బ్రహ్మ కమలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రహ్మకమలము

బ్రహ్మ కమలము (శాస్త్రీయ నామం: Saussurea obvallata) అనేది Asteraceae (Sunflower family) కి చెందిన మొక్క. ఇది హిమాలయ పర్వతాలు, మరియూ ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనా దేశాలలో కనబడుతుంది. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పము. ఈ మొక్కను King of Himalayan flower అని అంటారు. ఈ మొక్క పై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి.

ప్రాముఖ్యత[మార్చు]

హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మరియూ మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో బ్రహ్మకమలం ఆకులు, వేళ్ళు ఎండబెట్టి పొడిగా చేసి, 200 గ్రాముల పొడిని దేవదారు 20 మి.లీ నూనెలో కలిపి గుజ్జుగా చేసి విరిగిన ఎముకల భాగాల మీద పూస్తారు [1]. మధ్య హిమాలయాల్లో భోటియా తెగవారు తలనొప్పి, మానసిక సమస్యలకు బ్రహ్మకమల విత్తనాల నుండి తీసిన నూనెను తలకు వ్రాసుకుంటారు. మూత్ర సంబంధిత సమస్యలకు బ్రహ్మకమల పువ్వులను మిస్రితో కలిపి వండి సేవిస్తారు [2].

హైదరాబాద్, తెలంగాణలో వికసించిన బ్రహ్మ కమలం

అస్పష్టత[మార్చు]

బ్రహ్మకమలం గురించి అస్పష్టత ఉంది. ఉత్తర భారతదేశంలో పైన చెప్పిన మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. దక్షిణ భారతదేశంలో రాత్రి సమయాల్లో పువ్వులు వికసించే ఎఫీఫైలమ్ ఆక్సిపెటాలమ్ (Epiphyllum Oxypetalum) అను కాక్టస్ మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. మరికొద్ది మంది మాత్రం కమలము (లేదా తామర - Nelumbium Nucifera) ను బ్రహ్మ కమలంగా భావిస్తారు.

మూలాలు[మార్చు]

  1. Indigenous knowledge and Medicinal plants used by Vaidyas in Uttaranchal, India - Chandra Prakash Kala, Nehal A Farooquee, and BS Majila
  2. Indigenous medicinal practices of Bhotia tribal community in Indian central Himalaya - by Prasanna K Samal, Pitamber B Dhyani, Mihin Dollo

లింకులు[మార్చు]