బ్రాడీకార్డియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రాడీకార్డియా ఇ.సి.జి. రికార్డింగ్.
Bradycardia
Sinusbradylead2.JPG
Sinus bradycardia seen in lead II with a heart rate of about 50.
ICD-10R00.1
ICD-9427.81, 659.7, 785.9, 779.81
MeSHD001919

బ్రాడీకార్డియా (గ్రీక్ βραδυκαρδία, bradykardía, "హృదయ స్పందన చాలా నెమ్మదించడము") లేదా (గుండె అసాధారణ స్థాయిలో తక్కువ వేగంతో కొట్టుకోవడం) వయసులో పెద్దవారి వైద్యపరమైన విషయమునకు వస్తే, గుండె నిముషమునకు 60 సార్ల కంటే తక్కువగా కొట్టుకోవడము అనేది మందులు ఇవ్వవలసిన స్థితిగా ఉంటుంది, కానీ గుండె కొట్టుకునే వేగము నిముషమునకు 50 కంటే తగ్గితేనే ఆ జబ్బు యొక్క లక్షణము అని తెలుస్తుంది. దీని వలన కొంతమంది రోగులలో కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె నిర్బంధించబడడము వంటివి జరగవచ్చు, ఎందుకు అంటే బ్రాడీకార్డియా ఉన్న రోగుల గుండెలోకి కావలసినంత ప్రాణవాయువు ప్రసారము జరగకపోవచ్చును. ఇది కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోవడానికి, ఊపిరి సరిగా అందకపోవడము లేదా కొన్నిసార్లు తీవ్రమయ్యి మరణం కూడా సంభవించడానికి కారణము కావచ్చును.[1][2]

శిక్షణ పొందిన ఆటగాళ్ళలో లేదా వయసులో ఉండి ఆరోగ్యముగా ఉన్నవారిలో కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే వేగము తక్కువగా ఉండవచ్చు (ఉదాహరణకు: సైక్లింగ్ వృత్తిగా చేసే మిగ్యుయల్ ఇండురైన్ యొక్క గుండె కొట్టుకునే వేగము నిముషమునకు 28 సార్లుగా ఉండేది). ఏ వ్యక్తికి అయినా నీరసము, అలసట, మైకము, శరీరము తేలికైపోయినట్లు అనిపించడము, కళ్ళు తిరిగి పడిపోవడము, ఛాతీలో ఇబ్బందిగా ఉండడము, గుండె దడ వంటివి లేనప్పుడు లేదా బ్రాడీకార్డియాకు తోడుగా ఉపిరి అందకపోవడము వంటివి లేనప్పుడు, శాంతముగా ఉన్నప్పుడు ఉండే బ్రాడీకార్డియాను మాములుగానే భావిస్తారు.

ఒక వ్యక్తి యొక్క గుండె కొట్టుకునే వేగము నిజమునకు నిమిషమునకు 60 సార్ల కంటే తక్కువ లేనప్పటికీ, అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది చాలా తక్కువ అని భావించబడినప్పుడు దానిని రిలేటివ్ బ్రాడీకార్డియా అనే పదము ఉపయోగించి వివరిస్తారు.

నిర్వచనం[మార్చు]

పెద్దవారిలో ఒక నిముషమునకు గుండె 60 సార్ల కంటే తక్కువ కొట్టుకుంటే దానిని బ్రాడీకార్డియా అని అంటారు.[3] అది తన లక్షణములను చూపించడానికి ముందు గుండె కొట్టుకునే వేగము నిముషమునకు 50 సార్ల కంటే తక్కువ అవుతుంది.[3]

వర్గీకరణ[మార్చు]

ఆర్ట్రియల్[మార్చు]

ఆర్ట్రియల్ బ్రాడీకార్డియాలు మూడు రకములుగా ఉంటాయి. మొదటిది సైనస్ బ్రాడీకార్డియా. ఇది సాధారణముగా యవ్వనములో ఉన్నవారిలో మరియు ఆరోగ్యముగా ఉన్న పెద్దవారిలో కనుగొనబడింది. దీని లక్షణములు ఆ వ్యక్తి యొక్క శ్వాస క్రియల వలన తెలుస్తాయి. ప్రతి ఉఛ్వాసము గుండె కొట్టుకునే వేగము తగ్గడంతో ముడిపడి ఉంటుంది. నిశ్వాసము వలన గుండె సంకోచించే ప్రమాణములో పెరుగుదల ఉంటుంది. ఇది బహుశా శ్వాసక్రియ సమయములో వాగల్ నాడికి ఉండే బిగిలో వచ్చే మార్పుల వలన వస్తుంది అని భావించబడింది.[4]

సైనస్ బ్రాడీకార్డియా అనేది ఒక సైనస్ లయ 60 bpm కంటే తక్కువగా ఉండడము. ఇది బాగా ఆరోగ్యముగా ఉన్న వ్యక్తులలో మరియు చక్కటి పరిస్థితిలో ఉన్నారు అని భావించబడిన ఆటగాళ్ళలో సాధారణముగా కనిపిస్తుంది. 50 - 85 శాతము వరకు చక్కటి పరిస్థితిలో ఉన్నారు అని భావించబడిన ఆటగాళ్ళకు సున్నితమైన సైనస్ బ్రాడీకార్డియా ఉన్నట్లుగా అధ్యయనములలో కనుగొనబడినది, అదే మాములు ప్రజలలో ఇది 23 శాతము వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.[5] దీనికి కారణము ఏమిటి అంటే వారి గుండె యొక్క కండరములు ఎక్కువగా కొట్టుకునేలా నియంత్రించబడుతున్నాయి మరియు అందుకొరకు అదే పరిమాణములో రక్త ప్రసారము చేయడానికి తక్కువ సంఖ్యలో సంకోచించవలసి ఉంటుంది .[4]

సిక్ సైనస్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువ సైనస్ బ్రాడీకార్డియా, సైనోట్రియాల్ మూసుకుపోవడము, సైనస్ నిర్బంధించబడడము మరియు బ్రాడికార్డి-టచికార్దియా సిండ్రోమ్ (ఆట్రియాల్ కండరముల వ్యాకోచము, అల్లాడి పోవడము మరియు హటాత్తుగా గుండె కవాలములు మూసుకుని పోవడము టచికార్డియా) వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.[4]

ఆట్రియో వెన్ట్రిక్యులర్ నోడల్[మార్చు]

ఒక ఆట్రియో వెన్ట్రిక్యులర్ నోడల్ బ్రాడీకార్డియా లేదా AV జంక్షన్ రిథం అనేది మాములుగా సైనస్ నాడి నుంచి వెళ్ళే నరములకు ఉత్తేజము లేకుండా పోవడము వలన వస్తుంది. ఇది మాములుగా ఒక EKGలో కనిపిస్తుంది, మరియు ఒక సాధారణ QRS కాంప్లెక్స్, ఒక తిరగబడిన P వేవ్ అనేది ముందుగా లేదా వెనుకగా రావడం జరుగుతుంది.[4]

ఒక AV జంక్షనల్ ఎస్కేప్ అనేది AV జంక్షన్ లో ఎక్కడో స్థానభ్రంశం చెందిన ఫోకస్ నుంచి హృదయ స్పందన నెమ్మదించటం. SA నోడ్ నుంచి చెదిరిపోతున్న రేట్ AV నోడ్ కంటే తక్కువగా ఉంటే ఇది వస్తుంది.[4] ఈ విధంగా లయ తప్పడం అనేది SA లేదా AV నోడ్ లను అడ్డుకోవటం వలన SA నోడ్ యొక్క విద్యుత్ తరంగములు AV నోడ్ కు చేరలేకపోవడము వలన జరుగుతుంది.[6] ఇది హృదయ గతికి సంబంధించిన పనిని ఇంకా ఏమాత్రము చూడలేకపోతున్న SA నోడ్ యొక్క పనితీరును వేరే దానితో చేయించడానికి మరియు ఇది పని చేయనప్పుడు పేస్ మేకర్ ఫంక్షన్ యొక్క శ్రేణిని తిరిగి వెనుక ఉన్న వాటి సహాయముతో పని చేయించడము వంటివి గుండెను కాపాడడానికి చేసే యంత్రాంగములలో ఉన్నాయి. ఇది చాలా పెద్ద PR వ్యవధితో ఉండవచ్చు. ఒక జంక్షనల్ ఎస్కేప్ కాంప్లెక్స్ అనేది SA నోడ్ పై అధికముగా వాగల్ టోన్ పడుతూ ఉండడం వంటి వాటికి ఒక సాధారణ ప్రతిచర్యగా భావించబడుతున్నది. రోగ కారణములలో సైనస్ బ్రాడీకార్డియా, సైనస్ పట్టేయడము, సైనస్ వెళ్ళే ద్రోవ మూసుకు పోవడము లేదా AV బ్లాక్ వంటివి ఉంటాయి.[4]

వెన్ట్రిక్యులర్[మార్చు]

వెన్ట్రిక్యులర్ ఎస్కేప్ రిథం లేదా ఇడియోవెన్ట్రిక్యులర్ రిథం అని కూడా పిలవబడే ఒక వెన్ట్రిక్యులర్ బయోకార్డియా అనగా గుండె కొట్టుకునే వేగము నిముషమునకు 50 కంటే తక్కువగా ఉండడము. విద్యుత్ ప్రేరణ లేదా స్టిములి అర్టియం నుండి తక్కువగా ఉన్నప్పుడు ఈ మంత్రాంగము కావలసిన జాగ్రత్త తీసుకుంటుంది.[4] అతని మోపు లేదా గుండె నరముల నుండి వచ్చే కుదుపులు, నిమిషమునకు 20 నుండి 40 సార్లు గుండె కొట్టుకునేలా ఉండే పెద్ద QRS కాంప్లెక్స్ ను తయారు చేస్తుంది. అతని మోపు పైన ఉండే నరములను జంక్షనల్ అని కూడా అంటారు, ఇవి చిన్న QRS కాంప్లెక్స్ తో నిముషమునకు 40 నుండి 60 bpm కలిగి ఉంటాయి.[7][8] మూడవ స్థాయిలో వచ్చే గుండె అవరోధాలలో 61% బండిల్ బ్రాంచ్-సిస్టం లోను, 21% AV నోడ్ లోను మరియు 15% అతని మోపులోను వస్తుంది.[8] AV బ్లాక్ అనేది ఒక EKG ద్వారా తొలగించబడుతుంది మరియు "ఒక 1:1 P వేవ్స్ మరియు QRS సమ్మేళనాల మధ్య ఒక 1:1 సంబంధము ఉన్నది" అని సూచిస్తుంది.[7] వెన్ట్రిక్యులర్ బ్రాడీకార్డియాలు సైనస్ బ్రాడీకార్డియా, సైనస్ అరెస్ట్ మరియు AV బ్లాక్ లతో పాటు వస్తాయి. దీనికి చేసే చికిత్సలో తరచుగా అట్రోపిన్ ను మందుగా లోపలి ఇవ్వడము మరియు గుండెలో పేస్ మేకర్ పెట్టడము వంటివి ఉంటాయి.[4]

బాల్యము[మార్చు]

చిన్నపిల్లలలో బ్రాడీకార్డియా అనేది నిముషమునకు గుండె 100 సార్ల కంటే తక్కువ కొట్టుకోవడముగా నిర్వచించబడింది. (మాములుగా గుండె నిముషమునకు 120-160 సార్లు కొట్టుకోవాలి.) నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, నెలలు నిండిన తరువాత పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా ఈ అప్నియా మరియు బ్రాడీకార్డియాకు ఎక్కువగా గురి అవుతుంటారు; కానీ కారణము సరిగ్గా తెలియరాలేదు. కొంతమంది పరిశోధకులు ఈ బ్రాడీకార్డియా యొక్క వర్ణక్రమము మెదడులోని కొన్ని ప్రత్యేక ప్రదేశముల లోపల నుండి శ్వాసక్రియను నియంత్రిస్తూ ఉంటాయి మరియు అవి పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చును. బిడ్డను నెమ్మదిగా స్పర్శించడము లేదా ఇంక్యుబేటర్ కొంచెం కదిలించడము వంటివి చేయడం ద్వారా బిడ్డ మరలా శ్వాస తీసుకునేలా చేయవచ్చును, దీని వలన హృదయ స్పందన మరలా పెరుగుతుంది. (థియోఫిలినిన్ లేదా కేఫినిన్) వంటి మందులు కూడా ఇలాంటి పిల్లలకు అత్యవసరము అయితే వాడవచ్చు. NICU యొక్క ప్రమాణముల ప్రకారము ఈ కారణము వలన హృదయ స్పందనను మరియు ఉపిరితిత్తుల పని తీరును వైద్య పరికరముల సహాయముతో గమనిస్తూ ఉండవలసి ఉంటుంది.

కారణములు[మార్చు]

ఈ కార్డియాక్ అరితమియా అనేది చాలా కారణముల వలన రావచ్చును, అవి హృదయమునకు సంబంధించినవి మరియు సంబంధించనవి అని రెండు రకముగా విభజించబడ్డాయి. హృదయమునకు సంబంధించని కారణములు సాధారణముగా రెండవ స్థాయికి చెందినవి, వీటిలో మాదక ద్రవ్యములు వాడబడడము లేదా హింసించబడడము; జీవ సంబంధమైన లేదా ఎండోక్రైన్ కారణములు వంటివి ముఖ్యముగా థైరాయిడ్ లో ఇబ్బందులు రావడము వంటివి ; ఒక ఎలేక్త్రోలైట్ ల అసమతుల్యత; నరములకు సంబంధించినకారణములు; శరీర ధర్మములకు సంబంధించిన కారణములు; ఎక్కువ కాలము పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి రావడము మరియు వ్యాధి నిరోధక వ్యవస్థ తనంత తానే పనిచేయడం వంటి పరిస్థితులు వంటివి చాలా కారణములు ఉంటాయి. హృదయమునకు సంబంధించిన కారణములలో బాగా లేదా ఎప్పుడు ఉండే ఇషేమిక్ గుండె జబ్బు, నరములకు సంబంధించిన గుండె జబ్బు లేదా క్రుశించిపోయే ప్రాథమిక ఎలెక్ట్రికల్ జబ్బు వంటివి ఉంటాయి. మొత్తం మీద, ఈ కారణములు మూడు మంత్రాంగములలో పని చేస్తాయి, అవి : గుండె తనంత తానే తరచుగా బేజారు కావడము, శక్తి ప్రసారము ఆగిపోవడము మరియు పేస్ మేకర్ లు మరియు లయలు మారిపోవడము.

బ్రాడీకార్డియాలలో మాములుగా రెండు రకముల సమస్యలు తలెత్తుతాయి, అవి : సైనోట్రియాల్ నాడి (SA నాడి), యొక్క పని తీరులో తేడాలు మరియు ఏట్రి వెన్ట్రిక్యులర్ నాడి (AV నాడి) పని తీరులో తేడాలు.

సైనస్ నాడి యొక్క పని తీరులో తేడాలు (కొన్ని సార్లు జబ్బు పడిన సైనస్ సిండ్రోమ్ అని కూడా అంటారు, అటామిసిటీ లేదా సైనస్ నాడి నుంచి చుట్టు ప్రక్కల ఉన్న ఆర్ట్రియల్ కణములకు ("బయటకు వెళ్ళే ఒక త్రోవ") వెళ్ళే శ్వాసక్రియ సరిగా పనిచేయకపోవచ్చును. ఒక 12-లీడ్ EKG ను వాడడము వలన కేవలము రెండవ స్థాయికి చెందిన సైనోస్థిరాల్ బ్లాక్ లను మాత్రమే గుర్తించగలుగుతారు .[9] ఏదైనా ఒక ప్రత్యేకమైన బ్రాడీకార్డియాకు ఒక యంత్రాంగమును ఇవ్వడము దాదాపు అసాధ్యము, కానీ అప్పటికే ఉన్న యంత్రాంగము వైద్యము చేయడానికి సరిపోయేది కాదు, ఇది సిక్ సైనస్ సిండ్రోమ్ యొక్క రెండు సందర్భములలోను ఒకేలా ఉంటుంది, అది: ఒక శాశ్వతమైన పేస్ మేకర్ వేయడం.

అట్రియో వెంట్రిక్యులర్ కండక్షన్ లో ఆటంకములు (aka: AV బ్లాక్; 1o AV బ్లాక్, 2o టైప్ I AV బ్లాక్, 2o టైప్ II AV బ్లాక్, 3o AV బ్లాక్) వంటివి బండిల్ ఆఫ్ హిజ్ లో వలె AV నాడి జబ్బుపడడము వలన రావచ్చును లేదా దాని కంటే క్రింద రావచ్చును. సైనోఆట్రియాల్ బ్లాక్స్ కంటే AV బ్లాక్ ల క్లినికల్ సంబంధం చాలా ఎక్కువ.[9]

బ్రాడీకార్డియా ఉన్న రోగులు అప్పటికే అది కూడా వచ్చే ఉంటుంది, కానీ పుట్టుకతో వచ్చినది కాదు. బ్రాడీకార్డియా పెద్ద వయసు ఉన్న రోగులలో చాలా సాధారణముగా కన్పిస్తుంది.

రోగ నిర్ధారణ[మార్చు]

పెద్దలలో గుండె నిముషమునకు అరవై సార్ల కంటే తక్కువ కొట్టుకుంటుంటే బ్రాడీకార్డియా ఉంది అని నిర్ధారించవచ్చు. దీనిని పల్పేషన్ లేదా ఒక ECG ద్వారా నిర్ధారించవచ్చు.

రోగ లక్షణములు కనిపిస్తుంటే, అసలు కారణము కనుగొనడానికి ఎలెక్ట్రోలైట్ లను నిర్ధారించడము అనేది చాలా ఉపయోగముగా ఉంటుంది.

నిర్వహణ[మార్చు]

బ్రాడీకార్డియాకు వైద్యము చేయడం అనేది ఆ వ్యక్తి స్థిరముగా ఉన్నాడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.[3] ప్రాణవాయువు సరిగా అందకుండా ఉంటే కొంత మొత్తములో ప్రాణ వాయువు అందించాలి.[3]

స్థిరత్వము[మార్చు]

ఆ వ్యక్తి అసలు రోగ లక్షణములు చూపించకుండా ఉన్నా లేదా కొద్దిగా చూపిస్తూ ఉన్నప్పటికీ అత్యవసరమైన వైద్యం అవసరము ఉండదు.[3]

అస్థిరత్వము[మార్చు]

ఒక వ్యక్తి అస్థిరముగా ఉంటే ముందుగా సూటిగా నరములకు ఆట్రోపిన్ ఇవ్వవలసినదిగా సూచించబడుతుంది.[3] 0.5 mg కంటే తక్కువ మోతాదు వినియోగించకూడదు, ఎందుకు అంటే అది గుండె కొట్టుకునే వేగాన్ని ఇంకా తగ్గిస్తుంది.[3] ఇది కనుక పని చేయకపొతే, నరములకు ఇనోట్రోప్ ను ఇవ్వడము, డోపమైన్ ను లేదా ఎపిన్ఫరైన్ లోపలి ఎక్కించడము లేదా ట్రాన్సిక్యూటనస్ పేసింగ్ అనేవి వాడవలసి ఉంటుంది.[3] బ్రాడీకార్డియా యొక్క కారణమును వెనుకకు తీసుకోవడం వీలు కాకపొతే ట్రాన్స్వీనస్ పేసింగ్ అనేది చాలా అవసరము అయినది.[3]

సూచనలు[మార్చు]

  1. సైనస్ బ్రాడికార్డియా e మెడిసిన్
  2. బ్రాడికార్డియా ఎట్ మౌంట్ సినాయ్ హాస్పిటల్
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Allan B. Wolfson, ed. (2005). Harwood-Nuss' Clinical Practice of Emergency Medicine (4th ed.). p. 260. ISBN 0-7817-5125-X.
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  6. "AV Junctional Rhythm Disturbances (for Professionals)". American Heart Association. 2008-12-04. Retrieved 15 December 2009.
  7. 7.0 7.1 "Arrhythmias and Conduction Disorders". The merck Manuals: Online Medical Library. Merck Sharp and Dohme Corp. 2008-01. Retrieved 16 December 2009. Check date values in: |date= (help)
  8. 8.0 8.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  9. 9.0 9.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).