బ్రాహ్మణ గోత్రములు మరియు ప్రవరలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రాహ్మణులు వారి యొక్క గుర్తించదగిన పూర్వీకులు సంతతికి చెందిన వారిని ఆధారంగా తమను, తండ్రి వారసత్వం నుండి వర్గీకరించు కొందురు. ఈ పూర్వీకులు వారికి ఎంచుకున్న బ్రాహ్మణులుగా మారిన పురాతన భారతీయ ఋషులు లేదా క్షత్రియులు (యోధులు) సంతతికి ఆధారములు అయి ఉందురు.[1]

బ్రాహ్మణ గోత్రములు మరియు ఋషులు[మార్చు]

బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్య, గౌతముడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు,

బ్రాహ్మణ గోత్రములు మరియు క్షత్రియులు[మార్చు]

క్షత్రియుల వంశక్రమముగా వ్యుత్పత్తి, జాడలు పట్టుకొని, గోత్ర జాడతీయుట, ఆనవాలు. గురుతులు పట్టుట చేసిన రెండు గోత్రములకు క్షత్రియులు అయిన విశ్వామిత్రుడు మరియు మిత్రా ల నుండి ఆధారములు తరువాతి సంతతికి ఉన్నాయి.

శాఖలు మరియు ప్రవరలు[మార్చు]

అధర్వ సూత్ర కర్తలు బ్రాహ్మణుల శాఖలతో పాటు వారి ప్రవరలను కూడా ఏర్పరిచారు. హోత్ర సూత్ర కర్తలు అయిన భారద్వాజ, అగ్నివేశ్య, సత్యాషాడ, వైఖానస, హిరణ్యకేశ, ఆపస్తంబ, కాత్యాయన, బోధాయన, లోగాక్షి, ఇత్యాది గోత్ర ప్రవరలకు శాస్త్రకర్తలు. భారద్వాజ, గౌతమ, కశ్యప, వశిష్ట, కాలీయ, అత్రి, వైవస్వత సప్త ఋషులకు భృగువు, అగస్త్య, అంగీరసులు ఎల్లరూ గోత్ర గణాలకు ఆద్యులుగానూ, మూల పురుషులుగానూ గోత్ర ప్రవరల యందు దర్శనమిస్తున్నారు.

గోత్రములు-ఉపవిభాగాలు-ఉప ఉపవిభాగాలు[మార్చు]

గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము వశిష్ట గణ గోత్ర ప్రవరలులో ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య మరియు వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప ఉపవిభాగాలుగా విభజించ బడ్డాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]