Jump to content

బ్రహ్మచారి (సినిమా)

వికీపీడియా నుండి

"బ్రహ్మచారి" తెలుగు చలన చిత్రం 1968 ఫిబ్రవరి,1 న విడుదల. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏ వి.సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి దర్శకత్వం తాతినేని రామారావు కాగా, సంగీత దర్శకత్వం తాతినేని చలపతిరావు సమకూర్చారు.ఈ చిత్రం ను "పెన్నేనీ వార్గు"(1967) అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించారు. హిందీలో"ఏక్ నారి ఏక్ బ్రహ్మచారి"(1971) పేరుతో పునర్నిర్మించారు.

బ్రహ్మచారి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం ఎ.వి.సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయలలిత,
నాగభూషణం,
సూర్యకాంతం,
చలం,
రమణారెడ్డి,
ప్రభాకరరెడ్డి,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు _ రామకృష్ణ
  • జయలలిత _ వసంత
  • నాగభూషణం _ రావు సాహెబ్ పద్మనాభయ్య
  • తిక్కవరపు వెంకట రమణారెడ్డి_ బంగారయ్య
  • చలం_ జోగులు
  • పుణ్యమూర్తుల రాజబాబు_ దేవయ్య
  • మందాడి ప్రభాకరరెడ్డి_ ఆనందరావు
  • రావి కొండలరావు_ డాక్టర్
  • పెరుమాళ్ళు
  • పొట్టి ప్రసాద్_సోడాబుడ్డి
  • సూర్యకాంతం_ గజలక్ష్మి
  • రమాప్రభ: మల్లిక
  • సుకన్య_జానకి
  • పుష్పకుమారి_శాంత .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: తాతినేని రామారావు
  • కధ: బాల మురుగన్
  • మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • సంగీతం: తాతినేని చలపతిరావు
  • పాటల రచయితలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు
  • నేపథ్య గాయకులు: పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, బొడ్డుపల్లి బాల వసంత, టి.ఆర్.జయదేవ్, కె.బి.కె.మోహనరాజు
  • ఛాయ గ్రహణం: పి.ఎస్ సెల్వరాజు
  • ఎడిటింగ్: కృష్ణస్వామి
  • పంపిణీదారులు: నవయుగ ఫిలింస్
  • నిర్మాత: ఏ.వి.సుబ్బారావు
  • నిర్మాణ సంస్థ: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:01:02:1968.

పాటలు

[మార్చు]
  1. ఎవ్వరూ లేని ఈ చోట ఇటురా రారా ఒకమాట నను కవ్వించి - సుశీల,ఘంటసాల - రచన: దాశరథి
  2. ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో విరజల్లెను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
  3. ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు అంతలోనే బెదరిపోకండి - సుశీల_రచన: దాశరథి
  4. ఓ బ్రహ్మచారి నిన్నుకోరి నిలుచున్నది చిన్నది నిను చేరి - ఎస్.జానకి, సుశీల,వసంత బృందం_ రచన: దాశరథి
  5. నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి జేబులోన - టి. ఆర్. జయదేవ్, బి.వసంత_ కొసరాజు
  6. ఈ వెన్నెల వెలుగులోన . ఘంటశాల, సుశీల రచన: శ్రీ శ్రీ
  7. బ్రహ్మచారులలో, కె.బి.కె.మోహనరాజు_ రచన: సి.నారాయణరెడ్డి.

మూలాలు

[మార్చు]