బ్రిజ్‌లాల్ బియానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రిజ్‌లాల్ బియానీ
బ్రిజ్‌లాల్ బియానీ


వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
సంతానం కమల్ కిషోర్ బుయానీ, కమలా దేవి సార్దా, సరళా బిర్లా
పూర్వ విద్యార్థి Morris College, Nagpur

బ్రిజ్‌లాల్ బియానీ (1896-1968) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. అతను మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో పుట్టి పెరిగాడు.నాగపూర్‌లోని మోరిస్ కళాశాలలో చదువుకున్నాడు. బియానీ 1920 లో సహాయ నిరాకరణోద్యమంలో చేరాడు. దహిహండ ఉప్పు సత్యాగ్రహం, జంగిల్ సత్యాగ్రహం, నిజాం వ్యతిరేక పోరాటంలో అతను పాల్గొన్నపుడు నాలుగు సార్లు జైలు శిక్ష అనుభవించాడు.

1927-1930 సమయంలో సెంట్రల్ ప్రావిన్సెస్, బెరార్ మూడవ శాసన మండలిలో సభ్యునిగా అతను మొదటిసారి MLC గా ఎన్నికయ్యాడు. [1]

స్వాతంత్ర్యానంతరం, బియానీ అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. తరువాత అకోలా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. [2]

అతను 1957 లో మంగ్రుల్‌పిర్ నుండి బొంబాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. మహారాష్ట్ర మొదటి శాసనసభలో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [3]

అతనికి సావిత్రితో చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది. అతని కుమార్తె సరళ బిర్లా 1941 ఏప్రిల్ లో వ్యాపారవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా కుమారుడు బసంత్ కుమార్ బిర్లాను వివాహం చేసుకుంది. [4]

అమరావతిలోని బ్రిజ్‌లాల్ బియానీ సైన్స్ కాలేజీకి అతని పేరు పెట్టారు. అతని గౌరవార్థం భారత ప్రభుత్వం 2002 లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. [5]

మూలాలు

[మార్చు]
  1. Pateriya, Raghaw Raman (1991). Provincial legislatures and the national movement: a study in interaction in ... New Delhi: Northern Book Centre. p. 228. ISBN 81-85119-58-9.
  2. "State Election of India 1957" (PDF). Election Commission of India. p. 33. Retrieved 21 January 2010.
  3. "State Election of India 1957" (PDF). Election Commission of India. p. 33. Retrieved 21 January 2010.
  4. Brijlal Biyani and Indian Post
  5. Brijlal Biyani and Indian Post