బ్రాందీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక ప్రత్యేకమైన బ్రాందీ గ్లాసులో పోసివున్న కాగ్నాక్ బ్రాందీ

వైన్‌ను బట్టీపట్టడం ద్వారా ఉత్పత్తి చేసే ఒక రకమైన మద్యసారాన్ని బ్రాందీ అంటారు (ఈ పదాన్ని బ్రాందీవైన్ నుంచి స్వీకరించారు, బ్రాందీవైన్ మూలాలు డచ్ brandewijn -"మరిగించిన వైన్"లో ఉన్నాయి) [1], ద్రాక్షలను పులియబెట్టడం ద్వారా ముందుగా వైన్ తయారవుతుంది. సాధారణంగా బ్రాందీలో 35%–60% పరిమాణంలో మద్యసారం ఉంటుంది, దీనిని రాత్రి భోజనం తరువాత పానీయంగా సేవిస్తారు. కొన్ని బ్రాందీలను చెక్క పీపాల్లో ఉంచి నిల్వచేస్తుంటారు, అయితే నిల్వచేసినట్లు అనుభూతి కలిగించడానికి అనేక బ్రాందీల్లో ముదురుపాకం రంగు కలుపుతారు.

పులియబెట్టిన పండ్లు (అంటే ద్రాక్ష కాకుండా ఇతర పండ్లు) మరియు పోమాస్ నుంచి కూడా బ్రాందీని తయారు చేయవచ్చు.[2]

బ్రాందీలో రకాలు[మార్చు]

బ్రాందీలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి. నిర్దిష్ట రకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనట్లయితే, బ్రాందీ అనే పదం ద్రాక్ష బ్రాందీని సూచిస్తుంది.

ద్రాక్ష బ్రాందీ[మార్చు]

పులియబెట్టిన ద్రాక్షను బట్టీపట్టడం ద్వారా ద్రాక్ష బ్రాందీని తయారు చేస్తారు.

బ్రాందీ డి జెరెజ్ పీపాల నిల్వ

యూరోపియన్ యూనియన్ చట్టబద్ధంగా కాగ్నాక్ అనే పేరును సంప్రదాయ పద్ధతుల్లో ఫ్రాన్స్‌లోని కాగ్నాక్ ప్రాంతంలో ఉత్పత్తి చేసే బ్రాందీకి, ఫ్రాన్స్‌లోని గాస్కోనీ ప్రాంతంలో తయారయ్యే బ్రాందీకి అర్మేగ్నాక్ అనే పేరును ప్రత్యేకించింది. వీటిని PDOగా పరిగణిస్తున్న కారణంగా, అవి కేవలం బ్రాందీ శైలులుగానే కాకుండా, ఒక నిర్దిష్ట ప్రదేశానికి చెందిన బ్రాందీలుగా సూచించబడుతున్నాయి, అంటే కాలిఫోర్నియాలో తయారు చేసిన బ్రాందీకి కాగ్నాక్ తయారు చేసేందుకు ఉపయోగించే సారూప్య పద్ధతినే ఉపయోగిస్తారు, దీని రుచి కూడా కాగ్నాక్ మాదిరిగానే ఉంటుంది, అయితే ఫ్రాన్స్‌లోని కాగ్నాక్ ప్రాంతంలో తయారు చేయలేదు కాబట్టి, ఐరోపా‌లో దానిని ఆ పేరుతో పిలవడం లేదు.

ద్రాక్ష బ్రాందీని సంప్రదాయబద్ధంగా పశ్చిమ దేశాల్లో గది ఉష్ణోగ్రత వద్ద టులీప్-ఆకృతిలో ఉన్న గ్లాసులో లేదా స్నిఫ్టెర్‌లలో సేవిస్తుంటారు, ఇదిలా ఉంటే ఆసియా దేశాల్లో దీనిని మంచుముక్కలతో కలిపి సేవిస్తారు. గది ఉష్ణోగ్రత వద్ద దీనిని సేవించినప్పుడు, గ్లాసును చేతిలో తీసుకొని కొద్దిగా వేడి చేయడం లేదా క్రమంగా వేడిచేయడం చేస్తారు. అయితే, వేడిచేయడం ద్వారా మద్యం ఆవిరి బాగా ఘాటుగా మారవచ్చు, అందువలన వాసనలో ఘాటు పెరుగుతుంది.[ఆధారం చూపాలి]

తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్రాందీ మంచి వాసన కలిగివుంటుంది, ఉదాహరణకు 16 °C (61 °F). అనేక ఇళ్లలో, బాగా ఆస్వాదించేందుకు బ్రాందీని వేడిచేయడం కంటే చల్లబరుస్తారు. అంతేకాకుండా, మద్యం (సాధారణ బ్రాందీలో ఇది 40% వరకు ఉంటుంది) వేడిచేసేకొద్ది పలచబడుతుంది (చల్లబరిచినప్పుడు గాఢత పెరుగుతుంది). చల్లబరిచిన బ్రాందీ చప్పటి మరియు సున్నితమైన రుచితో ఉంటుంది, దీనికి తక్కువ మంట భావన కలుగుతుంది.[6]

పండ్ల బ్రాందీ[మార్చు]

కాల్వాడోజ్ సీసా, ఫ్రాన్స్‌లో ఆపిళ్ల నుంచి తయారు చేసిన ఒక పండ్ల బ్రాందీ

ద్రాక్షలు కాకుండా ఇతర పండ్ల స్వేదనం నుంచి పండ్ల బ్రాందీ (ఫ్రూట్ బ్రాందీ) ని తయారు చేస్తారు. ఆపిల్, రేగు వంటి పండ్లు, చెర్రీలు, ఎల్డ్‌బెర్‌బెర్రీస్, రాస్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ మరియు జల్దారు పండ్లను ఎక్కువగా ఈ బ్రాందీల తయారీకి ఉపయోగిస్తారు. పండ్లతో చేసిన బ్రాందీలో సాధారణంగా 40% నుంచి 45% ABV ఉంటుంది. దీనికి ఎటువంటి రంగు ఉండదు, సాధారణంగా మంచు ముక్కలతో సేవిస్తుంటారు.

పొమాస్ బ్రాందీ[మార్చు]

పొమాస్ బ్రాందీ ని ద్రాక్ష తొక్కలు, విత్తనాలు మరియు కాడలు మరియు రసం తీసిన తరువాత మిగిలిన పిప్పి (ద్రాక్ష నుంచి తీసిన రసాన్ని వైను తయారీకి ఉపయోగిస్తారు) తదితరాలను పులియబెట్టడం మరియు స్వేదనం ద్వారా తయారు చేస్తారు. ఉదాహరణలు:

పోమాస్ బ్రాందీల్లో నిల్వ చేసినవి మరియు రంగు జోడించకుండా ఉండేవి బాగా తక్కువగా ఉంటాయి.

స్వేదనం[మార్చు]

ఒకసారి మరిగించిన రసం యొక్క స్వేదనం ఈ కింది విధంగా ఉంటుంది:

8% నుంచి 12% ABV మద్య సాంద్రతతో ఉన్న వైను మరియు అధిక పులుసును ఒక కుండ బట్టీలో వేడిచేస్తారు. మద్యం ఆవిరి, నీరు మరియు అనేక సుగంధ పదార్థాలను ఒక కండెన్సర్ కాయిల్‌లో సేకరిస్తారు, ఇక్కడ ఇవన్నీ తిరిగి ద్రవరూపంలోకి మారతాయి. నీటి కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆల్కహాల్ (మద్యం) మరియు సుగంధ పదార్థాలు ఆవిరవుతాయి కాబట్టి, సాంద్రీకృత ద్రవంలో మద్యం గాఢత (స్వేదద్రవం) అసలు వైను కంటే ఎక్కువగా ఉంటుంది.

ఒకసారి స్వేదనం తరువాత, స్వేదద్రవాన్ని "లో వైన్" అని పిలుస్తారు, ఇది సుమారుగా 30% మద్యం (ఇథనాల్) పరిమాణాన్ని కలిగివుంటుంది.లో వైన్‌ను తరువాత రెండో సారి స్వేదనం చేస్తారు. మొదటి 1% లేదా ఉత్పత్తి అయిన స్వేదద్రవాన్ని హెడ్‌గా పిలుస్తారు, దీనిలో మద్యం సాంద్రత సుమారుగా 83% ఉంటుంది, చెడు వాసన కలిగివుంటుంది, అందువలన దీనిని తొలగిస్తారు (సాధారణంగా, తరువాత తయారు చేసేలో వైన్‌లో కలిపేందుకు దీనిని ఉపయోగిస్తారు). స్వేదన ప్రక్రియ కొనసాగేకొద్ది, తరువాత వచ్చే స్వేదద్రవం సుమారుగా 70% ఆల్కహాల్ కలిగివుంటుంది (దీనిని హార్ట్‌గా పిలుస్తారు), దీనిని బ్రాందీగా సేవించేందుకు ఉపయోగిస్తారు. స్వేదనం తరువాత మిగిలివుండే కొంతలో వైన్‌ను టెయిల్ అని పిలుస్తారు, దీనిని తరువాత దఫాలో వైన్‌లో కలుపుతారు.

స్వేదనం సాధారణంగా వైన్‌లో ఆల్కహాల్ శాతాన్ని మాత్రమే పెంచదు. స్వేదనం చేస్తున్న ఉత్పత్తికి ఉపయోగించే వేడి మరియు బట్టీ యొక్క పదార్థం (సాధారణంగా రాగి) కారణంగా స్వేదనం సందర్భంగా రసాయన చర్యలు కూడా జరుగుతాయి. దీని వలన అనేక కొత్త బాష్పశీల సుగంధ పదార్థాలు ఏర్పడతాయి, వైన్‌లో వాసన భాగాలు మరియు ఈస్టర్‌ల వంటి జలవిశ్లేషణ భాగాల పరిమాణం మారతాయి.

నిల్వ[మార్చు]

ఈ కింది మూడు పద్ధతుల్లో ఏదో ఒకదానిని ఉయోగించి బ్రాందీని తయారు చేస్తారు:

 • నిల్వ చేయకుండా తయారు చేసేవి: అనేక పోమాస్ బ్రాందీ మరియు కొన్ని పండ్ల బ్రాందీలను బాటిళ్లలో నింపే ముందు నిల్వచేయరు. ఇటువంటి ఉత్పత్తి స్వచ్ఛంగా మరియు ఎటువంటి రంగు లేకుండా ఉంటుంది.
 • ఒకే బ్యారెల్‌లో నిల్వ చేయడం: సహజంగా బంగారం లేదా గోధుమ రంగులో ఉన్న బ్రాందీలను ఓక్ పీపాల్లో నిల్వ చేస్తారు. పీపాలో నిల్వ చేసిన అనుభూతిని కల్పించేలా కొన్ని బ్రాందీలను ఉద్దీపనపరచడానికి ముదురు పాకం రంగును కలుపుతారు.
 • సోలెరా ప్రక్రియ: కొన్ని బ్రాందీలు, ముఖ్యంగా స్పెయిన్ బ్రాందీలను, సోలెరా వ్యవస్థలో నిల్వ చేస్తారు.

గుర్తింపు (లేబులింగ్)[మార్చు]

బ్రాందీ యొక్క నాణ్యత మరియు స్థితిని వర్ణించేందుకు ఒక గుర్తింపు వ్యవస్థ ఉంది; సాధారణంగా బ్రాండ్ పేరుకు సమీపంలో ఈ సూచికలను గుర్తించవచ్చు:

 • A.C.: చెక్కలో రెండేళ్లు నిల్వ చేసినవి.
 • V.S.: "వెరీ స్పెషల్" లేదా 3-నక్షత్రాలు, చెక్కలో కనీసం మూడేళ్లు నిల్వ చేసిన బ్రాందీలు.
 • V.S.O.P.: "వెరీ సుపీరియర్ ఓల్డ్ పోల్" లేదా 5-నక్షత్రాలు, చెక్క పీపాల్లో కనీసం ఐదేళ్లు నిల్వచేసిన బ్రాందీలు.
 • X.O.: "ఎక్స్‌ట్రా ఓల్డ్", నెపోలియన్ లేదా వీయిల్ రిజర్వ్, కనీసం ఆరేళ్లు నిల్వ చేసినవి, నెపోలియన్ అయితే కనీసం నాలుగేళ్ల నిల్వచేసినవి.
 • వింటేజ్: బాటిల్‌లో నింపే సమయం వరకు పీపాలో ఉంచిన బ్రాందీ, దీనిపై లేబుల్ పాతకాలపు తేదీని చూపిస్తుంది.
 • హార్స్ డి'ఏజ్: ఇవి వయస్సును గుర్తించేందుకు చాలా పాతవిగా ఉంటాయి, అయితే పదేళ్లు కంటే ఎక్కువ నిల్వ చేసినవి వీటిలో సాధారణంగా ఉంటాయి, ఇవి గొప్ప నాణ్యత కలిగివుంటాయి.

బ్రాందీ డి జెరెజ్ విషయంలో నియంత్రణ మండలి ఈ కింది విధంగా వర్గీకరిస్తుంది:

 • బ్రాందీ డి జెరెజ్ సోలెరా – ఒక సంవత్సరం.
 • బ్రాందీ డి జెరెజ్ సోలెరా రిజర్వా – మూడేళ్ల వయస్సు.
 • బ్రాందీ డి జెరెజ్ సోలెరా గ్రాన్ రిజర్వా – పదేళ్ల వయస్సు.

కుండ బట్టీలు- గోపుర బట్టీల మధ్య వ్యత్యాసం[మార్చు]

కాగ్నాక్ మరియు దక్షిణాఫ్రికా కుండ బట్టీ బ్రాందీలను కుంట బట్టీలను ఉపయోగించి వంతులవారీగా తయారు చేసే బ్రాందీలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు (వంతులవారీ స్వేదనం). అనేక అమెరికా బ్రాందీలకు గోపుర బట్టీల్లో పాక్షిక స్వేదనం ద్వారా స్వేదనం నిర్వహిస్తారు. పైన అంశీకరణ భాగంతో ఉన్న ప్రత్యేక కుండ బట్టీలను అర్మేగ్నాక్ బ్రాందీల కోసం ఉపయోగిస్తారు.

యూరోపియన్ యూనియన్ నిర్వచనం[మార్చు]

బ్రాందీ పదానికి యూరోపియన్ యూనియన్ సొంత చట్టబద్ధమైన నిర్వచనాన్ని ఏర్పాటు చేసింది:[7]

5. బ్రాందీ లేదా వీన్‌బ్రాండ్

(ఎ) బ్రాందీ లేదీ వీన్‌బ్రాండ్ అనేది ఒక మద్య పానీయం:
(i) వైన్ మద్యసారం నుంచి ఉత్పత్తి చేసిన, వైన్ స్వేదద్రవాన్ని చేర్చిన లేదా చేర్చని, 94.8% పరిమాణం కంటే తక్కువ స్వేదనం చేసిన, తుది ఉత్పత్తి యొక్క మద్య శాతంలో గరిష్టంగా 50% కంటే స్వేదద్రవం ఎక్కువగా ఉండాలి,
(ii) ఓక్ పాత్రల్లో కనీసం ఏడాది పాటు లేదా 1000 లీటర్ల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఓక్ పీపాల్లో కనీసం ఆరు నెలలపాటు నిల్వ చేసి ఉండాలి,
(iii) 100% ఘనపరిమాణపు ఆల్కహాల్ యొక్క ప్రతి హెక్టాలీటర్‌కు 125 గ్రాముల కంటే తక్కువ లేదా సమానమైన బాష్పశీల పదార్థాల పరిమాణం ఉండాలి, ఉపయోగించిన ముడి పదార్థాల యొక్క స్వేదనం లేదా పునఃస్వేదనం నుంచి ప్రత్యేకంగా ఉత్పత్తి చేయబడి ఉండాలి,
(iv) 100% ఘనపరిమాణపు ఆల్కహాల్ యొక్క ప్రతి హెక్టోలీటర్‌కు 200 గ్రాముల గరిష్ట మిథనాల్ పదార్థం ఉండాలి.
(బి) బ్రాందీ లేదా వీన్‌బ్రాండ్ యొక్క పరిమాణంలో కనిష్ట ఆల్కహాల్ సాంద్రత 36% వద్ద ఉండాలి.
(సి) ఎనెక్స్ I(5)లో నిర్వచించిన విధంగా ఆల్కహాల్ జోడించరాదు, అదేవిధంగా పలచబరచడం కూడా జరగకూడదు.
(డి) బ్రాందీ లేదా వీన్‌బ్రాండ్ రుచి ఇచ్చే పదార్థాలను కూడా జోడించరాదు. దీని కోసం సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను మినహాయించరాదు.
(ఈ) బ్రాందీ లేదా వీన్‌బ్రాండ్‌ కు కేవలం రంగు కోసం ముందురు పాకాన్ని మాత్రమే జోడించవచ్చు.

ఈ నిర్వచనం పరిధిలో గతంలో పండ్ల బ్రాందీ, పోమాస్ బ్రాందీ మరియు నిల్వచేయని ద్రాక్ష బ్రాందీలు ఉండేవి కాదు. ఇదే యూరోయిన్ యూనియన్ నియంత్రణ ఈ మినహాయించిన మద్యాలను ఫ్రూట్ స్పిరిట్, గ్రేప్ మార్క్ స్పిరిట్ మరియు వైన్ స్పిరిట్‌గా నిర్వచించింది.

జర్మనీ పదం వీన్‌బ్రాండ్ ఇంగ్లీష్ పదం "బ్రాందీ"కి సమానంగా ఉంటుంది, అయితే జర్మన్-మాట్లాడే దేశాల వెలుపల ఆస్ట్రియా మరియు జర్మనీల నుంచి బ్రాందీ కోసం దీనిని ఉపయోగిస్తున్నారు.

పోలెండ్‌లో బ్రాందీని కొన్నిసార్లు వైనో (వైన్) నుంచి స్వీకరించిన వైనియాక్ అనే పదంతో పిలుస్తారు.

చరిత్ర[మార్చు]

బ్రాందీ యొక్క మూలాలు స్పష్టంగా స్వేదన ప్రక్రియ అభివృద్ధితో ముడిపడివున్నాయి. పురాతన గ్రీసు మరియు రోమ్‌లకు సాంద్రీకృత మద్య పానీయం తెలుసు, దీని చరిత్ర పురాతన బాబిలోన్ కాలం నుంచి ఉంది. ప్రస్తుతం తెలిసిన బ్రాందీ మొట్టమొదటిసారి 12వ శతాబ్దంలో కనిపించింది, 14వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మొదట వైను సంరక్షణ పద్ధతిగా స్వేదనాన్ని ఉపయోగించేవారు, వ్యాపారులు వైన్‌ను రవాణా చేయడానికి ఇది సులభమైన మార్గంగా ఉపయోగపడింది. పరిమాణాన్నిబట్టి అంచనావేసే పన్నును తగ్గించేందుకు వైన్‌ను మొదట స్వేదనం చేసేవారనే భావన కూడా ఉంది. బ్రాందీకి నీటిని జోడించడం మరియు వినియోగానికి కొంతసేపు ముందు స్వేదనం ద్వారా తిరిగి నీటిని తీసివేయడం దీని ఉద్దేశం. చెక్క పీపాల్లో నిల్వ చేసిన తరువాత వచ్చే ఉత్పత్తికి అసలు స్వేదన మద్యం కంటే మెరుగ్గా ఉంటుందని గుర్తించబడింది.[2] నీటిని తొలగించడంతోపాటు, స్వేదన ప్రక్రియ అనేక సుగంధ పదార్థాలు ఏర్పడటం మరియు శిథిలమవడానికి దారితీస్తుంది, సిద్ధాంతపరంగా స్వేదద్రవం యొక్క సమ్మేళనం దాని యొక్క మూలం నుంచి మారిపోతుంది. వర్ణద్రవ్యాలు, చక్కెరలు మరియు ఉప్పులు వంటి స్థిర పదార్థాలు బట్టీలో మిగిలివుంటాయి. దీని ఫలితంగా, స్వేదద్రవం యొక్క రుచి అసలు మూలం యొక్క రుచి కంటే భిన్నంగా ఉంటుంది.

సైక్లోపీడియా యొక్క 1728 సంచికలో బ్రాందీ స్వేదనానికి ఈ కింది పద్ధతి వర్ణించబడింది:

 • బ్రాందీని సేకరించేందుకు ఒక సొరకాయలో సగభాగాన్ని మద్యంతో నింపి దానిని ఆరింట ఒకవంతు స్వేదనమయ్యే వరకు సన్నని మంటపై, లేదా గ్రాహకిలో పడే పదార్థం పూర్తిగా మండే పదార్థమయ్యే వరకు వేడిచేస్తారు. ఈ మద్యాన్ని, ఒక్కసారి మాత్రమే స్వేదనం చేసిన, వైన్ స్పిరిట్ లేదా బ్రాందీగా పిలుస్తారు. మరో స్వేదనం ద్వారా (లేదా అనేక సార్లు) శుద్ధిపరిచిన మద్యాన్ని ప్రతిశోధిత వైను మద్యసారంగా పిలుస్తారు. రెండో స్వేదన ప్రక్రియను బాల్నెయో మేరీలో మరియు గాజు సొరకాయలో నిర్వహిస్తారు, మద్యం పరిమాణంలో సగభాగం వరకు స్వేదనం చేస్తారు. దీనిని మరింత ప్రతిశోధించి, అంటే నిర్వాహకుడు అవసరమనుకునే వరకు ప్రతిశోధించి- బ్రాందీ తయారు చేస్తారు.[8]

సుదీర్ఘమైన మరియు సమస్యాత్మకమైన అనేక స్వేదనాలను తగ్గించేందుకు ఒక రసాయన పరికరం కనిపెట్టబడింది, దీంతో ఒకే స్వేదన ప్రక్రియను ఉపయోగించడం మొదలైంది. ప్రతిశోధిత వైను మద్యం యొక్క స్వచ్ఛతను పరీక్షించేందుకు కొంత భాగాన్ని మండిస్తారు. ఎటువంటి మాలిన్యాలు లేకుండా మొత్తం ద్రవం పూర్తిగా మండినట్లయితే మద్యం మేలైనదిగా పరిగణిస్తారు. మరో మెరుగైన పరీక్ష ఏమిటంటే, మద్యం అడుగున కొద్దిగా తుపాకీమందును చేర్చుతారు. మద్యాన్ని మండించినప్పుడు గన్‌పౌడర్‌కు కూడా మంటలు వ్యాపించినట్లయితే, ఆ మద్యం మేలైనదిగా గుర్తిస్తారు.[8]

అనేక బ్రాందీలను ద్రాక్షల నుంచి స్వేదనం చేస్తుండటంతో, ప్రపంచంలో మంచి బ్రాందీలను ఉత్పత్తి చేసే ప్రాంతాలు సాధారణంగా బాగా ద్రాక్షను పండించే ప్రాంతాలుగా ఉన్నాయి. 19వ శతాబ్దం చివరి కాలానికి, పశ్చిమ ఐరోపా మార్కెట్ మరియు వాటి యొక్క విదేశీ సామ్రాజ్యాల్లో ఫ్రాన్స్ మరియు స్పెయిన్ బ్రాందీలు ఆధిపత్యం చెలాయించాయి, తూర్పు ఐరోపాలో బల్గేరియా, క్రిమెయా మరియు జార్జియాలతోపాటు నల్ల సముద్ర ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే బ్రాందీలు ఆధిపత్యం కలిగివున్నాయి. 1880లో, డేవిడ్ సర్దార్జీష్విలీ జార్జియాలోని (తరువాత రష్యా సామ్రాజ్యంలో ఒక భాగం) బిలిసీలో తన కాగ్నాక్ కర్మాగారాన్ని స్థాపించాడు, ఈ ప్రాంతం టర్కీ, మధ్య ఆసియా మరియు పర్షియా వాణిజ్యమార్గాల కూడలిగా ఉంది. అర్మేనియా మరియు జార్జియా బ్రాందీలు (ఈ శకంలో కాగ్నాక్‌లుగా పిలువబడ్డాయి) ప్రపంచంలో అత్యుత్తమ బ్రాందీల్లో కొన్నింటిగా పరిగణించబడ్డాయి, 1900 దశకం ప్రారంభంలో ప్యారిస్ మరియు బ్రసెల్స్‌లో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఇవి వాటి ఫ్రెంచ్ ప్రత్యర్థి బ్రాందీల కంటే మెరుగైనవిగా గుర్తింపు పొందాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రోమనోవ్ కోర్టు యొక్క గిడ్డంగి గృహాలు ప్రపంచంలో అతిపెద్ద కాగ్నాక్ మరియు వైన్‌ల సేకరణలుగా గుర్తించబడ్డాయి- వీటిలో ఎక్కువ మద్యసారాలు జార్జియాలోని ట్రాన్స్‌కాకసస్ ప్రాంతం నుంచి వచ్చేవి. 1917 అక్టోబరు విప్లవం సందర్భంగా, వింటర్ ప్యాలస్ ముట్టడితో, బోల్షెవిక్ విప్లవం వాస్తవానికి ఒక వారంపాటు నిలిచిపోయింది, ఈ సమయంలో ఆందోళనకారులు కాగ్నాక్ మరియు వైన్‌లను త్రాగుతూ గడిపారని తెలుస్తోంది. రష్యా మార్కెట్ ఎప్పుడూ ఎక్కువ బ్రాందీని వినియోగించే ప్రాంతంగా ఉంది, దీనిలో ఎక్కువ భాగం స్వదేశంలో తయారు చేసిన బ్రాందీతోపాటు, దిగుమతి చేసుకునే బ్రాందీ కూడా ఉంది. సీసాలపై క్రమాలు పశ్చిమ ఐరోపా నియమావళికి అనుగుణంగా ఉంటాయి. సోవియట్ శకంవ్యాప్తంగా, బ్రాందీ ఉత్పత్తి కమ్యూనిస్ట్ పాలనకు గర్వకారణంగా ఉండేది, వారు గొప్ప బ్రాందీలను తయారు చేయడం కొనసాగించారు-వీటిలో బాగా ప్రసిద్ధి చెందినవి 1967, 1977, మరియు 1987నాటి జూబ్లీ బ్రాందీలు. ఈ ఉత్పత్తుల వినియోగం తరువాత మిగిలిన సీసాలను తిరిగి సేకరించడం జరిగేది, వాటి నాణ్యత వలనే కాకుండా, చారిత్రక ప్రాధాన్యత కోసం వాటిని సేకరించేవారు.

వినియోగం[మార్చు]

బ్రాందీని వివిధ వంట సంబంధమైన ఉపయోగాల్లో వడ్డిస్తారు.

వంట[మార్చు]

 • కేక్ మరియు పీ టాపింగ్స్ వంటి డెసెర్ట్‌లకు రుచికరమైన బ్రాందీని జోడిస్తారు, డిసెర్ట్ యొక్క రుచిని పెంచుతుంది.
 • యాపిల్ వంటకాల్లో రుచికరమైన బ్రాందీని సాధారణంగా ఉపయోగిస్తారు.
 • మాంసఖండము లేదా ఇతర మాంసాలకు పాన్ సాస్‌ల తయారీలో ఒక సాధారణ డీగ్లేజింగ్ లిక్విడ్‌గా బ్రాందీని ఉపయోగిస్తారు

పానీయాలు[మార్చు]

బ్రాందీని నేరుగా (అచ్చంగా దానినే) లేదా మంచు ముక్కలతో కలిపి వడ్డిస్తారు. అనేక ప్రసిద్ధ కాక్‌టెయిల్స్‌ను తయారు చేసేందుకు దీనిని అనేక ఇతర పానీయాలకు జోడిస్తారు. బ్రాందీ అలెగ్జాండర్, సైడ్‌కార్, బ్రాందీ సోర్ మరియు బ్రాందీ ఓల్డ్ ఫాషన్డ్ వంటి కాక్‌టెయిల్స్ ఇందుకు ఉదాహరణలు.

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 1. Oxford English Dictionary. Oxford, England: Oxford University Press. 1989.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. 2007.
 3. లిచైన్, అలెక్సిస్. అలెక్సిస్ లిచైన్స్ న్యూ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ వైన్ & స్పిరిట్స్ , 5వ ఎడిషన్, (న్యూయార్క్: ఆల్‌ఫ్రెడ్ ఎ. నూఫ్, 1987). పేజీ 3672
 4. బల్క్ బ్రాందీ ప్రొడ్యూసర్, రుడాల్ఫ్ ప్రెన్ GmbH
 5. సౌత్ ఆఫ్రికా విన్స్ బెస్ట్ బ్రాందీ ఇన్ ది వరల్డ్
 6. ది హిస్టరీ ఆఫ్ బ్రాందీ
 7. అఫీషియల్ జర్నల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ , 13 ఫిబ్రవరి 2008, 39/30–39/31. https://web.archive.org/web/20080820081859/http://www.mee.government.bg/ind/doc/LexUriServ.pdf
 8. 8.0 8.1 మూస:1728
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రాందీ&oldid=2809202" నుండి వెలికితీశారు