Jump to content

బ్రిజేష్ మెర్జా

వికీపీడియా నుండి
బ్రిజేష్ మెర్జా

పదవీ కాలం
2021 సెప్టెంబర్ 16  2022

పదవీ కాలం
2017  2022
ముందు కాంతిలాల్ అమృత్య
తరువాత కాంతిలాల్ అమృత్య
నియోజకవర్గం మోర్బి

వ్యక్తిగత వివరాలు

జననం 1958 మార్చి 1
గుజరాత్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

బ్రిజేష్‌భాయ్ మెర్జా (జననం 01 మార్చి 1958) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మోర్బి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 వరకు భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

బ్రిజేష్ మెర్జా 1985 నుండి 2007 వరకు ముఖ్యమంత్రి మాధవ్‌సిన్హ్ సోలంకి నుండి నరేంద్ర మోడీ వరకు వివిధ మంత్రులకు కార్యదర్శిగా పని చేసి ఆ తరువాత 2007లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా, మోర్బి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్‌కోట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోర్బి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

బ్రిజేష్ మెర్జా 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోర్బి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కాంతిలాల్ అమృత్యపై 3,419 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2020లో ఎమ్మెల్యే పదవికి & కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి[4][5] 2020లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జయంతిలాన్ జెరాజ్‌భాయ్ పటేల్ పై 4,649 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 వరకు భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[6]

ఆయనకు 2022లో బీజేపీ టికెట్ దక్కలేదు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Five former Congress MLAs join BJP in Gujarat" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 June 2020. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  2. "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
  3. The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  4. "કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કોણ છે આ પાટીદાર નેતા? જાણો વિગત". ABP Asmita. 5 June 2020. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  5. "Another Gujarat Congress MLA Resigns Ahead Of Rajya Sabha Polls, Third In 3 Days" (in ఇంగ్లీష్). NDTV. 5 June 2020. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  6. "A new look: Gujarat BJP ministry dominated by first-timers" (in ఇంగ్లీష్). India Today. 16 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
  7. "Gujarat election: Morbi MLA Brijesh Merja among 5 ministers denied ticket in BJP's 1st list of candidates" (in ఇంగ్లీష్). India TV News. 10 November 2022. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.