బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రెట్టన్‌ వుడ్స్‌ వ్యవస్థ 20వ శతాబ్ది మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద పారిశ్రామిక దేశాల్లో వాణిజ్య, ఆర్థిక సంబంధాలకు కావాలిసన నియమ నిబంధనలను ఏర్పాటు చేసిన విత్త నిర్వహణ వ్యవస్థ. స్వతంత్ర దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన విత్తపరమైన సంబంధాల నిర్వహణకు సంబంధించిన తొలి ఉదాహరణ ఇదే.

అది రెండో ప్రపంచ యుద్ధం ఇంకా తీవ్రస్థాయిలో జరుగుతున్న కాలం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు అదే సమయంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. 44 మిత్ర రాజ్యాలకు చెందిన 730 మంది ప్రతినిధులు అమెరికాలో న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెట్టన్‌ వుడ్స్‌లో ఉన్న మౌంట్‌ వాషింగ్టన్‌ హెటల్లో ఐక్యరాజ్య విత్త, ఆర్థిక సదస్సులో భేటీ అయ్యారు. చర్చోపచర్చల అనంతరం 1944 జూలై తొలి మూడు వారాల్లో బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

అంతర్జాతీయ విత్త వ్యవస్థ నియంత్రణకు విధి నిషేధాలు, సంస్థలు, నిబంధనల వ్యవస్థలను ఏర్పాటు చేసే క్రమంలో బ్రెట్టెన్‌ వుడ్స్‌ రూపకర్తలు అంతర్జాతీయ విత్త నిధి (IMF), అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు (IBRD) లను ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పటికీ ప్రపంచ బ్యాంకింగ్‌ సమూహంలో భాగాలుగానే ఉన్నాయి. ఒప్పందాన్ని తగిన సంఖ్యలో దేశాలు ఆమోదించిన అనంతరం ఈ సంస్థలు 1945 కల్లా పని చేయడం మొదలు పెట్టాయి.

ప్రతి దేశమూ తన కరెన్సీ మారక విలువను తమ బంగారం నిల్వల స్థిర విలువ (ఒక శాతం ప్లస్‌, లేక మైనస్‌) కు లోపు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత, చెల్లింపుల్లో తాత్కాలిక అసమతుల్యతలను సరిచేయగల IMF సామర్థ్యం వంటి వాతోత్ప్ కూడిన విత్త విధానం బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ ప్రధాన లక్షణాలు. కానీ 1971 ఆగస్టు 15న అమెరికా ఏకపక్షంగా డాలర్‌-బంగారం పరివతనీయత రద్దు చేసుకుంది. ఈ చర్య నిక్సన్‌ షాక్‌గా పేర్కొనే పరిస్థితికి దారి తీసింది. తత్ఫలితంగా అమెరికా డాలర్‌ ఇతర కరెన్సీలకు ఏకైక వెన్నుదన్నుగా, సభ్య దేశాలకు రిజర్వ్‌ కరెన్సీగా మారిపోయింది.

విషయ సూచిక

మూలాలు[మార్చు]

బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థకు రాజకీయ పునాది పలు కీలక పరిస్థితుల సంగమంలో దాగుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం తాలూకు అనుభవాలు, కొద్ది దేశాల చేతుల్లో కేంద్రీకృతమైన అధికారం (యుద్ధ ఫలితంగా ఈ జాబితా నుంచి మరిన్ని దేశాలను తొలగించడంతో ఈ సంఖ్య మరీ చిన్నదైపోయింది), ప్రపంచ విత్త వ్యవహారాల్లో నేతృత్వ స్థానం తీసుకునే సామర్థ్యం, ఆలోచన ఉన్న ఆధిపత్యపు శక్తి ఉనికి వంటివన్నీ ఇందుకు దారి తీశాయి.

ప్రపంచ ఆర్థిక మాంద్యం[మార్చు]

బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సులో జరిగిన ఒప్పందాలు, తీసుకున్న నిర్ణయాలకు ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణ లక్ష్యాలు, అందుకు అనుసరించాల్సిన పద్ధతుల విషయమై అత్యున్నత స్థాయిలో చేసుకున్న ఒప్పందం ఆధారభూతంగా నిలిచింది. పెట్టుబడిదారీ విధానం పై ఆ దేశాలన్నింటికీ ఉన్న ఏకాభిప్రాయమే అందుకు పునాదిగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రభుత్వాలు జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఎలాంటి పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలన్న విషయమై భిన్నాభిప్రాయాలతో ఉన్నా (ఉదాహరణకు ఫ్రాన్సు బలమైన ప్రణాళిక, ప్రభుత్వ జోక్యాలకు ప్రాధాన్యతనిచ్చింది. అమెరికా మాత్రం ప్రభుత్వ జోక్యాన్ని పరిమితం చేసుకోవడం పట్ల మొగ్గు చూపింది) అన్ని దేశాలూ ప్రాథమికంగా మార్కెట్‌ వ్యవస్థలు, ప్రైవేట్‌ యాజమాన్యాల కేసే మొగ్గు చూపాయి.

అలా ఈ సంపన్న దేశాల విభేదాల కంటే వాటి సారూప్యతలే కొట్టచ్చినట్టు కన్పిస్తాయి. యుద్ధ కాలంలో తలెత్తిన విత్తపరమైన అవ్యవస్థ తమకు విలువైన పాఠాలు నేర్పిందని బ్రెట్టెన్‌వుడ్స్‌లో పాల్గన్న అన్ని దేశాల ప్రభుత్వాలూ అంగీకరించాయి.

ప్రపంచ ఆర్థిక మాంద్యం తాలూకు అనుభవాలు అన్ని దేశాల ప్రభుత్వోద్యోగుల మనసుల్లోనూ అప్పటికింకా తాజాగానే ఉన్నాయి. 1930ల తరహా ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా చూడాలని బ్రెట్టెన్‌వుడ్‌ రూపకర్తలు ఆశించారు. మిత్ర రాజ్యాలన్నింటికీ అప్పులిచ్చిన అమెరికా, తన యుద్ధ బాకీలన్నీ తక్షణం చెల్లించాలంటూ పట్టుబట్టడం, ఒంటరితన విధానం పట్ల దేశాల మొగ్గు వంటివన్నీ కలగలిసి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేందుకు, తత్ఫలితంగా ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం తలెత్తేందుకు దారి తీశాయి.[1] 1930ల్లో పలు దేశాలు అనుసరించిన పొరుగుదేశాన్ని బిచ్చగాడిగా మార్చు తరహా విధానాలు కూడా ఇందుకు యథాశక్తి దోహదపడ్డాయి. చెల్లింపుల బాలెన్సుల్లో లోటును తగ్గించుకునే క్రమంలో తమ ఎగుమతి ఉత్పత్తుల పోటీతత్వాన్ని వీలైనంతగా పెంచేందుకు పలు దేశాలు కరెన్సీ విలువను తగ్గించడం వంటి పద్ధతులకు పాల్పడ్డ వైనం డిఫ్లెశనరి గొడవలతో పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఫలితంగా జాతీయ ఆదాయాలకు భారీగా గండి పడింది. డిమాండ్‌ ఉన్నపళంగా పడిపోయింది. నిరుద్యోగత పెరిగిపోయింది. మొత్తంమీద ప్రపంచ వర్తకమే పడకేసింది. అలా 1930ల్లో వర్తకం కేవలం కరెన్సీ బ్లాక్‌లకే (సమాన విలువతో కూడిన కరెన్సీని వాడే దేశాల సమూహాలు. ఉదాహరణకు బ్రిటిష్‌ సామ్రాజ్యంలో 'స్టెర్లింగ్‌ ప్రాంతం') పరిమితమైంది. అంతర్జాతీయ మూలధన ప్రవాహాన్ని, విదేశీ పెట్టుబడుల అవకాశాలను ఈ కరెన్సీ బ్లాక్‌లు పూర్తిగా అడ్డుకున్నాయి. స్వల్పకాలంలో ఈ విధానం వల్ల ప్రభుత్వాల ఆదాయాలు పెరిగినట్టే కన్పించినా మధ్య, దీర్ఘకాలాల్లో మాత్రం పరిస్థితిని ఇది దారుణంగా దిగజార్చింది.

అలా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు బ్రెట్టెన్‌వుడ్‌ రూపకర్తలు మొగ్గు చూపారు. ఇది కరెన్సీల విలువ పై కఠిన నియంత్రణ ఉన్న నియంత్రణ మార్కెట్ ‌పై ఆధారపడ్డ వ్యవస్థ. వ్యవస్థల ప్రత్యేక అమలు విషయంలో వారిలో భిన్నాభిప్రాయాలున్నా కఠినమైన నియత్రణ ఉండాలని మాత్రం అంతా అంగీకరించారు.

ఆర్థిక భద్రత భావన[మార్చు]

కోర్డెల్‌హల్‌

యుద్ధం జరిగిన సంవత్సరాల అనుభవాల ఆధారంగా అమెరికా ప్రణాళిక కర్తలు ఆర్థిక భద్రత అనే భావనను అభివృద్ధి చేశారు. ఉదారవాద అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యుద్ధానంతర శాంతికి అవకాశాలను పెంచుతుందన్నది వారి ఉద్దేశం. ఇలాంటి భద్రత భావనకు తెర తీసిన వారిలో అమెరికా రక్షణ మంత్రి (1933-44) కార్డెల్‌ హల్‌ ఒకరు.[Notes 1] రెండు ప్రపంచ యుద్ధాలకు మూల కారణం ఆర్థిక వివక్ష, వర్తక యుద్ధరీతులే కారణమని ఆయన నమ్మారు. నాజీ జర్మనీ వర్తక, వాణిజ్య నియంత్రణలు (ద్వైపాక్షిక ఒప్పందాలు) [2], బ్రిటన్‌ అనుసరించిన రాచరిక తరహా పద్ధతులు ప్రధానంగా ఆయన మనసులో ఉన్నాయి. ఈ పద్ధతుల ద్వారా బ్రిటన్‌ తన సామ్రాజ్య ఛత్రఛాయలో ఉన్న దేశాలకు, మాజీ దేశాలకు ప్రత్యేక వర్తక హెAదాలిచ్చింది. జర్మనీ, ఫ్రాన్సు, అమెరికా రక్షణాత్మక ఆర్థిక విధానాలే ఇందుకు కారణమయ్యాయని హల్ వాదించారు.

[U]nhampered trade dovetailed with peace; high tariffs, trade barriers, and unfair economic competition, with war…if we could get a freer flow of trade…freer in the sense of fewer discriminations and obstructions…so that one country would not be deadly jealous of another and the living standards of all countries might rise, thereby eliminating the economic dissatisfaction that breeds war, we might have a reasonable chance of lasting peace.

[3]

ప్రభుత్వ జోక్యాల ఎదుగుదల[మార్చు]

ఉదారవాద అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల జోక్యం తప్పనిసరి అని సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం అనంతరం సంపన్న దేశాలన్నింటిలోనూ ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వపరమైన నిర్వహణ ప్రధాన కార్యకలాపంగా మారిపోయింది. ఉపాధి, స్థిరత్వం, వృద్ధి ప్రభుత్వాల విధానల్లో ప్రధానాంశాలుగా మారాయి. బదులుగా జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ప్రభుత్వాల పాత్ర తమ పౌరులకు మరింత హెచ్చు స్థాయి ఆర్థిక భద్రతను కల్పించడమేనన్న భావన బాగా ప్రబలింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి సంక్షేమ రాజ్య భావన పుట్టి పెరుగుతూ వచ్చింది. ఆర్థిక వ్యవహారాల్లో సైధాంతిక ప్రభుత్వాల జోక్యానికి అది కారణమైంది. ఉద్యోగితను సరైన స్థాయిల్లో ఉండేలా చూసేందుకు ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరన్న కీన్స్‌ తరహా ఆర్థిక విధానాలకు నెమ్మదిగా ఆదరణ పెరిగింది.

అయితే దేశీయ ఆర్థిక విధానల్లో మితిమీరిన ప్రభుత్వ జోక్యం ఏకాకివాద సెంటిమెంటుకు దారితీసింది. అది కాస్తా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ప్రారంభించింది. జాతీయ లక్ష్యాల ప్రాథమ్యాలు, యుద్ధ సమయంలో దేశాల స్వతంత్ర చర్యలు, అంతర్జాతీయ సహకారం లేనిదే తమ జాతీయ లక్ష్యాల సాధన అసాధ్యమన్న అవగాహన లేమి వంటివన్నీ కలగలిసి పొరుగు దేశాన్ని బిచ్చగాన్ని చేసెయ్‌ వంటి వినాశకర విధానాలకు దారితీశాయి. హెచ్చు టారిఫ్‌లు, పోటాపోటీ కరెన్సీ విలువ తగ్గింపులు బంగారం ఆధారిత అంతర్జాతీయ విత్త వ్యవస్థను కుప్పకూల్చాయి. దేశీయంగా రాజకీయ అస్థిరతకు, అంతర్జాతీయంగా ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. దీన్నుంచి నేర్చుకున్న పాఠమే బ్రెట్టన్‌వుడ్‌ వ్యవస్థకు ప్రధాన నిర్మాత అని న్యూ డీలర్‌ హ్యారీ డెక్స్‌టర్‌ వైట్‌ వ్యాఖ్యానించారు.

the absence of a high degree of economic collaboration among the leading nations will…inevitably result in economic warfare that will be but the prelude and instigator of military warfare on an even vaster scale.

ఆర్థిక స్థిరత్వం, రాజకీయ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు వీలుగా తమ కరెన్సీలను మరింత నియంత్రించేందుకు, అంతర్జాతీయ వర్తకాన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా దేశాల మధ్య స్థిర మారక విలువలను కొనసాగించేందుకు మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు దేశాలన్నీ అంగీకరించాయి. అమెరికా స్వప్నించిన యుద్ధానంతర స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచానికి ఇదే పునాది. టారిఫ్‌లను తగ్గించడం, స్థిర మారక రేట్ల ద్వారా వర్తక సమతుల్యతను కొనసాగంచడం వంటివి కూడా అందులో భాగాలు. ఇవన్నీ కలిసి సానుకూల పెట్టుబడిదారీ విధానానికి రంగం సిద్ధం చేశాయి.

ఈ విధంగా బాగా అభివృద్ధి చెందిన మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలన్నీ అమెరికా తరహా యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక నిర్వహణకు అంగీకరించాయి. మరింత ప్రభావవంతమమైన అంతర్జాతీయ విత్త వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణలతో పాటు వర్తక, మూలధన నిల్వల స్వేచ్ఛాయుత ప్రవాహాలకు మరింతగా వీలు కల్పించేలా దాని నిర్మాణం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అంతర్జాతీయ విత్త వ్యవస్థ యుద్ధానికి ముందున్న బంగారం ప్రమాణ వ్యవస్థ వంటిదే. కాకపోతే అంతర్జాతీయ వర్తకం ద్వారా ప్రంచ బంగారు నిల్వల పున:స్థాపన జరిగే దాకా అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా అమెరికా డాలర్‌ను వాడారంతే. ఇలా కొత్త వ్యవస్థ (తొలినాళ్లలో) తన కరెన్సీ సరఫరాలో ప్రభుత్వాల జోక్యానికి అతీతంగా సాగింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరాల్లో ఆర్థిక గందరగోళం నెలకొన్న సందర్భంగా ఉన్న పరిస్థితికి ఇది సరిగ్గా భిన్నం. జోక్యానికి బదులుగా ప్రభుత్వాలు తమ కరెన్సీల ఉత్పత్తిని మరింత జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలు పెట్టాయి. తద్వారా తమ ధరల స్థాయిలను కరెన్సీ కృత్రిమంగా మార్చే వీల్లేకుండా జాగ్రత్త పడ్డాయి. బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థను ఒక విధంగా ఆర్థిక, కరెన్సీ వ్యవస్థల్లో ప్రభుత్వ సన్నిహిత జోక్యమనే కాలదోషం లేని వ్యవస్థకు మళ్లడంగా చెప్పవచ్చు.

అట్లాంటిక్‌ చార్టర్‌[మార్చు]

రూజ్‌వెల్ట్‌, చర్చిల్‌ 1941 ఆగస్టు 12న న్యూఫౌండ్‌ల్యాండ్‌లో జరిపిన రహస్య భేటీ అట్లాంటిక్‌ చార్టర్‌ ఏర్పాటుకు తెర తీసింది. దాన్ని బ్రిటన్‌, అమెరికా రెండు రోజుల తర్వాత అధికారికంగా ప్రకటించాయి.

అట్లాంటిక్‌ చార్టర్‌ 1941లో బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌తో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ నార్త్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ఒక నౌక పై సమావేశమైన సందర్భంగా రూపొందింది. బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సుకు ఇది పూర్వాంకం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ 14 సూత్రాల ప్రణాళికకు తెర తీసినట్టే రూజ్‌వెల్ట్‌ కూడా రెండో ప్రపంచ యుద్ధం ఇంకా ముగియనైనా ముగియక ముందే యుద్ధానంతర ప్రపంచం పై తన లక్ష్యాలకు అప్పుడే రూపమివ్వడం మొదలు పెట్టారు. ఇంతా చేస్తే అప్పటికింకా అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో అడుగు కూడా పెట్టలేదు. వర్తకం, ముడి సరుకుల పై అన్ని దేశాలకూ అవకాశముండాలన్న హక్కును అట్లాంటిక్‌ చార్టర్‌ పునరుద్ఘాటించింది. సముద్ర స్వేచ్ఛ, (1790ల్లో తన నౌకలను ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు తొలిసారిగా బెదిరించిన నాటి నుంచీ అమెరికా అనుసరిస్తూ వస్తున్న ప్రధాన విదేశీ విధానాల్లో ఒకటి), దురాక్రమణదారుల నిరాయుధీకరణ, సాధారణ భద్రత కోసం విస్తృత, స్తిర వ్యవస్థ ఏర్పాటు గురించి కూడా నొక్కిచెప్పింది.

రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు వస్తున్న కొద్దీ జరిగిన పరిణామాల్లో బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సును అంతిమ దశగా చెప్పవచ్చు. యుద్ధానంతరం జరగాల్సిన పునర్నిర్మాణ పనుల పై అమెరికా, బ్రిటన్‌ విత్త విభాగాధికారులు రెండున్నరేళ్ల పాటు జరిపిన సంప్రదింపులకు అది ఫలస్వరూపం. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో పూర్తిగా లోపించిన ప్రపంచ స్థాయి పునర్నిర్మాణ రీతుల పై బ్రిటిష్‌ అధికారులు అమెరికా అధికారులతో తీవ్రంగా చర్చలు జరిపారు. కరెన్సీ విలువలు హఠాత్తుగా పడిపోతాయేమో, మారక విలువల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయేమోనన్న భయ సందేహాలకు అతీతంగా వర్తకాన్ని కొనసాగించగల అంతర్జాతీయ స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా అవి సాగాయి. ఎందుకంటే ఈ రెండు అవలక్షణాలూ ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో దాదాపుగా ప్రపంచ పెట్టుబడిదారీ విధానాన్నే స్తంభింపజేశాయి.

బలమైన ఐరోపా‌ మార్కెట్‌ లేకుండా అమెరికా వస్తువులు, సేవలకు కొనుగోలుదారులే కరువవుతారని అగ్రరాజ్యపు విధాన నిర్ణేతలు అంచనా వేశారు. ఆ పరిస్థితుల్లో యుద్ధ సమయంలో సాధించిన అభివృద్ధిని దేశం కొనసాగించజాలదని వారు భావించారు. పైగా అమెరికా రాష్ట్రాలు యుద్ధ సమయంలో సమాఖ్య ప్రభుత్వం తమ డిమాండ్ల పై విధించిన పరిమితుల్ని తాత్కాలిక దృష్టితో మాత్రమే అంగీకరించాయి. నాటి వేతన స్కేళ్ల పై ద్రవ్యోల్బణం భారీస్థాయిలో ప్రభావం చూపుతున్న తరుణంలో ఇంకెంత మాత్రమూ ఎదురు చూపులతో గడిపేందుకు అవి సిద్ధంగా లేవు. (1945 చివరి నాటికి ఆటోమొబైల్‌, ఎలక్రికల్‌, ఉక్కు వంటి పరిశ్రమల్లో అప్పటికే సమ్మెలు, నిరసనలు మొదలయ్యాయి).

1945 తొలి నాళ్లలో బ్రెట్టన్‌వుడ్స్‌ స్ఫూర్తిని బెర్నార్డ్‌ బరూచ్‌ ఇలా అభివర్ణించారు. 'మనం గనక ఒకవేళ శ్రమ సబ్సిడీని, ఎగుమతి మార్కెట్లలో మితిమీరిన పోటీని ఆపగలిగితే, దాంతోపాటే యుద్ధ పరికరాల తయారీని నిరోధించగలిగితే దీర్ఘకాలిక సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి .[4] అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల మార్కెట్లు, సామగ్రుల పై నిర్నిరోధమైన ప్రవేశం కల్పించే స్థాయిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేలా నియమ నిబంధనలు రూపొందించేందుకు తన ఆధిపత్య స్థానాన్ని అమెరికా విజయవంతంగా వాడుకోవచ్చన్నది సూత్రీకరణ.

యూరప్‌, పశ్చిమాసియాల్లో యుద్ధ బీభత్సం[మార్చు]

వీటికి తోడు మరిన్ని విపరిణామాలు కూడా సంభవించాయి. యుద్ధం దెబ్బకు ఆర్థికంగా ఖాళీ అయిపోయిన అమెరికా మిత్ర రాజ్యాలు ఆ దేశ నేతృత్వాన్ని అంగీకరించాల్సి వచ్చింది. దేశీయ ఉత్పత్తి స్థాయిల పునరుద్ధరణతో పాటు అంతర్జాతీయ వర్తకంలో అమెరికా ఆర్థిక సాయం వాటికి తప్పనిసరిగా మారింది. నిజానికి వాటి మనుగడకు అమెరికా సాయం అత్యవసరంగా తయారైంది.

బహిరంగ మార్కెట్లో అమెరికా పారిశ్రామిక శక్తితో తామిక ఎంత మాత్రమూ పోటీ పడలేమని బ్రిటన్‌, ఫ్రాన్స్‌ యుద్ధానికి ముందే గ్రహించాయి. 1930ల్లోనే అమెరికా వస్తూత్పత్తులను నిషేధించేందుకు బ్రిటన్‌ తనదైన సొంత పారిశ్రామిక బ్లాకును ఏర్పాటు చేసింది. యుద్ధం తర్వాత తమకున్న ఆ రక్షణను తాము వదులుకోవాల్సి వస్తుందని చర్చిల్‌ ఒక్కనాటికి కూడా నమ్మలేదు. అందుకే అట్లాంటిక్‌ చార్టర్‌కు ఒప్పుకునే ముందే అందులోని స్వేచ్ఛాయుత ప్రవేశం తాలూకు క్లాజులను ఆయన విజయవంతంగా పలుచబరిచాడు.

అయినా బ్రిటిష్‌ సామ్రాజ్యంలోకి చొచ్చుకెళ్లేందుకు అమెరికా విధాన నిర్ణేతలు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. వస్తువుల పరంగా చూస్తే అమెరికా, బ్రిటన్‌ వస్తువుల పరిమాణం ప్రపంచ వర్తకం మొత్తం పరిమాణంలో సగం! ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రపంచ వర్తకంలో చెప్పుకోదగ్గ వాటాను చేజిక్కించుకోవాలంటే ముందుగా బ్రిటిష్‌ సామ్రాజ్య వర్తకం పై అది దెబ్బ కొట్టాల్సి ఉంది. 19వ శతాబ్ది మొత్తాన్నీ బ్రిటన్‌ శాసిస్తే, 20వ శతాబ్దం రెండో అర్ధ భాగం పై పూర్తిగా అమెరికా ఆధిపత్యమే సాగాలని ఆ దేశ అధికారులు వాంఛించారని[5]

ఒక విశ్లేషకుడు అభిప్రాపడ్డాడు.

One of the reasons Bretton Woods worked was that the US was clearly the most powerful country at the table and so ultimately was able to impose its will on the others, including an often-dismayed Britain. At the time, one senior official at the Bank of England described the deal reached at Bretton Woods as “the greatest blow to Britain next to the war”, largely because it underlined the way in which financial power had moved from the UK to the US.

—Business Spectator[6]

యుద్ధంతో పూర్తిగా చితికిపోయిన బ్రిటన్‌కు మరో అవకాశం కూడా ఏదీ లేకపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలు ఆ దేశ పరిశ్రమలను పూర్తిగా నాశనం చేశాయి. దేశ ఆహారావసరాల్లో దాదాపు సగం, ముడి సరుకుల్లో బగ్గు మినహా మిగతా అన్నింటినీ వంద శాతం దిగుమతి చేసుకున్నందుకు బ్రిటన్‌ మూల్యం చెల్లించుకుంది. సాయం కోరడం తప్ప వారికి మరో దారి లేకపోయింది. అందుకే బ్రిటన్‌కు 446 కోట్ల డాలర్ల సాయం అందజేస్తూ ఒప్పందం పై 1945 డిసెంబర్‌ 6న అమెరికా సంతకం చేసే దాకా బ్రిటిష్‌ పార్లమెంటు బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందానికి ఆమోదముద్ర వేయలేదు. 1945 డిసెంబర్‌ చివర్లో మాత్రమే ఆ పనిచేసింది.[7]

ఇక దాదాపుగా రెండు దశాబ్దాల పాటు పాత ప్రపంచంలోనూ, కొత్త ప్రపంచంలోనూ అమేరికా, ఫ్రాన్స్‌ ప్రయోజనాలు నిత్యం పరస్పరం తలపడుతూనే వచ్చాయి. యుద్ధం సమయంలో అమెరికా పై ఫ్రాన్స్‌కున్న అపనమ్మకానికి ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షునిగా ఉన్న జనరల్‌ చార్లెస్‌ డిగల్‌ చర్యలు అద్దం పట్టాయి. తమ దేశ వలసలను యథాతథంగా కాపాడుకునేందుకు, చర్యల్లో దౌత్యపరమైన స్వేచ్ఛ కోసం అమెరికా అధికారులతో ఆయన తీవ్రాతితీవ్రంగా తలపడ్డారు. దానికి బదులుగా అమెరికా అధికార వర్గం ఆయన పై రాజకీయ అతివాది అనే ముద్ర వేసింది.

కానీ 1945లో పరిస్థితులు మారాయి. ఫ్రాన్స్‌ జాతీయవాదానికి సారథ్యం వహిస్తున్న వ్యక్తిగా ఎట్టకేలకు అమెరికాను 100 కోట్ల డాలర్ల సాయం అడిగేందుకు అంగీకరించక తప్పలేదు. అందులో చాలా మొత్తాన్ని అమెరికా ఇచ్చింది. బదులుగా ప్రభుత్వ సబ్సిడీల పై కోత పెట్టేందుకు, ప్రపంచ మార్కెట్లో తమ ఎగుమతిదారులకు పైచేయి కల్పిస్తున్న కరెన్సీ అవకతవకలను నిలిపేసేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించాల్సి వచ్చింది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం కుదిరిపోతున్న దశలో మూడో ప్రపంచ దేశాల్లో అత్యధికం రాజకీయంగా, ఆర్థికంగా మిగతా సంపన్న దేశాలకు తాబేదార్లుగానే ఉండిపోయాయి. రాజకీయంగా, ఆర్థికంగా పాశ్చాత్య సంపన్న దేశాలతో పెనవేసుకుపోయిన ఈ దేశాలకు తమ ఆధిపత్య దేశాలు రూపొందించిన ఆర్థిక, ఇతరత్రా ఒప్పందాలను, నిబంధనలను తూచా తప్పకుండా అనుసరించడం తప్ప మరో మార్గమేదీ లేకుండా పోయింది. ఇలాంటి సమయాల్లో తూర్పున సోవియట్‌ ఆధిపత్యం తూర్పు ఐరోపా‌ దేశాలకు ప్రత్యేక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ఠ చేయసాగింది.

రూపకల్పన[మార్చు]

స్వేచ్ఛా వాణిజ్యం కరెన్సీల స్వేచ్ఛాయుత పరివర్తనీయత పై చాలా వరకు ఆధారపడింది. బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందకర్తలు అప్పటికే 1930ల్లో ఆత్మహత్యాసదృశంగా పరిణమించిన ఫ్లోటింగ్‌ రేట్ల ప్రమాదాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునే ఉన్నారు. కాబట్టి ద్రవ్యపరంగా మితిమీరిన మార్పుచేర్పులు స్వేచ్ఛాయుత వర్తకానికి అడ్డుగోడలుగా మారతాయని చెబుతూ వచ్చారు.

ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు అందరికీ ఆమోదయోగ్యమైన పెట్టుబడి, వర్తక, చెల్లింపుల సాధనాలు అత్యవసరంగా మారాయి. జాతీయ ఆర్థిక వ్యవస్థల మాదిరిగా కాకుండా అంతర్జాతీయ వర్తకానికి కేంద్ర ప్రభుత్వమంటూ ఏదీ ఉండదు. ఫలితంగా సొంత కరెన్సీని జారీ చేసి దాని వాడకాన్ని నిర్వహించే వెసులుబాటు కూడా అందులో ఉండదు. గతంలో ఈ సమస్యకు బంగారం ప్రమాణం సమాధానంగా ఉండేది. కానీ బ్రెట్టన్‌వుడ్స్‌ విధాన నిర్ణేతలు మాత్రం యుద్ధానంతర రాజకీయ ఆర్థిక వ్యవస్థలో బంగారం సూత్రం అంత ఆచరణ సాధ్యం కాదని భావించారు. దానికి బదులుగా స్థిర మారక రేట్ల వ్యవస్థను వారు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన పలు అంతర్జాతీయ సంస్థలు అమెరికా డాలర్‌ (కేంద్ర బ్యాంకులన్నింటికీ ఇది అప్పటికే బంగారం ప్రమాణంతో సమానమైన కరెన్సీగా ఇప్పటికే మారిపోయింది) ను రిజర్వు కరెన్సీగా వాడుతూ, దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి.

అనధికారికం[మార్చు]

గత ప్రభుత్వాలు[మార్చు]

19, 20వ శతాబ్దాల్లో అంతర్జాతీయ విత్త వ్యవహారాల్లో బంగారం అతి ప్రధాన పాత పోషించింది. కరెన్సీల విలువకు స్థిరత్వం ఆపాదించేందుకు బంగారం ప్రమాణమే పనికొచ్చింది. కరెన్సీల అంతర్జాతీయ విలువ బంగారంతో వాటి నిష్పత్తి పై ఆధారపడి నిర్ణయమవుతూ వచ్చింది. అంతర్జాతీయంగా కూడా ఒప్పందాల పరిపూర్తికి బంగారమే సాధనంగా మారింది. బంగారం ఆధారంగా ఏర్పాటు చేసిన ప్రమాణీకరించిన మారక విలువలను అంతా అభిలషణీయంగా భావించారు. ఎందుకంటే ఆ పద్ధతిలో ఇతర దేశాలతో వర్తకం చేయడాన్ని అంతా నష్టభయం లేని వ్యవహారంగా పరిగణించారు.

అంతర్జాతీయ వర్తకంలో అసమతుల్యతలను బంగారం ప్రమాణం ద్వారా గమ్మత్తైన రీతిలో సర్దుబాటయ్యేవి. లోటులో ఉన్న దేశానికి అతి తక్కువ స్థాయిలో బంగారు నిల్వలుండేవి. తత్ఫలితంగా నగదు సరఫరా కూడా తక్కువగానే ఉండేది. అలా డిమాండ్‌లో ఏర్పడే తగ్గుదల సహజంగానే దిగుమతులను కూడా తగ్గించేది. అదే సమయంలో ధరల్లో తగ్గుదల కారణంగా ఎగుమతులు బాగా పుంజుకునేవి. ఇలా లోటు దానంతటదే పూడుకుపోయేది. ద్రవ్యోల్బణం బారిన పడిన ఏ దేశమైనా విధిగా బంగారాన్ని కోల్పోయేది. దాంతో అందుబాటులో ఉండే నగదు పరిమాణం కూడా తగ్గిపోయేది. ఇలా తగ్గే నగదు పరిమాణం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను దానంతటదే తగ్గించేసేది. ఆ సమయంలో బంగారం వాడకానికి మద్దతుగా బ్రిటిష్‌ పౌండ్‌ పని చేసేది. నాడు బాగా జోరుమీదున్న బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ ఆధారంగా పౌండ్‌ రిజర్వు కార్యకలాపాల నగదుగా పెత్తనం చెలాయించింది. కానీ ప్రపంచ కరెన్సీగా పని చేసే సత్తా పౌండ్‌లో లేకపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ ఆర్థిక వ్యవస్థ బాగా బలహీనపడటమే ఇందుకు కారణం.

మారక రేటును స్థిరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా బ్రెట్టన్‌వుడ్స్‌ రూపకర్తలు ఒక విధానానికి తెర తీశారు. అయినా మరీ చురుకైన ఆర్థిక విధానాలకు ఆలవాలంగా మారిన ఆ కాలంలో 19 వ శతాబ్ది నాటి స్థిరమైన బంగారం స్టాండర్డ్‌కు ప్రత్యామ్నాయంగా స్థిర మారక రేట్ల విధానాన్ని ఎవరూ పెద్దగా ఆమోదించలేకపోయారు. నానాటికీ పెరిగిపోతున్న అంతర్జాతీయ వర్తకం, పెట్టుబడుల అవసరాలకు సరిపోయే రీతిలో బంగారం ఉత్పత్తి పెరగలేదు. ప్రపంచంలో అప్పటికి బయటపడ్డ బంగారు నిల్వల్లో అత్యధిక శాతం సోవియట్‌ యూనియన్‌లోనే ఉంది. అనంతర కాలంలో అమెరికాకు, పశ్చిమ ఐరోపా‌ దేశాలకు ప్రచ్ఛన్న యుద్ధ ప్రతిద్వంద్వి కావడంలో సోవియట్‌కు ఆ నిల్వలే సాయపడ్డాయి.

అంతర్జాతీయంగా కరెన్సీ కార్యకలాపాల్లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్లను సమర్థంగా తీర్చగల ఏకైక కరెన్సీగా అమెరికా డాలర్‌ మాత్రమే అందరికీ కన్పించసాగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం, డాలర్‌-బంగారం మధ్య స్థిర సంబంధం (ఔన్సుకు 35 డాలర్ల చొప్పున), ఆ ధరకు డాలర్లను బంగారంగా మారుస్తామన్న అమెరికా ప్రమాణం వంటివన్నీ కలిసి డాలర్‌ను బంగారంతో సమాన విలువ గలదానిగా మార్చేశాయి. నిజానికి వడ్డీ సంపాదించి పెట్టడం, బంగారం కంటే కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉండటం వంటి కారణాలతో డాలర్‌ బంగారం కంటే కూడా విశ్వసనీయమైనదిగా మారిపోయింది.

డిస్కౌంట్‌ బ్యాంకుల కాలంలో డిస్కౌంట్‌ బంగారంపై సంపాదించిన బడ్డీగా మాత్రమే ఉండేది. ప్రభుత్వ బాండ్లపై వడ్డీని తిరిగి చెల్లించేందుకు మరిన్ని డాలర్లను ముద్రించడమే ఏకైక మార్గంగా కూడా ఉండేదన్నది మరో అభిప్రాయం. ఆ విధంగా బంగరం ధరలు కూడా పెరిగిపోయేవి. బంగారం ధరను ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరపరిస్తే ఇతర దేశాలు బంగారమే కావాలని డిమాండ్‌ చేస్తాయి తప్ప డాలర్లను అంగీకరించవు. తత్ఫలితంగానే 1971లో బంగారానికి దారులు మూసేశారు.

స్థిర మారక రేట్లు[మార్చు]

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF‌), అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు (IBRD) ఒప్పందాల్లో స్పష్టంగా ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం నిబంధనలు స్థిర మారక రేట్ల వ్యవస్థకు ప్రాణం పోశాయి. సభ్య దేశాలు తమ కరన్సీలకు ఇతర దేశాల కరెన్సీల్లోకి మార్చుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్యానికి ఊతమివ్వడం ద్వారా బహిరంగ వ్యవస్థకు మరింతగా దోహదపడేందుకు ఈ నిబంధనలు ప్రేరేపణగా నిలిచాయి.

తద్వారా పెగ్‌డ్‌ రేట్‌ కరెన్సీ వ్యవస్థ పుట్టుకొచ్చింది. సభ్య దేశాలు తమ జాతీయ కరెన్సీలను బంగారం విలువతో సమానంగా (పెగ్‌గా) ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతోపాటు మారక రేట్లను కూడా దానికి ఒక శాతం ప్లస్‌ గానీ, మైనస్‌గా గానీ (సామీప్యం) నిర్వహించాల్సి వచ్చేది. ఇందుకోసం తమ విదేశీ ఎక్స్ఛేంజీ మార్కెట్లలో జోక్యం చేసుకోవాల్సి వచ్చేది (అంటే విదేశీ మారకం కొనుగోలు, విక్రయాలన్నమాట).

సిద్ధాంతపరంగా రిజర్వ్‌ కరెన్సీ జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ చెప్పిన విధంగా బాంకర్‌ (ఎన్నడూ అమలే చేయని ప్రపంచ కరెన్సీ ప్రమాణం) గా పని చేయాలన్నమాట. అయితే ఇందకు అమెరికా అభ్యంతరపెట్టింది. వారి అభ్యర్థనను మిగతా దేశాలు మన్నించాయి. తద్వారా అమెరికా డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీగా ఏర్పడింది. అంటే ఇతర దేశాలు తమ కరెన్సీలను అమెరికా డాలర్‌కు పెగ్‌ చేస్తారన్నమాట. ఒకసారి పరివర్తనీయత అమల్లోకి వచ్చిన తర్వాత తమ మార్కెట్‌ ఎక్స్‌చేంజీ రేట్లను సామ్య విలువకు ఒక శాతం అటూ ఇటుగా స్థిరంగా ఉంచేందుకు అమెరికా డాలర్లను కొనడం, అమ్మడం చేస్తాయి. ఆ విధంగా బంగారం ప్రమాణం ఆధారిత అంతర్జాతీయ ఆర్థిక విధానంలో బంగారం పోషించిన పాత్రను అమెరికా డాలర్‌ పోషించడం మొదలు పెట్టింది. (రోగ్‌ నేషన్‌, 2003, క్లైడ్‌ ప్రెస్టోవిజ్‌)

అదే సమయంలో డాలర్ ‌పై విశ్వసనీయత పెంచేందుకు డాలర్‌ నుండి బంగారం లెక్కను 35 డాలర్లకు ఒక ఔన్సు బంగారం వద్ద స్థిరంగా ఉంచేందుకు అమెరికా అంగీకరించింది. ఈ రేటు వద్ద విదేశీ ప్రభుత్వాలు, ఎక్స్‌చేంజీలు డాలర్లను బంగారంగా మార్చుకోగలిగాయి. బ్రెట్టన్‌వుడ్స్‌ విధానం డాలర్‌ ఆధారతిత చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం కరెన్సీలన్నీ డాలర్‌ విలువతో పోల్చి నిర్ణయమవడం మొదలైంది. డాలర్‌ స్వయంగా బంగారంగా నిర్ధారిత ధరకు ఎప్పుడంటే అప్పుడు మారేందుకు వీలుగా ఉంది. దాంతోపాటు బంగారం అంత మెరుగైన మారక ద్రవ్యంగా డాలర్‌ మారింది. ఇలా అమెరికా డాలర్‌ ఇప్పుడు ప్రభావవంతమైన ప్రపంచ కరెన్సీగా మారిపోయింది. దాని ప్రమాణానికి ప్రపంచంలోని ఇతర కరెన్సీలన్నీ పెగ్‌ అవడం మొదలు పెట్టాయి. ప్రపంచంలోకెల్లా అతి కీలక కరెన్సీగా అంతర్జాతీయ కార్యకలాపాల్లో అత్యధికం అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి లోబడే నడవసాగాయి.

అత్యధిక కొనుగోలు శక్తి ఉన్న కరెన్సీగా అమెరికా డాలర్‌ నిలిచింది. బంగారం దన్ను కలిగిన ఏకైక కరెన్సీగా కూడా అది నిలిచింది. అదనంగా రెండో ప్రపంచ యుద్ధంతో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అత్యధిక ఐరోపా‌ దేశాలు తమ బంగారం నిల్వలను చాలావరకు అమెరికా[ఆధారం కోరబడింది]కు బదలాయించాయి. ఇది కూడా అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి దారి తీసిన ప్రధాన కారణమే. ఆ విధంగా మిగతా ప్రపంచంలో అమెరికా డాలర్‌కు విలువ అమాంతంగా పెరిగిపోయింది. బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థలో అది కీలకమైన కరెన్సీగా మారిపోయింది.

సభ్య దేశాలు తమ పోలిక విలువను IMF‌ ఆమోదంతో మాత్రమే మార్చడం సాధ్యపడేది. ఆయా దేశాల చెల్లింపులు ప్రాథమికంగా అసమతుల్యతతో కూడుకుని ఉన్నాయన్న అభిప్రాయం ఆధారంగా IMF‌ నిర్ణయాలుండేవి.

అధికారిక రాజ్యాలు[మార్చు]

బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం IMF, IBRD (నేటి ప్రపంచ బ్యాంకు) స్థాపనకు దారి తీసింది. ఇవి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో బలోపేతమైన శక్తులుగా ఉన్నాయి.

ముందే చెప్పినట్టుగా క్లోజ్డ్‌ మార్కెట్లు పునరావృతం కావడాన్ని అడ్డుకోవడం, 1930ల నాటి ఆర్థిక పోరాటాలకు చెక్‌ చెప్పడమనే ఉమ్మడి లక్ష్యాలే బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సుకు ఏకాభిప్రాయ వేదికను సిద్ధం చేశాయి. ఆ విధంగా అంతర్జాతీయ విత్త వ్యవహారాల్లో ఒక సువ్యవస్థితమైన వ్యవస్థ అవసరం ఎంతో ఉందని బ్రెట్టన్‌వుడ్స్‌ రూపకర్తలు భావించారు. వ్యాపార అంచనాలను స్థిరీకరించేందుకు నియమాల ఆధారిత వ్యవస్థల అవసరం చాలా ఉంది అని బ్రిటిష్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ 1944లోనే నొక్కివక్కాణించాడు. బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థలోని స్థిర మారక రేట్ల పద్ధతి దాన్ని ప్రతిఫలిస్తోందని ఆయన అంగీకరించాడు. ఆ మధ్యకాలిక సంవత్సరాల్లో కరెన్సీ కష్టాలు ప్రభుత్వాల సంప్రదింపుల మధ్య స్థిరీకృత వ్యవస్థ పద్ధతులు లేకపోవడం వల్లనే ఏర్పడ్డాయని భావించారు.

అంగీకారయోగ్యమైన అంతర్జాతీయ సంప్రదింపుల నియమాలను ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికాంశాల పై సంఘర్షణ కనీస స్థాయికి తగ్గిపోయింది. దాంతోపాటే అంతర్జాతీయ సంబంధాల్లో ఆర్థికాంశాల ప్రాధాన్యత కూడా బాగా వెనకపట్టు పట్టింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి[మార్చు]

ప్రధాన వ్యాసం: International Monetary Fund

ఇది 1945 డిసెంబర్‌ 27న అధికారికంగా ఏర్పాటైంది. ఒప్పందానికి సంబంధించిన అధికరణల పై 29 సభ్య దేశాలు బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సులో సంతకం చేయడంతో IMF‌ ఏర్పాటుకు బీజం పడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల ట్రస్టీగా, నిబంధనల ర్యవేక్షణ సంస్థగా ఇది ఎదిగింది. 1947 మార్చి 1 నుంచి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించింది. 1 శాతం పైచిలుకు మారక రేట్ల మార్పుచేర్పులన్నింటికీ ఏ దేశానికైనా IMF ఆమోదం తప్పనిసరి. విత్త వ్యవస్థను ప్రభావితం చేసే విధానాల పై పలు దేశాలకు సంస్థ సలహలిచ్చింది.

IMF‌ రూపకల్పన[మార్చు]

IMF‌ ఏర్పాటుకు దారి తీసిన బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సులో సభ్యులందరికీ ఒకే ప్రశ్న ఎదురైంది. తాము ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ సంస్థ మున్ముందు అంతర్జాతీయ ద్రవ్యత్వ యాక్సెస్‌ విషయంతో పాటు కొత్తగా వచ్చే సంస్థ ప్రపంచ బ్యాంకు మాదిరిగా ఇష్టానికి కొత్త రిజర్వులను సృష్టించగలుగుతుందా, లేక కేవలం అప్పులిచ్చే వ్యవస్థగానే మిగిలిపోతుందా అన్న సందేహాలు వారిని వేధించాయి.

అమెరికాలోని జార్జియాలో సవనాలో 1946 మార్చి 8న జరిగిన అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రారంభ సమావేశంలో గవర్నర్ల బోర్డు భేటీ సందర్భంగా జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ (కుడి) మరియు హ్యారీ డెక్స్‌టర్‌ వైట్‌

సదస్సులో 44 దేశాలు పాల్గన్నా, చర్చలు మాత్రం రెండు పోటీ దేశాలైన అమెరికా, ఇంగ్లండ్‌ సిద్ధం చేసిన రెండు ప్రతిపాదనలపైనే జరిగాయి. అమెరికా ట్రెజరీలో అంతర్జాతీయ ప్రధాన ఆర్థికవేత్త హెAదాలో (1942-44) హ్యారీ డెక్స్టర్‌ వైట్‌ ద్రవ్యత్వానికి అంతర్జాతీయ యాక్సెస్‌ విషయంలో అమెరికా తరఫున బ్లూప్రింట్‌ను సిద్ధం చేశాడు. బ్రిటిష్‌ ట్రెజరీ కోసం కీన్స్‌ తయారు చేసిన చిత్తు ప్రతికి అది పోటీగా నిలిచింది. మొత్తం మీద వైట్‌ సిద్ధాంతానికి మెజారిటీ ఆమోదం లభించింది. ఆయన సిద్ధాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య ధరల స్థిరత్వ సాధనకు ప్రాధాన్యతనిచ్చింది. కీన్స్‌ ప్రతిపాదన మాత్రం ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే దిశగా సాగింది.

ఆ సమయంలో వైట్‌, కీన్స్‌ ప్రతిపాదనల మధ్య అగాధం చాలా ఎక్కువగా ఉన్నట్టు తోచింది. ప్రతి దేశానికీ అంగీకారయోగ్యమైన విధానాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ 1944 జూలై 22న సదస్సు ముగింపు సందర్భంగా చేసిన ఉపన్యాసంలో కీన్స్‌ ఇదే మాట అన్నాడు.

We, the delegates of this Conference, Mr. President, have been trying to accomplish something very difficult to accomplish.[...] It has been our task to find a common measure, a common standard, a common rule acceptable to each and not irksome to any.

కీన్స్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం అమలైతే ప్రపంచ రిజర్వు కరెన్సీ (దాన్ని బాంకర్‌ అని పిలవాలని కీన్స్‌ తలపోశాడు) ఏర్పాటయ్యేది. దీన్ని ఒక కేంద్ర బ్యాంకు పర్యవేక్షించేది. బహూశా నగదు ముద్రణ అధికారం కూడా దానికి దఖలు పడేది. దాంతోపాటు మరింత పెద్ద స్థాయిలో (ఆ సమయంలో బ్రిటన్‌ ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణ, ఇతరత్రా సమస్యల దృష్ట్యా ఈ ప్రతిపాదన అర్థం చేసుకోదగిందే) చర్యలకు అధికారులుండేవి.

చెల్లింపుల అసమతుల్యతలను సరి చేసే విషయానికి వస్తే, రుణదాతలు, రుణగ్రహీతలు ఇద్దరూ తమ విధానాలను మార్చుకోవాలని కీన్స్‌ సిఫార్సు చేశాడు. ఆయన చెప్పిన ప్రకారం చెల్లింపుల మిగులున్న దేశాలు లోటు దేశాల నుంచి తమ దిగుమతులను మరింతగా పెంచుకోవాలి. ఆ విధంగా విదేశీ వర్తక సమతుల్యతను సాధించాలి. లోటు దేశంపై మితిమీరిన భారం వేస్తున్న సమస్య పట్ల తద్వారా కీన్స్‌ సానుభూతితో స్పందించాడు. ఈ మార్గంలో అది ఇలా తేలిగ్గా పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డాడు.

కానీ రుణదాత దేశంగా మారనున్న అమెరికా మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మగా నిలవాలనే ఆలోచనతో కీన్స్‌ ప్రతిపాదనలను నిరసించింది. దాని పట్ల పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు. యుద్ధానంత ఆర్థిక వ్యవస్థలో తలెత్తగల ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పైనే అమెరికా శిబిరం ఎక్కువగా దృష్టి సారించింది. కాబట్టి సహజంగానే అసమతుల్యతలను లోటు దేశపు సమస్యగా మాత్రమే వైట్‌ పరిగణించాడు.

కొన్ని అంశాల పై ఇరు వర్గాలూ రాజీ పడ్డాయి. తిరుగులేని అమెరికా ఆర్థిక, సైనిక బలమే అందుకు కారణంగా నిలిచింది. కానీ మొత్తం మీద బ్రెట్టన్‌వుడ్స్‌ రూపకర్తలు వైట్‌ ప్రతిపాదిత సిద్ధాంతానికే మొగ్గు చూపారు.

చందాలు, కోటాలు[మార్చు]

సదస్సులో వచ్చిన నిర్ణయాలు అమెరికా ప్రాధాన్యతలనే ప్రతిఫలించాయి. ఫలితంగా IMFలో చందాలు, కోటాల వ్యవస్థ అంతర్భాగంగా అమరింది. అది ప్రతి దేశమూ కట్టే జాతీయ కరెన్సీ, బంగారం నిల్వల చందాతో కూడిన మిశ్రమ వ్యవస్థే తప్ప మరేమీ కాదన్పించే పరిస్థితి నెలకొంది. నగదును సృష్టించే సామర్థ్యమున్న ప్రపంచ బ్యాంకు కావాలన్న ఆశయాలకు ఇది పూర్తి విరుద్ధం. పలు దేశాల వర్తక లోటులను సరిచేయాల్సిన బాధ్యత కూడా IMF‌ పైనే పడింది. అంటే ఆ దేశాలు మాత్రం తమ కరెన్సీ విలువలను తగ్గించుకునే (డీ వాల్యుయేషన్) ప్రయత్నం ఎంతమాత్రమూ చేయవు. ఇది కాస్తా దిగుమతుల్లో క్షీణతకు నాంది పలికింది.

సభ్య దేశాలు బంగారం, తమ సొంత కరెన్సీల రూపంలో ఏర్పాటు చేసిన మొత్తాల ఆధారంగా ఒక నిధిని IMF‌ ఏర్పాటు చేసింది. వాస్తవ చందాలు 880 కోట్ల డాలర్లుగా లెక్క తేలాయి. IMF‌లో చేరిన ప్రతి దేశానికీ కోటాలను కేటాయించారు. వాటి వాటి ఆర్థిక శక్తియుక్తుల ఆధారంగా కోటా నిర్ణయమయ్యేది. దీన్ని ఒక విధమైన క్రెడిట్‌ డిపాజిట్‌గా పరిగణించేవారు. ఇవన్నీ తమ కోటాకు అనుగుణమైన మొత్తంలో చందా కట్టాలన్న బాధ్యత కూడా ఉండేది. ఆ చందాను 25 శాతం బంగారం, లేదా బంగారం రూపంలోకి మార్చిన కరెన్సీ రూపంలో (అంటే డాలర్‌ అనే అర్థం. అప్పట్లో అలా నేరుగా బంగారం రూపంలోకి మార్చుకోదగ్గ ఏకైక కరెన్సీగా అన్ని కేంద్ర బ్యాంకులూ డాలర్‌నే పరిగణించేవి), మిగతా 75 శాతాన్ని తన సొంత కరెన్సీలో చెల్లించాల్సి ఉండేది.

కోటా, చందాలు IMF‌ వద్ద ఉన్న నిధులకు ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ మొత్తాన్ని సభ్య దేశాల్లో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న వాటికి రుణాలిచేఏ్చందుకు IMF‌ వినియోగించసాగింది. చెల్లింపుల సమస్యలు ఎదురైతే ప్రతి సభ్య దేశమూ తక్షణం తన చందాలో 25 శాతాన్ని రుణంగా పొందగల సానుకూలత కూడా ఏర్పడింది. ఆ మొత్తం సరిపోలేదంటే విదేశీ కరన్సీలో అప్పులివ్వాల్సిందిగా ప్రతి దేశమూ కోరవచ్చు.

ఆర్థిక లోటుకు ద్రవ్య సాయం[మార్చు]

ప్రస్తుత ఖాతల్లో లోటు ఉండే సందర్భంలో IMF‌ సభ్యదేశాలు తమ వద్ద నిధుల లేమి ఉన్నప్పుడు తమ కోటాను బట్టి నిర్ధారితమయ్యే మొత్తాలకు సమానమైన విదేశీ కరెన్సీ రుణాలను పొందవచ్చు. మరోలా చెప్పాలంటే IMF‌కు ఎంత ఎక్కువగా చందా సమర్పిస్తే దాన్నుంచి ప్రతిగా అంత ఎక్కువ రుణం పొందడం సాధ్యమన్నమాట.

ఈ రుణాలను సభ్యదేశాలు 18 నెలల నుంచి ఐదేళ్ల కాల పరిమితి లోపు తిరిగి చెల్లించాల్సి ఉండేది. బదులుగా ప్రతి ఏడాదీ దేశాలు మరీ అప్పుల్లో కూరుకుపోకుండా చూసేందుకు కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేసేందుకు IMF‌ నడుం బిగించింది. ఆ విధంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పై IMF‌ అమెరికా ట్రెజరీ తరఫున నిఘా అధికారం కూడా చెలాయించిందన్నమాట. ఆయా దేశాలు తమ జాతీయ కరెన్సీలను పెంచుకోవడానికి కావాల్సిన రుణాల కోసం ఇందుకు అంగీకరించక తప్పేది కాదు.

IMF‌ రుణాలను ఇతర సంప్రదాయిక రుణ సంస్థలిచ్చే అప్పులతో పోల్చలేం. IMF రుణాలను ఇతర సంప్రదాయిక రుణ సంస్థలిచ్చే అప్పులతో పోల్చలేం. వాటిని బంగారంతో గానీ, సభ్యదేశపు జాతీయ కరెన్సీతో గానీ విదేశీ కరెన్సీని కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశంగా చెప్పవచ్చు.

అమెరికా దన్నుతో IMF‌ మొదలుపెట్టిన కార్యకలాపాలు బంగారం, సేవలను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేయడంలో ఇమిడి ఉండే అడ్డంకులను తొలగించేందుకు పని చేయసాగాయి. దాంతోపాటే కరెన్సీ అడ్డంకులను కూడా తొలగించి రెన్సీ మారకంపై నియంత్రణలను కూడా ఎత్తేసేందుకు అవి తోడ్పడ్డాయి.

చెల్లింపుల లోటును ఎదుర్కొంటున్న దేశాలకు అప్పులిచ్చేందుకు IMF ఏర్పాటు, నిర్మాణం జరిగాయి. స్వల్పకాలిక చెల్లింపుల తేడాలను IMF‌ రుణాల సాయంతో సరిచేసుకోవచ్చు. అది స్థిరమైన కరెన్సీ మారక రేట్లకు దారి తీస్తుంది. ఫలితంగా సభ్య దేశాలు తమ దిగుమతులను అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణమైన స్థాయికి తగ్గించుకోవడానికి వీలుగా జాతీయాదాయంలో తగ్గుదల విధించుకోవాల్సిన అగత్యం తప్పింది. చారిత్రక చెల్లింపుల లోటును సరిచేసుకునే ప్రయత్నాల్లో తమను తాము నిరుద్యోగం వంటి సమస్యల్లో పడవేసుకునే బాధల నుంచి కూడా పలు దేశాలకు అలాంటి చర్యల ద్వారా ఉపశమనం లభించింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు పలు ఐరోపా‌ దేశాలు, ముఖ్యంగా బ్రిటన్‌ ఇలాంటి చర్యలకే దిగేవి.

మారుతున్న తలసరి విలువ[మార్చు]

IMF‌ అంతర్జాతీయ ఒప్పందం ద్వారా తరచూ అంతరాయాలు కల‌ మారక రేట్లను, సర్దుబాట్లను చేసుకునేందుకు అవకాశం కల్పించేది (సభ్య దేశాల తలసరి విలువను మార్చడం ద్వారా). తద్వారా సభ్య దేశాలు తమ కరెన్సీ మారకపు రేటును 10 శాతం దాకా సర్దుబాటు చేసుకునేందుకు అనుమతి లభించేది. అవి తమ ఎగుమతులను విస్తరించుకోవడం, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా స్వీయ వర్తకంలో సమతుల్యతను సాధించేందుకు ఇది వీలు కల్పించేది. కేవలం ములిక అసమతుల్యత ఉంటె మాత్రమే దీన్ని అనుమతించేవారు. దేశ కరెన్సీ విలువలో తగ్గుదలను డీ వాల్యుయేషన్‌గా పిలిచేవారు. అదే సమయంలో విలువలో పెరుగుదలను రీ వాల్యుయేషన్‌ అనేవారు.

ఈ మారకపు రేట్ల మార్పులు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని ముందుగా భావించారు. కానీ తలసరి విలువ వ్యవస్థ పనితీరుకు కీలకమైన మౌలిక అసమతుల్యత భావనను మాత్రం ఎప్పుడూ సవివరంగా నిర్వచించనే లేదు.

IMF‌ కార్యకలాపాలు[మార్చు]

గతంలో ఎప్పుడూ అంతర్జాతీయ విత్త సహకారాన్ని శాశ్వత వ్యవస్థాగత ప్రాతిపదిక పై ప్రయత్నించే చర్యలు చేపట్టలేదు. అయితే ప్రభుత్వాల మధ్య ఓటింగ్‌ హక్కులను కూడా కల్పించాలని నిర్ణయించడం మరింత ప్రధానమైన నిర్ణయంగా చెప్పవచ్చు. అది కూడా ఒక దేశం, ఒక ఓటు పద్ధతిన కాకుండా, వారి కోటాలకు అనుగుణమైన రీతిలో ఓటింగ్‌ హక్కు ఇవ్వాలని తీర్మానించారు. అమెరికా IMFకు అత్యధికంగా కంట్రిబ్యూట్‌ చేస్తున్న కారణంగా ఈ విషయంలో ఆ దేశ నాయకత్వానిదే కీలక పాత్రగా ఉంటూండేది. ఇలా విలువ ఆధారిత ఓటింగ్‌ పద్ధతి ప్రకారం ఇమ్ఫ్ ‌పై అమెరికా విపరీతమైన ప్రభావం, ఆధిపత్యం చెలాయించేది. ఎందుకంటే IMF‌ కోటాల్లో మూడో వంతు అమెరికావే ఉండేవి. తద్వారా IMF‌ చార్టర్‌లో అవసరమైన అన్ని మార్పులకూ కావాల్సినంత మెజారిటీ ఆ దేశానికి స్వతహాగానే ఉండేది.

పైగా IMF‌ ప్రధాన కార్యాలయమే వాషింగ్టన్‌లో ఉంది. దాని సిబ్బంది కూడా ప్రధానంగా అమెరికా ఆర్థికవేత్తలే. IMF‌ తరచూ తన సిబ్బందిని అమెరికా ట్రెజరీ సిబ్బందితో మార్పిడి చేసుకుంటూ ఉండేది. 1946లో IMF‌ కార్యకలాపాలు మొదలుపెట్టినప్పుడు అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌.ట్రూమన్‌ వైట్‌ను దేశ తొలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రకటించాడు. అప్పటికింకా డిప్యూటీ ఎండీ పోస్టు ఏర్పాటే కానందున వైటే కార్యనిర్వాహక ఎండీగా కూడా పని చేసేవాడు. తద్వారా తొలి ఏడాది మొత్తం IMF పై ఆయన అత్యంత విశేషాధికారాలు, ఆధిపత్యం చెలాయించేవాడు.

అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు[మార్చు]

ప్రధాన వ్యాసం: International Bank for Reconstruction and Development

బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం అంతర్జాతీయ రిజర్వుల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదననూ పెట్టలేదు. కొత్తగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తే చాలని భావించింది. నిర్మాణపరమైన అసమతుల్యత ఏర్పడే సమయంలో దేశాలు వాటికవే పరిష్కారాలు వెతుక్కుంటాయని తలపోసింది. ఉదాహరణకు తమ కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు, పెంపు వంటి వాటి ద్వారా, లేదంటే తమ పోటీమయ స్థానాల ఆధారంగా వెతికేవి. ఆ పరిస్థితుల్లో IMF‌ వద్ద కూడా అలాంటి జాతీయ స్థాయి మార్గాలను ప్రోత్సహించేందుకు పెద్దగా సావకాశాలు లేకుండా పోయాయి.

రెండో ప్రపంచ యుద్ధం అంనతరం పూర్వపు సాధారణ పరిస్థితికి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే కొత్త వ్యవస్థ పని చేయడం సాధ్యమని 1944లో అంతా గుర్తించారు. ఐదేళ్ల స్వల్ప సంధికాలం అనంతరం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, వ్యవస్థ కార్యకలాపాలు మొదలు పెడుతుందని భావించారు.

ప్రపంచ వర్తక వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు యుద్ధానంతరం ఐరోపా‌ పునర్నిర్మాణానికి నిధులందించేందుకు బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పంద రూపకర్తలు మరో సంస్థ ఏర్పాటుకు తెర తీశారు. అదే అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు (IBRD). ఇప్పుడిది ప్రపంచ బ్యాంక్‌ సమూహంలో అత్యంత ముఖ్యమైన సంస్థగా విలసిల్లుతోంది. దీనికి 1,000 కోట్ల డాలర్ల అధీకృత మూలధనీకరణ ఉండేది. స్వీయ నిధుల నుంచి రుణాలివ్వడం, ప్రైవేట్‌ లోన్లను అండర్‌రైట్‌ చేయడం, సెక్యూరిటీల జారీ ద్వారా కొత్త నిధులు సేకరించడం, తద్వారా యుద్ధానంతరం రికవరీని వీలైనంతగా వేగవంతం చేయడం దాని బాధ్యతలుగా భావించారు. ఆర్థికాభివృద్ధి వంటి లక్ష్యాల సాధనకు రుణాలిచ్చేలా ఐక్యరాజ్యసమితికి చెందిన పత్యేక సంస్థగా IBRD రూపొందాలని భావించారు.

పునః‌ సర్దుబాటు[మార్చు]

డాలర్‌ కొరత, మార్షల్‌ ప్రణాళిక[మార్చు]

బ్రెటన్‌వుడ్స్‌ ఒప్పందాలు దాదాపుగా మొత్తం సభ్య దేశాల అనుమతిని, ఆమోదాన్ని పొందాయి. IMF‌ రుణాల సాయంతో జాతీయ విత్త నిల్వలు చెల్లింపుల బ్యాలెన్సుల్లోని తాత్కాలిక అసమతుల్యతలను సరి చేసుకుంటాయని భావించారు. కానీ ఐరోపా‌ను డోలాయమాన పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు అది సరిపోదని రుజువైంది.

యుద్ధానంతర ప్రపంచ పెట్టుబడిదారీ విధానం భారీ డాలర్‌ కొరతతో సతమతమైంది. అమెరికా భారీ వర్తక మిగులు నిల్వలను కొనసాగిస్తూ వచ్చింది. తద్వారా ఆ దేశ నిల్వలు భారీగా ఉండి, మరింతగా పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రవాహాన్ని తారుమారు చేయడం తప్పనిసరిగా మారింది. డాలర్లు అమెరికాను వదిలి, అంతర్జాతీయ వాడకానికి అందుబాటులో ఉండాల్సిన అవసరం తలెత్తింది. మరోలా చెప్పాలంటే, అమెరికా సహజ ఆర్థిక విధానాలను తారుమారు చేసి, తద్వారా స్వీయ చెల్లింపుల సమతుల్యతను లోటులోకి నెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

పశ్చిమ ఐరోపా‌ ఎదుర్కొంటున్న భారీ చెల్లింపుల నిల్వల అసమతుల్యతలను సరి చేసుకోవడానికి IMF‌ రుణ సౌకర్యం ఏ మాత్రమూ సరిపోకపోవడం మొదలైంది. IMF‌ కేవలం ప్రస్తుత ఖాతాల లోటుకే తప్ప పెట్టుబడి, పునర్నిర్మాణ ప్రక్రియలకు రుణాలివ్వజాలదని, బ్రెట్టన్‌వుడ్స్‌ అధికరణల ఒప్పందం అందుకు అంగీకరించదని సంస్థ గవర్నర్ల బోర్డు స్పష్టంగా ప్రకటించడంతో సమస్య మరీ విషమించింది. అప్పటికి IBRD వద్ద కేవలం అమెరికా తన వాటాగా చెల్లించిన 57 కోట్ల డాలర్ల నిధి మాత్రమే రుణాలిచ్చేందుకు అందుబాటులో ఉంది. దానికి అదనంగా IBRDకి బాండ్లు జారీ చేసేందుకు కేవలం సంప్రదాయ వాల్‌స్ట్రీట్‌ బ్యాంకింగ్‌ మార్కెట్‌ మాత్రమే అందుబాటులో ఉండటంతో అది విధిలేని పరిస్థితుల్లో సంప్రదాయిక రుణ జారీ విధానాన్ని అనుసరించాల్సి వచ్చింది. ఈ సమస్యల కారణంగా 1947 కల్లా IMF‌, IBRD రెండూ తాము అంతర్జాతీయ విత్త వ్యవస్థ తాలూకు ఆర్థిక సమస్యలను పరిష్కరించ లేకపోతున్నామంటూ చేతులెత్తేశాయి.[8]

ఈ నేపథ్యంలో అమెరికా ఐరోపా‌ రికవరీ కార్యక్రమాన్ని (మార్షల్‌ ప్లాన్‌) మొదలు పెట్టింది. తద్వారా ఐరోపా‌ పునర్నిర్మాణానికి దీర్ఘ మొత్తంలో ఆర్థిక, విత్తపరమైన సాయం అందించడానికి పూనుకుంది. ఇందులో అధిక భాగం గ్రాంట్లు, రుణాల రూపంలో ఇవ్వజూపింది. సోవియట్‌ బ్లాక్‌కు చెందిన పోలండ్‌ వంటి దేశాలు కూడా ఈ పథకంలో భాగాలుగానే ఉన్నాయి. 1947 జూన్‌ 5న హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో అమెరికా రక్షణ మంత్రి జార్డ్‌ మార్షల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.

The breakdown of the business structure of Europe during the war was complete. …Europe's requirements for the next three or four years of foreign food and other essential products… principally from the United States… are so much greater than her present ability to pay that she must have substantial help or face economic, social and political deterioration of a very grave character.

1947 నుంచి 1958 దాకా అమెరికా కావాలనే డాలర్లను దేశం బయటకి గుమ్మరించే విధానాన్ని ప్రోత్సహించింది. ఆ తర్వాత 1950 నుంచి చెల్లింపుల లోటుతో బండి నడిపింది. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు లిక్విడిటీని ఆపాదించేందుకు ప్రయత్నించింది. అమెరికా అందించిన పలు సహాయ కార్యక్రమాల ద్వారా డాలర్లు విదేశాలకు వరదలుగా పారాయి. అమెరికా అనుకూల గ్రీస్‌, టర్కీలకు ట్రూమన్‌ సిద్ధాంతం ఆధారంగా సాయం బహూరూపాలుగా వచ్చి పడింది. ఆ రెండు దేశాలూ అంతర్గత కమ్యూనిస్టు విప్లవాన్ని అణచేసేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. వాటితో పాటు పలు అమెరికా అనుకూల మూడో ప్రపంచ దేశాలకు కూడా సాయం అందించే ప్రక్రియను, వాటి అన్నింటి కంటే ముఖ్యంగా, మార్షల్‌ ప్రణాళిక అమలును అగ్రరాజ్యం మొదలు పెట్టింది. ప్రకారం 1948 నుంచి 1954 మధ్య ఏకంగా 16 పశ్చిమ ఐరోపా‌ దేశాలకు అమెరికా 1,700 కోట్ల డాలర్ల గ్రాంట్లు మంజూరు చేసింది.

దీర్ఘకాలిక సర్దుబాట్లను ప్రోత్సహించేందుకు ఐరోపా‌, జపాన్‌ మధ్య వర్తక పోటీని కూడా అమెరికా బాగా ఎగదోసింది. ఓటమి పాలైన అక్ష రాజ్యాల పై ఆర్థిక నియంత్రణలను కూడా రద్దు చేశారు. ఐరోపా‌, జపాన్‌ దేశాలకు ఉత్పాదకతలను పునర్నిర్మించుకునేందుకు, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సాయం ఇవ్వడం మొదలైంది. దీర్ఘకాలంలో ఐరోపా‌, జపాన్‌ రికవరీ ఆ మార్కెట్లను అమెరికా ఎగుమతుల వృద్ధికి సాయపడటం ద్వారా అగ్రరాజ్యానికే సాయపడుతుందని భావించారు. దాంతోపాటు అమెరికా మూలధన విస్తరణకు కూడా వీలవుతుందని భావించారు.

1956లో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ఆర్థిక సహకారాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత 1960లో అంతర్జాతీయ అభివృద్ధి సంఘం (IDA) ను ఏర్పాటు చేసింది. ఈ రెండూ ఇవి రెండూ వివాదాస్పదాలుగానే నిలిచాయి. ఐరాస నేతృత్వంలోని మరింత దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏర్పాటైన సంస్థను కూలదోసేందుకే IDAను ఏర్పాటు చేశారని దాని విమర్శకులు ఆరోపిస్తారు. పైగా కార్యక్రమం తాలూకు భావశీతలను పరిగణనలోకే తీసుకోకుండా IDA రుణాలిస్తుందని వారు దుమ్మెత్తిపోశారు. దాంతోపాటు వర్ధమాన దేశాల పై తమ ఆర్థిక వ్యవస్థలను తెరిచి ఉంచుకోవాలన్న ఒత్తిడి కాస్తా అవి సాదాసీదా సంస్థల నుంచి రుణాలు స్వీకరించేందుకు దారి తీస్తోందని విశ్లేషించారు. ఇది విదేశీ పెట్టుబడిదారుల ఆస్తుల కొనుగోలు, స్థానికుల పెట్టుబడుల ప్రవాహాల చక్రాన్ని కొనసాగేలా చేసేందుకే సాయపడుతుందని కూడా వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు వ్యవసాయ కార్యక్రమాలకు భారీ రుణాలివ్వగల IDA సామర్థ్యాన్ని దాని మద్దతుదారులు ప్రచారం చేశారు. 1960ల నాటి హరిత విప్లవాలకు అదే దోహదపడిందని వారన్నారు. ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరించడంతో పాటు మూడో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాలకు తరచూ సబ్సిడీలు ఇవ్వడం కూడా దాని ముఖ్య విధి అని గుర్తు చేశారు.

ఆ తర్వాత ఒక త్రిముఖ వర్తక వ్యవస్థను ఏర్పాటు చేసింది. వర్ధమాన దేశాలతో అత్యధిక లాభాలకు వర్తకం సాధించేలా పరివర్తనీయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంలో అమెరికాకు అది సాయపడింది. తద్వారా ముడి పదార్థాలను బాగా సేకరించి తన పరిశ్రమను అది పెంచుకోగలిగింది. ఈ మిగులును ఐరోపా‌కు డాలర్లను పంపిణీ చేసేందుకు అమెరికా వాడుకుంటుందన్నమాట. తద్వారా ఐరోపా‌ దేశాలు తమను తాము పునర్నిర్మించుకుంటాయి. ఇతర పారిశ్రామిక దేశాలు మూడో ప్రపంచ దేశాల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశమిస్తుంది. ఇదంతా కలిపి అమెరికాను ఇతర దేశాలకు స్థిరత్వానికి హామీ ఇచ్చే దేశంగా మార్చేసింది. ఈ త్రికోణం స్థిరపడ్డ తర్వాత బ్రెట్టన్ఉడ్స్‌ ఒప్పందానికి కష్టకాలం మొదలైంది. అంతిమంగా అది కుప్పకూలేందుకు ఆ పరిస్థితులు దారితీశాయి.

ప్రచ్ఛన్న యుద్ధం[మార్చు]

రూజ్‌వెల్ట్‌, చర్చిల్‌ జోసెఫ్‌ స్టాలిన్‌తో కలిసి 1945లో యెల్టాలో జరిపిన చర్చల ద్వారా యుద్ధానంతర శకానికి మార్గనిర్దేశనం చేశారు. తమ తమ ప్రభావిత ప్రాంతాలు, రంగాల గురించి అందులో వారు కూలంకషంగా చర్చించారు. అదే ఏడాది జర్మనీ నాలుగు ఆక్రమిత ప్రాంతాలుగా (సోవియట్‌, అమెరికన్‌, బ్రిటిష్‌, ఫ్రెంచి) ముక్కలైంది.

1944లో బ్రెట్టన్‌వుడ్స్‌ సదస్సులో పాల్గనేలా సోవియట్‌ యూనియన్‌ను ఒప్పించడంలో హ్యారీ డిక్స్టన్‌ వైట్‌ విజయం సాధించాడు. కానీ IMF‌లో చేరేందుకు సోవియట్‌ తిరస్కరించడంతో ఆయన లక్ష్యాలకు కాస్త విఘాతం ఏర్పడింది. 1945 డిసెంబరులో ఏర్పడ్డ IMF‌ ఏర్పాటు అధికరణలకు సోవియట్‌ ఎందుకు అంగీకరించలేదన్నది గతంలో చాలాకాలం పాటు చర్చనీయాంశంగా ఉండేది. కానీ ఇటీవల సోవియట్‌ విడుదల చేసిన పత్రాలతో ఆ విషయంలో అస్పష్టత తొలగి వాస్తవం బయటికి వచ్చింది. బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందానికి ఆమోదం తెలిపిన సభ్య దేశాల ప్రవర్తన ఆధారంగా సోవియట్‌ ఆ నిర్ణయం తీసుకుందని స్పష్టమైంది. ఒప్పందానికి తక్షణం అంగీకారం లభించిన తీరు పట్ల అటు అమెరికాలోనూ, ఇటు బ్రిటన్‌లోనూ జరిగిన చర్చలను యుద్ధ సమయంలో ఏర్పాటైన మిత్ర రాజ్యాల కూటమి శరవేగంగా విచ్ఛిన్నమైందనేందుకు సూచికలుగా మాస్కో పరిగణించింది.

రెండో ప్రపంచ యుద్ధం ఫలితంగా బలం, భౌగోళిక పరిమాణం మరింతగా పెరిగిన సోవియట్‌ యూనియన్‌ను ఎదుర్కొనేందుకు పెట్టుబడిదారీ శిబిరానికి నేతృత్వం వహించేందుకు అమెరికా సిద్ధమైంది. యుద్ధానంతరం ప్రపంచంలో అతి పెద్ద పారిశ్రామిక, విత్త, సైనిక శక్తిగా అమెరికా ఎదుగుదలకు ఆ దేశంపై యుద్ధం ఛాయలు అసలే పడకపోవడం బాగా లాభించింది. యుద్ధానంతరం ఐరోపా‌లోని పలు దేశాల్లో పెరిగిపోయిన అస్థిరత, సోవియట్‌, ఐరోపా‌ ఆర్థిక వ్యవస్థలపై యుద్ధం చూపిన పెను దుష్ప్రభావం కూడా ఇందుకు కారణాలుగా నిలిచాయి.

ఈ విధానం ద్వారా ప్రయోగించిన ఆర్థిక విధానాల తర్వాత కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు కేంద్రంగా ఉండటం వల్ల అమెరికా తన విదేశీ విధాన లక్ష్యాలను సాధించేందుకు నిర్నిరోధమైన స్వేచ్ఛను అనుభవించసాగింది. సైన్యాలను విదేశాల్లో నిలిపి ఉంచేందుకు, దేశం వెలుపల పెట్టుబడులు పెట్టేందుకు వర్తక మిగులు బాగా దోహదపడింది. విదేశాల్లో సైనిక నిల్వలుంచడం ఇతర దేశాలకు సాధ్యపడకపోవడంతో ప్రపంచ సంక్షోభాల్లో ఎందుకు, ఎప్పుడు, ఎలా జోక్యం చేసుకోవాలన్న అంశాలను అమెరికాయే నిర్ణయించగల స్థాయికి ఎదిగింది. ప్రపంచ ఆర్థికారోగ్యాన్ని నిర్దేశించే సూచీగా డాలర్‌ హవా కొనసాగుతూనే వచ్చింది. అమెరికాకు ఎగుమతులను వీలైనంతగా పెంచుకోవడమే ప్రపంచవ్యాప్తంగా సంపన్న, వర్ధమాన దేశాల ఆర్థిక విధానాల ఏకైక లక్ష్యంగా మారిపోయింది. దీన్నే పాక్స్‌ రోమనా, అనంతరం 19వ శతాబ్ది నాటి పాక్స్‌ బ్రిటానికా ల తర్వాత పాక్స్‌ అమెరికానాగా అంతా పేర్కొంటూ వచ్చారు. (ప్రపంచీకరణను చూడండి )

తర్వాతి కాలంలో బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ[మార్చు]

US‌ చెల్లింపుల బ్యాలెన్స్‌ సంక్షోభం[మార్చు]

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా 2,600 కోట్ల డాలర్ల విలువైన బంగారు నిల్వలను కొనసాగించింది. దేశంలో ఉన్నాయని అంచనా వేసిన 4,000 కోట్ల డాలర్ల నిల్వల్లో ఇది దాదాపు 60 శాతం. 1950ల్లో ప్రపంచ వర్తకం శరవేగంగా విస్తరించినా బంగారు నిల్వల బేస్ మాత్రం కొద్ది శాతమే పెరిగింది. 1950లో అమెరికా చెల్లింపుల బ్యాలెన్సులు ప్రతికూలంగా మారడం మొదలైంది. ఈ సంక్షోభానికి అమెరికా తొలి స్పందన 1950ల చివర్లో మొదలైంది. చమురు పై ప్రధానమైన కోటాలను, ఇతర వర్తక ప్రవాహాల పై నియంత్రణలను నాటి ఐసెన్ హూవర్‌ యంత్రాంగం విధించింది. మరిన్ని తీవ్ర నిర్ణయాలను కూడా ప్రతిపాదించారు గానీ అమలు చేయలేదు. కానీ 1958లో మొదలైన మాంద్యం నానాటికీ విస్తరించే సూచనలు కన్పించడంతో ఈ మాత్రం స్పందన అస్సలు చాలలేదు. 1960ల్లో కెన్నెడీ ఎన్నికైన తర్వాత ఔన్సు బంగారానికి 35 డాలర్లుగా నిర్ణయించిన బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థను కొనసాగించేందుకు దశాబ్ది పాటు సాగిన ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఆధార కరెన్సీ అయిన అమెరికా డాలర్‌ పై సభ్య దేశాలన్నీ కేవలం బంగారం పరివర్తనీయతను మాత్రమే అమలు చేసేలా బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం నిర్మాణం జరిగింది. కానీ కావాల్సింది బంగారం పరివర్తనీయత అమలు కాదు. కానీ దాన్ని అనుమతించారు. దేశాలు డాలర్లను బంగారంగా మార్చడానికి బదులు డాలర్లనే కొనసాగిన్చాసాగాయి. ఎందుకంటే పూర్తి పరివర్తనీయతకు బదులుగా అది అమ్మకాలకు కేంద్ర బ్యాంకుల మధ్య స్థిరమైన ధరను మాత్రమే ఏర్పాటు చేసింది. బహిరంగ బంగారం‌ మార్కెట్‌ అప్పటికింకా అమల్లోనే ఉంది. బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం ఇంకా పని చేసేందుకు వీలుగా అయితే డాలర్‌ పెగ్‌ను బంగారంగా మార్చడం గానీ, లేదంటే బంగారానికి ఔన్సుకు 35 డాలర్ల అధికారిక స్వేచ్ఛాయుత మార్కెట్‌ ధరను కొనసాగించడం గానీ చేయల్సి వచ్చేది. స్వేచ్ఛాయుత బంగారం మార్కెట్‌లో బంగారం ధరలు, కేంద్ర బ్యాంకుల బంగారం ధరల మధ్య అంతరం ఎంత పెరిగితే బ్రెట్టన్‌వుడ్స్‌ ధర వద్ద బంగారాన్ని అమ్మడం ద్వారా అంతర్గత ఆర్థిక లోటుపాట్లను వీలైనంతగా సర్దుబాటు చేసుకోవాలన్న ఆశలు కూడా దేశాలకు అంతగా పెరిగిపోయేవి.

బంగారం కంటే డాలర్లను నిల్వగా ఉంచుకోవడం తెలివైన పని అని రాబర్ట్‌ ట్రిఫిన్‌ 1960లో గమనించాడు. ఎందుకంటే వ్యవస్థను లిక్విడ్‌గా ఉంచడంతో పాటు ఆర్థిక వృద్ధిని వీలైనంతగా పెంచుకునేందుకు అమెరికా చెల్లింపుల బ్యాలెన్సు లోటు బాగా దోహదపడుతుంది. దీన్నే అనంతర కాలంలో ట్రిఫిన్‌ డైలమాగా పిలవడం మొదలైంది. అమెరికా తన వ్యవస్థను లోటులో నడపడంలో విపలమైందని, ఆ దేశ లిక్విడిటీ ప్రపంచ ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు ఎంత మాత్రమూ ఇక చాలదని ఆయన బాహాటంగానే అంచనా వేశాడు. తద్వారా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని కూడా హెచ్చరించాడు. అదే సమయంలో ఇలా చెల్లింపుల లోటును పెంచుకుంటూ పోవడం వల్ల రిజర్వు కరెన్సీయే అస్థిరతను పెంచినందున అంతిమంగా డాలర్‌ పై విశ్వసనీయత బాగా తగ్గిపోవడమే జరుగుతుంది.[9]

1961 నవంబర్‌ 1న 8 దేశాల మధ్య లండన్‌ బంగారం నిల్వ ఏర్పాటు ఈ దిశగా సాగిన మొదటి ప్రయత్నం. లండన్‌లో ఉదయాన్నే నిర్ణయించే బంగారం ధర (మార్నింగ్ గోల్డ్ ఫిక్స్) ఆధారంగా బహిరంగ మార్కెట్లో బంగారాన్ని విక్రయించి స్వేచ్ఛాయుత మార్కెట్‌ ధరల చక్రాన్ని నియంత్రించవచ్చని, మార్కెట్లో బంగారం ధర తగ్గే సమయాల్లో తిరిగి కొనుగోలు చేయడం ద్వారా లోటును కూడా పూడ్చుకోవచ్చన్నది ఈ నిల్వ వెనక దాగున్న సిద్ధాంతం. దానికి స్పందనగా క్యూబా క్షిపణుల సంక్షోభం, అలాంటి ఇతర చిన్న సంఘటనల కారణంగా బంగారం ధర అంతర్జాతీయ మార్కెటోల ఔన్సుకు 40 డాలర్లకు పెరిగిపోయింది. ఉత్పాదక సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు కెన్నెడీ యంత్రాంగం పన్నుల విధానంలో సమూల మార్పులకు తెర తీసింది. ఆ విధంగా ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించింది. ఇది చివరికి 1963లో పన్నుల కోత కార్యక్రమానికి దారి తీసింది. తద్వారా పెగ్‌ రేటును ఔన్సు బంగారానికి 35 డాలర్లుగా కొనసాగించే ప్రయత్నం జరిగింది.

1967లో పౌండ్‌ పై దాడి జరిగింది. స్టెర్లింగ్‌ ఏరియాలో బంగారం కోసం పోటీ 'రన్‌ ఆన్‌ గోల్డ్‌' మొదలైంది. 1967 నవంబర్‌ 18న బ్రిటిష్‌ ప్రభుత్వ విధిలేని పరిస్థితుల్లో పౌండ్‌ విలువను తగ్గించాల్సి వచ్చింది.[10] అప్పుడు అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బైన్స్‌ జాన్సన్‌ ముందు రెండే రెండు కఠినమైన అవకాశాలున్నాయి. ఒకటి పర్యాటక పన్నులు, ఎగుమతి సబ్సిడీలు, బడ్జెట్‌ వంటి వాటిలో కోత వేయడం ద్వారా రక్షణాత్మకమైన చర్యలు చేపట్టడం. రెండు 'రన్‌ ఆన్‌ గోల్డ్‌' ప్రమాదాన్ని అంగీకరించడం. జాన్‌ మాటల్లోనే చెప్పాలంటే, ప్రస్తుత వ్యవస్థను పని చేయించేందుకు అందుబాటులో ఉన్న బంగారు నిల్వలు ఏ మాత్రమూ సరిపోవు. మరీ ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యాన్ని, దాని వృద్ధినీ కొనసాగించేందుకు అంతర్జాతీయ లిక్విడిటీని యథాతథంగా ఉంచేందుకు డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీగా ఉండటం చాలా ముఖ్యం.[11] అమెరికా ప్రాథమ్యాలు సరైనవేనని జాన్సన్‌ పూర్తిగా విశ్వసించాడు. పశ్చిమ కూటమిలో అంతర్గతంగా కొన్ని ఒత్తిళ్లున్నప్పటికీ బహిరంగ వర్తక విధానం నుంచి తొలగిపోవడం ఆర్థికంగా, రాజకీయంగా తెచ్చిపెట్టగల లాభాల కంటే దానికి చెల్లించాల్సిన మూల్యమే ఎక్కవని భావించాడు. ప్రపంచ నేతగా రాజకీయ, సైనిక రంగంపై మన పాత్రలు ఒకవైపు, ప్రస్తుత విత్త వ్యవస్థలో భాగంగా ఆర్థిక ఇబ్బందికర పరిస్థితి విషయంలో చేపడుతున్న కరెక్షన్స్‌ మరోవైపు కలగలిసి మన మిత్రులకు ఆర్థికంగా అసాధ్యమైన పరిస్థితికి దారి తీస్తాయి అన్నాడు.[ఆధారం కోరబడింది]

పశ్చిమ జర్మనీ అమెరికా నుంచి బంగారం కొనుగోలు చేయకుండా ఉండేందుకు అంగీకరించింది. అందుకు బదులుగా డాలర్లను అట్టిపెట్టుకునేందుకు ఒప్పుకుంది. ఫలితంగా డాలర్‌పైనా, పౌండ్‌, స్టెర్లింగ్‌లపైనా ఒత్తిళ్లు యథాతథంగా కొనసాగాయి. 1968 జనవరిలో బంగారం ప్రవాహాలను అరికట్టేందుకు, ఎగుమతులను పెంచుకునేందుకు వరుస పెట్టి కొన్ని విధానాలను ప్రకటిస్తూ పోయాడు. అవి పెద్దగా విజయవంతం కాలేదు. అయితే 1968 మార్చి మధ్యలో రన్‌ ఆన్‌ గోల్డ్‌ సంభవించింది. దాంతో లండన్‌ బంగారు నిల్వ రద్దయింది. దాంతోపాటు ప్రస్తుత వ్యవస్థను కాపాడేందుకు, లేదంటే సంస్కరించేందుకు లెక్కలేనన్ని సమావేశాలు జరిగాయి.[12] కానీ విదేశీ స్థావరాల విషయంలో, ముఖ్యంగా పశ్చిమ యూరప్‌ విషయంలో అమెరికా పట్టుదలలు కొనసాగినంత కాలం గోల్డ్‌ పెగ్‌ను కొనసాగించేందుకు అవకాశాలు దాదాపుగా అందుబాటులో లేవనే చెప్పాలి.[ఆధారం కోరబడింది][original research?]

పెగ్‌ను కొనసాగించేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలూ 1968 నవంబర్‌లో విఫలమయ్యాయి. దాంతో బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థను బంగారం పెగ్‌ను చలనత్మకంగా మార్చే అమలు యంత్రాంగంగా మార్చేందుకు సరికొత్త విధాన ప్రయత్నాలు జరిగాయి. దాన్ని ఫియట్‌ విధానం ద్వారా గానీ, లేదా విదేశీ ఖాతాలను గౌరవించడంలో పరిమితులు విధించడం ద్వారా గానీ దీన్ని సాధించేందుకు ప్రయత్నించారు. బంగారు నిల్వ పతనం, ప్రైవేట్‌ సంస్థలతో బంగారంతో వర్తకం చేసేందుకు బంగారు నిల్వ సభ్యుల నిరాకరణల ఫలితంగా 1968 మార్చి 18 అమెరికా కాంగ్రెస్‌ డాలర్[13]‌కు 25 శాతం బంగారం దన్నును పునరావృతం చేసింది. దాంతోపాటే ప్రైవేట్‌ మార్కెట్ల[14] లో ట్రేడింగ్‌ చేసే ప్రభుత్వాలకు బంగారం అమ్మకాలను నిలిపేస్తామని అమెరికా ప్రతినబూనింది. ఎందుకంటే ఆ చర్యలు అంతర్జాతీయ బంగారం వర్తకంలో ప్రైవేట్‌ మార్కెట్ల విస్తరణకు దారి తీస్తున్నాయి. అందులో బంగారం ధరలు అధికారిక డాలర్‌ ధర కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి.[15] [16] కొన్ని దేశాల, ముఖ్యంగా ఫ్రాన్సు చర్యల ఫలితంగా అమెరికా బంగారు నిల్వలు నానాటికీ తగ్గుతూ పోయాయి. ఆ దేశాలేమో బంగారు నిల్వలను పెంచుకుంటూ పోయాయి.[16]

అంతర్జాతీయ విత్త నిర్వహణ క్షీణతకు దారి తీసిన నిర్మాణపరమైన మార్పులు[మార్చు]

పరివర్తనీయత పునరాగమనం[మార్చు]

1960లు, 70ల్లో చోటుచేసుకున్న ప్రధానమైన నిర్మాణపరమైన మరాఉ్పలు అంతిమంగా అంతర్జాతీయ విత్తన నిర్వహణ విధానం పతనానికి దారి తీశాయి. హెచ్చు స్థాయి విత్తపరమైన పరస్పరాధార వైఖరి వాటిలో ఒకటి. 1958లో పశ్చిమ యూరప్‌ దేశాల కరెన్సీ, 1964లో జపాన్‌ యెన్‌ల పరివర్తనీయత తిరిగి రావడం కాస్తా విత్తపరమైన పరస్పరాధార విధానానికి రంగం సిద్ధం చేసింది. అంతర్గత ఆర్థిక వ్యవహారాల విస్తృత వ్యాప్తికి పరివర్తనీయత దోహదపడింది. అది కాస్తా విత్తపరమైన పరస్పరాధారనీతయను మరింతగా పెంచింది.

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ల వృద్ధి[మార్చు]

బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతర్జాతీయీకరణ తాలూకు మరో పార్శ్వంగా అంతర్జాతీ బ్యాంకింగ్‌ కన్సార్టియం ఆవిర్భావం నిలిచింది. 1964 నుంచీ పలు బ్యాంకులు అంతర్జాతీయ సిండికేట్లను ఏర్పాటు చేయడం మొదలు పెట్టాయి. 1971 నాటికి ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో మూడొంతులకు పైగా బ్యాంకులు సిండికేట్లలో వాటాదారులుగా మారిపోయాయి. బహూళజాతి బ్యాంకులు భారీ మొత్తం పెట్టుబడుల్లో అంతర్జాతీయ బదిలీలు చయగలవు. అలా చేశాయి కూడా. పెట్టుబడి అవసరాలకు మాత్రమే కాకుండా మారకపు రేట్ల మార్పుచేర్పుల పై హెడ్జింగ్ స్పెక్యులేషన్ల కోసం కూడా ఈ చర్యలకు బ్యాంకులు పాల్పడ్డాయి.

ఈ కొత్త తరహా విత్తపరమైన పరస్పరాధారనీయత కాస్తా వీలైనంత గరిష్ట స్థాయిలో పెట్టుబడుల ప్రవాహాలకు వీలు కల్పించింది. బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ కాలంలో దేశాలు తమ మారకపు రేట్లలో మార్పుచేర్పు చేసుకునేందుకు అంతగా మొగ్గు చూపేవి కాదు. నిర్మాణపరమైన అసమతుల్యత చోటుచేసుకున్నప్పుడు కూడా అందుకు పెద్దగా ప్రయత్నించేవి కాదు. ఎందుకంటే అలాంటి మార్పులు దేశీయంగా కొన్ని ఆర్థిక సమూహాల పై పెను ప్రభావం చూపేవి. కాబట్టి దీన్ని రాజకీయ నాయకుల రాజకీయపరమైన రిస్కుగా అప్పట్లో అంతా పరిగణించేవారు. ఫలితంగా అధికారిక మారకపు రేట్లు చాలాసార్లు అవిశ్వసనీయమైనవిగానే ఉండేవి. తద్వారా స్పెక్యులేటర్లకు నష్టభయం ఏ మాత్రమూ లేని మార్కెట్లు అందుబాటులో ఉండేవి. ఆ పరిస్థితుల్లో వాళ్లు బలహీనమైన కరెన్సీ నుంచి బలమైన కరెన్సీకి ఇట్టే మారిపోయేవారు. తద్వారా రీ వాల్యుయేషన్‌ వచ్చిన సందర్భాల్లో లాభాలు సంపాదించేందుకు ప్రయత్నించేవారు. ఒకవేళ విత్త వర్గాలు రీ వాల్యుయేషన్‌ చోటుచేసుకోవడాన్ని నివారించే సందర్భాల్లో కూడా వారు ఎలాంటి నష్టమూ లేకుండా తమ కరెన్సీ విలువను తిరిగి చేరుకునేవారు. ఇలా రిస్కు లేని స్పెక్యులేషన్‌, అపారమైన నిల్వల లభ్యత భారీగా అస్థిరతలకు దారితీసేది.

క్షీణత[మార్చు]

అమెరికా విత్తపరమైన ప్రభావం[మార్చు]

విత్తపరమైన నిర్వహణను పలుచన పరిచిన రెండో నిర్మాణపరమైన మార్పు అమెరికా ఆధిపత్యానికి గండి పడటం. రెండు దశాబ్దాలకు పైగా సాగిన రీతిలో అమెరికా ఆర్థిక ఆధిపత్యం ప్రపంచం పై ఇంకెంత మాత్రమూ సాగడం లేదు. 1960ల మధ్య కాలానికల్లా ఈఈసీ, జపాన్‌ అంతర్జాతీయ ఆర్థిక శక్తులుగా తెర పైకి వచ్చాయి. వాటి మొత్తం నిల్వలు అమెరికా కంటే పెరిగిపోయి, వర్తకం, తలసరి ఆదాయం వంటివన్నీ అమెరికాను శరవేగంగా సమీపిస్తున్న కారణంగా యూరప్‌, జపాన్‌ రెండూ తమకు, అమెరికాకు మధ్య ఉన్న అంతరాన్ని బాగా తగ్గించేస్తూ వచ్చాయి.

ఆర్థిక అధికారపు బహూళత్వపు పంపకపు ధోరణి కాస్తా అమెరికా డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఉన్న విశిష్టమైన హెదా పట్ల సర్వత్రా అసంతృప్తికే దారి తీస్తూ వచ్చింది. ఫలితంగా ప్రపంచపు కేంద్ర బ్యాంకు హెదాలో అమెరికా తన లోటు ద్వారా అంతర్జాతీయ లిక్విడిటీని ఎప్పటికప్పుడు నిర్ణయించసాగింది. నానాటికీ పరస్పరాధారత పెరిగిపోతున్న ప్రపంచంలో అమెరికా విధానాలు యూరప్‌, జపాన్‌ దేశాల పై నానాటికీ చాలా ప్రభావం చూపడం మొదలైంది. దీనికి అదనంగా దేశాలు డాలర్లను అట్టిపెట్టుకునేందుకు ఇష్టంగా ఉన్నంతకాలం అమెరికా కూడా చెల్లింపుల బ్యాలెన్సుల అడ్డంకులకు అతీతంగా రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాలను ఖర్చు చేసుకోగలిగింది. సైనిక కార్యకలాపాలను, విదేశాలకు సాయాలను అందించగలిగింది.

డాలర్‌ వ్యవస్థలోని రాజకీయ స్థితిగతుల కారణంగా తలెత్తిన అసంతృప్తి అమెరికా, సోవియట్‌ యూనియన్ల మధ్య డిటెంట్‌ (అసంతృప్తి) వల్ల మరీ పెరిగిపోయింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విత్త వ్యవస్థ బలోపేతం కావడానికి సోవియట్‌ ప్రధాన కారణంగా నిలిచింది. అమెరికా రాజకీయ, రక్షణాత్మక ఛత్రఛాయ యూరప్‌, జపాన్‌ వంటి చోట్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యం కొనసాగేలా చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతాలు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా పూర్తిగా చితికిపోయి ఉన్నాయి. యూరప్‌ దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి, దాంతో పాటే వాటి వర్తక వృద్ధి నానాటికీ పెరిగిపోయాయి. మామూలు భద్రతపరమైన ఒత్తిళ్లు తొలగిన తర్వాత రక్షణపరమైన విషయాల్లో ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఆధారనీయత కూడా పెద్దగా వాటికి అవసరం లేకపోయింది. తత్ఫలితంగా ఆర్థిక ఒత్తిళ్లు మరోసారి తెర పైకి వచ్చాయి.

డాలర్‌[మార్చు]

అమెరికా అధికారాల తగ్గుదలను, ప్రస్తుత వ్యవస్థ పట్ల యూరప్‌, జపాన్‌లలో నెలకొన్న అసంతృప్తిని డాలర్‌ విలువ తగ్గుదల మరింతగా వేగవంతం చేసింది. 1945 అనంతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, వర్తక రీతులకు పునాదిగా నిలిచిన డాలర్‌ ప్రాభవం అలా తగ్గుముఖం పట్టడం మొదలైంది. వియత్నాం యుద్ధం, అందుకు మూల్యం చెల్లించుకోవడానికి అమెరికా యంత్రాంగం తిరస్కరణ, పన్ను విధానాల ద్వారా గొప్ప సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలకు చాలినన్ని నిధులు కేటాయించేందుకు అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బి.జాన్సన్‌ అట్టహాసంగా చేసిన ప్రయత్నాల వంటివన్నీ చివరికి డాలర్ల ప్రవాహాన్ని బాగా పెంచేశాయి. సైనిక అవసరాలకు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఇవి తప్పనిసరి అయ్యాయి. ఇది కాస్తా వర్తక స్థితిగతుల్లో అమెరికా సమతుల్యత పై బాగా ప్రభావం చూపింది.[ఆధారం కోరబడింది] 1960ల చివర్లో డలర్‌ దాని ప్రస్తుత వర్తక విలువ కన్నా ఎక్కువ స్థాయిలో కొనసాగింది. మరోవైపు డ్యుట్శే మార్క్‌, యెన్‌ తక్కువ విలువకు ట్రేడవసాగాయి. దాంతో సహజంగానే జర్మన్లు, జపనీయులకు తమ కరెన్సీని రీ వాల్యూ చేసే అవసరం గానీ, కోరిక గానీ లేకపోయాయి. దాంతో వారి ఎగుమతులు మరీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారలేదు. అదే సమయంలో అమెరికా మాత్రం డాలర్‌ డీ వాల్యుయేషన్‌ను పక్కన పెట్టడం ద్వారా తమ అంతర్జాతీయ విశ్వసనీయతను కాపాడుకునేందుకే ఆపసోపాలు పడింది.[17] ఇంకో వైపు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ల పుణ్యాన ప్రభుత్వ నిల్వల పై ఒత్తిడి మరీ పెరిగిపోయింది. తక్షణ లాభాల కోసం వాటి భారీ మిగులు పెట్టుబడుల నిల్వలు ప్రపంచమంతటా శరవేగంతో తిరగసాగాయి.[16]

దీనికి పూర్తి విరుద్ధంగా బ్రెట్టన్‌వుడ్స్‌ ఆవిర్భావం, ప్రపంచంలోని మొత్తం నిర్మాణ వస్తువుల్లో సగానికి పైగా అమెరికాలోనే తయారవుతుండటం, ప్రపంచ నిల్వల్లో సగానికి పైగా అమెరికా వద్దే ఉండటం వంటి కారణాలతో అంతర్జాతీయ నిర్వహణ, ప్రచ్ఛన్న యుద్ధం బాధ్యతలు రెండింటినీ అమెరికాయే తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణాలు, సాయాలు అందించేందుకు, సైనిక మోహరింపులకు, మిత్ర రాజ్యాల అవసరాలకు నిధులు అందించేందుకు చెల్లింపుల్లో లోటును 1950లలో అమెరికా విజయవంతంగా కొనసాగించగలిగింది. కానీ 1960ల్లో కథ మారింది. వాటన్నింటికీ అవుత్ను వ్యయాన్ని భరించడం అమెరికాకు కష్టసాధ్యంగా మారడం మొదలైంది. 1970ల కల్లా అమెరికా వద్ద ఉన్న అంతర్జాతీయ నిల్వలు 16 శాతానికి పడిపోయాయి. ఈ మారిన పరస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా తమను తాము సర్దుకోవడం అమెరికాకు తప్పనిసరిగా మారింది. స్థిర మారకపు రేట్లకు, కోరినప్పుడల్లా డాలర్లను బంగారంగా మారుస్తామన్న హామీని నిలబెట్టుకునేందకు అమెరికాకు ఇది తప్పలేదు.[ఆధారం కోరబడింది]

స్తంభించిన అంతర్జాతీయ విత్త నిర్వహణ[మార్చు]

చలన రేటు బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ 1968-72[మార్చు]

1968 నాటికల్లా ఐసన్‌హెవర్‌, కెనడీ, జాన్సన్‌ యంత్రాంగాలు అనుసరిస్తూ వచ్చిన ఔన్సు బంగారానికి 35 డాలర్ల స్థిర పెగ్‌ ఆచరణలో కష్టసాధ్యంగా మారుతూ వచ్చింది. అమెరికా నుంచి బంగారం ప్రవాహాలు నానాటికీ పెరిగిపోవడం మొదలైంది. బంగారాన్ని కొనసాగిస్తామని జర్మనీ, ఇతర దేశాల హామీలు ఇచ్చినా జాన్సన్‌ యంత్రాంగం విచ్చలవిడిగా నిధులు వెచ్చించిన తీరు పరిస్థితిని దిగజార్చింది. దాంతో 1940లు, 1950ల్లోని డాలర్ల కొరత కాస్తా 1960ల్లో డాలర్ల లోటు అగాథంగా మారిపోయింది. 1946లో ఏర్పాటు చేసిన ట్రెంచ్‌ డివిజన్‌ను మార్చేసేందుకు 1967లో రియోడిజనిరో భేటీలో IMF‌ అంగీకరించాల్సి వచ్చింది. అమెరికా డాలర్‌కు సమాన విలువతో కూడిన ప్రత్యేక డ్రాయింగ్‌ హక్కులను ఏర్పాటు చేశారు. కానీ అవి కార్యకలాపాలకు పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. కేవలం బ్యాంకులు, IMF‌ల మధ్య మాత్రమే వాటి వాడకం సాధ్యపడింది. దాంతో దేశాలకు తమ కేటాయింపులకు మూడు రెట్లు ఎక్కువగా స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (SDRs‌)ను అంగీకరించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా దీని పై వడ్డీ పడుతుంది. లేదంటే SDR హెల్డింగ్‌ను బట్టి ఆయా దేశాల ఖాతాకు జమవుతుంది. వాస్తవ వడ్డీ రేటు 1.5 శాతంగా కొనసాగింది.

దేశాలు పెగ్‌డ్‌ బంగారం కొనడాన్ని, హెచ్చు స్వేచ్ఛాయుత మార్కెట్‌ రేట్ల వద్ద అమ్మడానిన నిరోధించడమే SDR‌ వ్యవస్థ ఉద్దేశం. దాంతోపాటు ఆయా దేశాల ఖాతాకు వడ్డీని జమ చేయడం ద్వారా అవి డాలర్ల నిల్వను కొనసాగించేందుకు ఆసక్తి చూపేలా చేసేందుకు ఇది ప్రయత్నించింది. అదే సమయంలో ఆయా దేశాలు కొనసాగించగల డాలర్ల నిల్వ పై గరిష్ట పరిమితి కూడా విధించింది. అయితే ఇక్కడొక అనివార్యమైన సంఘర్షణ తలెత్తింది. పెట్టుబడిదారీ ప్రపంచపు సైనిక రక్షణదారుగా అమెరికా పాత్రను అంతా గుర్తించారు. కానీ దాని ప్రత్యేకమైన ద్రవ్యపరమైన విలువను మాత్రం ఎవరూ గుర్తించలేదు. దాంతో ఇతర దేశాలు అమెరికా డాలర్ల నిల్వను బాగా తగ్గించుకోవడం ద్వారా ఆ దేశ రక్షణ విధానాన్ని కొనుగోలు చేశాయి. అవి అమెరికా సైనిక విధానాన్ని సమర్ధించినంత కాలం మాత్రమే ఈ విధానాన్ని కొనసాగించేందుకు సుముఖత చూపాయి. వియత్నాం యుద్ధం, అర్థంపర్థం లేని విధానాల ఫలితంగా అమెరికా అనుకూల ఏకాభిప్రాయం నెమ్మదిగా కనుమరుగు కావడం మొదలైంది. SDR‌ ఒప్పందం ఈ సంబంధాల విలువను ద్రవ్యరూపంలోకి మార్చగలిగింది. కానీ దానికి మార్కెట్‌ను మాత్రం సృష్టించలేకపోయింది.

కాగితపు బంగారంగా SDRల పాత్ర అమెరికాకు బదులుగా IMF‌ను ప్రపంచపు కేంద్ర బ్యాంకుగా మార్చడం ద్వారా సమతుల వ్యవస్థను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కన్పించింది. విదేశీ పెట్టుబడులు, కరెన్సీలతో పాటు తప్పనిసరి పెట్టుబడి నియంత్రణల వంటి వాటన్నింటిపైనా అమెరికా 1968లో హెచ్చు నియంత్రణలను విధించింది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ చమురు దిగుమతుల పై కోటాను ఎత్తేశాడు. తద్వారా ఇంధన వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయన ప్రత్నించాడు. కానీ ఆ ప్రయోజనాన్ని నెరవేర్చకపోగా, ఈ చర్య డలర్ల ప్రవాహాన్ని విపరీతంగా పెంచేసి పెట్రో డాలర్ల పై ఒత్తిడిని తారస్థాయికి చేర్చింది. అప్పటికీ అమెరికా డాలర్‌ నిల్వల నుంచి తీసుకుంటూనే వెళ్లింది. 1971లో ఆ దేశం నిల్వల లోటు ఏకంగా 5,600 డాలర్లకు చేరింది. దాంతో పాటే బంగారేతర నిల్వలు కూడా దాదాపుగా తరిగిపోయాయి. విదేశీ మారక నిల్వలకు 22 శాతం మాత్రమే బంగారం గ్యారెంటీ అందుబాటులో ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే బంగారంతో పోలిస్తే డాలర్‌ అత్యధికంగా హెచ్చు విలువతో కొనసాగింది.

నిక్సన్‌ షాక్‌[మార్చు]

ప్రధాన వ్యాసం: Nixon Shock

1970ల తొలినాళ్లకల్లా వియత్నాం యుద్ధ ఫలితంగా అమెరికాలో ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. మొత్తం మీద అమెరికా వర్తక లోటులోనే కొనసాగింది. ఇందులో కీలక మలుపు 1970లో చోటుచేసుకుంది. ఆ సంవత్సరం అమెరికా బంగారు నిల్వలు 55 శాతం నుంచి 22 శాతానికి తరిగిపోయాయి. అమెరికా డాలర్‌ హెల్డర్లకు అమెరికా పై నమ్మకం బాగా తగ్గిపోయిందని, తత్ఫలితంగా వారు తమ బడ్జెట్‌, వర్తకాల్లో లోటు విధించుకున్నారని నియో క్లాసిక్ ఆర్థికవేత్తలు దీని పై వ్యాఖ్యానించారు.

1971లో అమెరికా డాలర్ల ముద్రణను మరింతగా వేగవంతం చేసింది. వాటిని విదేశాల్లోని తన సైనిక మోహరింపులు తదితర అవసరాల పై వెచ్చించసాగింది. దాంతో పాటు స్వీయ సైనిక, సామాజిక కార్యక్రమాలకు కూడా ఇలా అదనంగా ముద్రించిన డాలర్లను వినియోగించడం మొదలు పెట్టింది. ఫలితంగా 1971 తొలి ఆరు నెలల్లోనే అమెరికా ఏకంగా 2,200 కోట్ల డాలర్లను కోల్పోయింది. దీనికి స్పందనగా వేతనాలు, ధరలపై 90 రోజుల నియంత్రణను నిక్సన్‌ 1971 ఆగస్టు 15న ఏకపక్షంగా విధించాడు. దీంతోపాటు 10 శాతం దిగుమతి సర్‌చార్జి కూడా పడింది. వీటన్నింటికంటే ముఖ్యంగా గోల్డ్‌ విండోను మూసేశారు. తద్వారా బహిరంగ మార్కెట్లో కాకుండా ఇతర చోట్ల మాత్రమే డాలర్‌ను నేరుగా బంగారంతో మార్చుకునేందుకు వీలు ఏర్పడింది. అంతర్జాతీయ విత్త వ్యవస్థ సభ్య దేశాలనే కాకుండా స్వదేశంలోని ఆర్థిక శాఖను కూడా సంప్రదించకుండా నిక్సన్‌ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్నే నిక్సన్‌ షాక్‌ అంటారు.

సర్‌చార్జి విధింపును 1971 డిసెంబర్‌లోనే ఎత్తేశారు. పెద్ద కరెన్సీల రీ వాల్యుయేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి అంగీకరించిన మారకపు రేటులో 2.25 శాతం డీ వాల్యుయేషన్‌కు అంగీకారం కుదిరింది. కానీ మరింత ఫ్లెక్సిబుల్‌ అఫీషియల్‌ రేట్లను మాత్రం స్పెక్యులేటర్ల బారి నుంచి కాపాడటం అసాధ్యంగా మారింది. 1976 మార్చికల్లా పెద్ద కరెన్సీలన్నీ ఫ్లోటింగ్‌గానే మారాయి. అంటే వాటి మారకపు రేట్లు ఆయా ప్రభుత్వాలు తమ విత్త విధానాల నిర్వహణకు వాడే విధానాలకు వాటికి సంబంధమే లేకుండా పోయింది.

స్మిత్సోనియన్‌ ఒప్పందం[మార్చు]

ప్రధాన వ్యాసం: Smithsonian Agreement

ఆగస్టు 15 షాక్‌ తర్వాత కొత్త అంతర్జాతీయ విత్త నిర్వహణ వ్యవస్థ రూపకలపనకు అమెరికా యంత్రాంగం మరిన్ని చర్యలకు తెర తీసింది. 1971 పతనం సాగినంత కాలం గ్రూప్‌ 10 దేశాలు కొత్త బహూళ పక్ష విత్త విధానం ఏర్పాటుకు ద్వైపాక్షిక, బహూళ పక్ష ప్రయత్నాలు జోరుగా కొనసాగాయి.

1971 డిసెంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ 10 దేశాలు వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్‌ సంస్థలో సమావేశమై స్మిత్సోనియన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అది డాలర్‌ విలువను ఔన్సుకు 38 డాలర్లకు తగ్గించింది. దాంతో పాటు వర్తక బాండ్ల విలువను 2.25 మార్పుచేర్పులు చేసింది. కేవలం SDR‌ల సాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే సమతుల్యత సాధించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో దీని పై బాగా విమర్శలు చెలరేగాయి. పైగా నిర్మాణపరంగా చూసినా ఇది తాత్కాలిక ఒప్పందం మాత్రమే. అయినా అమెరికా ప్రభుత్వంలో క్రమశిక్షణను పెంచడంలో ఇది విపలమైంది. దాంతోపాటే సమకాలీన ఇతర ఆర్థిక సంస్థల విషయంలోనూ ఇదే జరిగింది. డాలర్‌ పై బంగారం రూపంలో ఒత్తిడి అలాగే కొనసాగింది.

ఫలితంగా బంగారం చలన ఆస్తిగా మారిపోయింది. 1971లో ఇది ఔన్సుకు ఏకంగా 44.2 డాలర్ల స్థాయికి పెరిగిపోయింది. 1972 నాటికి ఒక్కసారిగా ఔన్సుకు 70.3. డాలర్లుగా పెరిగింది. ఈ పెరుగుదల అలా సాగుతూనే పోయింది. 1972 నాటికల్లా కరెన్సీలన్నీ డాలర్‌కు ప్రతిగా ఈ డీవాల్యూడ్‌ పెగ్‌ను కూడా పరిహరించడం మొదలు పెట్టాయి. అయితే పారిశ్రామిక దేశాలన్నీ ఈ చర్య చేపట్టేందుకు ఒక దశాబ్ది కాలం పట్టింది. 1973 ఫిబ్రవరిలో బ్రెట్టన్‌వుడ్స్‌ కరెన్సీ మారక మార్కెట్లు మూతపడ్డాయి. చివరి ప్రయత్నం కూడా ముగిసిపోయిన తర్వాత డాలర్‌ విలువ ఔన్సు బంగారానికి 44 డాలర్ల స్థాయికి పడిపోయింది. అప్పుడు ఫ్లోటింగ్‌ కరెన్సీ వ్యవస్థలో ఆ మార్కెట్లు మళ్ళా తెరుచుకున్నాయి.

బ్రెట్టన్‌వుడ్స్‌ 2[మార్చు]

ప్రధాన వ్యాసం: Bretton Woods II

నేటి విత్త వ్యవస్థను బ్రెట్టన్‌వుడ్స్‌ 2గా డూలే, ఫోకెర్ట్స్‌ాలాండూ, గార్బర్‌ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం నాటి మాదిరిగానే నేటి ఆర్థిక వ్యవస్థ కూడా ఆధిపత్య అంతర్జాతీయ కరెన్సీ జారీ పద్ధతిపైనే, అది కూడా ఆ పరిధిలోనే ఆధారపడుతోందని వారు వాదించారు. ఈ పరిధి తక్కువగా విలువ కట్టిన మారకపు రేటు పై ఆధారపడ్డ ఎగుమతుల ఆధారిత వృద్ధికి దారితీసింది. 1960ల్లో ప్రధానాంశంగా అమెరికా, పరిధిగా ఐరోపా‌, జపాన్‌ నిలిచాయి. ఈ పాత పరిధి ఈ కాలం నాటికి బాగా 'గ్రాడ్యుయేట్‌' అయింది. ఇప్పుడు కొత్త పరిధిగా ఆసియా మారింది. ప్రధానాంశంగా మాత్రం అమెరికాయే కొనసాగింది. ఆర్థిక మధ్యవర్తి పాత్ర పోషించే పెగ్‌డ్‌ కరెన్సీల వ్యవస్థ స్థిరంగా, ఆశించదగినదిగా ఉండాలి. కాకపోతే ఈ భావనే వివాదాస్పదంగా మారింది.[18]

బ్రెట్టన్‌వుడ్స్‌ 2కు ఇచ్చిన ఈ నిర్వచనం 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వెనకపట్టు పట్టింది. ఎందుకంటే విధాన నిర్ణేతలంతా కొత్త తరహా అంతర్జాతీయ విత్త నిర్వహణ వ్యవస్థను కోరుకున్నారు. వారిలో పలువురు బ్రెట్టన్‌వుడ్స్‌ 2 విధానాన్ని తేలిగ్గా తీసి పక్కన పెట్టేశారు. మరోవైపు ఈ సంక్షోభం బ్రెట్టన్‌వుడ్స్‌ 2ను గురించిన చర్చను కూడా మరోసారి పునరుద్ధరించింది.[Notes 5]

డాలర్‌ ఆధిపత్యం (డాలర్‌ హెజిమొనీ) అనే పదాన్ని హెన్రీ సి.కె. లూ ఖాయం చేశాడు. ప్రపంచీకృత ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్‌ ఆధిపత్యాన్ని వివరించేందుకు ఆయన ఈ పని చేశాడు.

బ్రెట్టన్‌వుడ్స్‌ తరహా పాతబడ్డ ఆర్థిక వ్యవస్థలను గురించి మనం పునరాలోచించాల్సిన సమయం వచ్చేసింది అని 2008 సెప్టెంబర్‌ 6న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ అన్నారు.[19]

2009 సెప్టెంబర్‌ 24ా25 సమయంలో పిట్స్‌బర్గ్‌లోని డేవిడ్‌ ఎల్‌.లారెన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా జీ 20 శిఖరాగ్రానికి ఆతిథ్యమిచ్చారు. కరెన్సీ మారకపు రేట్ల పునరేకీకరణకు ఆ సందర్భంగా ప్రతిపాదనలు వచ్చాయి. ఈ విధాన సమావేశంలో వచ్చిన ఫలితాలను 2009 పిట్స్‌బర్గ్‌ ఒప్పందంగా పిలుస్తారు. లోటు దేశాలు తమ కరెన్సీల విలువను తగ్గించుకోవడానికి, మిగులు దేశాలు వాటిని పెంచుకోవడానికి అంగీకారం కుదిరింది.

2010 మార్చిలో గ్రీస్‌ ప్రధాని పనడ్రూ ఇంటర్నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యునల్‌లో ఆపోజిట్‌ ఎడిట్‌ పేజీ వ్యాసం రాశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలన్నీ కొత్త ప్రపంచ ఆర్థిక నిర్మానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ అంత సాహసోపేతంగా ఉండాలి. యూరప్‌ సమాజం, యూరప్‌ విత్త సమాఖ్య అంత సాహసంగానూ ఉండాలి. అది కూడా శరవేగంగా జరగాలి అని అందులో ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు ఒబామాతో కలయిక సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూల్లో కూడా ఆయన అవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లకు కొత్త నియంత్రణ విధానాలను ఏర్పాటు చేసే అంశాన్ని 2010 జూన్‌, నవంబర్‌ నెలల్లో జరిగే తదుపరి జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఒబామా తప్పక లేవనెత్తుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యా వారసత్వం[మార్చు]

బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థ పతనం ఆర్థిక వ్యవస్థలో విశ్వసనీయతను ఒక ప్రాధాన్యాంశంగా అధ్యయనం చేసేందుకు దారి తీసింది. దాంతో పాటే బహిరంగ స్థూల ఆర్థిక రీతుల (ముండేల్‌ ఫ్లెమింగ్‌ మోడల్‌) కు దారి తీసింది.[ఆధారం కోరబడింది]

పెగ్‌డ్‌ రేట్లు[మార్చు]

కింద చూపించినవి పెగ్‌డ్‌ రేట్లు అమల్లోకి వచ్చిన తేదీలు. అవి IMF అందించిన ప్లోటింగ్‌ రేట్ల ను సూచిస్తాయి.[20]

జపాన్‌ యెన్‌[మార్చు]

తేదీ # యెన్‌ = $1 US
ఆగష్టు 13 15
మార్చి 3, 2009 50
1 జూలై 2007 270
ఏప్రిల్ 28, 2007 360
1 జూలై 2007 308
డిసెంబరు 15, 2002 115.60*
డిసెంబరు 15, 2002 92.499*

గమనిక: 2007 జీడీపీ 4.272 లక్షల కోట్ల అమెరికా డాలర్లు. $4.272 trillion US Dollars

డచ్ మార్క్‌[మార్చు]

తేదీ # మార్కులు = $1 US గమనిక
జూన్ 12, 2002 3.33
7 సెప్టెంబరు 1994 4.20
మార్చి 3, 2009 4
20 అక్టోబర్ 2009. 3.67
డిసెంబరు 15, 2002 1.673* ట్రేడింగ్ చివరి రోజున యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 2.807 లక్షల అమెరికా డాలర్లు $2.807 trillion US Dollars

పౌండ్ స్టెర్లింగ్[మార్చు]

తేదీ # పౌండ్ = $1 US
డిసెంబరు 15, 2002 1/4.03 = 0.25
7 సెప్టెంబరు 1994 1/2.8 = 0.36
నవంబరు 12, 2003 1/2.4 = 0.42
డిసెంబరు 15, 2002 0.598*
డిసెంబరు 15, 2002 0.681*

గమనిక: 2007 జీడీపీ 2.1 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $2.1 trillion US Dollars

ఫ్రెంచి ఫ్రాంకు[మార్చు]

తేదీ # ఫ్రాన్క్స్ = $1 US గమనిక
డిసెంబరు 15, 2002 119.11 £1 = 480 FRF
జనవరి 2007 214.39 £1 = 864 FRF
20 అక్టోబర్ 2009. 263.52 £1 = 1062 FRF
(ఏప్రిల్ 27, 2003). 272.21 £1 = 1097 FRF
7 సెప్టెంబరు 1994 350 £1 = 980 FRF
ఆగస్టు 5,2009 420 £1 = 1176 FRF
డిసెంబరు 15, 2002 493.71 1 FRF = 1.8 mg gold
జనవరి 2007 4.9371 1 కొత్త ఫ్రాంక్ = 100 పాత ఫ్రాన్కులు
ఆగస్టు 5,2009 5.48 1 కొత్త ఫ్రాంక్ = 162 mg బంగారం
డిసెంబరు 15, 2002 5.627* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 2.075 లక్షల కోట్ల అమెరికా డాలర్‌ $2.075 trillion US Dollars

ఇటాలియన్‌ లిరా[మార్చు]

తేదీ # లిరా = $1 US గమనిక
జనవరి 2007 225
మార్చి 26, 2005 509
జనవరి 2007 350
నవంబరు 12, 2003 575
7 సెప్టెంబరు 1994 625
డిసెంబరు 15, 2002 1,654.569* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 1.8 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $1.8 trillion US Dollars

స్పానిష్‌ పెస్టా[మార్చు]

తేదీ # పెస్తాలు = $1 US గమనిక
1 జూలై 2007 60
నవంబరు 12, 2003 70 స్టెర్లింగ్ తో పాటు విలువ తగ్గించబడింది
డిసెంబరు 15, 2002 142.734* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 1.361 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $1.361 trillion US Dollars

డచ్‌ గల్డెన్‌[మార్చు]

తేదీ # గల్దేన్ = $1 US గమనిక
డిసెంబరు 15, 2002 2.652
7 సెప్టెంబరు 1994 3.8
మార్చి 3, 2009 3.62
డిసెంబరు 15, 2002 1.888* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 0.645 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.645 trillion US Dollars

బెల్జియన్‌ ఫ్రాంకు[మార్చు]

తేదీ # ఫ్రాంకులు = $1 US గమనిక
డిసెంబరు 15, 2002 43.77
1946 43.8725
7 సెప్టెంబరు 1994 50
డిసెంబరు 15, 2002 34.605* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 0.376 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.376 trillion US Dollars

గ్రీకు డ్రాచ్మా[మార్చు]

తేదీ # డ్రాచ్మా = $1 US గమనిక
1954 30
డిసెంబరు 15, 2002 281.821* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 0.327 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.327 trillion US Dollars

స్విస్ ఫ్రాంక్[మార్చు]

తేదీ # ఫ్రాంకులు = $1 US గమనిక
డిసెంబరు 15, 2002 4.30521 £1 = 17.35 CHF
సెప్టెంబర్ 24 4.375 £1 = 12.25 CHF
డిసెంబరు 15, 2002 1.377* £1 = 2.289 CHF
డిసెంబరు 15, 2002 1.211* £1 = 1.778 CHF

గమనిక: 2007 జీడీపీ 0.303 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.303 trillion US Dollars

డానిష్‌ క్రోన్‌[మార్చు]

తేదీ # క్రోనర్ = $1 US గమనిక
ఆగష్టు 13 4.8
7 సెప్టెంబరు 1994 6.91 స్టెర్లింగ్ కు తగ్గట్టుగా విలువ తగ్గించబడింది.
నవంబరు 21, 2007 7.5
డిసెంబరు 15, 2002 6.392*
డిసెంబరు 15, 2002 5.882*

గమనిక: 2007 జీడీపీ 0.203 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.203 trillion US Dollars

ఫిన్నిష్‌ మార్కా[మార్చు]

తేదీ # మార్కా = $1 US గమనిక
20 అక్టోబర్ 2009. 136
1 జూలై 2007 160
7 సెప్టెంబరు 1994 230
7 సెప్టెంబరు 1994 320
జనవరి 2007 3.2 1 కొత్త మార్కా = 100 ఓల్డ్ మార్కా
20 అక్టోబర్ 2009. 4.2
డిసెంబరు 15, 2002 5.084* ట్రేడింగ్ చివరి రోజు; యూరోల్లోకి మార్చబడింది (1999 జనవరి 4)

గమనిక: 2007 జీడీపీ 0.188 లక్షల కోట్ల అమెరికా డాలర్లు $0.188 trillion US Dollars

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

 • అంతర్జాతీయ కార్మిక అంశాల జాబితా
 • ప్రపంచీకరణ నిరోధకం
 • పన్నులు మరియు వాణిజ్యం పై సాధారణ ఒప్పందం
 • ప్రపంచీకరణ
 • పెట్టుబడిగా బంగారం
 • ప్రపంచీకరణ మరియు ఆరోగ్యం
 • నిర్మాణపరమైన సర్దుబాట్లు
 • విదేశీ మారక నిల్వలు
 • విత్తపరమైన ఆధిపత్యం
 • నయా ఉదారవాదం
 • యుద్ధానంతర ఆర్థిక వృద్ధి
 • ట్రిఫిన్‌ అయోమయం
 • వాషింగ్టన్ సమ్మతి
 • ప్రపంచ బ్యాంకు

గమనికలు[మార్చు]

 1. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా విదేశీ ఆర్థిక విధానానికి ఉదారవాద ఆలోచనలు ఎలా స్ఫూర్తినిచ్చాయన్న అంశంపైచర్చకు చూడండి: ఉదాహరణకు కెన్నెత్‌ వాల్ట్జ్‌, మ్యాన్‌, ద స్టేట్‌ అండ్‌ వార్‌ (న్యూయార్క్‌: కొలంబియా యూనివర్సిటీ ప్రెస్‌, 1969) మరియు డేవిడ్‌ పి.కలియో మరియు బెంజిమన్‌ ఎం.రోలాండ్‌, అమెరికా అండ్‌ వరల్డ్‌ పొలిటికల్‌ ఎకానమీ (బ్లూమింగ్టన్‌, ఇండియానా, ఇండియానా యూనివర్సిటీ ప్రెస్‌, 1973)
 2. Quoted in Robert A. Pollard, Economic Security and the Origins of the Cold War, 1945–1950 (New York: Columbia University Press, 1985), p.8.
 3. Comments by John Maynard Keynes in his speech at the closing plenary session of the Bretton Woods Conference on July 22, 1944 in Donald Moggeridge (ed.), The Collected Writings of John Maynard Keynes (London: Cambridge University Press, 1980), vol. 26, p. 101. This comment also can be found quoted online at [1]
 4. Comments by U.S. Secretary of State George Marshall in his June 1947 speech "Against Hunger, Poverty, Desperation and Chaos" at a Harvard University commencement ceremony. A full transcript of his speech can be read online at [2]
 5. ఇటీవలి ప్రచురణ కోసం చూడండి: మైఖేల్‌ పి.డూలీ, డేవిడ్‌ ఫోక్‌లెర్ట్స్‌ాలాండూ, పీటర్‌ ఎం.గార్బర్‌: బ్రెట్టన్‌వుడ్స్‌ 2 స్టిల్‌ డిఫైన్స్ ద ఇంటర్నషనల్‌ మానెటరీ సిస్టమ్‌. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనమిక్‌ రీసెర్‌&,, 2009 ఫిబ్రవరి.

సూచనలు[మార్చు]

 1. మైఖేల్‌ హడ్సన్‌, సూపర్‌ ఇంపీరియలిజం, ద ఆరిజిన్‌ అండ్‌ ఫండమెంటల్స్‌ ఆఫ& యూఎస్‌ వరల్డ్‌ డామినెన్స్‌ , రెండో ప్రచురణ (లండన్‌ అండ్‌ స్టెర్లింగ్‌, వీఏ: ఫ్లూటో ప్రెస్‌, 2003), అధ్యాయం 5.
 2. కె.దిమిత్రోవా, ఎన్‌.నెనోవ్‌స్కీ, జి.పవనెల్లీ(2007) ఎక్స్ఛేంజీ కంట్రోల్‌ ఉయ ఇటలీ అండ్‌ బల్గేరియా ఇన్‌ ద ఇంటర్‌వార్‌ పీరియడ్‌: హిస్టరీ అండ్‌ పర్‌స్పెక్టివ్స్‌, ఐసీఈఆర్‌ వర్కింగ్‌ పేపర్‌ నంబర్‌ 40
 3. Hull, Cordell (1948). The Memoirs of Cordell Hull: vol. 1. New York: Macmillan. p. 81. 
 4. బరూచ్‌ టు ఈ.కోల్బెంట్స్‌ 1945 మార్చి 23, పేపర్స్‌ ఆఫ్‌ బెర్నాడ్డ్‌ బరూచ్‌, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ లైబ్రరీ, ప్రిన్స్‌టన్‌, ఎన్‌.జె. కోటెడ్‌ ఇన్‌ వాల్టర్‌ లాఫెబర్‌, అమెరికా, రష్యా అండ్‌ ద కోల్డ్‌ వార్‌ (న్యూయార్క్‌, 2002), 12వ పుట.
 5. లుండెస్టడ్‌ గెయిర్‌, ఎంపైర్‌ బై ఇన్విటేషన్‌? ద యునైటెడ్‌ స్టేట్స్‌ అండ్‌ వెస్టర్న్ యూరప్‌, 1945-1952, జర్నల్‌ ఆఫ్‌ పీస్‌ రీసెర్చ్‌ , వాల్యూమ్‌ 23, నంబర్‌ 3 (1986 సెప్టెంబర్‌), పీపీ 263-277, సేజ్‌ పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌, మరియు జి.ఇకెన్‌బె, ఎ.జాన్‌, ఎ వరల్డ్‌ ఎకానమీ రిస్టోర్స్‌: ఎక్స్‌పర్ట్‌ కాన్సెన్సెస్‌ అండ్‌ ద ఆంగ్లో-అమెరికన్‌ పోస్ట్‌వార్‌ సెటిల్మెంట్‌, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ , వాల్యూమ్‌ 46, నంబర్‌ 1, నాలెడ్జ్‌, పవర్‌, అండ్‌ ఇంటర్నేషనల్‌ పాలసీ కో ఆర్డినేషన్‌ (1992 వింటర్‌), పేజీలు 289-321, ద ఎంఐటీ ప్రెస్‌ http://www.jstor.org/stable/2706958
 6. http://www.businessspectator.com.au/bs.nsf/Article/Why-Bretton-Wood-II-will-flop-L9VEK?OpenDocument&src=sph[dead link]
 7. పి.స్కిడెల్‌స్కీ, జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌, (2003), పీపీ 817-820.
 8. Mason, Edward S.; Asher, Robert E. (1973). The World Bank Since Bretton Woods. Washington, D.C.: The Brookings Institution. pp. 105–107, 124–135.  Cite uses deprecated parameter |coauthors= (help)
 9. http://www.imf.org/external/np/exr/center/mm/eng/mm_sc_03.htm
 10. "Wilson defends 'pound in your pocket'". BBC News. 1967-11-19. 
 11. ఫ్రాన్సిస్‌ జె.గవిన్‌, గోల్డ్‌, డాలర్స్‌, అండ్‌ పవర్‌ - ద పాలిటిక్స్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ మానెటరీ రిలేషన్స్‌, 1958-1971 , ద యూనివర్టిసీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా ప్రెస్‌ (2003), ఐఎస్‌బీఎన్‌ 0-8078-5460-3
 12. "Memorandum of discussion, Federal Open Market Committee" (PDF). Federal Reserve. 1968-03-14. 
 13. యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ పబ్లిక్‌ లా 90-269, 1968-03-18
 14. Speech by Darryl R. Francis, President Federal Reserve Bank of St. Louis (1968-07-12). "The Balance of Payments, The Dollar, and Gold" (PDF). p. 7. 
 15. Larry Elliott , Dan Atkinson (2008). The Gods That Failed: How Blind Faith in Markets Has Cost Us Our Future. The Bodley Head Ltd. pp. 6–15, 72–81. ISBN 1847920306. 
 16. 16.0 16.1 16.2 Laurence Copeland. Exchange Rates and International Finance (4th ed.). Prentice Hall. pp. 10–35. ISBN 0273-683063. 
 17. Gray, William Glenn (2007), "Floating the System: Germany, the United States, and the Breakdown of Bretton Woods, 1969–1973", Diplomatic History, 31 (2): 295–323, doi:10.1111/j.1467-7709.2007.00603.x 
 18. డూలీ, ఫోక్లఎర్ట్స్‌ాలాండూ, అండ్‌ గార్బర్‌ (2003): 'యాన్‌ ఎస్సే ఆన్‌ ద రివైవ్డ్‌ బ్రెట్టన్‌వుడ్స్‌ సిస్టమ్‌' ఎన్‌బీఈఆర్‌ వర్కింగ్‌ పేపర్స్‌; ఫర్‌ ఎ క్రిటిక్‌, ఐసన్‌గ్రీన్‌, బ్యారీ (2004): గ్లోబల్‌ ఇంబాలెన్సెస్‌ అండ్‌ ద లెసన్స్‌ ఆఫ్‌ బ్రెట్టన్‌వుడ్స్‌ ఎన్‌బీఈఆర్‌ వర్కింగ్స్‌ పేపర్స్‌
 19. George Parker, Tony Barber and Daniel Dombey (October 9, 2008). "Senior figures call for new Bretton Woods ahead of Bank/Fund meetings". 
 20. డేటా మరియ స్టాటిస్టిక్స్‌ను అందించినది అంతర్జాతీయ విత్త నిధి వెబ్‌సైట్‌[not specific enough to verify]

మరింత చదవటానికి[మార్చు]

 • ఎ.వాన్‌ డోర్మల్‌; బ్రెట్టన్‌వుడ్స్‌; విత్త వ్యవస్థ ఆవిర్భావం; అండన్‌ మెక్‌మిలన్‌ 1978
 • మైఖేల్‌ డి.బోర్డో మరియు బ్యారీ ఐసెన్‌గ్రీన్‌; బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థపై ఆత్మపరిశీలన: అంతర్జాతీయ విత్త సంస్కరణలకు పాఠాలు: 1993
 • హరాల్డ్‌ జేమ్స్‌; బ్రెట్టన్‌వుడ్స్‌ ఒప్పందం నాటి నుంచీ అంతర్జాతీయ విత్త సహకారం; ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌; అమెరికా-1996

బాహ్య లింకులు[మార్చు]

మూస:Central banks

Coordinates: 44°15′16″N 71°26′52″W / 44.25436°N 71.44787°W / 44.25436; -71.44787