బ్లీచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Clorox Bleach Bottle.jpg
వాణిజ్య పరమైన క్లోరొక్ష్ సోడియం హైపో క్లోరైట్ బ్లీచ్.

బ్లీచ్ అనేది ఒక రసాయనం. ఇది తరచూ ఆక్సీకరణం ద్వారా రంగులను పోగొట్టడం లేదా తెల్లబరచడం చేస్తుంది. సాధారణ రసాయన బ్లీచ్‌లుగా ఇళ్లలో ఉపయోగించే సుమారు 3–6% సోడియం హైపోక్లోరైట్‌ (NaClO) ద్రావణమైన క్లోరిన్ బీచ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా పెరాక్సైడ్ విడుదల చేసే సోడియం పెర్బోరేట్, సోడియం పెర్‌కార్బొనేట్, సోడియం పెర్‌సల్ఫేట్, టెట్రాసోడియం పిరోఫాస్ఫేట్ లేదా ఉదాహరణకు, టెట్రాఎసిటిలిథిలిన్‌డయామైన్ మరియు/లేదా సోడియం నోనానోయిల్‌ఆక్సీబెంజీన్‌సల్ఫేట్ వంటి ఉత్ప్రేరకాలు మరియు యాక్టివేటర్స్ (సేంద్రియ పదార్థాల చర్యలను అధికం చేసే మిశ్రమ పదార్థాలు) తో కూడిన యూరియా పెరాక్సైడ్ వంటి సంయోగ పదార్థాలను కలిగిన ఆక్సిజన్ బ్లీచ్‌ను చెప్పుకోవచ్చు. బ్లీచింగ్ పౌడర్ అనేది కాల్షియం హైపోక్లోరైట్.

పలు బ్లీచ్‌లు బ్యాక్టీరియా సంహారక గుణాలను కలిగి ఉంటాయి. వీటిని సంక్రమణ నిరోధం మరియు స్టెరిలైజేషన్ (మరిగించి క్రిములను చంపడం) కు వాడుతారు.

ఇతర బ్లీచ్‌లు[మార్చు]

క్లోరిన్ డయాక్సైడ్‌ను కలప గుజ్జు, కొవ్వు పదార్థాలు, చమురులు, సెల్యులోజ్ (ఒక రకమైన కార్బోహైడ్రేట్ పదార్థం), పిండి మరలు, జౌళీలు, బీస్‌వేక్స్ (తేనెపట్టు తయారీకి తేనెటీగలు విడుదల చేసే మైనం), చర్మం మరియు ఇతర అనేక పరిశ్రమల్లో శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు.

ఆహార పరిశ్రమలో కొన్ని సేంద్రియ పెరాక్సైడ్‌లు (బెంజాయిల్ పెరాక్సైడ్, మొదలైనవి) మరియు ఇతర కారకాల (ఉదాహరణకు, బ్రోమైట్‌లు) ను ఫ్లోర్ బ్లీచింగ్ (పిండికి తెలుపురంగు తీసుకురావడం) మరియు మెచ్యూరింగ్ ఏజెంట్‌లు (పిండి లక్షణాలను మెరుగుపరిచే కారకాలు) గా ఉపయోగిస్తున్నారు.

పెరాసిటిక్ ఆమ్లం మరియు ఓజోన్‌లను కాగితపు ఉత్పత్తుల తయారీ, ప్రత్యేకించి, వార్తాపత్రికలు మరియు తెలుపు రంగు క్రాఫ్ట్ పేపర్ (పుస్తకాల అట్టలకు ఉపయోగించే గట్టి కాగితం) కు ఉపయోగిస్తారు.[1]

రెండు మిశ్రమాల బ్లీచ్‌లను ప్రత్యేకించి, సింధూర వృక్షం కలపను తెల్లబరచడానికి ఉపయోగిస్తారు.

పర్యావరణ ప్రభావం[మార్చు]

బ్లీచ్ చేపలు మరియు అకశేరుకాలకు హాని కలిగించే అత్యంత విషపూరిత పదార్థం. ఇరుకైన ప్రదేశాల్లో చేపలు ఆధారం నుంచి దూరంగా వెళ్లిపోవడానికి ఈదే ప్రయత్నం చేస్తాయి.

సేంద్రియ లవణాల (AOX) అత్యధిక శోషణ స్థాయిలను సోడియం హైపోక్లోరైట్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్, ట్రైహాలోమీథేన్స్ (THM, క్లోరోఫాం వంటి) మరియు ట్రైహాలోఎసిటిక్ యాసిడ్ (THAA, ఈ సందర్భంలో ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్) సహా మట్టి పదార్థాల ప్రతిచర్య సమయంలో గుర్తించవచ్చు. అత్యధిక AOX కడిగిన నీళ్లతో పాటు కాలువలోకి వెళ్లిపోతుంది.

రసాయన చర్యలు[మార్చు]

హైపోక్లోరైట్ మరియు క్లోరిన్‌‌లు నీటిలో సమానంగా ఉంటాయి. సమతాస్థితి pHపై ఆధారపడి ఉంటుంది. తక్కువ pH (ఆమ్ల) క్లోరిన్‌కు అనుకూలంగా ఉంటుంది.[2]

Cl2 + H2O H+ + Cl- + HClO

క్లోరిన్ అనేది ఒక శ్వాసక్రియకు సంబంధించిన ప్రకోపనకారి. ఇది శ్లేష్మ పొరలపై దాడి చేయడం మరియు చర్మాన్ని కాల్చుతుంది. సాధ్యమైనంత తక్కువగా 3.53 ppm వాసనగా మాత్రమే గుర్తించబడుతుంది. అదే 1000 ppm కొన్ని సార్లు గట్టిగా ఊపిరిపీల్చుకోవడం ద్వారా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. U.S.లోని OSHA క్లోరిన్ ప్రమాదస్థాయిని 0.5 ppm (8-గంటల కాలం-పెంపు సరాసరి—వారంలో 38 గంటలు) కు పరిమితం చేసింది.[3]

సోడియం హైపోక్లోరైట్ మరియు అమ్మోనియా పలు ఉత్పన్నాలను విడుదల చేసే విధంగా ఉష్ణోగ్రత, గాఢత మరియు అవి ఏ విధంగా కలపబడ్డాయో వాటి ఆధారంగా ప్రతి స్పందిస్తాయి.[4] ప్రధాన ప్రతిచర్య అమ్మోనియా హరినీ కరణం. తొలుత క్లోరమైన్‌ (NH2Cl) ను తర్వాత డైక్లోరమైన్‌ (NHCl2) ను చివరగా నైట్రోజన్ ట్రైక్లోరైడ్ (NCl3) ను ఇవ్వాలి. ఈ పదార్థాలు కళ్లు, ఊపిరితిత్తులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాక గాఢతల స్థాయి పెరిగితే ఇవి విషపూరితంగా మారుతాయి.

NH3 + NaOCl → NaOH + NH2Cl

NH2Cl + NaOCl → NaOH + NHCl2

NHCl2 + NaOCl → NaOH + NCl3

అదనపు ప్రతిచర్యలు ఓలిన్ రాస్‌చిగ్ ప్రక్రియకు భిన్నంగా హైడ్రాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

NH3 + NH2Cl + NaOH → N2H4 + NaCl + H2O

విడుదలైన హైడ్రాజిన్ ఉష్ణమోచక చర్యలో మోనోక్లోరమైన్‌తో మళ్లీ ప్రతిచర్య చెందుతాయి.[2]

2 NH2Cl + N2H4 → 2 NH4Cl + N2

పారిశ్రామిక సంబంధిత బ్లీచింగ్ కారకాలు కూడా ఆందోళనకరంగా పరిణమిస్తాయి. ఉదాహరణకు, కలప గుజ్జు శుద్ధీకరణకు ఆదిమ క్లోరిన్‌ను ఉపయోగించడం ద్వారా డయాక్సిన్‌లు (హైడ్రోకార్బన్లు) సహా ఆర్గానోక్లోరిన్‌లు (హరినీకరణం చెందిన ద్రావణిలు) మరియు నిరంతర సేంద్రియ కాలుష్యకారకా ఉత్పత్తవుతాయి. ఒక పారిశ్రామిక బృందం ప్రకారం, ఈ ప్రక్రియల్లో క్లోరిన్ డయాక్సైడ్‌ను ఉపయోగించడం ద్వారా డయాక్సిన్ విడుదలను గుర్తించదగ్గ స్థాయిలకు పరిమితం చేస్తుంది.[5] అయితే, క్లోరిన్ మరియు అత్యంత విషపూరితమైన హరినీకరణం చెందిన ఉపఉత్పన్నాల వల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు మాత్రం కొనసాగుతాయి.

వివిధ గృహసంబంధ పరిశుభ్రతా ఉత్పత్తుల్లోని సోడియం హైపోక్లోరైట్ మరియు సేంద్రియ రసాయనాలు (ఉదాహరణకు, సర్ఫాక్టంట్‌లు, సువాసనలు) హరినీకరణం చెందిన వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) (అస్థిర సేంద్రియ సంయోగ పదార్థాల) ను విడుదల చేసే విధంగా ప్రతిచర్యకు లోనవుతాయని తాజా యూరోపియన్ అధ్యయనం వెల్లడించింది.[6] పరిశుభ్రతా పనులు చేసే సమయంలో విడుదలయ్యే ఈ హరినీకరణం చెందిన సంయోగ పదార్థాల్లో కొన్ని విషపూరితమైనవి మరియు సంభావ్య మానవ కేన్సర్‌ వ్యాధిని కలుగజేసే పదార్థాలు. బ్లీచ్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించే సమయంలో ఇంటి లోపలి వాయు సాంద్రతలు చెప్పుకోదగ్గ విధంగా పెరుగుతాయని (క్లోరోఫాంకు 8-52 రెట్లు మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్‌కు 1-1170 రెట్లు. ప్రత్యేకించి, ఇంటిలోని నిర్దిష్ట ప్రమాణాలకు పైన) ఈ అధ్యయనం తెలిపింది. హరినీకరణం చెందిన అస్థిర సేంద్రియ సంయోగ పదార్థాల గాఢతల్లో పెరుగుదల సాధారణ బ్లీచ్‌లో తక్కువగానూ మరియు “చిక్కని ద్రవం మరియు జెల్ (ద్రవరూపంలోని ఒక అర్థ ఘనపదార్థం )” రూపంలోని ఉత్పత్తులకు అధికంగా ఉంటుంది. పరిశీలించిన వివిధ హరినీకరణం చెందిన VOCల (ప్రత్యేకంగా కార్బన్ టెట్రాక్లోరైడ్ మరియు క్లోరోఫాం) ఇంటి లోపలి వాయు సాంద్రతల్లో విశిష్ట పెరుగుదలలు ఈ సంయోగ పదార్థాలను పీల్చే విధంగా గురికావడంలో బ్లీచ్ వినియోం ముఖ్యమైన కారణం కావొచ్చని సూచిస్తాయి. ఈ పరిశుభ్రతా ఉత్పత్తులను ఉపయోగించడం చెప్పుకోదగ్గ విధంగా కేన్సర్ ప్రమాదాన్ని, [7] పెంచుతాయని, ఈ పర్యవసానం ఊహాత్మకమైనదని రచయితలు అభిప్రాయపడ్డారు.

 • కార్బన్ టెట్రాక్లోరైడ్ (అత్యధిక ఆందోళనకరంగా ఉండవచ్చు) గాఢత యొక్క అత్యధిక స్థాయి ఒక ఘనపు మీటరుకు 459 మైక్రోగ్రాములు, అనువదిస్తే 0.073 ppm (పార్ట్ పర్ మిలియన్), లేదా 73 ppb (పార్ట్ పర్ బిలియన్). సుమారు ఎనిమిది గంటల వ్యవధితో OSHA-అనుమతించదగిన కాల-పెంపు సరాసరి సాంద్రత 10 ppm,[8]. ఇది దాదాపు 140 రెట్లు అధికం.
 • OSHA అత్యధికంగా అనుమతించదగిన గరిష్ట సాంద్రత (4 గంటల్లో ఐదు నిమిషాల పాటు 5 నిమిషాల దుర్బల స్థితిని కలిగి ఉండటం) 200 ppm,[8]. ఇది నివేదిత గరిష్ట ఉన్నత స్థాయికి (బ్లీచ్ శాంపుల్ బాటిల్ యొక్క అనిర్దిష్ట ప్రమాణం) మరియు డిటర్జెంట్ ద్వారా) రెండు రెట్లు అధికం.

ఈ ఉత్పత్తుల వినియోగంపై తదుపరి అధ్యయనాలు మరియు ఇతర సంభావ్య ప్రమాదస్థతి మార్గాలు (అంటే, చర్మసంబంధమైన) ఇతర ప్రమాదాలను బహిర్గతం చేయొచ్చు. ఈ వాయువుల వల్ల ఓజోన్ క్షీణత గ్రీన్‌హౌస్ ప్రభావాలు కలుగుతాయని రచయిత సూచించినప్పటికీ, నిర్దిష్ట ప్రమాణాల్లో విడుదలయ్యే అలాంటి వాయువులను ఇతర వనరులకు సంబంధించి, వాటి భాగస్వామ్యాన్ని తప్పక తగ్గించాలి.

విలీనీకరణం[మార్చు]

అధికంగా సాంద్రీకరణం చెందించిన బ్లీచ్ సాధారణంగా విక్రయించబడుతుంది. అందువల్ల బాహ్య ప్రదేశాలను శుభ్రపరిచడం మరియు తాగునీరు శుద్ధికి ఉపయోగించినప్పుడు, సురక్షితంగా వాడుకునే విధంగా దీనిని నీటిలో కలపాలి. పలు ఉపరితల ప్రదేశాలను శుభ్రపరిచేటప్పుడు, శుద్ధీకరణకు 9 భాగాల నీటికి ఒక్క భాగం బ్లీచ్ కలిపితే మంచిది. అత్యవసర పరిస్థితిలో, తాగునీటిని శుభ్రపరచవచ్చు. శుద్ధీకరణకు బ్లీచ్-నీరు నిష్పత్తి : లీటరు నీటికి 2 చుక్కల బ్లీచ్ లేదా గ్యాలను (4L) నీటికి 8 చుక్కల బ్లీచ్‌ను; ఐదు గ్యాలన్ల (19L) నీటికి 1/2 టీస్పూన్ బ్లీచ్ కలపాలి. ఒకవేళ నీర మురికిగా ఉంటే, బ్లీచ్‌ను కలపడానికి ముందు నీటిని వడగట్టాలి.[9] అదనపు బ్లీచ్ బ్యాక్టీరియాను చంపదు. అయితే ఆరోగ్యానికి మాత్రం హాని కలిగిస్తుంది.[10]

రసాయన శాస్త్రం[మార్చు]

బ్లీచింగ్ ప్రక్రియను దిగువ తెలిపిన రసాయన ప్రతిచర్యల ద్వారా వివరించడం జరిగింది:

Cl2 (aq) + H2O (l) H+ (aq) + Cl- (aq) + HClO (aq)

హైపోక్లోరస్ ఆమ్లం యొక్క H+ ఆయాను తర్వాత ద్రావణిలో విలీనమవుతుంది. తద్వారా తుది ఫలితం సమర్థవంతంగా ఉంటుంది.

Cl2 (aq) + H2O (l) 2H+ (aq) + Cl- (aq) + ClO- (aq)

హైపోక్లోరైట్ క్లోరైడ్‌గానూ మరియు ఆమ్లజని యొక్క అత్యధిక ప్రతిచర్యా రూపంగా విడిపోతుంది.

2ClO- 2Cl- + O2

బ్లీచ్ చర్యా విధానం[మార్చు]

పలు రంగులు మరియు వర్ణద్రవ్యాలలోని రంగు క్రోమోఫోర్‌లను కలిగి ఉండే బీటా కెరోటిన్ వంటి అణు సముదాయం (బణువు) ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. రసాయన బ్లీచ్‌లు రెండు మార్గాల్లో ఒక దాని ద్వారా పనిచేస్తాయి:

 • ఒక ఆక్సీకరణ బ్లీచ్ రసాయన బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో క్రోమోఫోర్ ఏర్పడుతుంది. ఇది బణువును ఒక భిన్నమైన పదార్థంగా మారుస్తుంది. అంటే అది క్రోమోఫోర్‌ను కలిగి ఉండకపోవచ్చు లేదా దృశ్య కాంతిని గ్రహించలేని క్రోమోఫోర్‌ను కలిగ ఉండొచ్చు.
 • క్రోమోఫోర్‌లోని ద్విబంధాలను ఏక బంధంగా విడగొట్టడం మార్చడం ద్వారా పలచబరిచిన బ్లీచ్ పనిచేస్తుంది. ఇది దృశ్య కాంతిని పీల్చుకునే క్రోమోఫోర్ యొక్క సామర్థ్యాన్ని తొలగిస్తుంది.[11]

ఒక ప్రక్రియ ద్వారా సూర్యకాంతి బ్లీచ్ ‌మాదిరిగా పనిచేయడం అదే విధమైన ఫలితాలను ఇస్తుంది : తరచూ నీలలోహిత లేదా అతినీలలోహిత శ్రేణిలో ఉండే అత్యంత శక్తివంతమైన కాంతికణాలు క్రోమోఫోర్‌లోని బంధాలను విచ్ఛిన్నం చేయగలవు. తద్వారా పదార్థం వర్ణరహితంగా మారుతుంది. ఎక్కువగా బయలుపరచడం (ఎక్స్‌పోజర్) ఫలితంగా తరచూ అత్యధిక కాంతివిహీనానికి దారితీస్తుంది. సాధారణంగా రంగులను తెలుపుకు మార్చడం మరియు ప్రత్యేకంగా అత్యధిక కాంతివిహీన నీలిరంగు వర్ణపటాలుగా మారుతాయి.[12]

మాంసకృత్తులను సమష్టిగా పోగు చేయడం ద్వారా సోడియం హైపోక్లోరైట్ యొక్క క్రిమినాశక యంత్రాంగం పనిచేస్తుంది.[13][14]

క్రిమినాశక సామర్థ్యం[మార్చు]

బ్లీచ్, ప్రత్యేకించి, సోడియం హైపోక్లోరైట్ యొక్క విస్తృత వర్ణపట సామర్థ్యం సూక్ష్మజీవులతో దాని రసాయన క్రియాశీలత గుణానికి బద్ధమై ఉంటుంది. క్రిమినాశకాల తరహాలో అవరోధక లేదా విషపూరిత తరహాలో పనిచేయడం కంటే, ప్రకోపకానికి వీలులేకుండా సహజ గుణాన్ని పోగొట్టడానికి మరియు పలు వ్యాధి కారకాలను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవుల సంపర్క కణాలతో బ్లీచ్ త్వరితగతిన ప్రతిచర్యకు దిగుతుంది. బ్లీచ్, ప్రత్యేకించి సోడియం హైపోక్లోరైట్ క్రిమి యొక్క హీట్ షాక్ ప్రొటీన్‌లతో ప్రతిచర్యకు దిగడం, కణాంతర్గత సహాయకారులుగా వాటి పాత్రను చైతన్యపరచడం మరియు బ్యాక్టీరియా సమూహాలుగా ఏర్పడేలా (ఒక గుడ్డు ఉడికించబడటం) చేస్తుందని చూపబడింది. ఈ సమూహాలు చివరకు మరణిస్తాయి. కొన్ని సందర్భాల్లో, బ్లీచ్ యొక్క సంతులన ఆమ్లత ఒక బ్యాక్టీరియా యొక్క కొవ్వు పదార్థ పొరను నాశనం చేస్తుంది. ఇది ఒక బుడగను పగలగొట్టే ప్రతిచర్యతో సారూప్యతను కలిగి ఉంటుంది. సూక్ష్మజీవుల వ్యాప్తిని బ్లీచ్ (ప్రత్యేకించి, సోడియం హైపోక్లోరైట్) సమర్థవంతంగా చంపడం అధికంగా ఉంటుంది. తద్వారా ఇది అత్యంత సర్వతోముఖ క్రిమి సంహారిణిగా పేర్కొనబడింది.

అంటురోగానికి ప్రతిస్పందనగా, మానవ వ్యాధి నిరోధక వ్యవస్థ, బ్యాక్టీరియా సంబంధిత దురాక్రమదారులను (హానికర క్రిములు) మట్టుబెట్టడానికి ఒక బలమైన ఆక్సీకరణ కారకం, హైపోక్లోరస్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • కీటక నాసిని
 • ఇంటి సంభంధమైన రసాయనాలు
 • టూత్ బ్లీచింగ్
 • చక్కల కోసం బ్లీచింగ్
 • బ్లీచ్ఫీల్డ్

మూలాలు, వనరులు[మార్చు]

 1. "Ozo formulas". Ozone Information.
 2. 2.0 2.1 Cotton, F.A (1972). Advanced Inorganic Chemistry. John Wiley and Sons Inc. ISBN 0-471-17560-9. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 3. Occupational Safety & Health Administration (2007). and peroxide/recognition.html "OSHA -- Chlorine" Check |url= value (help). OSHA. Retrieved 2007-08-26.
 4. Rizk-Ouaini, Rosette; Ferriol, Michel; Gazet, Josette; Saugier-Cohen Adad, Marie Therese (1986). "Oxidation reaction of ammonia with sodium hypochlorite. Production and degradation reactions of chloramines". Bulletin de la Societe Chimique de France. 4: 512–21.CS1 maint: multiple names: authors list (link)
 5. "ECF: The Sustainable Technology" (PDF). Alliance for Environmental Technology. Retrieved 2007-09-19. Cite web requires |website= (help)
 6. ఓడబసి, M., “హలోజినేటెడ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌన్డ్స్ ఫ్రొం ది యుస్ అఫ్ క్లోరిన్-బ్లీచ్- కాంటైనింగ్ హౌస్హొల్డ్ ప్రొడక్ట్స్”, ఎన్విరాన్మెంటల్ సైన్స్ & టెక్నాలజీ 42, 1445-1451, (2008). లభ్యత: http://pubs.acs.org/journals/esthag/
 7. ఓడబసి, M., “హలోజినేటెడ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌన్డ్స్ ఫ్రొం ది యుస్ అఫ్ క్లోరిన్-బ్లీచ్- కాంటైనింగ్ హౌస్హొల్డ్ ప్రొడక్ట్స్, స్లైడ్ ప్రెసెన్టేషన్(2008). లభ్యత: http://www.slideworld.org/ViewSlides.aspx?URL=5092
 8. 8.0 8.1 "Chemical Sampling Information: Carbon Tetrachloride". Osha.gov. 2004-06-16. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 9. వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్: హౌ టు ప్యూరిఫై యువర్ డ్రింకింగ్ వాటర్
 10. "Guidelines for the Use of Sanitizers and Disinfectants in Child Care Facilities". Virginia Department of Health. Retrieved 2010-03-16. Cite web requires |website= (help)
 11. Field, Simon Q (2006). "Ingredients -- Bleach". Science Toys. Retrieved 2006-03-02.
 12. Bloomfield, Louis A (2006). "Sunlight". How Things Work Home Page. Retrieved 2006-03-02.
 13. Reuters (2008). "Mystery solved: How bleach kills germs". MSNBC.com. Retrieved 2008-11-13.
 14. Jakob, U. (14 November 2008). "Bleach Activates a Redox-Regulated Chaperone by Oxidative Protein Unfolding". Cell. Elsevier. 135 (4): 691–701. doi:10.1016/j.cell.2008.09.024. PMC 2606091. PMID 19013278. Retrieved 2008-11-19. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

మరింత పఠనం[మార్చు]

 • బోడ్కిన్స్, Dr. బైలే. బ్లీచ్ ఫిలడెల్ఫియా: విర్జీనియా ప్రచురణా పత్రిక, 1995.
 • ట్రోట్మాన్, E.R. టెక్స్ట్టైల్ సోర్సింగ్ అండ్ బ్లీచింగ్ . లండన్: చార్లెస్ గ్రిఫ్ఫిన్ & Co., 1968. ISBN 0262081504

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=బ్లీచ్&oldid=1999366" నుండి వెలికితీశారు