Jump to content

బ్రహ్మం సాగర్

వికీపీడియా నుండి
బ్రహ్మం సాగర్

బ్రహ్మం సాగర్ వైఎస్‌ఆర్ జిల్లాలోని సాగునీటి ఆనకట్ట.[1]

చరిత్ర

[మార్చు]

కరవు పీడిత బద్వేలు ప్రాంతానికి త్రాగు, సాగు నీటి కల్పనకు ఎన్.టి.రామారావు, ఈ ప్రాజెక్టుకు, 1983లో 432 కోట్ల అంచనా వ్యయంతో శ్రీకారం చుట్టాడు.తెలుగుగంగ ప్రాజక్ట్ లో భాగంగా ఈ సాగరన్ని నిర్మించారు. శ్రీశైలం ప్రాజక్ట్ కృష్ణానది కుడి కాలువ నుండి నీటిని తరలిస్తారు.తెలుగు గంగ ప్రాజెక్టులో లో బాగంగా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. కృష్ణనది నీటిని తీసుకునే శ్రీశైలం కుడి ఒడ్డు కాలువ నీటిని తాగు,సాగు,పారిశ్రామిక అవసరాల కోసం దీనిని రూపొందించారు.

ఈ సాగర నిర్మాణం లో ఐదు గ్రామాలు నీటమునిగాయి.ఆ గ్రామాల పేర్లు బసవపురం, ఓబులరాజుపల్లి, కొత్తపల్లి, జంగంరాజుపల్లి ,గొల్లపల్లి.

ఈ జలాశయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ముద్దనూరు గ్రామానికి సమీపంలో ఉంది.

17.5 టి.ఎం.సి.ల సామర్ధ్యంతో పూర్తి చేసిన ఈ జలాశయాన్ని, 2006, సెప్టెంబరు-27న అప్పటి ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖరరెడ్డి, ఏ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతులమీదుగా దీనిని జాతికి అంకితం చేసినారు.ఈ రిజర్వాయర్ దాదాపు 1.9 కిలోమీటర్ల పొడవు మరియు దాదాపు 27 మీటర్ల ఎత్తుతో ఒక పెద్ద మట్టి ఆనకట్టను నిర్మించడం జరిగింది.[2] ఈ బ్రహ్మం సాగర్ కి ఎడమ,కుడి కాల్వలు కలవు.లక్ష యాబై వేల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ సాగరాన్ని నీటితో నింపుతున్నారు. [3] లోతు 216 మీటర్లు (గరిష్టం) .[4]

రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజక్ట్ (ఆర్టీపిపి) విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుతోపాటు ఇక్కడి జలాన్ని 72 కి.మీ దూరం తరలిస్తూ వినియోగిస్తున్నారు. 40 క్యుసెక్కుల నీటిని ఆర్టీపిపి కి సరఫరాచేస్తున్నారు.[5]

సమీపం లో ఉన్న దర్శనీయ పుణ్యక్షేత్రం

[మార్చు]

బ్రహ్మంగారి మఠం

ఉపయోగం

[మార్చు]

ఈ జలాశయం ఆధారంగా మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల రైతులు ప్రధానంగా వరి, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు,వేరుశనగ పంటలు పండిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. Codingest. "బ్రహ్మం సాగర్ డ్యాంకు లీకేజీ ముప్పు". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-11-11.[permanent dead link]
  2. "Brahmamsagar Dam Water Level Today (5th December 2025) | Brahmamsagar Dam History, Entry Fee, Storage Capacity and Flow Data". Oneindia (in ఇంగ్లీష్). Retrieved 2025-12-05.
  3. ABN (2024-09-17). "ప్రతి ఎకరాకు బ్రహ్మంసాగర్‌ నీరు". Andhrajyothy Telugu News. Retrieved 2025-11-28.
  4. "Brahmamsagar Dam Water Level Today (28th November 2025) | Brahmamsagar Dam History, Entry Fee, Storage Capacity and Flow Data". Oneindia (in ఇంగ్లీష్). Retrieved 2025-11-28.
  5. "బ్రహ్మయ్యా.. చూడవయ్యా..! | brahmam sagar in deadly dry | Sakshi". www.sakshi.com. Retrieved 2025-11-28.