బ్రిటిష్‌ కౌన్సిల్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రిటిష్‌ కౌన్సిల్‌
BritishCouncil.png
Founder(s)United Kingdom Government
TypeCultural institution
Founded1934
Key peopleVernon Ellis (Chair)
Martin Davidson (Chief Executive)
Area servedWorldwide
Product(s)British cultural and language education
Revenue£982 million (2007/6)
Websitewww.britishcouncil.org
లండన్‌లోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయం

బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఇంగ్లండ్‌లో ప్రభుత్వ విధులు నిర్వర్తించే ఒక రకమైన స్వతంత్ర స్వచ్ఛంద సంస్థ వంటిది (ఆమ్స్‌ లెంగ్త్‌ బాడీ). అంతర్జాతీయ విద్య, సాంస్కృతిక అవకాశాల విషయంలో విశేష కృషి చేస్తుంది. దీన్ని రాయల్‌ చార్టర్‌ ద్వారా ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌తో పాటు స్కాట్లండ్‌లో కూడా ధార్మిక సేవా సంస్థగా ఇది నమోదైంది.

1934లో ఏర్పాటైన బ్రిటిష్‌ కౌన్సిల్‌కు 1940లో కింగ్‌ జార్జి 6 రాయల్‌ చార్టర్‌ను అనుమతించారు.[1] ఇంగ్లండ్‌ ప్రభుత్వంలో ఈ సంస్థను స్పాన్సర్‌ చేసే శాఖ విదేశీ, కామన్వెల్త్‌ వ్యవహారాల కార్యాలయం. రోజువారీ పనుల విషయంలో సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందనే చెప్పాలి. సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్‌ డేవిసన్‌ 2007 ఏప్రిల్‌లో నియమితులయ్యారు.[ఉల్లేఖన అవసరం]

విషయ సూచిక

అవలోకనం[మార్చు]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ లక్ష్యం: ఇంగ్లండ్‌కు, ఇతర దేశాలకు మధ్య పరస్పర లాభదాయక రీతిలో సాంస్కృతి, విద్యా సంబంధాలను పెంపొందించడం. ఇంగ్లండ్‌ సృజనాత్మక ఆలోచనలను, సాఫల్యాలను ప్రోత్సహించడం. బ్రిటిష్‌ కౌన్సిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు, ప్రాంతాల్లో విస్తరించిన నెట్‌వర్క్‌ ఉంది. సెంట్రల్‌ లండన్‌లో వైట్‌హాల్‌ సమీపంలోని స్ప్రింగ్‌ గార్డెన్స్‌లో ప్రధాన కార్యాలయముంది. బెల్‌ఫాస్ట్‌, కార్డిఫ్‌, మాంచెస్టర్‌, ఎడింబరోల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.[2]

2006/07లో బ్రిటిష్‌ కౌన్సిల్‌కు 55.1 కోట్ల పౌండ్ల ఆదాయం లభించింది. ఇందులో 19.5 కోట్ల పౌండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం గ్రాంట్ల రూపంలో ఇచ్చింది.[ఉల్లేఖన అవసరం] మిగతా మొత్తాన్ని వ్యక్తులు, సంస్థలకు ఇంగ్లిష్‌ నేర్పడం; పరీక్షలు; కన్సల్టెన్సీ సేవల వంటివాటి ద్వారా సంస్థ సంపాదించింది. ప్రధానంగా అభ్యసనం/శిక్షణ, కళలు, సైన్స్‌, సమాజం వంటివి సంస్థ కార్య క్షేత్రాలు. బ్రిటిష్‌ కౌన్సిల్‌కు గర్వ కారణంగా పలు దేశాల్లో చిరకాలం పాటు కొనసాగిన పలు బ్రిటిష్‌ కౌన్సిల్‌ గ్రంథాలయాలను సంస్థ క్రమంగా మూసేసింది.[ఉల్లేఖన అవసరం][neutrality is disputed]

సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 400 నుంచి 500 సిబ్బందిని తొలగిస్తున్నట్టు 2009 జూన్‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఇందుకోసం బ్యాక్‌ ఆఫీస్‌ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడంతో పాటు ఇంగ్లండ్‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యకలాపాలను మరింతగా కేంద్రీకృతం చేయడం మొదలు పెట్టింది.[3]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ రెబెకా వాల్టన్‌ 'మొనోకల్‌' మేగజైన్‌కు ఇలా చెప్పారు: బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రధానోద్దేశమైన సాంస్కృతిక సంబంధాలతో పాటు కళలకు కూడా సమ ప్రాధాన్యం లభించేలా చూసేందుకు మేమెంతగానో కృషి చేస్తున్నాం. సరిహద్దులకు అతీతంగా దేశాల మధ్య సజావుగా చర్చల ప్రక్రియలు మొదలు పెట్టేందుకు కళలే అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. దేశాల చేతుల్లోని అస్త్రాల్లో ఆంక్షలతో సమానంగా ఇప్పుడు తొలిసారిగా కళలు కూడా ప్రధానంగా మారుతున్నాయని ఒక విదేశీ విభాగపు అధికారి ఇటీవలే వ్యాఖ్యానించగా నేను విన్నాను. ప్రజలంతా ఇంగ్లండ్‌కేసి మరింతగా ఆకర్షితులు కావాలని, ప్రపంచం విషయంలో ఇంగ్లండ్‌ తాలూకు సానుకూల లాభాలను మరింతగా గమనించాలని మన కోరిక. అందుకే మనం బ్రిక్‌ దేశాలపై దృష్టి కేంద్రీకరించాలి. రష్యా రాజకీయంగా చాలా కష్టమైన ప్రాంతం. అలాగే గల్ఫ్‌ దేశాల్లో మన ఉనికిని కేవలం ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్నాం. అక్కడ నాటక రచనను వృద్ధి చేసే ప్రయత్నాలకు మనం ఇప్పుడిప్పుడే ఊతమిస్తున్నాం. యువత ఆసక్తులేమిటి, వాటిని ఆకర్షించగల అంశాలేమిటన్న వాటిని గురించి రాయడంపైనే ప్రస్తుతానికి మనం నిమగ్నులమయ్యాం. సమీప ప్రాచ్య దేశాలు, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కూడా ఒకప్పుడు మన రాయల్‌ కోర్టు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంది. గల్ఫ్‌ విషయంలోనూ అక్కడి మాదిరిగానే వృద్ధి చెందాలన్నది నా అభిమతం. ఒక దేశంగా మనం దీర్ఘకాలిక పనులే చేస్తాం. ఇంగ్లండ్‌ పెద్ద స్థాయి కార్యాలను చేపట్టి పూర్తి చేయాల్సిన సందర్భాలు కూడా కొన్నుంటాయన్నది నా అభిప్రాయం. ముఖ్యంగా అబుదాబిలో ఫ్రాన్స్‌ అభిరుచి మాదిరిగా ఒక నగర వాతావరణాన్ని అది ఉన్నపళంగా మార్చగలిగినప్పుడు. (మోనోకల్‌ సంచిక 26, సంపుటి 3, 2009 సెప్టెంబర్‌)

ఫ్రాన్స్‌ 'అలెయన్స్‌ ఆఫ్‌ ఫ్రాంచైజెస్‌' నెట్‌వర్క్‌కు తిరుగే లేదని మోనోకల్‌ మేగజైన్‌ నిర్వహించిన సాఫ్ట్‌ పవర్‌ సర్వే తేల్చింది. అది ఇంగ్లండ్‌లోని సాఫ్ట్‌ పవర్‌ను ఫ్రాన్స్‌ సంస్థతో సమానమైనదిగా అంచనా వేసే ముందు బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యకలాపాల గురించి ఏ విధమైన ప్రత్యేక ప్రస్తావనా చేయడంలో విఫలమైంది. అదే సంచికలో మేగజైన్‌ మరో విషయాన్ని కూడా పేర్కొంది. ఆంగ్ల భాషా బోధనలో స్వీడన్‌కు చెందిన ఈఎఫ్‌ (ఇంగ్లిష్‌ ఫస్ట్‌) అనే కంపెనీ పోషించిన ప్రధాన పాత్రను ప్రత్యేక వ్యాసంలో పేర్కొంది. ఇంగ్లండ్‌కు సంబంధించి సాఫ్ట్‌ పవర్‌ మెట్రిక్స్‌ను ప్రస్తావించిన సందర్భంగా, బీబీసీ వరల్డ్‌ చేసిన సేవలను కూడా ప్రస్తుతించింది.

https://web.archive.org/web/20101217103807/http://monocle.com/sections/affairs/Magazine-Articles/The-new-soft-sell---Global/

లిబియాలో శాంతిని కొనసాగించే ఇంగ్లీష్‌ ప్రాజెక్టు వంటి బ్రిటిష్‌ కౌన్సిల్‌ కొనసాగించే కార్యకలాపాలకు అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ, రక్షణ శాఖలకు చెందిన ఎఫ్‌సీఓ నిధులు సమకూరుస్తుంది. ఇది బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రైవేట్‌ రంగ విమర్శకుల్లో అనుమానాలకు, అభ్యంతరాలకు తావిస్తోంది.[4][5]

చరిత్ర[మార్చు]

ప్రస్తుతమున్న బ్రిటిష్‌ కౌన్సిల్‌ భావన 1920ల చివర్లో ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీల సాంస్కృతిక సంస్థలు చాలా విజయవంతమైన తీరును చూసిన తర్వాత ఇంగ్లండ్‌ విదేశీ కార్యాలయంలో మొగ్గ తొడిగింది.[6] భావ సారూప్యత ఉన్న కొందరు వ్యక్తులు 1934లో బ్రిటిష్‌ కమిటీ ఫర్‌ రిలేషన్స్‌ విత్‌ అదర్‌ కంట్రీస్‌ను స్థాపించారు.[7] ఇందులోని కమిటీ అనే పదాన్ని వెంటనే తొలగించారు. దాంతో అది బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిలేషన్స్‌ విత్‌ అదర్‌ కంట్రీస్‌గా మారింది.[8] తొలుత ఈ కమిటీ పనంతా రెండే రంగాల్లో విస్తరించి ఉండేది. అవి విదేశాల్లో ఆంగ్ల విద్యకు మద్దతు, ప్రసంగ పర్యటనలు, సంగీత ట్రూపులు, కళా ఎగ్జిబిషన్ల ద్వారా బ్రిటిష్‌ సంస్కృతిని వ్యాపింపజేయడం. ఇందుకు వారు లక్ష్యంగా చేసుకున్న తొలి భౌగోళిక ప్రాంతాలుగా తూర్పు మధ్యదరా, మధ్యప్రాచ్య దేశాలను చెప్పుకోవాలి. అనంతరం ఐరోపా‌, లాటిన్‌ అమెరికాల్లోని పేద దేశాలపై కౌన్సిల్‌ దృష్టి సారించింది. 1936లో సంస్థ పేరును అధికారికంగా బ్రిటిష్‌ కౌన్సిల్‌గా కుదించారు.[8] పలు బ్రిటిష్‌ కాన్సులేట్లలో ఇది పని చేయడం మొదలు పెట్టింది. కానీ పలు దేశాల్లో నెమ్మదిగా తనకంటూ సొంత కార్యాలయాలను కూడా కాలక్రమంలో మొదలు పెట్టింది. 1938లో ఈజిప్టుతో ఇందుకు తెర తీసింది. స్థానిక పరిస్థితులు, అవకాశాలు, బ్రిటిష్‌ కార్యకలాపాలను అక్కడి వారు స్వీకరించే సావకాశాల వంటివాటిపై కౌన్సిల్‌కు దాని విదేశీ సహాయకులు ముందుగానే కావాల్సినంత సమాచారాన్ని సేకరించేవారు. ఈ సమాచారాన్ని 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన కొత్తలో అప్పుడప్పుడే ఏర్పాటు చేసిన సమాచార శాఖకు పంపేవారు.[7]

యుద్ధ సమయంలో ఐరోపా‌, మధ్య ప్రాచ్యాల్లోని అత్యధిక బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయాను మూసేశారు. తటస్థ స్వీడన్‌, పోర్చుగల్‌, స్వీడన్‌ మాత్రమే ఇందుకు మినహాఇంపు. ఇందుకు బదులుగా ఇంగ్లండ్‌తో పాటు అక్కడి మిత్రపక్షాల సేవా బృందాలకు ఇంగ్లిష్‌ తదితర విద్యావకాశాలు కల్పించసాగారు. ఈ సేవల నిర్వహణకు 1939లో రెసిడెంట్‌ ఫారినర్స్‌ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేశారు. యుద్ధం ముగిసేనాటికి ఇంగ్లండ్‌లో లండన్‌, లివర్‌పూల్‌, మాంచెస్టర్‌, బర్మింగ్‌హం, ఆక్స్‌ఫర్డ్‌, స్ట్రాట్‌ఫర్డ్‌-ఆన్‌-అవాన్‌, విల్టన్‌; స్కాట్లండ్‌లో ఎడింబరో, లేత్‌; వేల్స్‌లోని కార్డిఫ్‌లతో పాటుగా అతిథి శాస్త్రవేత్తలకు, మిత్రపక్షాల లాయర్ల ఫోరాలకు సామాజిక కేంద్రం‌గా ఇవి దోహదపడ్డాయి.[9] 1940లో కింగ్‌ జార్జి 6 బ్రిటిష్‌ కౌన్సిల్‌కు రాయల్‌ చార్టర్‌ను అనుగ్రహించారు. యుద్ధానంతరం బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఐరోపా‌ పునర్నిర్మాణ పనుల్లో అది పెద్ద ఎత్తున పాల్గంది. కానీ నిధుల లేమి కారణంగా పలు ఇతర ప్రాంతాల్లో మాత్రం కార్యాలయాలను మూసేయాల్సి వచ్చింది.[7] వీటిలో తొలుత చేపట్టిన పనులుగా 1944 ఆగస్టులో పారిస్‌ను విముక్తం చేయగానే ఆస్టిన్‌ గిల్‌ను అక్కడి పారిస్‌ కార్యాలయాన్ని పున:ప్రారంభించేందుకు పంపారు. అక్కడి త్వరలోనే ఓల్డ్‌ విక్‌ కంపెనీ, జూలియన్‌ హక్స్‌లీ, టీఎస్‌ ఇలియట్‌ వంటి ప్రముఖులు సందర్శించసాగారు.[10] శరణార్థులు తిరిగి వస్తుండటంతో ఇంగ్లండ్‌లోని సగానికి సగం కేంద్రాలను మూసేశారు. కానీ మిగతా వారు మాత్రం విదేశీ విద్యార్థులకు, స్వల్పకాలిక సందర్శకులకు మద్దతిచ్చే కొత్త కార్యాన్ని భుజాలకెత్తుకున్నారు.

పునర్నిర్మాణ కార్యక్రమాల తర్వాత, విదేశీ కార్యాలయాల నుంచి నిధులు తగ్గసాగాయి. దాంతో బ్రిటిష్‌ కౌన్సిల్‌ విధిగా పలు దేశాల నుంచి రాజకీయ కారణాలతో వైదొలగాల్సి వచ్చింది. తూర్పు ఐరోపా‌లోని అత్యధిక దేశాలు, చైనా, పర్షియా (ఇరాన్‌) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా సంస్థకున్న నెట్‌వర్క్‌ కూడా క్షీణించింది.[11] డ్రోగెడా, హిల్‌, వోస్పెర్‌, డంకన్‌ సమీక్ష కమిషన్లు ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా తమ నివేదికలు ఇచ్చిన తర్వాత బ్రిటిష్‌ కౌన్సిల్‌ రైసన్‌ డీటెర్‌ కూడా పెద్దపెట్టున విమర్శలకు లోనైంది. తర్వాత కూడా బ్రిటిష్‌ కౌన్సిల్‌ మనుగడ సాగించగలిగింది గానీ దాని లాభాలు తగ్గుముఖం పట్టాయి.

వ్యయ కుంభకోణం[మార్చు]

పన్ను చెల్లింపుదారుల డబ్బుతో ఏర్పాటైన బ్రిటిష్‌ కౌన్సిల్‌ పర్యటనల ఖర్చు విషయంలో మార్క్‌ లాంకస్టర్‌, మైకేల్‌ మార్టిన్‌ (రాజకీయ నాయకుడు), మరికొందరు ఇతర ఎంపీలు కుంభకోణానికి పాల్పడ్డారు. 2008లో మార్క్‌ లాంకస్టర్‌ బ్రిటిష్‌ కౌన్సిల్‌ పనుపున రెండు రోజుల సదస్సు కోసం బిజినెస్‌ తరగతిలో బ్యాంకాక్‌ వెళ్లారు. అందుకు ఏకంగా 5,018 పౌండ్లను వెచ్చించారు. మరోవైపు లేబర్‌ పార్టీ ఎంపీ సలీ కీబ్లే ఎకానమీ క్లాసులో వెళ్లి, బిజినెస్‌ తరగతిలో మొత్తం మీద కేవలం 2,452 పౌండ్ల ఖర్చుతో తిరిగి వచ్చారు. దాంతోపాటు తమ సంస్థలలో కాకుండా ఇతరత్రా లభించే ఎలాంటి ఆతిథ్యం గురించైనా ఎంపీలు విధిగా అందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని నుంచి మినహాయింపు ఉన్న సంస్థల జాబితాలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ పేరు లేదు. తమ పర్యటనలను గురించిన సమాచారాన్ని విడుదల చేయడాన్ని ఒక ప్రత్యేక సర్టిఫికెట్‌ నిషేధిస్తోందని చెబుతూ మార్టిన్‌ సంతకం చేశారు. దాన్ని పార్లమెంటరీ ప్రివిలేజ్‌గా ఆయన పేర్కొన్నారు. దీన్ని అన్ని పార్టీల ఎంపీలతో పాటు పౌర స్వేచ్ఛావాదులు కూడా తీవ్రంగా ఖండించారు.[12]

2010 జూన్‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్టిన్‌ డేవిసన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్వతహాగా రూపొందించుకున్న అంతర్గత నియమాలనే ఉల్లంఘిస్తూ లండన్‌లో రాత్రిళ్లు చేసిన బసలకు కూడా బిల్లులు వసూలు చేసుకోవడం ద్వారా అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ పత్రికల్లో విమర్శలు వచ్చాయి. https://archive.is/20120913224010/http://www.thisislondon.co.uk/standard/article-23835659-british-council-boss-defends-pound-4600-hotel-expenses.do

ప్రోత్సాహకాలు[మార్చు]

బోధన[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో 70 బ్రిటిష్‌ కౌన్సిల్‌ బోధన కేంద్రాలున్నాయి. అవి 2006-07లోనే 3 లక్షలకు పైగా విద్యార్థులకు 11,89,000 తరగతి గంటల పాటు బోధించాయి.[13] ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఇంగ్లిష్‌ భాషా బోధనా సంస్థ తామేనని బ్రిటిష్‌ కౌన్సిల్‌ పేర్కొంటుంది.[3]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ తమ పరీక్షా కేంద్రాల ద్వారా ఏటా 10 లక్షల మంది అభ్యర్థుల విషయంలో 15 లక్షల ఇంగ్లండ్‌ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. విదేశాల్లో అందుబాటులో ఉన్న వృత్తిగత అర్హతలను పొడిగించేందుకు ఇంగ్లండ్‌లోని పలు హోదా ఇవ్వగల సంస్థలతో కలిసి పని చేస్తోంది. అంతర్జాతీయంగా కోబిస్‌, నాబ్స్‌, యూరోపియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ వంటి పలు సంస్థల ఆధ్వర్యంలో నడిచే బ్రిటిష్‌ స్కూళ్ల వ్యవహారాలను కూడా కౌన్సిల్‌ పర్యవేక్షిస్తుంది.

దస్త్రం:IELTSlogo.jpg
విశ్వవ్యాప్తంగా ఐఇఎల్‌టిఎస్‌ ఇంగ్లిష్‌ పరీక్షను నిర్వహించడంలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ సహాయపడుతుంది

కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ఈఎస్‌ఓఎల్‌ పరీక్షలు, ఐడీపీ ఎడ్యుకేషన్‌ ఆస్ట్రేలియాలతో కలిసి గ్లోబల్‌ ఐఈఎల్‌టీఎస్‌ ఆంగ్ల భాషా ప్రామాణిక పరీక్షలను కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహిస్తుంది.

విద్యా శాఖ సాయం ద్వారా ఇంగ్లండ్‌లోని పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులకు ఇతర సంస్కృతులను అర్థం చేసుకుని, అభినందించే ప్రవృత్తిని కలిగించేందుకు అంతర్జాతీయ పాఠశాల అవార్డును బ్రిటిష్‌ కౌన్సిల్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ఈ అవార్డు కోసం 2,700 ఇంగ్లండ్‌ పాఠశాలలు ప్రయత్నిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఇంగ్లండ్‌పై ఉన్న తేలికపాటి భావాన్ని పోగొట్టేందుకు, సంస్కృతుల మధ్య చర్చలను పెంపొందించేందుకు వీలుగా అక్కడి పాఠశాలలతో పలు అనుసంధాన కార్యక్రమాలను కౌన్సిల్‌ కొనసాగిస్తుంది. ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలోని 153 పాఠశాలలు ఇలాంటి 53 అనుసంధానిత ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా ఉన్నాయి.

విదేశాల్లో పనితీరు[మార్చు]

ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ద ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ (ఐఏఈఎస్‌టీఈ) ని ఇంగ్లండ్‌లో అంతర్గతంగా బ్రిటిష్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా[14] 80కి పైగా దేశాల్లో అమల్లో ఉంది. విద్యార్థులకు ఇంగ్లండ్‌లో చదువుకునేందుకు, విదేశాల్లో పనిచేసే అంతర్జాతీయ ఉపాధి అవకాశాల్లో భాగంగా ఇంటెర్న్‌షిప్‌ చేసేందుకు అవకాశాన్ని ఈ కోర్సు కల్పిస్తుంది.[15]

అత్యుత్తమ స్థాయిలో స్ఫూర్తిని పొంది, రెండో ఏడాది, ఆ పై స్థాయి కోర్సుల్లో ఉండి, విదేశాల్లో పెయిడ్‌, కోర్సు సంబంధిత ఇంటెర్న్‌షిప్‌లలో చదువుకావాలన్న గట్టి ఆకాంక్ష ఉన్న పట్టభద్రులు టెక్నికల్‌ డిగ్రీలను, అంటే ఇంజనీరింగ్‌, సైన్స్‌, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ వంటి కోర్సులు చదవడాన్ని ఈ కార్యక్రమం అనుమతిస్తుంది. వేసవి నెలల్లోని 8 నుంచి 12 వారాల్లో వీరికి నియామకాలు జరుగుతంటాయి. అయితే వీటికోసం అవకాశాలు మాత్రం ఏడాది పాటు కా అమల్లో ఉంటాయి. తమ నియామకం లోపు, లేదా గ్యాప్‌ వచ్చిన ఏడాదిలో తమకు నప్పే కోర్సులో ఇంటెర్న్‌గా చేరేందుకు ఆసక్తి ఉన్నవారికి ఇవి తగి ఉంటాయి.

అత్యంత ప్రతిభావంతులైన విదేశీ పట్టభద్రులను కంపెనీ యాజమాన్యాలకు ఈ కోర్సు అందుబాటులో ఉంచుతుంది.[16] ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ వంటి రంగాల్లో పట్టభద్రుల కొరతను ఎదుర్కొంటున్న పరిశ్రమలోని పలు కంపెనీలకు నిపుణులను అందించే అతి ముఖ్యమైన వనరుగా ఇది ఉపయోగపడుతోంది.

క్రీడా ఉత్సవాలు[మార్చు]

40కి పైగా దేశాల్లో ఉన్న తన క్రీడా ప్రాంగణాల్లో యువతీ యువకులు బృంద నిర్మాణ నైపుణ్యాల వంటి వాటిని అలవర్చుకుంటారన్నది బ్రిటిష్‌ కౌన్సిల్‌ లక్ష్యం. ఇందుకోసం డ్రీమ్స్‌+టీమ్స్‌ వంటి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇప్పటిదాకా 5,500 మంది యువ నేతలకు శిక్షణనిచ్చింది. వారి ద్వారా వారి పాఠశాలలు, సమాజాల్లోని 2.8 లక్షల మందికి చేరువైంది. మరింత మంది యువతీ యువకులకు ఈ విధంగా సాయం అందించడంతో పాటు వారిని ప్రపంచ పౌరసత్వానికి సంసిద్ధులను చేసేందుకు వీలుగా తన కార్యకలాపాలను బ్రిటిష్‌ కౌన్సిల్‌ నానాటికీ విస్తరించుకుంటోంది.

శాంతి కోసం ఇంగ్లీష్‌[మార్చు]

ఆఫ్రికా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ చేపడుతున్న కార్యకలాపాల్లో నానాటికీ శరవేగంగా విస్తరిస్తున్న అంశంగా పీస్‌కీపింగ్‌ ఇంగ్లిష్‌ను చెప్పవచ్చు. పీస్‌కీపింగ్‌ ఇంగ్లిష్‌ ప్రాజెక్ట్‌ (పీఈపీ) ద్వారా సైనిక సిబ్బందిలో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు విదేశీ, కామన్వెల్త్‌ కార్యాలయం, రక్షణ శాఖల సమన్వయంతో సంస్థ పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 దేశాల్లోని 50 వేల పై చిలుకు పోలీసు, సైనిక సిబ్బందికి పీఈపీ సాయపడుతోంది. లిబియా, [4] ఇథియోపియా, జార్జియా వంటి పలు దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.[17] ఈ పీస్‌కీపింగ్‌ ఇంగ్లిష్‌ ప్రాజెక్టును బ్రిటిష్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తోంది. దీనికి కావాల్సిన నిధులను ఇంగ్లండ్‌ ప్రభుత్వ ప్రపంచ సంఘర్షణ నిరోధక నిధి అందిస్తోంది.

ఆన్‌లైన్‌ కార్యక్రమాలు[మార్చు]

చైనా, హాంకాంగ్‌లలోని ఇంగ్లిష్‌ నేర్చుకునేవారు, అధ్యాపకుల కోసం ఒక సరికొత్త కమ్యూనిటీ వెబ్‌సైట్‌ను 2007లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ చైనా ప్రాంతం ప్రారంభించింది. ఈ సైట్‌లో ఇప్పటికే 30 వేల మందికి పైగా సభ్యులున్నాయి. ఇది సోషల్‌ నెట్‌వర్కింగ్‌ తరహా పనితీరు విభాగం. దాంతోపాటు ఇంగ్లిష్‌ నేర్చుకునే వారికోసం పలురకాలైన విస్తృత కార్యక్రమాలున్నాయి.[4][18]

2007 నాటికి ఉన్న వివరాల ప్రకారం ఇంగ్లిష్‌ నేర్చుకునే వారికోసం విద్యా ద్వీపాన్ని ఏర్పాటు చేసేందుకు సెకండ్‌ లైఫ్‌ టీన్‌ గ్రిడ్‌లోకి బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రవేశించింది.[19][20]

ఇతర కార్యకలాపాలు[మార్చు]

కఫేస్‌ సైంటిఫిక్స్‌[మార్చు]

ఇంగ్లండ్‌, మరికొన్ని దేశాల్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నడిచే కఫేస్‌ సైంటిఫిక్స వంటివి అక్కడి వారికి సైన్సును గురించిన అవగాహన కల్పించేందుకు పని చేస్తాయి. ఇవి కఫేలు, బార్లు, పుస్తక దుకాణాల వంటివాటిలో మొదలవుతాయి. ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్త, లేదా సైన్సు రచయితలు వాటిని మొదలు పెడతారు. ఇప్పటిదాకా జరిగిన ఇలాంటి కార్యక్రమాలుభారత్‌, మలేసియా వంటి సుదూర దేశాల నుంచి కూడా సామాజిక, జాతిపరమైన అంశాల నుంచి మొదలుకుని డార్విన్‌, డీఎన్‌ఏ, భూ తాఫోన్నతి (గ్లోబల్‌ వార్మింగ్‌), కృతిమ మేధ వంటివాటిపై చర్చించేందుకు ప్రజలను ముందుకు తీసుకొస్తున్నాయి.

కర్బనరహిత నగరం[మార్చు]

పర్యావరణ మార్పులు, [21] ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ ఎదుర్కొంటున్న ఇంధన సవాళ్ల పట్ల అందరిలోనూ అవగాహన కలిగించడం కోసం కర్బనరహిత నగరం అనే ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని బ్రిటిష్‌ కౌన్సిల్‌ మొదలు పెట్టింది. తన సైన్స్‌ పనులకు అతి పెద్ద అంశంగా పర్యావరణ మార్పులను అది ఎంచుకుంది. 'ఈ అతి పెద్ద సమస్యను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్‌ ప్రదాని చూపుతున్న నాయకత్వ పటిమ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు జీ8, ఈయూ అధ్యక్ష స్థానాలను ప్రధాని ఉపయోగిస్తున్న తీరు వంటివాటిని ఎత్తి చూపడం దీని లక్ష్యం. ఒక ఆన్‌లైన్‌ ప్రపంచవ్యాప్త చర్చ, పలు సెమినార్లు, సదస్సులతో కూడిన టూరింగ్‌ ఎగ్జిబిషన్‌ కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం. కర్బనరహిత నగరం కార్యక్రమంలో ఇప్పటికే 62 దేశాలు పాల్గన్నాయి. 25 లక్షల మందిని ఈ ప్రచారం నేరుగా చేరుకుంది.

2006లో పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల యువత ప్రచార శాఖ చేపట్టిన విజయవంతమైన కార్యక్రమంలో అనంతరం మరో కార్యక్రమానికి బ్రిటిష్‌ కౌన్సిల్‌ తెర తీసింది. పర్యావరణ మార్పుల చాంపియన్లు పథకం ద్వారా 13 దేశాల నుంచి (ఒక్కొక్కరు చొప్పున) యువ చాంపియన్లను జీ8+5 సదస్సుల్లో ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేసింది. పర్యావరణ మార్పుల ప్రభావాన్ని వివరించడం, దాన్ని ఎదుర్కొనే మార్గాంతరాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ యువ చాంపియన్లను కార్యోన్ముఖులను చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

ఈ చాంపియన్లు మొదట 2008 మే నెలలో లండన్‌ను సందర్శించారు. అక్కడ వారు జీ8 పర్యావరణ మంత్రులకు మూడు ఔత్సాహిక సవాళ్లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత వీటిలో తమకిష్టమైన సవాలుకు ఓటు వేశారు. తర్వాత గెలుపొందిన సవాలును చాంపియన్లంతా కలిసి జపాన్‌లోని కోబేలో జరిగిన కోబే చాలెంజ్‌లో వారు ప్రదర్శించారు. తమ సొంత దేశాల్లో వాటిపై ప్రాజెక్టును పూర్తి చేసి, దాని ప్రగతిపై నివేదిక సమర్పిస్తామని ప్రతినబూనారు.

అఫ్గానిస్థాన్‌లో షేక్స్‌పియర్‌ నాటక ప్రదర్శన[మార్చు]

2005లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ మద్దతుతో ప్రదర్శించిన లవ్స్‌ లేబర్స్‌ లాస్ట్‌ అఫ్గానిస్తాన్‌లో గత 17 ఏళ్లలో ప్రదర్శితమైన తొలి షేక్స్‌పియర్‌ నాటకంగా ప్రసిద్ధి చెందింది. ఈ నాటకాన్ని అఫ్గాన్‌లోని దరి భాషలో ప్రదర్శించారు. షేక్స్‌పియర్‌ నాటకంలోని సార్వత్రిక అంశాలను స్థానికాంశాలు, సంగీతంతో మేళవించి ప్రదర్శించిన ఈ నాటకాన్ని కిక్కిరిసిన ఆడిటోరియంలో జనాలంతా అత్యంత ఉత్సాహంతో తలకించారు.

యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అవార్డులు[మార్చు]

విదేశాల్లో సృజనాత్మక పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇంగ్లండ్‌ సంస్థలతో బ్రిటిష్‌ కౌన్సిల్‌ చేతులు కలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ సీజనాత్మక పారిశ్రామికవేత్తలకు 'ఇంటర్నేషనల్‌ యంగ్‌ పబ్లిషర్‌ ఆఫ్‌ ద ఇయర్‌', 'యూకే యంగ్‌ పబ్లిషింగ్‌ ఎంట్రప్రెన్యూర్‌ మరియు ఇంటర్నేషనల్‌ యంగ్‌ మ్యూజిక్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' వంటి కొన్ని అవార్డులు అందించడం దీని లక్ష్యం.[22]

వైసీఈ అవార్డు కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు: ఒకటేమో వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుంచి అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అవార్డు, మరోటి ఇంగ్లండ్‌కు చెందిన సృజనాత్మక పారిశ్రామికవేత్తలకు.[23]

వైసీఈ కార్యక్రమం గురించి[మార్చు]

సృజనాత్మక పరిశ్రమల పరిధిలో స్థాపించిన తమ వ్యాపారాల అనుభవాలను యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అందరితో పంచుకునేందుకు వీలు కల్పించేలా యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్త కార్యక్రమం ఏర్పాటైంది. సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ఏర్పరచి, సృజనాత్మక ప్రతిభ, వినియోగదారుల మధ్య వారధిని ఏర్పాటు చేసేందుకు కేంద్రీకృత వ్యవస్థ అవసరాన్ని ఇది గుర్తిస్తుంది. 25-35 మధ్య వయసులో ఉన్న యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నైపుణ్యాలను వైసీఈ కార్యక్రమం కొనియాడుతుంది. వారికి శిక్షణ అవకాశాలను అభివృద్ధి చేస్తుంది. వారి కెరీర్‌ వృద్ధికి కావాల్సిన పరికరాలను ఇవ్వజూపుతుంది. కొలాబరేషన్లతో పాటు కొత్త ప్రాజెక్టులకు కావాల్సిన ఉత్సాహాన్ని, ఉద్దీపనను అందిస్తుంది.[24]

సృజనాత్మక రంగాల్లో పని చేసే అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇంగ్లండ్‌కు ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలకు చెందిన భావి నేతల మధ్య సరికొత్త రంగాలవారీ, భిన్న రంగాలవారీ నెట్‌వర్కులను ఏర్పాటు చేస్తుంది.

సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంస్కృతిక సంబంధాలను మౌలిక నైపుణ్యాలుగా బ్రిటిష్‌ కౌన్సిల్‌ పరిగణిస్తుంది. ఈ నెట్‌వర్కుల ద్వారానే వారు పని చేస్తారు, వాటిపై ఆధారపడతారు. ఈ దృక్పథాల ద్వారానే వారు కార్యక్రమాలను నిర్మిస్తారు.

ఏటా బ్రిటిష్‌ కౌన్సిల్‌ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి, ఇంగ్లండ్‌లోని సృజనాత్మక పరిశ్రమలను వారికి చూపిస్తుంది. అలాగే ఇంగ్లండ్‌లోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వర్ధమాన ఆర్థిక వ్యవస్థలను చూపిస్తుంది. తద్వారా ఈ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ చుట్టూ ఉన్న ప్రంపంలోని భిన్న, వైవిధ్యమైన నెట్‌వర్కు అవకాశాలపై, సంయుక్త సహకారానికి (కొలాబరేషన్‌) వాటి మధ్య ఉన్న బోలెడన్ని అవకాశాలపై, వాటికి నేతృత్వం వహించడంతో పాటు వాటి నుంచి నేర్చుకునేందుకు తమకున్న అవకశాలపై కావాల్సినంత అవగాహన కల్పిస్తుంది.

ఇందులో 9 విభాగాల్లో అవార్డులున్నాయి: విజువల్‌ ఆర్ట్స్‌, డిజైన్‌, ఫ్యాషన్‌, పర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ప్రచురణ, స్క్రీన్‌, సంగీతం, ఇంటరాక్టివ్‌, కమ్యూనికేషన్స్‌.

అంతర్జాతీయ యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవార్డులు[మార్చు]

వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చెందిన అంతర్జాతీయ యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సాఫల్యాలను సత్కరించడంతో పాటు వారిలోని ప్రతిభను వృద్ధి చేసేందుకు అంతర్జాతీయ యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవార్డులను బ్రిటిష్‌ కౌన్సిల్‌ సృజన్తామక ఆర్థిక వ్యవస్థ విభాగం ప్రారంభించింది.

కొత్త అవకాశాల కోసం తమ శోధనను అభివృద్ధి చెందిన ప్రపంచానికి మాత్రమే పరిమితం చేసే దిశగా రంగాల వారీగా ఉన్న ధోరణికి ప్రతిస్పందనగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలపై ఐవైసీఈ దృష్టి సారిస్తుంది. వాణిజ్యానికున్న ప్రపంచ స్థాయి స్వభావం దృష్ట్యా ఆయా అవకాశాలను విజయవంతంగా చేరుకోవడంతో పాటు చేజిక్కించుకోవడానికి ఇది దారులు పరుస్తుంది.

ఇందులో తొలి అవార్డును ప్రచురణల విభాగంలో 2004లో ప్రవేశపెట్టారు. అనంతరం డిజైన్‌ (2005), సంగీతం (2006), స్క్రీన్‌ (ఫిల్మ్‌ అండ్‌ టీవీ) (2007), ఫ్యాషన్‌ (2008) ల్లో అవార్డులు మొదలయ్యాయి. 2008/09లో కమ్యూనికేషన్స్‌, ఇంటరాక్టివ్‌, పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌ వంటివాటిలో కూడా అవార్డులను ప్రవేశపెట్టారు. ఇలా సృజనాత్మక పరిశ్రమల్లో 9 అవార్డులను ప్రవేశపెట్టినట్టు అయింది.

బ్రిటిష్‌ కౌన్సిల్‌ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ద్వారా పాల్గనే వర్ధమాన దేశాలకు చెందిన ఆర్థిక వ్యవస్థల్లోని యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ ఈ అవార్డులు అందుబాటులో ఉంటాయి. ఏటా 8 నుంచి 10 దేశాలను ఇందులో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఆయా దేశాల్లోని స్థానిక బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయాలు జాతీయ ఫైనలిస్టును ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫైనలిస్టును జాతీయ పోటీల నుంచి, తమ జాతీయ పరిశ్రమలోని ప్రఖ్యాత గణాంకాలున్న జ్యూరీ ఎంపిక చేస్తుంది. అంతర్జాతీయ ఫైనలిస్టులందరూ వారం పాటు జరిగే పర్యటన కోసం ఇంగ్లండ్‌లో కలుసుకుంటారు. తమ రంగాల గురించి ఇంగ్లండ్‌లో మరిన్ని విషయాలను వారు తెలుసుకుంటారు. సంబంధిత సృజనాత్మక రంగం, పరిశ్రమపై వారికి ఒక అవగాహన కల్పించేందుకు వీలుగా వ్యక్తిగత, బృంద సమావేశాలను కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తుంది. పర్యటన సందర్భంగా అవార్డుకు ఓవరాల్‌ అంతర్జాతీయ విజేతను ఎంపిక చేసేందుకు కావాల్సిన తీర్పు ప్రక్రియను ఓవైపు అనుసరిస్తూ ఉంటుంది. ఫైనలిస్టులందరూ తాము లోతుగా చూసిన ఇంగ్లండ్‌ పరిశ్రమపై జ్యూరీకి సంబంధించి తమ పని విషయంలో ఒక ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఆ రంగానికి సంబంధించి తమ దేశంలోని మార్పులను, ఇంగ్లండ్‌లోని పరిణామాలను తామెలా అర్థం చేసుకున్నదీ వివరిస్తారు. వారి నుంచి ఒక విజేతను ఎన్నుకుంటారు. అతనికి అవార్డుతో పాటుగా బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంయుక్త భాగస్వామ్యంలో తన దేశం, ఇంగ్లండ్‌ల పరస్పర సంబంధంతో సంబంధిత రంగంలో ప్రాజెక్టు రూపకల్పనపై వెచ్చించేందుకు వీలుగా ఆర్థిక బహూమతిని కూడా అందజేస్తారు.

ఇప్పటిదాకా 47 దేశాల నుంచి 150కి పైగా ఫైనలిస్టులను ఎంపిక చేశారు. అర్జెంటీనా, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, లిథువేనియా, ఒమన్‌, రస్యా, టాంజానియా వంటివి ఇందులో ఉన్నాయి. బ్రెజిల్‌, కొలంబియా, ఎస్టోనియా, భారత్‌, ఇండొనేసియా, లెబనాన్‌, మెక్సికో, మొరాకో, నైజీరియా, పోలండ్‌, వెనెజువెలా, యెమన్‌ వంటి దేశాల నుంచి విజేతలుగా నిలిచారు.

ఈ క్రమంలో కొన్ని బలోపేతమైన అంతర్జాతీయ నెట్‌వర్కులు ఆవిర్భవించాయి. తొలి భారీ వైసీఈ అలామ్మీ కార్యక్రమం 2007లో జరిగింది. అందులో అవార్డులు అందుకున్న ఫైనలిస్టులంతా లండన్‌ పుస్తక సదస్సు సందర్భంగా ఆ నగరంలో కలిశారు. అప్పుడు వారు అలామ్మీ నెట్‌వర్కును ఏర్పాటు చేశారు. 26 దేశాల్లోని సభ్యుల ద్వారా అదిప్పుడు నడుస్తోంది. ఈ నెట్‌వర్క్‌కు లండన్‌ పుస్తక సదస్సులో ఒక స్టాండ్‌ను కూడా కేటాయించారు. ఫ్రాంక్‌ఫర్ట్‌ పుస్తక సదస్సులో కూడా ఇది సమావేశాలు, సెమినార్లను ఏర్పాటు చేస్తోంది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంఘటనలను ప్రచురిస్తోంది. 2008లో డిజైన్‌ అవార్డుల ఫైనలిస్టుల తొలి అలామ్మీ సదస్సు లండన్‌లో జరిగింది. 100 శాతం డిజైన్‌ అండ్‌ ద లండన్‌ డిజైన్‌ ఫెస్టివల్ తో పాటుగా ఇది జరిగింది.

ఇంగ్లండ్‌ యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవార్డులు[మార్చు]

ఐవైసీఈ అవార్డులు విజయవంతం కావడంతో ఇంగ్లండ్‌కు చెందిన సృజనాత్మక పరిశ్రమలకు మద్దతు నానాటికీ పెరిగింది. పరిశ్రమకు చెందిన అత్యంత సీనియర్‌ వ్యక్తులు ఈ అవార్డులను నిర్ణయించారు. (లిజ్‌ క్లాడర్‌, డంకన్‌ కెన్‌వర్తీ, డౌగ్‌ డీ ఆర్కీ). మాస్టర్‌ క్లాస్‌లను అందజేశారు (సర్‌ టెరెన్స్‌ కొన్రాన్‌, ఇయాన్‌ లివింగ్‌స్టోన్‌ ఓబీఈ, సర్‌ పాల్‌ స్మిత్‌). ఇలా ఇంగ్లండ్‌లోని యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వర్ధమాన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పరిశ్రమ పర్యటనలో పాల్గొనేందుకు, పరిశ్రమ నిర్మాణం, వికసిస్తున్న మార్కెట్ల పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు వీలు కల్పించే ఇంగ్లండ్‌ కార్యక్రమం కోసం డిమాండ్‌ కూడా పెరగసాగింది.

అంతర్జాతీయ కార్యక్రమం మాదిరిగానే ఇంగ్లండ్‌లోని యువ సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లోని ఘనతను గుర్తించడం, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సత్తాను మరింత ఎక్కువగా అర్థం చేసుకునేలా ప్రోత్సాహించేదుకు వీలుగా ఇంగ్లండ్‌ అవార్డులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2007లో యూకే యంగ్‌ పబ్లిషింగ్‌ ఎంట్రప్రెన్యూర్‌ అవార్డులతో 2007లో ఈ కార్యక్రమం మొదలైంది. 2008లొ బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఈఎస్‌టీఏ, కల్చరల్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాంల సాయంతో విస్తరించింది. సంగీతం, డిజైన్‌, ఫ్యాషన్‌, స్క్రీన్‌ రంగాల్లో కూడా ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించంది. 2009తో కళలు, ఇంటరాక్టివ్‌, మ్యూనికేషన్లు, విజువల్‌ ఆర్ట్స్‌ వంటి వాటితో ఇంగ్లండ్‌ అంతటా సృజనాత్మక పరిశ్రమల్లో అభివృద్ధి అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు.

ఇంటర్వ్యూ అనంతరం ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేసి, ఏదో ఒక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో పర్యటించి, అక్కడి స్థానిక మార్కెట్‌పై తమ అవగాహనను పెంపొందించుకునేందుకు వారికి అవకాశం కల్పిస్తారు. తమ ప్రొఫైళ్లను అభివృద్ధి చేసుకునేందుకు ఫైనలిస్టులు నెట్‌వర్కులను రూపొందిస్తారు. ఇంగ్లండ్‌కు తిరిగి వచ్చాక తమ అనుభవాలను మరింతగా పంచుకునేందుకు పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. తర్వాత జడ్జీల ప్యానెల్‌ వారిని విదేశీ అనుభవాలపై ఇంటర్వ్యూ చేస్తుంది. విజేతకు తను సందర్శించిన దేశంతో ఇంగ్లండ్‌ను సంబంధిత సృజనాత్మక రంగంలో మరింత సన్నిహిత భాగస్వామిని చేసేందుకు వీలుగా రూపొందించే ప్రాజెక్టు కోసం నగదు సాయాన్ని కూడా అందిస్తారు.

వైసీఈ క్లబ్‌[మార్చు]

వైసీఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి అంతర్జాతీయ, ఇంగ్లండ్‌ నెట్‌వర్కులు పుట్టుకొచ్చాయి. ఇప్పటిదాకా 50కి పైగా దేశాల నుంచి 150కి పైగా ఫైనలిస్టులు ఈ అవార్డుల్లో పాల్గొన్నారు.

2009 ఏప్రిల్‌లో ఏర్పాటైన ఒక ఇంగ్లండ్‌ వైసీఈ క్లబ్‌ ఆఫ్టర్‌ ద క్రంచ్‌ (క్రియేటివ్‌ అండ్‌ కల్చరల్‌ స్కిల్స్‌ అండ్‌ కౌంటర్‌పాయింట్‌ (థింక్‌ ట్యాంక్‌) మద్దతుతో) అనే పబ్లికేషన్‌ను పురస్కరించుకుని లండన్‌లో కలిసిన సందర్భగా పుట్టుకొచ్చింది. 2007-2010 మధ్య సంభవించిన ఆర్థిక సంక్షోభం సందర్భంగా సృజనాత్మక రంగాల ప్రాధాన్యతను ఇది అధ్యయనం చేసింది. ఇగ్నేషియస్‌ మీడియా వ్యవస్థాపకుడు, సీఈఓ ప్యాట్రిక్‌ మెక్‌కెనా ప్రసంగంతో ఈ సెషన్‌ ముగిసింది.

ఇతర దేశాల్లో కూడా కొత్త క్లబ్బులను ఏర్పాటు చేశారు. పోలండ్‌, టర్కీల్లో ఇప్పటికే సమావేశాలు కూడా జరిగాయి.

సృజనాత్మక రంగం ఎదుర్కొన్న ఒత్తిళ్లు, డిమాండ్లను గుర్తిస్తూ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. సంపన్న, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సృజనాత్మక పరిశ్రమలు ఇప్పటికే సూక్ష్మ వ్యాపారాలు, ఎస్‌ఎంఈల ద్వారా ఏర్పాటైనవే. ఆ రంగాల్లోని వృద్ధిని సాధించడం ఒకింత కష్టసాధ్యమైన వ్యవహారం.

సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు నిర్వచనం[మార్చు]

సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఇలా నిర్వచిస్తోంది:[25]

ఒక సృజనాత్మక రంగంలో పనిచేస్తూ, వ్యాపార విజయాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన వ్యాపార వృద్ధి (లాభం, మార్టెక్‌ వాటా, ఉద్యోగులు) పరమైన మాటలతో పాటు తన ప్రఖ్యాతి (నాణ్యత, అలంకారం) ల్లో చూపించగలిగిన వ్యక్తి.

.ఒక సృజనాత్మక రంగంలో పనిచేస్తూ విజయవంతమైన (ప్రభావం, చేరికల పరంగా) సామాజిక, లేదా ఆ రంగంలో లాభాపేక్ష లేని సంస్థను అభివృద్ధి చేసిన వ్యక్తి.

• ఒక సృజనాత్మక రంగంలో పనిచేస్తూ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడటం ద్వారా అందులో నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శించే వ్యక్తి

• ఒక సృజనాత్మక రంగంలో పనిచేస్తూ తన రంగానికి సంబంధించి వృద్ధి చెంది, మార్కెట్‌ను పెంచే చర్యలు (ఎగ్జిబిషన్లు, వ్యాపార సదస్సులు, ఉత్సవాల వంటివాటి నిర్వహణ) తీసుకున్న వ్యక్తి.

అవార్డు కార్యక్రమ అవసరాల కోసం, సృజనాత్మక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ కింది లక్షణాలుండాలి:

1 పారిశ్రామిక సామర్థ్యం[మార్చు]

రిస్కు తీసుకోగల సామర్థ్యం: రిస్కులను అంచనా వేసి, ఆస్వాదించి, తన నైపుణ్యాలు/చర్యల ద్వారా వాటిని ఎదుర్కోగలడు. తద్వారా తన ఆలోచనలను అతను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలడు. సృజనాత్మక రంగమంటే ప్రాణం: తమంత తాముగా ప్రాథమికంగా ప్రతిభావంతులై ఉండాల్సిన అవసరమేమీ లేదు. కానీ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకొచ్చే మధ్యవర్తులుగా, ఆ విషయంలో గౌరవించదగిన సామర్థ్యం ఉన్నవారుగా, సృజనాత్మకతను అర్థం చేసుకుని నిర్వహించగలవారుగా ఉందాలి. కార్పొరేట్‌ నైపుణ్యాలు: వ్యాపార తెలివిడి. వాణిజ్య స్పృహ, నిర్వహణ సామర్థ్యం. అంతిమ ఉత్పత్తిని వ్యాపార వ్యూహం, లక్ష్యంలో తగిన విధంగా ఇమడ్చగల నైపుణ్యం. వ్యక్తుల మధ్య నైపుణ్యాలు: ఆలోచనను అమ్మగల, అమ్మకానికి పెట్టగల, నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయగల సామర్థ్యం.

2. నాయకత్వ సామర్థ్యం/తమ రంగాన్ని మార్చగల శక్తి[మార్చు]

నాయకత్వ సామర్థ్యం: సృజనాత్మక, పారిశ్రామిక నైపుణ్యాలను తన రంగంలో జాతీయ స్థాయి సృజనాత్మక సమాజాల్లో నాయకునిగా ఎదిగేందుకు కావాల్సిన దీర్ఘ దృష్టి. తమ వైసీఈ పాఠాలను, అనుభవాలను ఇతరులతో సమర్థంగా పంచుకోగల లక్షణం. మార్పుకు వాహకం: వ్యాపారంలో పరిమాణాత్మకంగా మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్‌ మౌలిక సదుపాయాలపైనే ఏకమొత్తంగా సానుకూలంగా ప్రభావం చూపించేందుకు కావాల్సిన సామర్థ్యం.

3. మార్కెట్‌ స్పృహ, అవగాహన[మార్చు]

స్థానిక మార్కెట్లు, వాటిలో తన పాత్రను గురించిన పూర్తి అవగాహన. మార్కెట్‌లోని లోపాలను పూడ్చగల సామర్థ్యం. వాటిని అవకాశాలుగా మార్చి సొమ్ము చేసుకోగల తెలివిడి.

4. నికార్సైన ఆలోచనలు[మార్చు]

సొంత ఆలోచనలు, వాటిని వాణిజ్య వస్తువులుగా అభివృద్ధి చేయగల సానుకూలత.

ఆత్మవిశ్వాసం: సొంత ఆలోచనలకు మద్దతుగా నిలిచి వాటిపై దృష్టి నిలపగల సత్తా.

5. ఇంగ్లండ్‌/ప్రపంచం పరంగా నెట్‌వర్కుల్లో అంతర్జాతీయ దృక్పథం[మార్చు]

పరస్పరం లాభదాయకమైన వ్యక్తిగత, వృత్తిగత పని సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న తపన, చేయగల సామర్థ్యం. ఇంగ్లండ్‌తో సహ భాగస్వామ్యం, ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో చర్చల ద్వారా లాభాలు పొందగల సామర్థ్యం.

వీటికి తోడు, భాగస్వామికి ఈ దిగువ అంశాలు తప్ప ఉండాలి: • దరఖాస్తుల తేదీ నాటికి 25-35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి • సృజనాత్మక రంగంలో (దిగువ పేర్కొన్న రంగాల నిర్వచనాల పరంగా) కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న పనివారై ఉండాలి. • పారిశ్రామికవేత్తగా ఉండాలి. సంబంధిత సృజనాత్మక రంగ అభివృద్ధికి వాణిజ్యపరంగా గానీ, ప్రజల పరంగా గానీ, రెండు రకాలుగానూ గానీ తమ దేశంలో పాటుపడి ఉండాలి. • స్వభావం, సామర్థ్యాలు, వివరించగల సత్తా వంటివాటి పరంగా సంబంధిత రంగంలో తమ దేశంలో భావి నేతగా ఎదగగలిగి ఉండాలి • ఐఈఎల్‌టీఎస్‌6 - 'కంప్యూటర్‌ వాడకందారు' లేదా అంతకంటే ఎగువ స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలుండాలి

పాలస్తీనా సాహితీ ఉత్సవం[మార్చు]

2008లో ఈ ఉత్సవం మొదలైన నాటి నుంచీ ఇందులో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రధాన భాగస్వామిగా ఉంది. 2009లో ఈ ఉత్సవపు ముగింపు సంబరానికి ఉద్దేశించిన వేదికను ఇజ్రాయెలీ దళాలు మూసేశాయి. కానీ బ్రిటిష్‌ కౌన్సిల్‌ చిరస్మరణీయ రీతిలో జోక్యం చేసుకుని, అవి అక్కడే జరిగేలా చేయగలిగింది.[26]

ప్రధాని గ్లోబల్‌ ఫెలోషిప్‌[మార్చు]

ఈ కార్యక్రమం కొనసాగేందుకు ప్రధాన బాధ్యురాలు బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రధాన బాధ్యతదారు. దీన్ని స్థాపించింది మాత్రం పిల్లలు, పాఠశాలలు, కుటుంబాల శాఖ. ఇందులో భాగంగా ఏటా 100 మందికి బ్రిటిష్‌ కౌన్సిల్‌ శిక్షణ అందిస్తుంది. ప్రతి భాగస్వామ దేశానికీ ఈ కార్యక్రమాన్ని అందజేస్తుంది.[27] (మరింత సమాచారం కోసం ప్రధాన వ్యాసం ద ప్రైమ్‌ మినిస్టర్స్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ చూడండి)

రష్యాలో సంక్లిష్టతలు[మార్చు]

ఇటీవలి సంవత్సరాల్లో రష్యాలో కార్యకలాపాల కొనసాగింపు విషయంలో కౌన్సిల్‌ కొన్ని సమస్యలను ఎదుర్కొంది. అవి కొన్నిసార్లు రష్యా-ఇంగ్లండ్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి. విద్య, సైన్స్‌, సంస్కృతి విషయాల్లో 1994 నాటి అంతర్‌ ప్రభుత్వ సహకార ఒప్పందం ప్రకారం కౌన్సిల్‌ పనిచేస్తుంది. దీని స్థానంలో కొత్త సాంస్కృతిక కేంద్రాల ఒప్పందం (సీసీఏ) ను ఏర్పాటు చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అది రష్యాలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ హోదాను నిర్వచిస్తుంది.[28] ప్రస్తుతం బ్రిటిష్‌ ప్రభుత్వం పన్ను చట్టాల కింద నమోదై ఉంది. దాంతో అక్కడ అది చేపట్టే ఫీజులు వసూలయ్యే పనులకు రష్యా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తుంది. వాణిజ్య భాషా బోధన కోర్సులకు గతంలో స్థానిక పన్నుల నుంచి మినహాయింపు పొందామన్న కౌన్సిల్‌ వాదనను కూడా రష్యా ప్రభుత్వం ఇప్పుడు సవాలు చేస్తోంది. దాంతోపాటే, తాను రాజకీయపరమైనవిగా భావించిన పలు రష్యా స్వచ్ఛంద సంస్థలకు కౌన్సిల్‌ మద్దతు పలుకుతోందని కూడా అనుమానిస్తోంది.[original research?]

2008 జనవరి 1 నుంచి అన్ని ఈఎస్‌ఓఎల్‌, ఇతర ఆంగ్ల భాషా పరీక్షలను రష్యాలో కూడా నిర్వహిస్తానని 2007 చివర్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. కానీ తర్వాత తమ అధీనంలో లేని కొన్ని పరిస్థితులను కారణంగా చూపుతూ అప్పటికే బుక్‌ అయిపోయిన కొన్ని పరీక్షలను కౌన్సిల్‌ రద్దు పరిచింది.[29] దాంతోపాటు మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, ఎకటెరింబర్గ్‌ మినహా రష్యాలోని ఇతర అన్ని కేంద్రాలనూ 2007 చివరి కంటేముందే మూసేస్తానని కూడా ప్రకటించింది. అనంతరం చేసిన మూసివేత ధ్రువీకరణ ప్రకటనను ఇక్కడ నివేదిస్తున్నాం.[30]

2007 డిసెంబర్‌ 12న మరో ఉదంతం చోటుచేసుకుంది. మాస్కో వెలుపల ఉన్న రెండు ప్రాంతీయ కార్యాలయాలనూ 2008 జనవరికి ముందే మూసేయాల్సిందిగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రిటిష్‌ కౌన్సిల్‌ను ఆదేశించినట్టుగా వార్తలు వచ్చాయి. బ్రిటిష్‌ కౌన్సిల్‌ తమ దేశంలో అక్రమంగా కొనసాగుతోందని రష్యా పలుమార్లు చెబుతూ వచ్చింది. పైగా, కౌన్సిల్‌ పన్ను నిబంధనలతో పాటు పలు ఇతర చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించింది.[31] ఈ విషయంలో రష్యా వైఖరి మాస్కో న్యూస్‌ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక వ్యాసంలో కళ్లకు కట్టినట్టుగా కన్పించింది.[32]

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, ఎకటెరింబర్గ్‌లలోని కౌన్సిల్‌ కార్యాలయాలను నూతన సంవత్సరం విరామం తర్వాత సంస్థ పున:ప్రారంభించింది. దీన్ని ఉద్దేశపూర్వకమైన రెచ్చగొట్టే చర్యగా రష్యా వర్గాలు ఆరోపించాయి. ఎందుకంటే, ఆ చర్య అక్రమమని వాదించాయి. అయితే, బ్రిటిష్‌ కౌన్సిల్‌ పూర్తిగా చట్టబద్ధంగానే పని చేస్తోందని, అందుకని అది పని చేయడం కొనసాగిస్తుందని, ఈ విషయంలో రష్యా ఏ చర్య తీసుకున్నా అది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి వ్లాదిమిర్‌ తిటోవ్‌కు తాను అప్పటికే వర్తమానం అందించానని రష్యాలో బ్రిటిష్‌ రాయబారి సర్‌ టోనీ బ్రెంటన్‌ వివరించారు.[33] 2008 జనవరి 15న మరో సంఘటన జరిగింది. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ కార్యాలయ అధిపతి స్టీఫెన్‌ కిన్నోక్‌ (నాటి బ్రిటిష్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నీల్‌ కిన్నోక్‌ కుమారుడు) ను ట్రాఫిక్‌ ఉల్లంఘించాడనే, మద్యం సేవించి కారు నడిపాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ విషయంలో ఆల్కహాల్‌ పరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిరాకరించారు. తన దౌత్య హోదాను అందుకు కారణంగా చూపారు. ఒక గంట అనంతరం బ్రిటిష్‌ కాన్సూల్‌ జనరల్‌ రంగప్రవేశం చేసి, అది సరైన కారణమేనని చెప్పుకొచ్చారు. తర్వాత ఆయన్ను విడుదల చేశారు.[34] ఆ మర్నాడే స్టీఫెన్‌ కిన్నోక్‌ రష్యా వదిలి వెళ్లారు. మరోచోట నియమితులయ్యారు.[35]

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, ఎకటెరింబర్గ్‌ కౌన్సిల్‌ కార్యాలయాల పున:ప్రారంభం తర్వాత ఎఫ్‌ఎస్‌బీ అధికారులు వాటిలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ సిబ్బందిని ఇంటర్వ్యూ చేశారు. వారు అక్రమ సంస్థ తరఫున పనిచేస్తున్నారని ఆ సందర్భంగా వారికి తెలియపరిచారు. ఫలితంగా ఆ రెండు కార్యాలయాలూ మూతపడ్డాయి. సిబ్బంది లేమే అందుకు కారణం. అలా 2008 జనవరి 17న అవి మూతబడే ఉన్నాయి.[36] తమ సిబ్బంది సంబంధిత సమస్యల కారణంగా ఆ కార్యాలయాలను తిరిగి ప్రారంభించే అవకాశాలు అంతగా లేవని బ్రిటిష్‌వారు భావించారు. కానీ రష్యా వైఖరి పట్ల ఇంగ్లండ్‌ మరింత గౌరవం చూపే పక్షంలో సమస్యకు సజావైన పరిష్కారం సాధ్యమేనని ఇంగ్లండ్‌లో రష్యా రాయబారి యూరీ ఫెడొటోవ్‌ అన్నారు. దీనికి ఒక పరిష్కారం సాధ్యమే. కానీ మాకు మరింత గౌరవం కావాలి. దాంతోపాటే ఈ విషయమై బహిరంగ చర్చకు స్వస్తి పలకాలి. అలాంటి చర్చల వల్ల సమస్యలే తప్ప ఒరిగేదేమీ ఉండదు అని వివరించారు.[37]

పన్ను ఎగవేత ఆరోపణలపై రష్యా ఆదాయ పన్ను వర్గాలు బ్రిటిష్‌ కౌన్సిల్‌ను మరింతగా విచారించనున్నాయని 2008 జూన్‌లో ప్రకటన వెలువడింది. 2008 మేలో విడుదలైన 2007కు సంబంధించిన పన్ను మదింపు ఉదంతం ఈ వివాదానికి కారణం.[ఉల్లేఖన అవసరం]

దీనిపై ఒక ఇ-మెయిల్‌ ప్రకటనలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఇలా పేర్కొంది, బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆదాయ పన్ను వర్గాల వద్ద నమోదైంది. క్రమం తప్పకుండా పన్నులు కూడా చెల్లిస్తోంది. రష్యా ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన అన్ని డిమాండ్లనూ అది తూచా తప్పకుండా నెరవేరుస్తోంది.[ఉల్లేఖన అవసరం]

అయితే, పన్ను బిల్లులో పేర్కొన్న ప్రకారం గడువు లోపల బ్రిటిష్‌ కౌన్సిల్‌ పన్ను చెల్లించలేదని ఆరోపణ వచ్చింది. ఆ మొత్తాన్ని అసమంజమైనది, పరిమితికి మించి భారీ మొత్తంలో ఉన్నదిగా కౌన్సిల్‌ విమర్శించింది.[original research?] ఆ మొత్తం పన్నునూ కట్టకపోతే బ్రిటిష్‌ కౌన్సిల్‌కు రష్యాలో మిగిలి ఉన్న ఏకైక మాస్కో కార్యాలయం నుంచి పుస్తకాలు, సామగ్రి, కవిత్వం (సిక్‌), కంప్యూటర్ల వంటి అన్ని రకాల ఆస్తులనూ జప్తు చేసేందుకు రష్యా ఆదాయ పన్ను వర్గాలు సమాయత్తమయ్యాయి. ఇంకా పన్ను బకాయి పడి ఉన్న సందర్భాల్లో రష్యా వర్గాలు తీసుకునే ప్రమాణీకృత చర్యలుగా వాటిని ఆ దేశ ఆదాయ పన్ను అధికారి ఒకరు అభివర్ణించారు.[38]

బ్రిటిష్‌ కౌన్సిల్‌పై ఉన్న పన్ను కేసును 23 లక్షల పౌండ్ల మొత్తానికి 2008 డిసెంబరులో రష్యా కోర్టు ఒకటి తిరిగి తెరిచింది. ఈ వివాదాన్ని దిగువ కోర్టు వద్ద పరిష్కరించుకున్నామని కౌన్సిల్‌ భావించినా, దాన్ని తిరగదోడింది.[39] స్విట్జర్లాండ్‌లో ఉన్న దావోస్‌లోని ద వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో 2009 జనవరి నుంచి బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్‌ కిన్నోక్‌తో కూడా ఈ విషయమై కౌన్సిల్‌ బంధం తెంచుకుంది.[40]

చైనాలో బ్రిటిష్‌ కౌన్సిల్‌[మార్చు]

బ్రిటిష్‌ కౌన్సిల్‌, హాంగ్‌కాంగ్‌

హాంకాంగ్‌లో 1948లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ పని చేయడం ప్రారంభించింది. ఆంగ్ల బోధన, ఇంగ్లండ్‌ను గురించిన అత్యంత తాజా సమాచారాన్ని అందించడం, బ్రిటిష్‌ విద్య, శిక్షణలను ప్రోత్సహించడం, పాలన సంస్కరణల్లో హాంకాంగ్‌ ప్రభుత్వంతో అతి సన్నిహితంగా పని చేయడం, బ్రిటిష్‌ సైన్స్‌, కళలు, సాహిత్యం, డిజైన్లను ప్రదర్శించడం దాని లక్ష్యాలుగా ఉన్నాయి.[41]

విమర్శలు[మార్చు]

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియాల్లో తన పెట్టుబడుల మొత్తాన్ని పెంచుతున్నట్టు 2007 మార్చిలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఇందులో అత్యధిక మొత్తం ఇతర సేవలు, గ్రంథాలయాల్లో కోత ద్వారా, ఐరోపా‌ వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల మూత ద్వారా సమకూరుతుంది.[ఉల్లేఖన అవసరం] టెల్‌ అవీవ్‌, జెరూసలేం (ఇజ్రాయెల్‌) లలోని (ఈ పట్టణాల్లో కౌన్సిల్‌కు 1946 నుంచీ గ్రంథాలయాలున్నాయి) కార్యాలయాలను మూసేస్తున్నట్టుగా బ్రిటిష్‌ ఎంపీలకు 2007 జూన్‌లో సమాచారం అందింది. ఏథెన్స్‌ (గ్రీస్‌) [42], బెల్‌గ్రేడ్‌ [43] (యుగోస్లేవియా) ల్లోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ గ్రంథాలయాలను కూడా మూసేయాలని నిర్ణయించారు. అలాగే, భారత్‌లో 'భౌతిక అస్తిత్వాన్ని' తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా భోపాల్‌, త్రివేండ్రంలలోని గ్రంథాలయాలనూ ఈ ఏడాది మార్చిలోగా మూసేయాలని నిర్ణయించారు.[44] తద్వారా మిగిలే నిధులను సంస్కృతి, విద్య, సైన్స్‌, పరిశోధన రంగాలపై భారీగా వెచ్చించాలని తీర్మానించారు.[ఉల్లేఖన అవసరం]

2009 డిసెంబర్‌ చివరికల్లా ముంబైలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ గ్రంథాలయం కూడా మూతబడింది.[45] దానికి బదులుగా ఆన్‌లైన్‌లో గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచుతామన్న హామీ పాఠకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా అప్రధానమైనవని కౌన్సిల్‌ భావించిన పలు ఇతర దేశాల్లో కూడా గ్రంథాలయాలు, కార్యాలయాలు మూతబడ్డాయి. తద్వారా, దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనాలుంటాయని నమ్మిన చైనా, మధ్యప్రాచ్య దేశాలపై కౌన్సిల్‌ తన కార్యకలాపాలను కేంద్రీకరించసాగింది.[ఉల్లేఖన అవసరం][original research?] లెసొతో, స్విట్జర్లాండ్‌, ఈక్వెడార్‌, ప్రొవిన్షియల్‌ లాండర్‌ (జర్మనీ) ల్లోని తన కార్యాలయాలను కూడా కౌన్సిల్‌ 2000, 2001 మధ్య మూసేసింది. దాంతోపాటు బెలారుస్‌లో కూడా. దీనిపై అక్కడి పార్లమెంటులో నిరసన వ్యక్తమైంది. బెలారస్‌ మూసివేత తాత్కాలికమే కాగలదంటూ ఎడింబరోలో జరిగిన ఒక సదస్సులో కౌన్సిల్‌ ఛైర్మన్‌ నీల్‌ కిన్నోక్‌ చేసిన ప్రకటన ఉత్తుత్తిదేనని తర్వాత రుజువైంది.[46] లాటిన్‌ అమెరికాపై పునరాలోచన వ్యూహంలో భాగంగా పెరూలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయాన్ని కూడా 2006లో మూసేశారు.[47]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ తాలూకు మారిన ప్రాథమ్యాల గురించి 'కంపానియన్‌ టు బ్రిటిష్‌ హిస్టరీ' రచయిత చార్లెస్‌ ఆర్నాల్డ్‌-బేకర్‌ ఇలా వివరించారు: ఈ విధానమే పైనుంచి కింది దాకా పూర్తిగా అపార్థాలమయం. మనం అసలు విజయవంతమే కాజాలని దిక్కుగా వెళ్తున్నాం. ఈ క్రమంలో, మన మంచిని కోరుకునే యూరప్‌ మిత్రులను నిర్లక్ష్యం చేస్తున్నాం. బీరూట్‌ (లెబనాన్‌), బాగ్దాద్‌ (ఇరాక్‌)ల్లో మన పుస్తకాలను చదవగల అతి కొద్ది మంది ఇప్పటికే మతం మారిపోయారు.[48]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ మాదిరిగా కాకుండా అలయన్స్‌ ఫ్రాంచైజ్‌, గోథే ఇన్‌స్టిట్యూట్‌ ఐరోపా‌వ్యాప్తంగా తమ గ్రంథాలయాలను విస్తరించడంతో పాటు నిండుగా నింపుతున్నాయని వ్యాసం గుర్తు చేసింది. టెల్‌ అవీవ్‌లో ఫ్రాన్స్‌ తన కొత్త గ్రంథాలయాన్ని 2007లో పున:ప్రారంభించింది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ అక్కడ, పశ్చిమ జెరూసలేంలో తన గ్రంథాలయాలను మూసేసిన కొద్ది నెలలకే![49] గాజాలో కూడా ఇన్‌స్టిట్యూట్‌ ఫ్రాంకైస్‌ గాజా మున్సిపల్‌ లైబ్రరీని స్థానిక వర్గాల సాయంతో నిర్వహిస్తోంది. ఈ విషయంలో గాజా నగరం, ఫ్రాన్స్‌ నౌకాశ్రయ నగరం డంకెర్‌క్యూల మధ్య మున్సిపల్‌ ట్విన్నింగ్‌ లింక్‌ ఉంది.[50][51] ఓస్లో బ్రిటిష్ లో మా కార్యాలయం జనాలకు తెరిచి ఉండదు. మేం విచారణ సేవలు కూడా అందించబోవడం లేదు అని ఓస్లో (నార్వే) లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ బాహాటంగా బోర్డు రాయించేసింది.[52] కానీ గోథే ఇన్‌స్టిట్యూట్‌ ఉనికి మాత్రం గ్లాస్గోలో కూడా బ్రిటిష్‌ కౌన్సిల్‌ కంటే కొట్టచ్చినట్టుగా కన్పిస్తుంటుంది.[53] పైగా, జర్మనీలో ఇప్పుడు ఒకే ఒక్క బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయం మిగిలి ఉంది. అది కూడా తూర్పు బెర్లిన్‌లో![54]

బ్రిటిష్‌ కౌన్సిల్‌కు కఠినమైన పార్లమెంటరీ జవాబుదారీతనం లేదంటూ పార్లమెంటు సభ్యులు తదితరులు విమర్శిస్తుంటారు. కానీ ఆ సంస్థకు పలువురు పార్లమెంటేరియన్లతో వ్యక్తిగత స్థాయిలో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.[ఉల్లేఖన అవసరం] కన్జర్వేటివ్‌ పార్టీ షాడో సంస్కృతి అధికార ప్రతినిధి జెరెమీ హంట్‌ ఎంపీ ఇందులో ఒకరు. ఆయనకు చెందిన హాట్‌కోర్సెస్‌ కంపెనీకి షెఫీల్డ్‌ డేటా సర్వీసెస్‌ ద్వారా బ్రిటిష్‌ కౌన్సిల్‌తో సన్నిహిత సంబంధముంది.[55]

అధికారికంగా చూస్తే బ్రిటిష్‌ పార్లమెంటరీ టేబుల్‌ ఆఫీస్‌ బ్రిటిష్‌ కౌన్సిల్‌ విషయమై తాను సంధించే పార్లమెంటరీ ప్రశ్నలన్నింటినీ అధికారికంగా ఆ సంస్థకు స్పాన్సరింగ్‌ శాఖ అయిన విదేశాంగ, కామన్వెల్త్‌ కార్యాలయానికి ఎక్కుపెడుతుంటుంది.[56]

చైనాలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ తీసుకున్న చర్యలు ఏ పాటి ప్రభావవంతంగా నిలిచాయో 'విద్య, నాణ్యతలపై హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సెలెక్ట్‌ కమిటీ' ఇంగ్లండ్‌లో ఒక నివేదికలో 2007 ఆగస్టు 5న పేర్కొంది.[57] చైనా వర్సిటీల సాయంతో చేపట్టిన సంయుక్త విద్యా కార్యక్రమాల విషయంలో ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్‌, చైనా, కెనడా, ఫ్రాన్స్‌ వంటి దేశాల కంటే కూడా ఇంగ్లండ్‌ వెనకబడి ఉందని అది ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కమిటీకి సమర్పించిన సాక్ష్యాల్లో కౌన్సిల్‌ ఇలా వాదించింది, బ్రిటిష్‌ డిగ్రీలకు అంతర్జాతీయంగా విద్యార్థులు అత్యధిక విలువను ఆపాదిస్తారు. వాటికున్న అంతర్జాతీయ గుర్తింపే అందుకు కారణం. తాము వెచ్చించే డబ్బులకు సరైన ప్రతిఫలం గిట్టుబాటు కావాలనే మనస్తత్వాన్ని అంతర్జాతీయ విద్యార్థులు కలిగి ఉంటారు. కనీసం పాక్షికంగా అయినా విదేశాల్లో అందించే కార్యక్రమాలను ఎంచుకోవడం నుంచి ప్రతి విషయంలోనూ ఈ ధోరణిని వారు చూపుతారు అని చెప్పుకొచ్చింది. భారత్‌ను తమ మార్కెటింగ్‌ పద్ధతికి ఉదాహరణగా బ్రిటిష్‌ కౌన్సిల్‌ చూపింది. తమ యూకే-ఇండియా విద్యా, పరిశోధన ప్రక్రియలను ఉదహరించింది.[58] వాటిని బీపీ, షెల్‌ వంటి బ్రిటిష్‌ చమురు రంగ దిగ్గజాలు, జీఎస్‌కే వంటి ఫార్మా కంపెనీలు, బీఏసీ సిస్టమ్స్‌ వంటి ఆయుధ కంపెనీలు చేపట్టాయని వివరించింది.[59]

ఈ రంగంలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ మార్కెటింగ్‌ పద్ధతిపై స్కాట్లండ్‌ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ ద సండే హెరాల్డ్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ చట్టం కింద సేకరించిన సమాచారం ఆధారంగా కొన్ని వాస్తవాలను వెల్లడించింది. అమెరికాలోని స్టిర్లింగ్‌ విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ స్టెర్లింగ్‌ (సిక్‌) గా అక్కడి బ్రిటిష్‌ కౌన్సిల్‌ మార్కెటింగ్‌ నమస్వయకర్త పేర్కొనడన్ని ఎత్తిచూపింది. ఇక విద్యను ప్రాథమిక బాధ్యతగా గుర్తించాల్సింది పోయి, స్కాట్లండ్‌లో విశ్వవిద్యాలయాలను విదేశాల్లో ప్రోత్సహించే పథకంలో భాగమైన స్కాటిష్‌ ఎగ్జిక్యూటివ్‌ సివిల్‌ సర్వెంట్స్‌, భారత్‌, చైనాల్లోని బ్రిటిష్‌ కౌన్సిళ్ల మధ్య ఆ విషయంలో ఉద్రిక్తతలను పెంచి పోషించిన వైనాన్ని కళ్లకు కట్టింది. ఈ క్షేత్ర యుద్ధాలు స్కాటిష్‌ ఎగ్జిక్యూటివ్‌ తాలూకు కీలకమైన తాజా ప్రతిభ విధానాన్ని తక్కువ చేస్తున్నాయని సందే హెరాల్డ్‌ నివేదించింది.[60]

1998 తర్వాత స్కాట్లండ్‌లో విద్య, సంస్కృతి స్కాటిష్‌ పార్లమెంటు పరిధిలోకి వెళ్లిపోయాయి. ఇంగ్లండ్‌లో (బ్రిటిష్‌ కౌన్సిల్‌ మాదిరిగా) నమోదైన సేవా సంస్థలు ఇప్పుడు స్కాట్లండ్‌లో కూడా సేవ చేయాలనుకుంటే 2007 ఫిబ్రవరి నుంచి విధిగా క్రాస్‌-బోర్డర్‌ సేవా సంస్థలుగా నమోదు కావాల్సి ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ తాలూకు ఇలాంటి కొన్ని కార్యలాపాలను 2007/08లో నేషనల్‌ ఆడిట్‌ ఆఫీస్‌ (ఎన్‌ఏఓ) పరీక్షించింది. 'బ్రిటిష్‌ కౌన్సిల్‌ పనితీరు చాలా శక్తిమంతంగా ఉందని, తన వినియోగదారులు, లబ్ధిదారులకు అత్యధిక విలువనిస్తూ సాగుతోందని ఎన్‌ఏఓ తన నివేదికలో పేర్కొంది.[61] అయితే, ఇంగ్లిష్‌ తరగతులు కులీన వర్గాలని, కాబట్టి వాణిజ్య సదుపాయాల కల్పనదారులనుంచి అవాంఛిత సానుకూలతలను అందుకున్నారని చెప్పుకొచ్చింది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యాలయాలకు వెల్లువెత్తిన వేలాది ఇ-మెయిళ్లు, ఫోన్‌ కాల్స్‌కు ఎవరూ బదులు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది.[62]

ఎన్‌ఏఓ నివేదిక 5వ పేజీలో ఒక పాఠాంతరముంది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ కాంట్రాక్టు పనులను తనిఖీ, మదింపుల నుంచి అది మినహాయించింది. పలు ఇంగ్లండ్‌, అంతర్జాతీయ సంస్థలు, ఏజెన్సీల కోసం బ్రిటిష్‌ కౌన్సిల్‌ చేపట్టిన పనులను ప్రధానంగా మేం మా అధ్యయన పరిధి నుంచి మినహాయించాం. ప్రధానంగా అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన సందర్భాల్లోనే మేమిలా చేశాం అని వివరణ కూడా ఇచ్చింది. ఈ విషయంలో పరిశీలన కూడా అనవసరమని పేర్కొంది. అందుకు కారణాన్ని ఇలా వివరించింది: ఇలాంటి పనులను పోటీని ఎదుర్కొని సంస్థ గెలుచుకుంది. అవి కనీసం మొత్తంమీద దాని ఖర్చులను తిరిగి సంపాదించి ఇస్తున్నాయి. ఆ డబ్బుకు సరిపడ విలువైన పని చేయాల్సిన ప్రాథమిక బాధ్యత అలాంటి పనులను సంపాదించిన ఏజెన్సీలపై విధిగా ఉంటుంది అంది.

విదేశీ కార్యాలయ వార్షిక నివేదికపై పరిశీలనలో భాగంగా, విదేశీ వ్యవహారాల కమిటీ ఏటా బ్రిటిష్‌ కౌన్సిల్‌ నుంచి సాక్షులను పిలిపించి, వారిని విచారించడంలో గంటలకు గంటలు గడుపుతుంది. కానీ ఆ స్థాయి తనిఖీని కూడా కామన్స్‌ తీర్మానం ఒకటి పూర్వపక్షం చేసేసింది. ఎంపీలు సముద్రాంతర పర్యటనలకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ నుంచి పొందిన మొత్తాల గురించి లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అది పేర్కొంటోంది.[63]

ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ) (నిగల్‌ గ్రిఫిత్స్‌-ఎంపీ, ఇయాన్‌ డేవిడ్‌సన్‌-ఎంపీ) బ్రిటిష్‌ కౌన్సిల్‌ అసోసియేట్‌ పార్మఎంటరీ గ్రూప్‌కు ఆఫీస్‌ బేరర్లు.[64] బ్రిటిష్‌ కౌన్సిల్‌ లాబీ గ్రూపుకు నిగల్‌ గ్రిఫిత్స్‌ ఉపాధ్యక్షుడు.[65]

2008లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ను ప్రజా పద్దుల కమిటీ తన ముందుకు పిలిచింది. అంతకు ముందు ప్రచురితమైన జాతీయ ఆడిట్‌ కార్యాలయ నివేదిక ఆధారంగా ఈ చర్యకు దిగింది. అనంతరం పీఏసీ ఇచ్చిన నివేదికలో, బ్రిటిష్‌ కౌన్సిల్‌ అసోసియేట్‌ పార్లమెంటరీ గ్రూప్‌ ఉపాధ్యక్షుడు, ఎంపీ నిగెల్‌ గ్రిఫిత్స్‌ 2008 జూన్‌లో నాటి సాక్ష్యాల సెషన్‌కు అసలు హాజరే కాకపోయినా, బ్రిటిష్‌ కౌన్సిల్‌పై ఈ నివేదికను ఆమోదించిన పీఏసీ సభ్యుల బృందంలో ఒకరని బయట పెట్టింది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ సీఈఓను అప్పుడు క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు.[66] గ్రిఫిత్స్‌ అంతకు ముందు రష్యాలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి బ్రిటిష్‌ కౌన్సిల్‌ కార్యకలాపాలను 1998 జనవరి ప్రాంతంలో బాగా సమర్థించారు. సరిగ్గా అదే సమయంలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ కార్యాలయం నుంచి వారి మనిషి (స్టీఫెన్‌ కిన్నోక్‌) ఉద్వాసనకు గురయ్యాడు.[62][67][68][69]

తన చట్టాలను సరిచేసుకోవాల్సిందిగా బ్రిటిష్‌ కౌన్సిల్‌కు సమాచార కమిషనర్‌ 2009 ఏప్రిల్‌లో గట్టిగా సూచించారు. సిబ్బంది గణాంకాలను వారి వారి కార్మిక సంఘాల అనుబంధాలతో పాటుగా సంస్థ పోగొట్టుకోవడమే ఇందుకు కారణం. దాంతోపాటు ఎన్‌క్రిప్షన్‌ హెAదాను వివరించి చెప్పగల కంప్యూటర్‌ డిస్కు కూడా పోయింది.[70]

చారిత్రక ఉపక్రమనికలు[మార్చు]

1934లో 'బ్రిటిష్‌ కమిటీ ఫర్‌ రిలేషన్స్‌ విత్‌ అదర్‌ కంట్రీస్‌'గా ఏర్పాటైన బ్రిటిష్‌ కౌన్సిల్‌కు, బ్రిటిష్‌ ప్రయోజనాల వ్యాప్తిలో 'సాంస్కృతిక ప్రచారం ప్రాధాన్యతను గుర్తించిన సర్‌ రెజినాల్డ్‌ (రెక్స్ ‌) లీపర్‌ తాలూకు ధోరణే దిక్సూచి.

బ్రిటిష్‌ కౌన్సిల్‌ఫై రష్యాలో (పైన చూడండి) మోపిన అభియోగాల నేపథ్యంలో ద సండే హెరాల్డ్‌లోని అనుభవజ్ఞుడైన దౌత్య వ్యవహారాల ఎడిటర్‌ ఒక బ్రిటిష్‌ 'దౌత్య వర్గాల ప్రతినిధి'ని ఉటంకిస్తూ ఇలా పేర్కొన్నారు: రబ్రిటిష్‌ కౌన్సిల్‌ మన సీక్రెట్‌ ఇంటలిజెన్స్‌ సర్వీసెస్‌కు ఓ చిన్నపాటి విభాగమన్న అభిప్రాయం చాలా విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అధికారికంగా అది అంత నిజం కాకపోయినా అలాంటి సంబంధాలు మాత్రం ఆ రెండు సంస్థల నడుమ ఉన్నాయి. ఎందుకంటే అలా కాకుండా ఎలా ఉంటుంది? ఆ మేరకు వస్తున్న అన్ని రకాల సమాచారమూ పనికిమాలినదే అయ్యుంటుందా? ఎంతైనా, బ్రిటిష్‌ కౌన్సిల్‌ వర్తక కార్యకలాపాలతో నిభాయించుకు వస్తుంది. కాబట్టి అనివార్యంగా చౌకబారు నిఘా సమాచార సేకరణలో భాగస్వామి అవుతుంది.[71]

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి కూతురికి బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఒక స్కాలర్‌షిప్‌ను కేటాయించినప్పుడు కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.[72]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ చైర్‌ పర్సన్‌గా పనిచేసిన 1998-2004 మధ్య కా లంలో లేబర్‌ పీర్‌ బరోనెస్‌ హెలెనా కేన్నెడీ క్యూసీ, లీసెస్టెర్స్‌ డీ మోంట్‌ఫోర్ట్‌ విశ్వవిద్యాలయం, గ్లాస్గో కాలెండోనియన్‌ విశ్వవిద్యాలయం, మిడిల్‌సెక్స్‌ విశ్వవిద్యాలయం, రాబర్ట్‌ గార్డన్‌ విశ్వవిద్యాలయం, అబర్‌డీన్‌ విశ్వవిద్యాలయం, డెర్బీ విశ్వవిద్యాలయం, యార్క్‌ విశ్వవిద్యాలయం, టోంస్క్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయం, జ్యుడీషియల్‌ అకాడెమీ ఆఫ్‌ రష్యాల నుంచి లెక్కలేనన్ని డిగ్రీలను అందుకున్నారు. ప్రస్తుతానికి ఆమెకు 28 గౌరవ డిగ్రీలున్నాయి![73][74]

బ్రిటిష్ కౌన్సిల్‌లో కాల్పనికత[మార్చు]

ది రష్యా హౌస్‌ అనే జాన్‌ లి కెర్రీ (మాజీ కాన్సులర్‌ అధికారి డేవిడ్‌ కార్న్‌వెల్‌) నవల కూడా రాయల్‌ గురించి తెలిపింది. ఇది బ్రిటిష్‌ కౌన్సిల్‌ను సూచిస్తూ ప్రారంభమవుతుంది. ఈ సంస్థలు ఇంగ్లిష్‌ భాష బోధనకు తొలి ఆడియో వ్యవస్థ మరియు బ్రిటిష్‌ సంస్కృతిని విస్తరించింది దానిని చివరి వరకూ నడిపించారు. దీని అధికారుల్లో ఒకరు తనను ఒక అందమైన రష్యా యువతి సంప్రదించగానే ఇచ్చేశారు. ఆమె అనేక మాన్యుస్క్రిప్ట్స్‌ను తీసుకెళ్లి వేరేవారికి ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. ఈ పుస్తకాన్ని ఒక ఇంగ్లిష్‌ ప్రచురణకర్తకు ఆమె ఇచ్చింది. అతడు తన స్నేహితుడు అని చెప్పింది.[71]

ఇందులో గ్రహమ్‌ గ్రీన్‌ యొక్క ది థర్డ్‌మ్యాన్‌ కూడా కలిసి ఉంది. ఇందులో క్యారెక్టర్‌ పేరు క్రాబిన్‌. దీనిని విల్‌ఫ్రిడ్‌ హైడ్‌ వైట్‌ సినిమాలో పోషించారు. ఈయన బ్రిటిష్‌ కౌన్సిల్‌ కోసం పనిచేశారు. 1946లో, రచయిత జార్జి ఓర్వెల్‌ సలహా ప్రకారం, సీరియస్‌ రచయితలు రోజువారీ ఉద్యోగాలు చేయకూడదని నిర్ణయించారు. రచన అనే దాని కోసం ఒకరు తమ అర్త్ద సృజనాత్మక పని అయిన టీచింగ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, కంపోజింగ్‌ లేదా ప్రొపాగాండాను బ్రిటిష్‌ కౌన్సిల్‌ లాంటి సంస్థకు ఎక్కువగా కేటాయించుకూడదని అని తెలిపారు.[75] డామ్‌ స్టెల్లా రిమిన్‌గ్టన్‌ తన ఆత్మకథలో, ఈమె ఎమ్‌ఐ5కు నాయకత్వం వహించిన తొలి మహిళ. ఈమె బ్రిటిష్‌ ఇంటిలిజెన్స్‌ సర్వీసులో చేరడానికి ముందు భారత్‌లోని బ్రిటిష్‌ కౌన్సిల్‌లో పనిచేశారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగులు కూడా చాలా తరచుగా యుకె గౌరవాలలోని ప్రత్యేక సెక్షన్‌లలో కనిపించేవారు. విదేశాల్లోని డిప్లమాట్‌ల పోస్టింగ్స్‌లో కనిపించేవారు. సంస్థ యొక్క అసలు హోదా ఏమిటనేదానితో సంబంధం లేకుండా, రష్యాలాంటి దేశాల్లో సాధారణ డిప్లమాటిక్‌ అంశాలను నెరవేర్చగలరాలేదా అని చూశారు. జెరూసలెంలోని బ్రిటిష్‌ కౌన్సిల్‌ మాజీ అధికారి ఎమ్మా స్కై, కొన్ని సంవత్సరాల తర్వాతయుఎస్‌ జనరల్‌ రేమండ్‌ ఒడియెరోనెకు రాజకీయ మరియు సాంస్కృతిక సలహాదారుగా ఇరాక్‌లో పని చేవారు. పేల్‌స్టీన్‌లో బ్రిటిష్‌కౌన్సిల్‌ గురించి విపరీతమైన విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. బ్రిటిష్‌ కౌన్సిల్‌లో ఆమె పెయిడ్‌ ప్రాజెక్ట్‌ అనేది తనిఖీ తర్వాత ఉనికిలో లేని సబ్జెక్ట్‌గా మారిపోయింది. స్లష్‌ నిధుల కోసం, ఇతర నిధుల కోసం వచ్చిన అభ్యర్థనలను కూడా పట్టించుకోలేదు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ రాజకీయ మద్దతు కౌన్సిల్‌ను విస్మరించింది. పిఎన్‌ఎ మంత్రిత్వశాఖ, ఆర్థిక మరియు పాలెస్టినియన్‌ లెజిస్లేచర్‌ కూడా దాతల అవినీతి గురించి ఆందోళన తెలిపింది. బ్రిటిష్‌ కౌన్సిల్‌ సూచనల ప్రకారం (దీని గూల్‌) తరచుగా లారెన్స్‌ డురెల్‌ తన హాస్య రచనలో విదేశీ మరియు కామన్వెల్త్‌ కార్యాలయ్యాలో పనిచేసే విదేశాల్లో పోస్టింగ్స్‌ ఉన్న డిప్లమాట్‌ల గురించి ఆంట్రోబస్‌ కంప్లీట్‌లో వివరించారు.[76]

ఎమ్‌ఐ6 యొక్క అధికారిక చరిత్రలో: సీక్రెట్‌ ఇంటిలిజెన్స్‌ సెక్రెట్‌ యొక్క చరిత్ర 1909-1949, కీత్‌ జెఫ్రీ రచన, బ్రిటిష్‌ కౌన్సిల్‌ యొక్క పాత్ర, దీని సామర్ధ్యం ఇందులోని సూచికలో ప్రస్తావించారు. దీనిలో బ్లాండ్‌ కమిషన్‌ యొక్క 1944లో మరియు బ్రిటిష్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపకులు రెక్స్‌ లీపెర్‌ గురించి ప్రస్తావించారు. https://web.archive.org/web/20080430184741/http://www.britishcouncil.org/history-who-leeper.htm

సంఘాలు[మార్చు]

బ్రిటిష్‌ కౌన్సిల్‌ తాలూకు గత సంఘాలు:

 • 1934 -1937 లార్డ్‌ టైరెట్‌
 • 1937–1941 లార్ట్‌ లాయిడ్‌
 • 1941–1945 సర్‌ మాల్కం రాబర్ట్‌సన్‌
 • 1946–1955 సర్‌ రొనాల్డ్‌ ఆడమ్‌
 • 1955–1959 సర్‌ డేవిడ్‌ కెల్లీ
 • 1959–1967 లార్డ్‌ బ్రిడ్జెస్‌
 • 1968–1971 లార్డ్‌ ఫుల్టన్‌
 • 1971–1972 సర్‌ లెస్లీ రోవన్‌
 • 1972–1976 లార్డ్‌ బాలంట్రే
 • 1977–1984 సర్‌ చార్లెస్‌ ట్రాటన్‌
 • 1985–1992 సర్‌ డేవిడర్‌ ఓర్‌
 • 1992–1998 సర్‌ మార్టన్‌ జాకోంబ్‌
 • 1998–2004 బారోనెస్‌ కెన్నెడీ ఆఫ్‌ ద షాస్‌
 • 2004–2009 లార్డ్‌ కిన్నోక్‌[77]
 • 2010- ప్రస్తుతం సర్‌ వెర్నోన్‌ ఎలిస్‌

గుర్తింపు[మార్చు]

పశ్చిమ ఐరోపా‌లోని జాతీయ సాంస్కృతిక సంస్థల్లో సమాచారం, హ్యూమానిటీల్లో అత్యద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను 2005లో అలియన్స్‌ ఫ్రాంచైజ్‌తో పాటుగా ద సోషిటా డాంటే అలీగెరి, ద గోథే-ఇన్‌స్టిట్యూట్‌, ద ఇన్‌స్టిట్యూటో సెర్వాంట్స్‌, ఇన్‌స్టిట్యూ కామోస్‌, బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా ప్రిన్స్‌ ఆఫ్‌ ఆస్టురియాస్‌ అవార్డును అందుకున్నాయి. ఈ సంయుక్త అవార్డు సమయంలో ఐరోపా‌లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ తాలూకు గోప్యమైన విధానాలు సామాన్య ప్రజానీకం దృష్టికి ఇంకా రాలేదు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • యూనిక్‌
 • ముస్లింల సంస్కృతుల పండగ
 • విదేశీ భాషగా ఆంగ్ల బోధన (టిఇఎఫ్‌ఎల్‌)
 • ది బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ క్లబ్‌

సూచనలు[మార్చు]

 1. "Britishcouncil.org". మూలం నుండి 2009-01-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 2. Britishcouncil.org
 3. "Personneltoday.com‌". మూలం నుండి 2010-11-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 4. 4.0 4.1 "Britishcouncil.org". మూలం నుండి 2008-12-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 5. Wordpress.com
 6. లీ, మునా 9 కోహెన్‌, జోనాథన్‌ ఎడిట్‌ చేశారు (2004) ఎ పాన్‌ అమెరిరికన్‌ లైఫ్‌: ఎంచుకున్న పొయిట్రీ మరియు ప్రోజ్‌ ఆఫ్‌ మునా లీ , యూనివర్శిటీ ఆఫ్‌ విస్‌కానిసస్‌ ప్రెస్‌, మాడిసన్‌, విస్‌కాన్‌సిస్‌,పేజి 268, ఐఎస్‌బిఎన్‌ 0-299-20230-5
 7. 7.0 7.1 7.2 1930లు మరియు 1940లు-బ్రిటిష్‌ కౌన్సిల్‌- చరిత్ర బ్రిటిష్‌ కౌన్సిల్‌ వెబ్‌పేజి
 8. 8.0 8.1 డొనాల్డ్‌సన్‌, ఫ్రాన్స్‌ లోన్స్‌డేల్‌ (1984) ది బ్రిటిష్‌ కౌన్సిల్‌ : మొదటి 50 సంవత్సరాలు జె.కేప్‌, లండన్‌, పేజి 1, ఐఎస్‌బిఎన్‌ 0-224-02041-2
 9. ఎలీడ్‌ సెంటర్స్‌ - 1940లు - ఎప్పుడు - బ్రిటిష్‌ కౌన్సిల్‌ - చరిత్ర'' బ్రిటిష్‌ కౌన్సిల్‌ వెబ్‌పేజి
 10. సి.ఎ.హెచ్‌. (1990) ఆస్టిన్‌ గిల్‌ (1906-1990)' ఫ్రెంచ్‌ విద్యలు 44 (4) : పిపి. 501-502, పేజి 501, డిఓఐ: 10. 1093/ఎఫ్‌ఎస్‌/ఎక్స్‌ఎల్‌ఐవి.4.501.
 11. 1950లు మరియు 1960లు - బ్రిటిష్‌ కౌన్సిల్‌ - చరిత్ర బ్రిటిష్‌ కౌన్సిల్‌ వెబ్‌పేజి
 12. స్పీకర్‌ మైకేల్‌ మార్టిన్‌ ఇన్‌ సీక్రెసీ రో ఓవర్‌ బ్రిటిష్‌ కౌన్సిల్‌ ట్రిప్స్‌, టెలిగ్రాఫ్‌
 13. బ్రిటిష్‌ కౌన్సిల్‌ వార్షిక నివేదిక 2006/2007.15 డిసెంబర్ 2007 న శోధించబడింది. Archived 2008-02-27 at the Wayback Machine.
 14. ఐఎఇఎస్‌టిఇ అధికారిక వెబ్‌సైట్‌
 15. ఐఎఇఎస్‌టిఇ.ఓఆర్‌జి.యుకె
 16. ఐఎఇఎస్‌టిఇ.ఓఆర్‌జి
 17. "బ్రిటిష్‌ కౌన్సిల్‌. ఓఆర్‌జి". మూలం నుండి 2009-08-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 18. "ఇంగ్లిష్‌ ఆన్‌లైన్‌". మూలం నుండి 2009-02-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 19. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఐల్‌ టు ఓపెన్‌ బేటా ఇన్‌ టీన్‌ గ్రిడ్‌ టుమారో, 13 డిసెంబర్ 2007 న శోధించబడింది.
 20. యూట్యూబ్‌ వీడియో - బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఐల్‌, సెకండ్‌లైఫ్‌
 21. బ్రిటిష్‌ కౌన్సిల్‌. ఓఆర్‌జి
 22. "మేకింగ్‌ ఎ వరల్డ్‌ ఆఫ్‌ డిఫరెన్స్‌". మూలం నుండి 2007-09-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 23. క్రియేటివ్‌ ఎకానమీ. ఓఆర్‌జి. యుకె/
 24. [1]
 25. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-02-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-13. Cite web requires |website= (help)
 26. Youtube.com
 27. బ్రిటిష్‌ కౌన్సిల్‌ వెబ్‌సైట్‌ ప్రధాని యొక్క విశ్వ ఫెలోషిప్‌ ఏమిటి? నవంబరు 10, 2009 న వాడబడినది
 28. విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక, నవంబరు 2007, పేరా137
 29. బ్రిటిష్‌ కౌన్సిల్‌, రష్యా.12 డిసెంబర్ 2007 న శోధించబడింది.
 30. బ్రిటిష్‌ కౌన్సిల్‌ - లైబ్రరీస్‌ హ్యాండోవర్‌.సేకరణ తేదీ ఫిబ్రవరి 7, 2008.
 31. రష్యా బ్రిటిష్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సస్పెండ్‌ చేసింది, రాయ్‌టర్స్‌.13 డిసెంబర్ 2007 న శోధించబడింది.
 32. మాస్కో న్యూస్‌ నెం 49. 2007: బ్రిటిష్‌ కౌన్సిల్‌ క్లోజ్‌ ఇన్‌ రీజియన్స్‌.13 డిసెంబర్ 2007 న శోధించబడింది. Archived 2009-02-13 at the Wayback Machine.
 33. యుకె-రష్యా డిప్లమాటిక్‌ రో వోర్‌సెన్స్‌, బిబిసి న్యూస్‌ 14 జనవరి
 34. ది టైమ్స్‌ ఆన్‌లైన్‌ : నీల్‌ కినోక్స్‌ సన్‌ హెల్డ్‌ బై పోలీస్‌
 35. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ పబ్లికేషన్స్‌ మరియు రికార్డులు : 20 మార్చి 2008[permanent dead link]
 36. రష్యా రో కార్యాలయాలు 'మూసివేయబడి ఉన్నాయి' బిబిసి న్యూస్‌. 17 జనవరి 2008.
 37. బ్రిటిష్‌ కౌన్సిల్‌ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌-2లో పనిని రద్దు చేసింది ఆర్‌ఐఎ నోవోస్టి, 16 జనవరి 2008
 38. "బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఇన్‌కోర్ట్‌ ఓవర్‌ ట్యాక్స్‌ బిల్‌ - సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ టైమ్స్‌, 20 జూన్‌ 2008". మూలం నుండి 2012-02-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-08. Cite web requires |website= (help)
 39. "British Council hit by Russia tax bill". London: Daily Telegraph. 27 December 2008. Retrieved 27 April 2010. Cite news requires |newspaper= (help)
 40. "Press Release". World Economic Forum. Cite news requires |newspaper= (help)
 41. బ్రిటిష్‌ కౌన్సిల్‌. ఓఆర్‌జి
 42. ఏథెన్స్‌ లైబ్రరీ, హ్యాన్‌సార్డ్‌ 27 జూన్‌ 2007
 43. "కొత్త ప్రొఫైల్‌". మూలం నుండి 2007-11-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 44. "British Library writes its epilogue". The Hindu. Chennai, India. 7 December 2007.
 45. ఇండియా టైమ్స్‌. కామ్‌
 46. (Neil Kinnock Archived 2007-11-29 at Archive-It at the Edinburgh Festival of Politics, (from about 36-42 minutes into the streaming video clip and the question/answer from about 62 minutes in)
 47. లార్డ్స్‌హాన్‌సర్డ్‌ టెక్ట్స్‌, పెరూలో ఇంగ్లిష్‌ భాష సలహా సర్వీలులు తొలుత బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు మారాయి. తర్వాత ప్రధానకార్యాలయం లండన్‌కు వచ్చాయి. హాన్‌సర్డ్ ‌ కాలమ్‌, డబ్ల్యుఎ 130, 26 జూన్‌ 2006
 48. అవుట్‌క్రై యాజ్‌ బ్రిటిష్‌ కౌన్సిల్‌ క్విట్స్‌ యూరోప్‌ టు వూ ముస్లిమ్‌ వర్‌ల్డ్‌ బై హెలినా స్మిత్‌, ఏథెన్స్‌ ది అబ్జర్వర్‌ , 5 ఆగస్టు 2007
 49. పశ్చిమ జెరూసలెం Archived 2007-08-19 at the Wayback Machine. లైబ్రరీ క్లోజర్‌
 50. గాజా లైబ్రరీ Archived 2007-09-27 at the Wayback Machine. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌
 51. [2]ఫ్రమ్‌ క్విట్టింగ్‌, గ్యాప్‌లను బ్రిటిష్‌ కౌన్సిల్‌ పూడుస్తోంది, ది అబ్జర్వర్‌ కు ఉత్తరం, 12 ఆగస్టు 2007
 52. "బ్రిటిష్‌ కౌన్సిల్‌.ఓఆర్‌జి". మూలం నుండి 2008-12-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 53. గోఎతె.డిఇ
 54. "ఇతర లాండెర్‌ కార్యాలయాలు కూడా మూసివేయబడ్డాయి". మూలం నుండి 2008-09-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 55. యుసిఎఎస్‌.ఎసి.యుకె. ఉదాహరణ
 56. స్పాన్సరింగ్‌ విభాగం హాన్సార్డ్‌ 25 జూన్‌ 2007
 57. చైనాలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం
 58. "యుకె భారతదేశం విద్య మరియు పరిశోధన ఇనిషియేటివ్స్‌". మూలం నుండి 2007-08-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 59. బిఎఇ సిస్టమ్స్‌ విచారణ ది బోస్టన్‌ గ్లోబ్‌ 27 జూన్‌ 2007
 60. యుద్ధాలు మరియు టర్ప్‌ వార్స్‌ వల్ల తాజా నైపుణ్యం అనేది సందేహంలో పడింది {/1{2}}ది సండే హెరాల్డ్‌ 30 అక్టోబరు 2005
 61. ది బ్రిటిష్‌ కౌన్సిల్‌: అచీవింగ్‌ ప్రభావం జాతీయ ఆడిట్‌ ఆఫీస్‌ జూన్‌ 9, 2008
 62. 62.0 62.1 గార్డియన్‌.కో.యుకె
 63. టెలిగ్రాఫ్‌.కో.యుకె
 64. "బ్రిటిష్‌ కౌన్సిల్‌. ఓఆర్‌జి". మూలం నుండి 2009-06-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 65. న్యూస్‌ఆఫ్‌దవరల్డ్‌.కో.యుకె
 66. పార్లిమెంట్‌.యుకె
 67. పార్లిమెంట్‌.యుకె
 68. గార్డియన్‌.కో.యుకె
 69. పార్లమెంట్‌.యుకె
 70. ఐటిప్రో.కో.యుకె
 71. 71.0 71.1 "సండేహెరాల్డ్‌.కామ్‌". మూలం నుండి 2008-01-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-23. Cite web requires |website= (help)
 72. టైమ్స్‌ఆన్‌లైన్‌.కో.యుకె
 73. "హెలీనాకెన్నెడీ.కో.యుకె". మూలం నుండి 2009-04-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 74. "డౌగ్‌టిస్ట్రీట్‌.కో.యుకె". మూలం నుండి 2013-04-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-24. Cite web requires |website= (help)
 75. హారిజన్‌ ప్రశ్నావళి: ది కాస్ట్‌ ఆఫ్‌ లెటర్స్‌, హారిజాన్‌లో, 1946
 76. డురెల్‌ ఎల్‌ (1985) ఆంట్రోబస్‌ పూర్తి , 202పిపి, ఫాబెర్‌ అండ్‌ ఫాబెర్‌ ఐఎస్‌బిఎన్‌ 0-571-13603-6
 77. బ్రిటిష్‌ కౌన్సిల్‌.ఓఆర్‌జి

బాహ్య లింకులు[మార్చు]

వీడియో చిత్రాలు[మార్చు]

మూస:International cultural promotion organizations

zl:zwanzik