బ్రేకింగ్ బాడ్
| Breaking Bad logo.svg | |
| Genre | |
|---|---|
| సృష్టించిన వారు | Vince Gilligan |
| తారాగణం | |
| స్వరకర్తలు | Dave Porter |
| Country of origin | United States |
| Original language(s) |
|
| No. of seasons | 5 |
| ఎపిసోడ్లు సంఖ్య | 62 (List of episodes) |
| నిర్మాణము | |
| ఎక్సిక్యూటివ్producer(s) |
|
| Producer(s) |
|
| ఎడిటర్లు |
|
| ప్రాంతాలు | Albuquerque Studios, Albuquerque, New Mexico |
| ఛాయాగ్రహణము |
|
| నిడివి | 43–58 minutes |
| నిర్మాణసంస్థలు |
|
| ప్రసారము | |
| Original channel | AMC |
| Original run | 2008 జనవరి 20 – 2013 సెప్టెంబరు 29 |
| కాలనిర్ణయ శాస్త్రము[Chronology] | |
| సంబంధిత ప్రదర్శనలు | |
బ్రేకింగ్ బాడ్ అనేది AMC టెలివిజన్ కోసం విన్స్ గిల్లిగాన్ రూపొందించిన ఒక అమెరికన్ నియో-వెస్ట్రన్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీలో సెట్ చేసి చిత్రీకరించిన ఈ సిరీస్ వాల్టర్ వైట్ (బ్రయాన్ క్రాన్స్టన్) అనే కల్పిత పాత్ర పై ప్రధాన కథ నడుస్తుంది. సిరీస్ మొదలయ్యేసరికి అతను రసాయన శాస్త్రంలో మంచి అనుభవం ఉన్న హైస్కూల్ కెమిస్ట్రీ టీచర్. మూడవ దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధ పడుతూ ఉంటాడు. తనకి క్యాన్సర్ ఉందని తెలిసాక చాలి, చాలని జీతంతో మధ్య తరగతి జీవితం గడుపుతున్న అతను మరణించేలోపు తన కుటుంబం కోసం ఏదో ఒకటి చేసి, డబ్బు సంపాదించి వారికి ఇచ్చి మరణిద్దాం అనుకుంటాడు. అదే సమయంలో తన మాజీ విద్యార్థి జెస్సీ పింక్మన్ (ఆరోన్ పాల్) ని ఆకస్మికంగా ఒక పోలీస్ దాడిలో కలుస్తాడు. అతన్ని కలిసి మెథాంఫేటమిన్ (క్రిస్టల్ మెత్) అనే డ్రగ్స్ ని తయారు చేసి అమ్మడం గురించి తన ప్రణాళిక చెబుతాడు. ఇలా వీరిద్దరూ కలిసి డ్రగ్స్ తయారు చేయడంతో సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ ధారావాహికలో అన్నా గన్, డీన్ నోరిస్, బెట్సీ బ్రాండ్ట్, ఆర్.జె. మిట్టే, జియాన్కార్లో ఎస్పోసిటో, బాబ్ ఓడెన్కిర్క్ జోనాథన్ బ్యాంక్స్ కూడా నటించారు.
బ్రేకింగ్ బాడ్ 2008, జనవరి 20 న AMC లో ప్రదర్శించబడింది. ఐదు సీజన్లు, 62 ఎపిసోడ్ల తర్వాత 2013, సెప్టెంబర్ 29 న ముగిసింది. దీని మొదటి సీజన్ సాధారణంగా సానుకూల సమీక్షలను అందుకుంది, తరువాతి సీజన్లు, ముఖ్యంగా చివరి ఐదవ సీజన్, ప్రదర్శనలు, రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, పాత్రలను మలిచి, అభివృద్ధి చేసిన తీరు విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నాల్గవ సీజన్కు ముందు, ఈ సిరీస్ మొదటి మూడు సీజన్లూ చాలా తక్కువ వీక్షకులను కలిగి ఉంది. 2013లో నెట్ఫ్లిక్స్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాక, అందులో ఈ సిరీస్ కూడా అందరికీ అందుబాటులో ఉండటంతో చివరి సీజన్ రెండవ భాగంలో వీక్షకుల సంఖ్య మరింత పెరిగింది. సిరీస్ ముగుస్తున్న సమయానికి అత్యధికంగా వీక్షించిన కేబుల్ టెలివిజన్ ఎపిసోడ్లలో ఒకటిగా మారింది.
బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని కాలాలలోనూ అత్యుత్తమ టెలివిజన్ ధారావాహికలలో ఒకటిగా విమర్శకులచే విస్తృతంగా పరిగణించబడింది. ఇది 16 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, 2 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, 2 పీబాడీ అవార్డులు, ఒక బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బ్రయాన్ క్రాన్‌స్టన్ డ్రామా సిరీస్‌లో ఉత్తమ ప్రధాన నటుడిగా నాలుగు సార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డును గెలుచుకోగా, ఆరోన్ పాల్ డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు, అన్నా గన్ డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటిగా రెండు సార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. ఈ ధారావాహిక ఉత్తమ టెలివిజన్ కార్యక్రమాల ర్యాంకింగ్‌లలో స్థానం నిలుపుకుంటూ వస్తోంది.
తర్వాతి కాలంలో ఈ సిరీస్ పెద్ద బ్రేకింగ్ బాడ్ ఫ్రాంచైజీకి మారడానికి దారి ఏర్పరుచుకుంది. బ్రేకింగ్ బాడ్ లోని సాల్ గుడ్మాన్ అనే ఒక లాయర్ పాత్రపై బెటర్ కాల్ సాల్ అనే ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ నిర్మించారు. ప్రధాన పాత్ర లో బాబ్ ఓడెన్కిర్క్ నటించాడు. సాల్ గుడ్మాన్ పై కేంద్రీకృతమైన ఈ స్పిన్-ఆఫ్ సిరీస్, 2015, ఫిబ్రవరి 8 న AMC లో ప్రసారం అయింది. 2022, ఆగస్టు 15న ముగిసింది. తర్వాతి కాలంలో 2019 అక్టోబర్ 11న ఆరోన్ పాల్ నటించిన ఎల్ కామినోః ఎ బ్రేకింగ్ బాడ్ చిత్రం, నెట్ఫ్లిక్స్ లోనూ, ఎంపిక చేసిన థియేటర్లలోనూ విడుదలైంది.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "Poniewozik-2010" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "western" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "western2" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "black-comedy" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "tragedy" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "tragedy2" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు