బ్లాక్ బాక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లాక్ బాక్స్ యొక్క ప్రణాళిక.

శాస్త్రీయ మరియు సాంకేతిక రంగాల్లో బ్లాక్ బాక్స్ అంటే ఒక పరికరం, వ్యవస్థ లేదా వస్తువు. ఇన్‌పుట్, అవుట్‌పుట్ మరియు బదిలీ విశిష్టతల పరంగా దీని యొక్క అంతర్గత పనితీరుల గురించి తెలియకుండా, ఇది ప్రత్యేకంగా చూడబడుతుంది. అంటే దీని అమలు తీరు "అస్పష్టమైనది" (నలుపు). ట్రాన్సిస్టర్, యాంత్రిక పద్ధతి లేదా మానవ మెదడు ఇలా పనితీరు పైకి కనిపించని దాదాపు అన్నింటిని బ్లాక్ బాక్సులుగా సూచిస్తారు.

బ్లాక్ బాక్స్ వెనుకవైపు భాగం ఒక వ్యవస్థగా పనిచేస్తుంది. అక్కడ తనిఖీ చేయడానికి వీలుగా అంతర్గత కాంపొనెంట్లు (చిన్న పరికరాలు) లేదా లాజిక్‌లు అందుబాటులో ఉంటాయి. దానిని కొన్నిసార్లు వైట్ బాక్స్‌, గ్లాస్ బాక్స్ లేదా క్లియర్ బాక్స్ అని కూడా పిలుస్తారు.

చరిత్ర[మార్చు]

ఆధునిక పదం "బ్లాక్ బాక్స్" సుమారు 1945 ప్రాంతంలో ఆంగ్ల భాషలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. బ్లాక్ బాక్సుల యొక్క బదిలీ విశిష్టతల ద్వారా జరిగే నెట్‌వర్క్ సంశ్లేషణ ప్రక్రియ విల్‌హెల్మ్ కాయర్‌ను గుర్తించగలదు. 1941లో వాటి యొక్క అత్యంత పురోభివృద్ధి రూపంపై అతని ఆలోచనలను ప్రచురించాడు.[1] కాయర్ ఈ పదాన్ని స్వతహాగా ఉపయోగించకపోయినప్పటికీ, అతని అనుచరులు మాత్రం కచ్చితంగా ఈ పద్ధతిని బ్లాక్ బాక్స్ విశ్లేషణగా వివరించారు.[2] బ్లాక్ బాక్సుల విధానాన్ని బిలీవిట్చ్[3] అంతకుముందే ఆవిష్కరించాడు. 1921లో బ్లాక్ బాక్సులుగా టు-పోర్ట్ నెట్‌వర్క్‌ల యొక్క స్పష్టమైన ప్రయోజనాన్ని ఫ్రాంజ్ బ్రీసిగ్‌కు అతను ఆపాదించాడు. 2-టర్మినల్ కాంపొనెంట్లను అంతకుముందు నిస్సందేహంగా బ్లాక్‌ బాక్సులుగా భావించేవారని అతను వాదించాడు.

ఉదాహరణలు[మార్చు]

 • ఎలక్ట్రానిక్స్‌లో, మార్చడానికి వీలున్న పరికరం యొక్క ఒక సీలు వేసిన భాగం; లైన్-రీప్లేసబుల్ యూనిట్‌ను చూడండి. (LRU)
 • కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ మరియు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్లలో బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌ను తగిన ఇన్‌పుట్‌లను ఇవ్వడం ద్వారా అవుట్‌పుట్‌ అంచనాలకు తగ్గట్టు వచ్చిందా లేదా అని చెక్ చేయడానికి ఉపయోగిస్తారు.[4] అమలవుతున్న వాస్తవిక ప్రోగ్రాం పరిశీలించబడని కారణంగా "బ్లాక్ బాక్స్" అనే పదాన్ని ఉపయోగిస్తారు.
 • బ్లాక్ బాక్స్ ప్రోగ్రాం యొక్క అంతర్గత పనితీరులను యూజర్ చూడలేడు (ఇదొక క్లోజ్డ్ సోర్స్ ప్రోగ్రాం కారణం చేత బహూశా ఇలా జరగొచ్చు) లేదా ఇది ఎలాంటి దుష్పరిణామాలను కలిగి ఉండదు. అంతేకాక ఈ ఫంక్షన్‌ను పర్యవేక్షించాల్సిన పనిలేదు. సాధారణంగా, గణనలో పునర్వినియోగానికి ఇది అత్యంత యుక్తమైనది.
 • అంతేకాక గణనలో, ఒక విక్రయదారుడు అందించిన పరికరం యొక్క చిన్న భాగాన్ని బ్లాక్ బాక్స్ సూచిస్తుంది. ఆ విక్రయదారుడి యొక్క ఉత్పత్తిని ఉత్పత్తి వినియోగానికి ఇలా సూచించబడుతుంది. తరచూ ఈ పరికరం యొక్క నిర్వహణ మరియు సాయాన్ని విక్రయదారుడు కొనసాగించడం జరుగుతుంటుంది. కంపెనీ పొందే బ్లాక్ బాక్స్‌లు నిష్క్రియాత్మకంగా ఉంటాయి.
 • సమాచార నియంత్రణ యంత్రాధ్యయనంలో, బ్లాక్ బాక్సును ఒక తెలియని వ్యవస్థగా నార్బెర్ట్ వీనర్ వర్ణించాడు. దీనిని సిస్టమ్ ఐడెంటిఫికేషన్ (వ్యవస్థ గుర్తింపు) మెలకువలను ఉపయోగించి, గుర్తించాలి.[5] స్వీయ-వ్యవస్థలో తొలి మెట్టు ఒక బ్లాక్ బాక్స్ యొక్క అవుట్‌పుట్ తీరును కాపీ చేయగలగడం అని అతను గుర్తించాడు.
 • న్యూరల్ నెట్‌వర్కింగ్ లేదా హ్యూరిస్టిక్ ఆల్గారిథమ్స్‌ ('లెర్నింగ్' కంప్యూటర్స్ లేదా 'AI అనుకరణల'ను వివరించడానికి ఉపయోగించే కంప్యూటర్ పదాలు) లో బ్లాక్ బాక్సును ప్రోగ్రామర్లు అంత సులువుగా పరీక్షించలేని ప్రోగ్రాం పరిసరం యొక్క స్థిరంగా మారే విభాగాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. ప్రోగ్రాం కోడ్‌ను చూడగలిగే సందర్భంలో దీనిని వైట్ బాక్స్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్) అని కూడా పిలుస్తారు. అయితే కోడ్ చాలా క్లిష్టమైనది కావడం చేత ఇది ఒక బ్లాక్ బాక్స్ కూడా అయిండొచ్చు.
 • అర్థశాస్త్రం‌లో, పలువురు వ్యక్తులు ప్రోగ్రామర్లు తయారు చేసిన "బ్లాక్ బాక్స్" ప్రోగ్రాంలు మరియు యాంత్రిక పద్ధతుల ద్వారా వ్యాపారం చేస్తున్నారు.[6] కచ్చితమైన సాంకేతిక మార్కెట్ పరిస్థితులు (SMA క్రాస్‌ఓవర్ వంటి) హఠాత్తుగా తలెత్తినప్పుడు ఈ ప్రోగ్రాంలు స్వీయాత్మకంగా యూజర్ యొక్క ఖాతాల వ్యాపారం చేపడుతాయి.
 • భౌతికశాస్త్రంలో, ఒక బ్లాక్ బాక్స్ అంటే అంతర్గత నిర్మాణం తెలియని లేదా ఏదైనా ఒక ప్రత్యేక పనికి పరిగణించని ఒక వ్యవస్థ.
 • గణితశాస్త్ర నమూనా రూపకల్పనలో ఒక పరిమిత పెట్టె.
 • తాత్వశాస్త్రం మరియు మనస్తత్వశాస్త్రంలో, ప్రవర్తనా వాద పాఠశాల మానవ మెదడును బ్లాక్ బాక్స్‌గా భావించింది. బ్లాక్ బాక్స్ సిద్ధాంతంను చూడండి.[7]
 • గూఢ లేఖన శాస్త్రంలో, జీరో-నాలెడ్జ్ ప్రూఫ్ ప్రొటోకాల్ వంటి క్రిప్టోగ్రాఫిక్ ప్రొటోకాల్‌ను అమలు చేయడం ద్వారా ఒక యాంత్రిక పద్ధతి గ్రహించిన విజ్ఞాన సంకల్పాన్ని పొందడానికి బ్లాక్ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ప్రొటోకాల్‌తో సంకర్షణ చెందేటప్పుడు యాంత్రిక పద్ధతి అవుట్‌పుట్ దానిని మాత్రమే సంకర్షణ చెందించే ఒక అనకరణయంత్రం ద్వారా అనుకరించబడగలదు. అంటే, యాంత్రిక పద్ధతికి అనుకరణయంత్రం యొక్క ఇన్‌పుట్ తప్ప మరేమీ 'తెలియదు' ఒకవేళ, బ్లాక్ బాక్స్ మార్గంలో అనుకరణయంత్రం గనుక యాంత్రిక పద్ధతితో మాత్రమే సంకర్షణ చెందితే, అప్పుడు ఒక బ్లాక్ బాక్స్ అనుకరణయంత్రం అని పిలుస్తాం.
 • వైమానికరంగంలో, "బ్లాక్ బాక్స్" (ప్రమాదం జరిగిన తర్వాత కూడా గుర్తించే విధంగా ఇవి వాస్తవంగా ప్రకాశవంతమైన నారింజ రంగును కలిగి ఉంటాయి) అనేది ఒక విమానం లేదా హెలికాప్టర్‌ కాక్‌పిట్‌లోని ఆడియో రికార్డింగ్ పరికరం. విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ల సంభాషణలను ఇది రికార్డు చేస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే, పరిశోధకులు ఏం జరిగింతో ధ్రువీకరించడానికి బ్లాక్ బాక్స్ రికార్డింగ్‌ను ఉపయోగించుకుంటారు. విభిన్న కారణం చేత ఈ పరికరాలను వాస్తవంగా బ్లాక్ బాక్సులుగా పిలిచినప్పటికీ, పైన పేర్కొన్న అర్థం ప్రకారం అవి కూడా బ్లాక్ బాక్సుకు ఒక ఉదాహరణే. అందులో రికార్డింగ్ వాస్తవంగా ఎలా జరిగిందనే ఆందోళన అవసరం లేదు.
 • ఔత్సాహిక రేడియోలో "బ్లాక్ బాక్స్ ఆపరేటర్" అనే పదం ఫ్యాక్టరీ తయారీ రేడియోలు ఎలా పనిచేస్తాయనే దానిపై తగిన అవగాహన లేకుండా వాటిని ఉపయోగించే వారిని చులకన చేయడం లేదా స్వీయ హేళన చేసుకోవడాన్ని తెలుపుతుంది. అలాంటి వారు సొంతంగా పరికరాన్ని తయారు చేసుకోలేరు (ఎక్కువగా "గృహతయారీ"గా పిలుస్తుంటారు) లేదా వారి సొంత "బ్లాక్ బాక్సుల"ను రిపేరు చేసుకోలేరు.[8]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • బ్లాక్ బాక్స్ ప్రణాళికా వ్యవస్థ
 • బ్లాక్ బాక్స్ సిద్ధాంతం
 • సిస్టమ్స్ థీరి

సూచనలు[మార్చు]

 1. W. Cauer. Theorie der linearen Wechselstromschaltungen , Vol.I . Akad. Verlags-Gesellschaft Becker und Erler, Leipzig, 1941.
 2. E. కౌర్, W. మాథిస్, మరియు R. పౌలి , "లైఫ్ అండ్ వర్క్ అఫ్ విల్హం కైర్ (1900 – 1945)", Pమేథమెటికల్ థీరి అఫ్ నెట్వర్క్స్ అండ్ సిస్టమ్స్ (MTNS2000) యొక్క పదునాల్గవ అంతర్ జాతీయ సదస్స్సు కార్యకలాపాలు , p4, పెర్పిజ్ఞాన్, జూన్, 2000. ఆన్ లైన్ లో గ్రహింపబడినది 19th సెప్టెంబర్ 2008.
 3. బెలివిత్చ్, V, "సమ్మరి అఫ్ ది హిస్టరీ అఫ్ సర్క్యూట్ థీరి", IRE యొక్క కార్యకలాపాలు , 50వ సం|| , Iss 5, pp848-855, మే 1962.
 4. 1995 బోరిస్ బేజర్ చే బ్లాక్-బాక్స్ టెస్టింగ్: టెక్నిక్స్ ఫర్ ఫంక్షనల్ టెస్టింగ్ అఫ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్. ISBN 0262081504
 5. నోర్బెర్ట్ వీనర్ చే సైబర్నేటిక్స్: ఓర్ ది కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ది ఆనిమాల్ అండ్ ది మెషిన్ పేజ్ xi, MIT ముద్రణ, 1961, ISBN 026273009X
 6. మార్టిన్ J. ప్రింగ్ చే బ్రేకింగ్ ది బ్లాక్ బాక్స్, మక్ గ్రా-హిల్, 2002, ISBN 0071384057
 7. "మైండ్ యాస్ ఏ బ్లాక్ బాక్స్: ది బిహేవ్యరిస్టిక్ అప్ప్రోచ్", pp 85-88, in కాగ్నిటివ్ సైన్స్: ఆన్ ఇంట్రోడక్షన్ టు ది స్టడి అఫ్ మైండ్, జే ఫ్రీడెన్బర్గ్, గోర్డన్ సిల్వర్మాన్, సేజ్ ప్రచురణ, 2006
 8. http://www.g3ngd.talktalk.net/1950.html

బాహ్య లింకులు[మార్చు]