాంగ విధానం, భద్రతా విన్యాసాల వెనుక ఉన్నాడు.

పురస్కారాలు[మార్చు]

ఈయనకు 2011 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

మరణం[మార్చు]

ఈయన సెప్టెంబర్ 28, 2012 న న్యూ ఢిల్లీ లోని వసంత్ కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "The Name Is Mishra, Brajesh Mishra". www.outlookindia.com. 4 September 2000. Retrieved 21 December 2019.
  2. "Former Foreign Minister Natwar Singh pays tribute to Brajesh Mishra". India Today. 30 September 2012. Retrieved 21 December 2019.
  3. "Devil's Advocate: Brajesh Mishra on Atal vs Advani – Politics News – IBNLive". Ibnlive.in.com. 3 February 2010. Archived from the original on 13 నవంబరు 2014. Retrieved 21 December 2019.
  4. Srinivasan, T P. "Brajesh Mishra: Steely determination and a kind heart". Retrieved 21 December 2019.
  5. "India's first National Security Advisor Brajesh Mishra passes away". The Hindu. Archived from the original on 9 డిసెంబరు 2012. Retrieved 21 December 2019.