బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ లార్డ్ విలియం బెంటింక్
చిట్టచివరి బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి

భారతదేశములో సా.శ. 1600 లో వ్యాపారముచేసుకునటకు ప్రవేశించిన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ క్రమేణా వలసరాజ్యస్థాపనచేసి, రాజ్యాదికారములు చేపట్టి దేశమును పరిపాలించు ప్రభుత్వముగా మారినది. తరువాత ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము వారు 1858 నంబరు 1 వ తేదీనాడు విక్టోరియా రాణీగారి ప్రకటన ద్వారా భారతదేశమందలి ప్రభుత్వమును ఇంగ్లీషు వారి రాజ్యమకుటములో చేర్చిన విసిష్ట చరిత్రలో కుతూహలకరమైన విశేషములు చాలా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంటు వారు 1773 లో ఆమోదించిన రెగ్యులేటింగ్ చట్టము ప్రకారము బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ భారతదేశములో మొట్టమొదటి గవర్నరుజనరల్ ను నియమించారు (మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్సు ). అంతకు ముందు 1773 దాకా గవర్నర్ల పదవులే ఉన్నాయి. 1773 నుండి గవర్నర్ జనరల్ గా చేసినవారు బ్రిటిష్ ఇండియాలో కేవలము కలకత్తా రాష్ట్రమునకే (ఇప్పటి బెంగాల్ రాష్ట్రము) గవర్నర్ జనరల్సు అయ్యిరి. 1833 లో చేసిన రాజ్యాగ చట్టము అనగా 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము వలన బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీనే బ్రిటిష్ ప్రభుత్వము వారి ప్రతినిధిగా నియమించి భారతదేశమును బ్రిటిష్ ఇండియా (వలసరాజ్యముగా) నిరంకుశముగా పరిపాలనసాగించారు. అందుచే 1833 నుండి భారతదేశమును పరిపాలించిన ప్రభువులను బ్రిటిష్ ఇండియా గవర్పర్ జనరల్సు అనవచ్చును. అటువంటివారిలో విలియం బెంటింక్ మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్. 1858 నవంబరు 1 వ తేదీన విక్టోరియా రాణిగారి రాజ్యాంగపత్రము ద్వారా చేసిన ప్రకటనతో భారతదేశపు ప్రభుత్వమును ఇంగ్లీషురాజ్యమకుటములో కలిపినప్పటినుండి భారతదేశమును పరిపాలించు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినధిని వైస్రాయి (VICEROY) అనికూడా అనబడుచుండెను. అందుచే గవర్నర్ జనరల్ లేదా వైస్రాయిగా సంబోధించబడిరి. వైస్రాయి పదము వాడుటమొదలుపెట్టినకాలమునుండి (1858) మొదటి వైస్రాయి క్యానింగ్ ప్రభువు (Charles John Canning). 1947 ఆగస్టు 15 తేదీవరకు ఆఖరి వైస్రాయిగా చేసిన లార్డు మౌంట్ బాటన్. భారతదేశము స్వతంత్రమైన తేదీనుండి వైస్రాయి అను బిరుదు ఉపసంహరింపబడినది అందుచే అక్కడనుండి తదుపరి 1948 జూన్ 28 వరకూ గవర్నర్ జనరల్ గా కొనసాగిన మౌంట్ బాటన్ ఆఖరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. అతని పదవిపూర్తి (1948 జూన్ 28) కావడంతో అప్పటినుండి భారతదేశ రాజ్యాంగము విడుదలయ్యే వరకూ అంటే 1950 జనేవరి 26 వరకూ గవర్నర్ జనరల్ గా మొదటి భారతీయుడు రాజాజీగా ప్రసిధ్ది చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి ( చూడు అధినివేశ స్వరాజ్యము [1]

గవర్నర్ జనరల్ గా చేసిన వారి జాబితా[మార్చు]

క్రమాంకము గవర్నరు జనరల్ జననం పదవీక్రమణ పదవీ విరమణ మరణం
1 రాబర్టు క్లైవు (గవర్నరు) 1725 1743 1767 1774
2 వారన్ హేస్టింగ్సు 1732 1750 1785 1818
3 కారన్ వాలీసు 1738 1786 1793 1805
4 సర్ జాన్ షోర్ 1795
5 లార్డు (మార్నింగటన్) వెల్లెస్లీ 1760 1798 1805 1842
6 కారన్ వాలీసు 1738 1805 1795 1805
7 మింటో 1823 1828
8 లార్డు హేస్టింగ్సు 1754 1813 1823 1826
9 అమ్హరెస్టు 1823 1828
10 విలియం బెంటింక్ 1774 1828 1835 1839
11 సర్ ఛార్ల్సు మెట్కాఫ్ (ఆక్టింగ్ గవరనర్ జనరల్) 1835
12 ఎలెన్ బరో 1842 1847
13 జేమ్సు యాన్డూృ బ్రౌన్ ర్యామ్సె ( డల్ హౌసీ ) 1812 1847 1856 1860
14 కర్జన్ 1899 1910
15 లార్డు హార్డింజి 1858 1910 1914 1944
28 లార్డు షెమ్స ఫర్డు 1916 1921
29 రీడింగ్ 1921 1926
30 లార్డు ఇర్విన్ 1881 1926 1931 1959
31 లార్డు వెల్లింగటన్ 1866 1931 1936 1941
32 లార్డు వావెల్ 1944 1947
33 లార్డు మౌంట్ బాటన్ (మౌంట్ బాటన్) 1947 1948

మూలాలు[మార్చు]

  1. "The British Rule in India" D.V. Siva Rao(1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ

బయటి లింకులు[మార్చు]

https://en.wikipedia.org/wiki/List_of_governors-general_of_India