బ్లూస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Music genre బ్లూస్‌ అనేది ఒక సంగీతరూపం మరియు సంగీత కళారూపం. 19వ శతాబ్దం చివరల్లో స్పిరుచ్యువల్స్, పని పాటలు, ఫీల్డ్ హాలోయర్స్, షౌంట్స్, ‌ ఛాంట్స్ మరియు సరళంగా రచించిన బలార్డ్ నుంచి అమెరికాలోని సుదూర దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆఫ్రికన్‌ అమెరికన్‌ సమాజానికి చెందిన వారు దీన్ని ప్రాథమికంగా సృష్టించారు.[1] బ్లూస్‌ సంగీత రూపం జాజ్‌, రిథమ్‌ అండ్‌ బ్లూస్‌, రాక్‌ అండ్‌ రోల్‌లో కనిపించినప్పటికీ, దీనిలో ఉండే నిర్దిష్ట శృతిగమనం- 12 బార్‌ శ్రుతి ద్వారా దీన్ని లాక్షణీకరించవచ్చు. బ్లూ నోట్స్, మేజర్‌స్కేల్‌కు సంబంధించిన స్థాయిని దిగువస్థాయిలోనో లేదా క్రమేపీ తగ్గించి మైనర్‌ మూడు నుంచి మేజర్‌ మూడు వరకు) వ్యక్తీకరణ కోసం పాడటం లేదా వాయించడం అనేది ఇందులో కనిపించే సర్వసాధారణ రూపం.

బ్లూస్‌ కళారూపం అనేది బ్లూస్‌ రూపాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అయితే ఇతర లక్షణాలైన నిర్దిష్ట లిరిక్స్, బాస్‌ లైన్స్ మరియు వాద్యపరికరాలుంటాయి. బ్లూస్‌ను కంట్రీబ్లూస్‌, అర్బన్‌ బ్లూస్‌ ఇలా అనేక ఉపకళారూపాలుగా విభజించవచ్చు.ఇవన్నీ కూడా 20వ శతాబ్దంలో ఏదో సందర్భంలో ప్రాచుర్యం పొందినవే. వీటిలో డెల్టా, పిడిమాంట్‌, జంప్‌, చికాగో బ్లూస్‌ స్టైల్స్ బాగా పరిచితమైనవి. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఆక్వాస్టిక్‌ నుంచి ఎలక్ట్రిక్‌ బ్లూస్‌గా పరిణతి చెందింది. తద్వారా విస్త్రతమైన శ్రోతలకు బ్లూస్‌ మ్యూజిక్‌ అందుబాటులోకి వచ్చింది. 1960 మరియు 70ల్లో ఒక హైబ్రిడ్‌ రకమైన బ్లూస్‌ రాక్‌ ఆవిర్భవించింది.

ద బ్లూస్‌ అనే పదం డెవిల్‌ బ్లూస్‌ను సూచిస్తుంది. విషాదము మరియు దు:ఖం అన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ అర్థాన్ని ఇచ్చే విధంగా మొదటిసారిగా జార్జి కోల్‌మన్‌ యొక్క ఏకాంకి బ్లూ డెవిల్స్ (1798)లో కనిపిస్తుంది.[2] అయితే ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంగీతంలో దీని వాడకం చాలా పురాతనమైనది. 1912లో హార్ట్ వార్డ్ యొక్క డల్లాస్‌ బ్లూస్‌ తొలి కాపీరైట్‌ పొందిన బ్లూస్‌ స్వరకల్పన కావడంతో అప్పటి నుంచి ఇది ప్రమాణీకృతమైంది.[3][4] పాటల్లో ఈ రెండు పదాల్ని మానసిక ఆందోళన స్థితిని తెలపడానికి తరుచుగా వాడుతుంటారు.[5]

రూపాలు[మార్చు]

20వ శతాబ్దం మొదటి దశాబ్దాల వరకు కూడా, బ్లూస్‌ యొక్క సంగీతాన్ని శ్రుతిగమనం ఆధారంగా స్పష్టంగా నిర్వచించలేదు.[6] 1900 తొలిరోజుల్లో ఆఫ్రికన్‌- అమెరికన్‌ గాయకుడు బెస్సీ స్మిత్‌ వంటి వారు వాణిజ్యపరంగా విజయవంతం కావడంతో 12 బార్‌ బ్లూస్‌ స్థిరపడిపోయింది.[7] ఇతర శ్రుతి గమన విధానాలైన 8 బార్‌ రూపాన్ని ఇప్పటికీ బ్లూస్‌ పరిగణిస్తుంటారు. ఉదాహరణకు హౌ లాంగ్‌ బ్లూస్‌, ట్రబుల్‌ ఇన్‌ మైండ్‌ మరియు బిగ్‌ బిల్‌ బ్రాంజీ యొక్కకీ టూ ద హై వంటివి. కొన్ని 16 బార్‌ బ్లూస్‌ కూడా ఉన్నాయి.రే చార్లెస్‌ స్వరపరిచిన స్వీట్‌ 16 బార్స్‌ మరియు హెర్బి హాన్‌కాక్‌ యొక్క వాటర్‌మిలన్‌ మ్యాన్‌ వంటివి. కొన్ని 16 బార్‌ బ్లూస్‌ కూడా ఉన్నాయి.రే చార్లెస్‌ స్వరపరిచిన స్వీట్‌ 16 బార్స్‌ మరియు హెర్బి హాన్‌కాక్‌ యొక్క వాటర్‌మిలన్‌ మ్యాన్‌ వంటివి. తమదైన శైలిలో ఉండే బార్‌నెంబర్లు వంటివి, ఉదాహరణకు 9 బార్‌ గమనం ఉన్న సిట్టింగ్‌ ఆన్‌ ద టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ వంటివి కూడా అరుదుగా కనిపిస్తాయి.

12 బార్ పద్ధతిలో ఆలపించబడిన శ్రుతులు: C లో బ్లూస్ కొరకు శ్రుతులు:
మధ్యకు అలైన్ చెయ్యండి
I I లేదా IV I I7
IV IV I I7
వి V లేదా IV I I లేదా V
మధ్యకు అలైన్ చెయ్యండి
సి సి లేదా ఎఫ్ సి సి 7
ఎఫ్ ఎఫ్ సి సి 7
జి జి లేదా ఎఫ్ సి సి లేదా జి

ప్రాథమికంగా బ్లూస్‌ స్వరక్పలనకు సంబంధించిన 12 బార్‌ లిరిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌, 12 బార్లు హరాత్మక శ్రేఢిలో 4/4 సమయ విరామాన్ని ప్రతిబింబిస్తాయి. 12 బార్‌ బ్లూస్‌కు అనుసంధానమైన బ్లూస్‌ యొక్క శృతిని 12 బార్‌ విధానంలో వాయించడానికి వీలుగా మూడు విభిన్న స్థాయిల్లో ఈ శృతిని రూపొందిస్తారు. గమనం యొక్క స్థాయిని రోమన్‌ నెంబర్ల సాయంతో సూచిస్టారు ఉదాహరణకు బ్లూస్‌లో సి కీలో సి అనేది టానిక్‌ ఛార్డ్(1) మరియు ఎఫ్‌ అనేది సబ్‌ డామినెట్‌(4).చివరి శ్రుతి డామినెంట్‌(5) వెనక్కి తిరిగి ఉంటుంది. తదుపరి ప్రోగ్రేషన్‌ ప్రారంభానికి మార్పును మార్క్ చేస్తుంది. లిరిక్స్ సాధారణంగా 10వ బార్‌ యొక్క చివర బీట్‌ లేదా 12బార్‌ యొక్క మొదటి బీట్‌ ముగిసే సమయంలో ముగుస్తుంది. చివరి రెండు బార్లు వాద్యకారునికి విశ్రాంతిని ఇస్తుంది. ఈ రెండు బార్‌ బ్రేక్‌, ముందు, వెనక ఉండటం అనేది చాలా సంక్ష్లిష్టంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో సింగిల్‌ నోట్‌ కలిగి ఉండటం శ్రుతిపరంగా వ్యతిరేకతను సృష్టిస్తుంది.

చాలాసమయం వరకు ఈ అన్ని రకాలు శ్రుతులు కూడా హార్మోనిక్‌7వ రూపంలో ఉంటాయి. హార్మోనిక్‌7 విరామాన్ని వాడటం అనేది బ్లూస్‌ యొక్క లక్షణంగా మరియు సర్వసాధారణంగా బ్లూస్‌ సెవన్‌ అని అంటారు.[8] బ్లూస్‌7 శ్రుతిని, హార్మోనిక్‌ శ్రుతిని ఒక నోట్‌ ద్వారా 7:4 నిష్పత్తిలో ఫండమెంటల్‌ నోట్‌కు కలుపుతారు. ఇది కన్వెషనల్‌ వెస్ట్రన్‌ డయాటోనిక్‌ స్కేలుపై ఎలాంటి విరామం వద్ద మూసుకోదు.[9] సౌలభ్యం కోసం లేదా అవసరం కోసం కొన్ని సార్లు దీన్ని మైనర్‌7 ఇంటర్వేల్‌ లేదా డామినెంట్‌7 శ్రుతి వద్ద సరిచేస్తారు.

మైనర్‌ పెంటాటోనిక్‌ స్కేల [15]

మెలోడీలో ఫ్లాట్‌3,5,7లు దాని అనుబంధ మేజర్‌ స్కేలుపై ఉపయోగించడం బ్లూస్‌ యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు.[10] ఈ ప్రత్యేకమైన నోట్స్‌ను బ్లూలేదా బెంట్‌ నోట్స్ ‌ అని అంటారు ఈ స్కేల్‌ నోట్స్‌ సహజ స్కేలు టోన్స్‌తో మార్పిడి చేస్తారు. మైనర్‌ బ్లూ స్కేలు విషయానికి వస్తే ఫ్లాట్‌3 స్థానాన్ని న్యాచురల్‌3తో భర్తీ చేస్తారు. ఫ్లాటెండ్‌7ను న్యాచురల్‌7తో మార్పిడి చేస్తారు. ఫ్లాట్‌5ను న్యాచురల్‌ ఐదుతోను మార్పిడి చేస్తారు. గుణాత్మక శ్రేఢిలో 12బార్‌ను శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నా, ఫ్లాట్‌ 3, ఫ్లాట్‌5, ఫ్లాట్‌7ను మెలోడీలో వాడటం, రెండింటిని కలిపి నొక్కడం - పక్కపక్క ఉన్న నోట్‌లను ఒకే సమయంలో ఏకకాలంలో ప్లే చేయడం( డైమెన్‌ష్డ్‌ సెకండ్‌) మరియు స్లైడింగ్‌, గ్రేస్‌ నోట్‌లను ఇదే తరహాలో ఉపయోగించడం.[11] బ్లూ నోట్స్ రిథమిక్‌గా సాగుతున్నప్పుడు, మెలోడీల సమయంలోకీ మూమెంట్స్‌ను అనుమతిస్తుంది. ఇది బ్లూస్‌ను మరింత అందంగా మారుస్తుంది.

స్వింగ్ సంగీతంలో కీలక పాత్ర పోషించిన శాఫిల్స్, ఆఫ్రో-అమెరికన్ మూలాల నుండి బ్లూస్ యొక్క ప్రత్యేక లక్షణంగా ఉన్నాయి.[12] 1940 మధ్యలో ఏర్పడ్డ ఆర్‌ అండ్‌ బి వేవ్‌లో సింపుల్‌ షఫుల్స్ స్పష్టంగా కనిపిస్తాయి.గిటార్‌ యొక్క బాస్‌ స్ట్రింగ్స్‌పై 3నోట్‌ రిఫ్ట్‌ ఏర్పడుతుంది. ఈ రిఫ్ట్‌ను బేస్‌ మరియు డ్రమ్స్ ‌ మీద ప్లే చేసినప్పుడు గ్రూవ్‌ ఏర్పడుతుంది. షఫుల్‌ రిథమ్‌ డౌ, డాడౌ, డాడౌ డ లేదా డంప్‌ డా డంప్‌, డా డంప్‌ డా[13] లా ఉంటుంది. ఇది అసమానంగా లేదా ఊగుతూ 8నోట్‌ను కలిగి ఉంటుంది. దీన్ని గిటార్‌పై స్టడీ బ్రాస్‌గానో లేదా 5 నుంచి ఆరు వరకు శ్రుతిలో వెనిక్కి క్రమంగా క్వార్టర్‌ నోట్‌ మోషన్‌లో ప్లే చేయాల్సి ఉంటుంది. బ్లూస్‌ ఈ యొక్క గమనానికి సంబంధించి మొదటి నాలుగు బార్ల గిటార్‌ టేబుల్‌కు సంబంధించిన ఉదాహరణ.[14][15]
బ్లూస్‌ షఫుల్‌ లేదా ఈ మేజర్‌లో బూగీ ([25]).
ఈ7 ఈ7 ఈ7 ఈ7
ఈ
బి
జి 
డి |----------------|2—2-4—2-5—2-4—2-|----------------|----------------|
ఏ |2—2-4-2-5-2-4—2-|0—0-0—0-0—0-0—2-|2—2-4—2-5—2-4—2-|2—2-4—2-5—2-4—2-|
ఈ |0—0-0—0-0—0-0—2-|----------------|0—0-0—0-0—0-0—2-|0—0-0—0-0—0-0—2-|

లిరిక్స్[మార్చు]

దస్త్రం:RobertJohson.png
రాబర్ట్‌ జాన్సన్‌, డెల్టా బ్లూస్‌ మ్యుజీషియన్‌

బ్లూస్‌ తొలి సంప్రదాయంలో లిరిక్స్‌లో తరచుగా తొలిలైనును నాలుగు సార్లు రిపీట్‌ చేసేవారు. 20వ శతాబ్దం తొలి దశాబ్దాల్లోనే ప్రస్తుతం వాడుకలో ఉన్న నిర్మాణాన్ని స్టాండర్డ్‌ చేశారు. దీన్ని ఏఏబి ప్యాట్రన్‌ అని పిలుస్తారు. మొదటి నాలుగు బార్ల మీద తొలి లైన్‌ను పాడతారు. ఆ తరువాత దీన్ని నాలుగుసార్లు రిపీట్‌ చేస్తారు. ఆ తరువాత సుదీర్ఘమైన ముగింపులైనును చివరి బార్లలో పాడతారు.[16] మొదట వెలువడిన రెండు బ్లూస్‌ సాంగ్స్‌ డల్లాస్‌ బ్లూస్‌(1912) మరియు సెయింట్‌.లూయిస్‌ బ్లూస్‌(1914)లు రెండూ కూడా 12 బార్‌ బ్లూస్‌ నిర్మాణానికి అనుగుణంగా ఏఏబి ప్యాట్రన్‌లో ఉన్నవే. ఒకే లైనును మూడు సార్లు రిపీట్‌ చేయడం వల్ల ఏర్పడే మూసతనాన్ని దూరం చేయడం కోసం ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు డబ్యు. సి. హ్యాండ్‌ రాసాడు.[17] తరువాత పాడే లైన్లు సాధారణంగా మెలోడీ కంటే ఒక రిథమ్‌తో కూడిన సంభాషణ మాదిరి ఉండే ప్యాట్రన్లను ఎంచుకునేవారు. తొలితరం బ్లూస్‌ బలహీనంగా రాయబడ్డ రూపాల్ని మాత్రమే తీసుకున్నారు. గాయకుడు లేదా గాయకురాలి గొంతుక ప్రపంచంలోని వాస్తవ క్రూరత్వం, పోలీసు అధికారుల అమానుషత్వం, తెల్లజాతి వారి చేతుల్లో అణచివేతకు గురవ్వడం, ఇతర భయానక పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతున్నట్లుగా ఉండేది.[18]

ఆఫ్రికన్‌ా అమెరికన్‌ సమాజానికి ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ఈ లిరిక్స్‌ ఉండేవి. ఉదాహరణకు బ్లైండ్‌ లెమన్‌ జఫర్‌సన్‌ యొక్క రైజింగ్‌ హై వాటర్‌ బ్లూస్‌(1927), 1927లో సంబంధించిన గ్రేట్‌ మిసిసిపి వరదలగురించి చెబుతుంది.

వరద నీరు పెరుగుతోంది, దక్షిణ ప్రాంత ప్రజలకు ఇక సమయం లేదు.
నేను చెబుతున్నాను. వరద నీరు పెరుగుతోంది. దక్షిణ ప్రాంత ప్రజలకు ఇక సమయం లేదు.
నా మెఫిన్‌ గర్ల్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం నాకు తెలియడం లేదు.

అయితే బ్లూస్‌ యొక్క లిరిక్స్‌ పేరాశ మరియు అణచివేతకు సంబంధించినవైనప్పటికీ, ఇందులో హాస్యాన్ని, బూతును మేళవించేవారు.[19]

రెబేకా, రెబేకా, నామీద నుంచి నీ పెద్ద కాళ్లను తీయి
రెబేకా, రెబేకా, నామీద నుంచి నీ పెద్ద కాళ్లను తీయి
అది నిన్ను పంపిస్తోనంట్నుంది, కానీ నరకం నానుంచి దూరంగా వెళుతున్నట్లుంది
సంప్రదాయ బ్లూస్‌ లిరిక్‌ సంబంధించి బిగ్‌బో టర్నర్‌ యొక్క రెబెక్కాలోనిది.

హూకుమ్‌ బ్లూస్‌ కామెడీ లిరిక్స్‌తోపాటు మొరటుగా ఉండే స్టైల్స్‌లో ప్రదర్శనలు ఇచ్చేవారు.[20] టంపా రీడ్‌ యొక్క క్లాసిక్‌ టైట్‌ లైట్‌ దట్‌(1928) అసభ్యంగా ఉండే సంభాషణలాంటిది. ఇందులో టైట్‌ అనే పదాన్ని ఓ అసభ్య భంగిమను సూచించే విధంగా ఉపయోగించారు. యుద్ధానంతరం బ్లూస్‌లో లిరిక్‌ ఉన్న భాగంలో సంగీతం స్వలంగా ఉండేది. ఇది సంబంధాలు, లైంగిక పరమైన ఆందోళనలపై ఎక్కువగా దృష్టి సారించింది. యుద్ధానికి ముందున్న బ్లూస్‌లో ఆర్థిక ఒడిదుడుకులు, వ్యవసాయం, దయ్యాల, జూదం, మ్యాజిక్‌, వరదలు, ఎండిపోయిన కాలాలు వంటివి లిరిక్స్‌లో ఎక్కువగా కనిపిస్తే, యుద్ధానంతర బ్లూస్‌లో ఇవి చాలా తక్కువగా కనిపించేవి.[21]

ముందుతరం బ్లూస్‌లో యూర్బా పురాణగాధ ప్రధాన పాత్ర పోషించినట్లు రచయిత ఎడ్‌ మోరెల్స్‌ పేర్కొన్నాడు. రాబర్ట్‌ జాన్సన్‌ యొక్క క్రాస్‌రోడ్‌ బ్లూస్‌కు ఎలిగ్యుయా యొక్క ద ఒరిషా ఇన్‌ ఛార్జ్‌ ఆఫ్‌ ద క్రాస్‌రోడ్స్‌కు సున్నితమైన సంబంధముందని సూచించాడు.[22] అయితే బ్లూస్‌పై క్రిస్టియన్‌ గణనీయంగా ఉందని చెప్పవచ్చు.[23] చార్లీ ప్యాట్రన్‌ లేదా స్కిప్‌ జేమ్స్‌ వంటి చాలా మంది కళాకారులు చాలా మతపరమైన పాటులు లేదా స్పిరుచ్యువల్స్‌ను పాడారు.[24] రెవరెండ్‌ గ్యారీ డేవిసన[25],బ్లైండ్‌ విల్లీ జాన్సన్‌ల యొక్క లిరిక్స్‌ పూర్తిగా స్పిరుచ్యువల్స్‌ అయినప్పటికీ, వారి యొక్క సంగీతం కారణంగా వీరిని బ్లూస్‌ కింద పరిగణించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.[26]

చరిత్ర[మార్చు]

మూలాలు[మార్చు]

జాన్‌ లోమెక్స్‌. పల్లెపాటల రచయిత

బ్లూస్‌ షీట్‌ మ్యూజిక్‌ సంబంధించిన 1912లో హార్ట్‌ వాండ్‌ యొక్క డల్లాస్‌ బ్లూస్‌ను తొలి. ఆ తరువాత సంవత్సరంలో డబ్యు. సి. హాండీ యొక్క మొఫిస్‌ బ్లూస్‌ను ప్రచురితమైంది తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ బ్లూస్‌ రికార్డింగ్‌ 1920లో జరిగింది. ఆఫ్రికన్‌- అమెరికన్‌ సింగర్‌ మామి స్మిత్‌ ఫెర్రీ బ్రాండ్‌ఫోర్డ్స్‌ యొక్క క్రేజీ బ్లూస్‌కు వ్యాఖ్యానం చెప్పింది. కానీ బ్లూస్‌ యొక్క ఆవిర్భావం దీనికంటే చాలా దశాబ్దాల ముందు అంటే 1890 ప్రాంతంలో జరిగింది.[27] గ్రామీణ ఆఫ్రికన్‌ అమెరికన్‌ కమ్యునిటీలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం. అమెరికాలో చదువుకున్న వర్గాల్లోనూ[28] జాతివివక్ష తదితర కారణాల వల్ల వీటి వివరాలు చాలా తక్కువ తెలుసు.[29] చరిత్ర కారులు దక్షిణ టెక్సాస్‌ మరియు సుదూర దక్షిణ ప్రాంతాల్లో 20శతాబ్దానికి కొద్దిగా ముందున్న బ్లూస్‌ సంగీతం గురించి తెలిపారు, ముఖ్యంగా క్లార్‌డేల్‌, మిసిసిపిల్లో బ్లూస్‌ మ్యూజిక్‌ ఉన్నట్లు చార్లెస్‌ పీబోడీ ఉదహరించాడు.1901-1902 దక్షిణ టెక్సాస్‌ ప్రాంతంలో ఇదేతరహా పాటలున్నట్లు పేర్కొన్నాడు. ఈ పరిశీలనలు పలువురి యొక్క జ్ఞాపకాలకు సరిపోతాయి. జెల్లీ రాల్‌ మార్టిన్‌, న్యూ ఆర్లియన్స్‌లో 1902లో తొలిసారిగా బ్లూస్‌ సంగీతాన్ని విన్నట్లు ఆయన పేర్కొన్నాడు. మా రెనీ కూడా అదే సంవత్సరంలో మిసిసిపిలో బ్లూస్‌ సంగీతాన్ని విన్నట్లు తన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంది. డబ్లు. సి. హ్యాండీ మిసిసిపిలోని ట్యుట్‌విలర్‌లో బ్లూస్‌ సంగీతాన్ని 1903లో తొలిసారి విన్నట్లు పేర్కొన్నాడు. ఈ రంగానికి సంబంధించి హెవర్డ్‌ డబ్యు.ఓడమ్‌ విస్త్రతమైన పరిశోధన జరిపాడు. 1905నుంచి 1908 ప్రాంతంలో లఫాయతే, మిసిసిపి, న్యూటన్‌, జార్జియాల్లో ఉన్న గ్రామీణ పాటలను సేకరించి ఒక పెద్ద గ్రంథాన్ని పబ్లిష్‌ చేశాడు.[30] బ్లూస్‌ యొక్క నాన్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌, ప్రోటో బ్లూస్‌ను, 20శతాబ్దపు తొలిరోజుల్లో పరిశోధన నిమిత్తం పౌల్‌ ఆలివర్‌ ద్వారా వోడస్‌ రికార్డ్‌ చేసింది. అయితే అవి ఇప్పుడు లభ్యం కావడం లేదు.[31] ఇప్పటికీ లభ్యమవుతున్న వాటిని 1924లో [[లారెన్స్‌ గెలర్ట్‌{ /0}]]ఆ తరువాత రాబర్ట్‌ డబ్యు. గార్డన్‌ సేకరించారు. గార్డన్‌ తరువాత ఆర్కైవ్స్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఫ్లోక్‌ సాంగ్స్‌ఆఫ్‌ ద లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ యొక్క హెడ్‌ అయ్యాడు. లైబ్రరీలో గార్డెన్‌ యొక్క వారసుడుజాన్‌ లీమాక్స్‌, 1930లో తన కుమారుడు అలెన్‌తో కలిసి ఫీల్డ్‌ హాలోయర్స్‌, రింగ్‌ షౌటర్స్‌ వంటి ప్రోటో బ్లూస్‌ స్టైల్స్‌ను ధృవీకరించే ఎన్నో నాన్‌ కమర్షియల్‌ బ్లూస్‌ రికార్డులను సేకరించారు.[32] 1920కు ముందున్న బ్లూస్‌ సంగీతానికి సంబంధించిన రికార్డ్‌లో లీడ్‌ బెల్లీ, హెన్రీ థామస్‌[33] వంటి కళాకారుల యొక్క రికార్డ్స్‌ను కూడా పొందుపరిచారు.[34] ఇవన్నీ కూడా బ్లూస్‌ అనేది తన యొక్క ప్రధాన 12, 8 లేదా 16 బార్‌ కంటే భిన్నమైన రూపంలో అంతకుముందు ఉండేదన్న వాదనల్ని బలపరుస్తాయి.[35][36]

సామాజికంగా, ఆర్థికంగా బ్లూస్‌ యొక్క ఆవిర్భావం గురించి పూర్తిగా తెలియదు.[28][37] 1863లో బానిస నిర్మూలన చట్టం వచ్చిన తరువాత మాత్రమే బ్లూస్‌ ఆవిర్భవించనట్లు తరుచుగా సూచిస్తుటారు. 1870 మరియు 1900 మధ్య కాలంలో బానిస నిర్మూలన చట్టంతో పాటు నల్లజాతి రోజంతా పనిచేసిన తరువాత సంగీతం వినడానికి, డ్యాన్స్‌ చేయడానికి, జూద క్రీడల ద్వారా విశ్రాంతి పొందడంకోసం రూపొందించిన జ్యూక్‌ జాయింట్లు అభివృద్ధి చెందడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.[38] ఈ కాలంలో బానిసత్వం నుంచి షేర్‌ క్రాపింగ్‌ దిశగా పరిణామాలు చోటుచేసుకోవడం,చిన్న తరహా వ్యవసాయ ఉత్పత్తి, దక్షిణ అమెరికా ప్రాంతంలో రైలురోడ్డు మార్గాల విస్తరణ చోటుచేసుకున్నాయి. 1900 తొలి కాలంలో బ్లూస్‌ సంగీతం బృందంగా ప్రదర్శనలు ఇచ్చే దశ నుంచి వ్యక్తిగతంగా తమదైన శైలిలో ప్రదర్శించే విధంగా అభివృద్ధి చెందిదని పలువురు మేధావులు విశ్లేషిస్తుంటారు. బానిసత్వం కోరల్లో మగ్గిన ప్రజలకు లభించిన స్వాతంత్యం కారణంగానే బ్లూస్‌ అభివృద్ధి చెందినట్లు కొందరు వాదిస్తుంటారు. లారెన్స్‌ లెవిన్‌ దృష్టిలో- వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి జాతిపరంగా సిద్ధాంతాల పునరుద్ఘాటనకు, బూకర్‌ టి. వాషింగ్టన్‌ ప్రసంగాలను ప్రజాదరణ, బ్లూస్‌ ఆవిర్భావానికి మధ్య సంబంధం ఉన్నట్లుగా పేర్కొంటాడు. తదుపరి లెవిన్‌ ఈ విధంగా పేర్కొంటాడు. ఆఫ్రికన్‌- అమెరికన్లు బానిసలుగా ఉన్నప్పుడు సాధ్యం కానీ మానసిక, సామాజిక, ఆర్థిక అంశాలు శరవేగంగా అభివృద్ధి చెందారు.అందువల్ల సామ్యవాద తరహాలో ఉండే వీరి సంగీతం, వారి మతపరమైన సంగీతానికి ఎంత ఆదరణ అయితే ఉందో అంత ఆదరణ సంపాదించుకోవడంలో ఆశ్చర్యమే లేదంటాడు.[39]

తమదైన శైలిలో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారానే ఈకళ రూపుదిద్దుకుంది కనుక, మొత్తం బ్లూస్‌ సంగీతంలో కొన్ని లక్షణాలు ఉమ్మడిగా కనిపిస్తాయి.[40] అయితే ఆధునిక బ్లూస్‌రూపుదిద్దుకోవడానికి ముందే కొన్ని లక్షణాలు ఎంతో కాలం ముందు నుంచే ఉన్నాయి. అరుస్తూ పిలవడం,అదేవిధంగా స్పందించడం అనేది ముందుతరం బ్లూస్‌ మ్యూజిక్‌ యొక్క ఒక లక్షణం.శృతి లేదా ఏక స్వరం లేకపోవడం మరియు ఎలాంటి నిర్దిష్ట సంగీత నిర్మాణానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల ఈ సంగీతంలో విద్యుక్త భావాలు కనిపిస్తాయి.[41] ముందుతరం బ్లూస్‌లో కనిపించే ఇలాంటి రూపం బానిసల యొక్క రింగ్‌ షౌట్‌లు, పొలం పాటల్లో కనిపిస్తాయి. ఇవే తరువాత భావోద్వేగ విషయంలో సరళమైన సోలో సాంగ్స్‌కు తోవలు పరిచాయి.[42]

గాత్ర సంగీతం ఏ మాత్రం ప్రమేయం లేని మరియు పశ్చిమ ఆఫ్రికా నుంచి దిగుమతి చేయబడ్డ బానిసల యొక్క మౌఖిక సంప్రదాయాల నుంచి బ్లూస్‌ ఆవిర్భవించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నల్లజాతి వారు ఎన్నో రకాల స్టైల్స్‌ను, దీని ఉపాంగాలను, ఆయా ప్రాంతీయ వ్యత్యాసాలతో అమెరికాలో మొత్తం ఏర్పరిచారు. బ్లాక్స్‌లోను, ఇది తెలియనప్పటికీ, యూరోపియన్‌ తరహా సప్తస్వరాలు అదేవిధంగా ఆఫ్రికన్‌ కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌ను స్టైల్స్‌ రెండూ కూడా అంతర్ణీమై స్వరం మరియు గిటార్‌ల యొక్క సమ్మిళితాలయ్యాయి.[43][44] పశ్చిమ ఆఫ్రికా గ్రియోట్స్‌కు సంబంధించిన ఎలాంటి మెలోడికల్‌ స్టైల్‌ ప్రతిబింబించకుండా, బ్లూస్‌ తనదైన ముద్రను కలిగి ఉంది.[45][46] వాటి యొక్క ప్రభావం మంద్రమైనది మరియు సూక్ష్మమైనది. ఆఫ్రికన్‌ సంగీతానికి చెందిన ఏ ఒక్క రూపానికో.. బ్లూస్‌ అనేది ఏకైక వారసత్వం కలిగి ఉందని చెప్పలేం.[47] అయితే బ్లూస్‌లో ఉండే అనేక అంశాలు, కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌ విధానం,బ్లూస్‌ నోట్స్‌ వంటివాటిని ఆఫ్రికన్‌ సంగీతంలో గమనించవచ్చు. ఈ బ్లూ నోట్స్‌ అనేవి బ్లూస్‌కంటే ముందు ఆఫ్రికన్‌ మూలాల నుంచి వచ్చిందని ఇంగ్లిష్‌ స్వరకర్త శ్యాముల్‌ కాల్‌రిడ్జ్‌ టైలర్‌ 1898లో స్వరపరిచిన ద ఆఫ్రికన్‌ సూట్‌ ఫర్‌ పియానో లోని ఏ నీగ్రో లవ్‌ స్టోరీ అనేది స్పష్టం చేస్తుంది.ఇందులో బ్లూ మూడు మరియు ఏడు స్వరాలు కనిపిస్తాయి.[48] డిడ్లే బౌ( ఇంట్లో తయారు చేసిన ఏక తీగ సాధనం 20శతాబ్ది ప్రారంభంలో అమెరికా దక్షిణ ప్రాంతంలో కనిపించింది), బాంజోలు ఆఫ్రికన్‌ సంగీతానికి చెందిన పరికరాలు, ఈ రెండడూ కూడా ఆఫ్రికన్‌ పెర్ఫార్మెన్స్‌ టెక్నిక్స్‌ను తొలినాటి బ్లూస్‌ సంగీత పరికరాల పట్ల పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి సాయపడ్డాయి.[49] బాంజో పశ్చిమ ఆఫ్రికన్‌ సంగీతం నుంచి నేరుగా దిగుమతి చేసుకోబడింది. గ్రైయోట్స్‌ ఉపయోగించే సంగీత పరికరాన్ని పోలి ఉంటుంది( వోలఫ్‌, ఫుకా, మదిన్‌కా వంటి ఆఫ్రికన్‌ ప్రజలు వాడే హలమ్‌ లేదా ఎకోన్‌టింగ్‌ వంటివి).[50] అయితే 1920ల్లో కంట్రీ బ్లూస్‌ను రికార్డ్‌ చేయడం ప్రారంభించిన తరువాత బాంజో వాడకం తగ్గిపోయింది. ముఖ్యంగా వ్యక్తిగత ప్రదర్శనలు ఇచ్చే పాపా చార్లీ జాక్‌సన్‌ ఆ తరువాత గుస్‌ కేనన్‌ వంటి వారు మాత్రమే ఉపయోగించేవారు.[51]

బ్లూస్‌ సంగీతం ఇథోపియన్‌ ఎయిర్స్‌, మినిస్ట్రీరియల్‌షోలు, నీగ్రో స్పిరిచ్యువల్స్‌తోపాటు సంగీత పరికరాలు, సప్తస్వర భావనను కూడా తనలో కలుపుకుంది.[52] ఈశైలి రాగ్‌టైమ్‌ శైలికి చాలాదగ్గరగా ఉంటుంది. ఈ రెండు ఒకే కాలం నాటివైనా, బ్లూస్‌ మాత్రం ఆఫ్రికన్‌ సంగీతంలో ఉన్న ఒరిజినల్‌ మెలోడిని మరింత సంరక్షించగలిగింది.[53]

బ్లూస్‌ మరియు ఆధునిక కంట్రీ మ్యూజిక్‌ఈ రెండింటి యొక్క సంగీత నిర్మాణం, శైలి 19వ శతాబ్దికాలంలో అమెరికా దక్షిణ ప్రాంతంలో రూపుదిద్దుకున్నాయి. బ్లూస్‌ మరియు కంట్రీ మ్యూజిక్‌కు సంబంధించిన రికార్డులు 1920నాటికే ఉన్నాయి. ఆ సమయంలో రికార్డు పరిశ్రమ ప్రజాదరణ పొందటంతో నల్లవారివి నల్లవారికి, తెల్లవారివి తెల్లవారికి అమ్మడం కోసం రేస్‌ మ్యూజిక్‌ హిల్‌బిల్లీ మ్యూజిక్‌ అనే మార్కెటింగ్‌ విభాగాలుండేవి. అయితే ఆ సమయంలో బ్లూస్‌, కంట్రీ మ్యూజిక్‌ కోసం స్పష్టమైన సంగీత విభజన లేదు. కేవలం గాయకుని యొక్క జాతీయత ఆధారంగానే సాధ్యమయ్యేది. రికార్డింగ్‌ కంపెనీలు కొన్నిసార్లు వివరాలు తప్పుగా ఇవ్వడం వల్ల అదీ సాధ్యమయ్యేది కాదు.[54][55] అయితే కొన్ని శృతి నిర్మాణాలు మరియు గీత వ్యూహాల ఆధారంగా సంగీత పరిశోధకులుబ్లూస్‌ను నిర్వచించేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో పుట్టినప్పటికీ, ప్రేక్షకులు ఎంతో సాధారణ స్థాయిలోనే ఆస్వాదించేవారు. ఇది క్లుప్తంగా దక్షిణ గ్రామీణ ప్రాంత సంగీతం, మరీ ముఖ్యంగా మిసిసిపి డెల్టా. తెలుపు, నల్లజాతి సంగీతకారులు ఒకే ప్రదర్శనను పంచుకున్నారు. వారు తమని తాము బ్లూస్‌ సంగీతకారుల కంటే సాంగ్‌స్టర్స్‌గానే భావించుకునేవారు. 1920ల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నల్లజాతి వారు పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన తరువాత, అదే సమయంలో రికార్డింగ్‌ పరిశ్రమ అభివృద్ధి చెందిన తరువాతే బ్లూస్‌కు ఒక ప్రత్యేకమైన కళగా గుర్తింపు వచ్చింది. నల్లజాతి శ్రోతలకు కోసం అమ్మేందుకు డిజైన్‌ చేయబడిన రికార్డులకు బ్లూస్‌ ఒక కోడ్‌వర్డ్‌గా మారింది.[56]

బ్లూస్‌ యొక్క మూలాలు ఆఫ్రో-అ మెరికన్‌ సమాజానికి చెందిన మతపరమైన సంగీతం స్పిరిచ్యువల్స్‌కు దగ్గరగా ఉంటాయి. స్పిరిచ్యువల్స్‌ యొక్క ఆవిర్భావం బ్లూస్‌ కంటే ఎంతో ముందు జరిగింది. ఇది 18 శతాబ్దం యొక్క మధ్య కాలంలో బానిసల్ని క్రైస్తవులుగా మార్చబడినతరువాత క్రిస్టియన్‌ గీతాల్ని మరీముఖ్యంగా చాలా ప్రసిద్ధి కాంచిన ఇసాక్‌వాట్స్‌ను పాడటం ప్రారంభించారు.[57] బ్లూస్‌ను శృతి యొక్క అనుపాతం ద్వారా నిర్వచించడానికి ముందు, స్పిరిచ్యువల్‌ యొక్క సామ్యవాద ప్రతిరూపమని నిర్వచించారు. గ్రామీణ నల్లజాతివారియొక్క తక్కువస్థాయి సంగీతంగా భావించేవారు. మతపరమైన సమాజానికి చెందిన సంగీతకారుడు తక్కువ స్థాయి సంగీతాన్ని వాయించడం పాపంగా, బ్లూస్‌ సంగీతం డెవిల్‌ మ్యూజిక్‌గాను పరిగణించారు. దీంతో సంగీతకారులు రెండు విభాగాలుగా విడిపోయారు. గాస్పెల్స్‌, బ్లూస్‌ గాయకులు. అయితే రూరల్‌ బ్లూస్‌ సంగీతం 1920 ప్రాంతంలో రికార్డ్‌ చేయడం ప్రారంభం కావడంతో రెండు వర్గాలకు చెందిన సంగీతకారులు ఒకరకమైన కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌, బ్లూ నోట్స్‌, స్లైడ్‌ గిటార్‌ వంటి టెక్నిక్స్‌ ఉపయోగించేవారు. గాస్పెల్‌ సంగీతం ఎక్కువగా క్రిస్టియన్‌ హైమ్‌తో సరిపోలి ఉండే సంగీత రూపాన్ని ఉపయోగించేది. ఫలితంగా దాని సామ్యవాద ప్రతిరూపమైన బ్లూస్‌ కంటే తక్కువగా మార్కెట్‌ చేయగలిగేది.[23]

యుద్ధం ముందు బ్లూస్‌[మార్చు]

అమెరికన్‌ షీట్‌ మ్యూజిక్‌ పబ్లిషింగ్‌ పరిశ్రమ గొప్ప రాగ్‌టైమ్‌ సంగీతాన్ని అందించింది. 1912నాటికి షీట్‌ మ్యూజిక్‌ పరిశ్రమ బ్లూస్‌ తరహా ఉండే మూడు పాపులర్‌ స్వరకల్పనలు విడుదల చేసింది. ఆలోచన లేకుండా టిన్‌ పాన్‌ అలే బ్లూస్‌ ఎలిమెంట్స్‌ స్వీకరించి బేబీ ఎఫ్‌. సీల్స్‌ యొక్క బేబీ సీల్స్‌( మార్టీ మాధ్యుస్‌ ఏర్పాటు చేశాడు), హార్ట్‌ వాడ్‌యొక్క డల్లాస్‌ బ్లూస్‌ మరియు డబ్లు. సి హ్యండీ యొక్క ద మెఫిన్‌ బ్లూస్‌.[58]

సెయింట్‌ లూయిస్‌ బ్లూస్‌కు సంబంధించిన షీట్‌ మ్యూజిక్‌ (1914)

హ్యాండి శిక్షణ పొందిన సంగీతకారుడు, కంపోజర్‌ మరియు అరేంజర్‌. సింఫల్‌ స్టైల్‌లో ఉండే బ్యాండ్‌ మరియు సింగర్‌ తరహాలో బ్లూస్‌లోను ప్రతిరాయడం, ఆర్కెస్ట్రా ఉండేట్లు చూడటం ద్వారా బ్లూస్‌కు ప్రజాదరణం పెరగడానికి సాయపడ్డాడు. ప్రజాదరణ ఉన్న ఫలప్రథమైన కంపోజర్‌గా పేరుగాంచాడు. తనకు తానుగా పాదర్‌ ఆఫ్‌ ద బ్లూస్‌గా అభివర్ణించుకునేవాడు. అయితే ఈయన స్వరరచనలను రాగ్‌టైమ్‌, జాజ్‌ యొక్క ఫ్యూజన్‌గా వర్ణించవచ్చు. స్వరాలను కలపడానికి ఉపయోగించిన క్యూబన్‌ హబనెరా రిథమ్‌ అనేది చాలా కాలంగా రాగ్‌టైమ్‌లో అనుబంధమై ఉంది.[22][59]సెయింట్‌ లూయిస్‌ బ్లూస్‌ అనేది హ్యాండి యొక్క ప్రముఖమైన స్వరరచనగా చెప్పుకోవచ్చు.

1920ల్లో బ్లూస్‌ ఆఫ్రికన్‌ అమెరికన్‌ మరియు అమెరికన్‌ పాపులర్‌ మ్యూజిక్‌లో కీలక భాగస్వాములయ్యారు. హ్యాండీ చేసిన ఏర్పాట్లు మరియు సంప్రదాయ మహిళా బ్లూస్‌ ప్రదర్శకుల ద్వారా వీరు తెల్లజాతి శ్రోతలకు దగ్గరయ్యారు. బార్లలో సంప్రదాయ భిన్నంగా చేసే ప్రదర్శనల నుంచి థియేటర్‌లో వినోదం అందించే స్థాయికి బ్లూస్‌ ఎదిగారు. థియేటర్‌ ఓనర్స్‌ బూకర్స్‌ అసోసియేషన్‌ నైట్‌ క్లబ్స్‌ అయిన కాటన్‌ క్లబ్‌వంటి వాటిలోను, జ్యూక్‌ జాయింట్‌అయిన బార్లుతోపాటు మెంఫిస్‌ లోని బెలే స్ట్రీట్‌వంటి వాటిలో బ్లూస్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. చాలా రికార్డింగ్‌ కంపెనీలు, అమెరికన్‌ రికార్డ్‌ కార్పొరేషన్‌, ఒకే రికార్డ్స్‌, మరియు పారామౌంట్‌ రికార్డ్స్‌వంటివి ఆఫ్రికన్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ను రికార్డ్‌ చేయడం ప్రారంభించాయి.

రికార్డింగ్‌ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో, కంట్రీ బ్లూస్‌ ప్రదర్శకులు బో కార్టర్‌, జిమ్మీ రోడ్జర్‌( కంట్రీ సింగర్‌), బ్లైండ్‌ లెమన్‌ జఫర్‌సన్‌, లోని జాన్‌సన్‌, టంపా రీడ్‌ మరియు బ్లైండ్‌ బ్లేక్‌ వంటి వారు ఆఫ్రికన్‌ అమెరికన్‌ సమాజంలో మరింత ప్రజాదరణ పొందారు. కెంటకీలో పుట్టిన సిల్వేస్టర్‌ వీవర్‌ 1923లో స్లైడ్‌ గిటార్‌ శైలిలో రికార్డింగ్‌ చేశాడు. ఇందులో గిటార్‌ యొక్క మెట్లు బ్లేడు లేదా బాటిల్‌ యొక్క పదునైన పగిన భాగమో ఉండేది.[60] స్లైడ్‌ గిటార్‌ డెల్టా బ్లూస్‌లో ఒక ముఖ్యమైన భాగమైంది.[61] 1920ల్లో మొదటి బ్లూస్‌ రికార్డింగ్స్‌ను సంప్రదాయమైన, గ్రామీణ కంట్రీ బ్లూస్‌ మరియు మరింత పరిణతిచెందిన సిటీ లేదా అర్బన్‌ బ్లూస్‌గా వర్గీకరించవచ్చు.

కంట్రీ బ్లూస్‌ ప్రదర్శకులు తరచుగా కేవలం బాంజో లేదా గిటార్‌ సాయంతోనో లేదా అవి లేకుండా ప్రదర్శనలు ఇచ్చేవారు. 20వ శతాబ్ద కాలంలో కంట్రీ బ్లూస్‌ యొక్క ప్రాంతీయ శైలుల్లో విపరీతమైన మార్పు ఉండేది. ద డెల్టా బ్లూస్‌(మిసిసిపి) రూస్టీ స్ప్రోస్‌ స్టైల్‌లో ఆకట్టుకునే గాత్రం దీనికి సాయంగా స్లైడ్‌ గిటార్‌ను ఉపయోగించేది. చాలా తక్కువగా రికార్డు చేసిన రాబర్ట్‌ జాన్‌సన్‌ అర్బన్‌, కంట్రీ బ్లూస్‌ను సమ్మిళితం చేశాడు.[62] రాబర్ట్‌ జాన్‌సన్‌కు అదనంగా ఆయన వారసుడు చార్లీ ప్యాటన్‌ మరియు ఆయన సన్ హౌస్‌లు ఈ తరహా శైలి ప్రభావానికి గురైన ప్రదర్శకులుగా చెప్పుకోవచ్చు. బ్లైండ్‌ విల్లీ మెక్‌టెల్‌ మరియు బ్లైండ్‌బాయ్‌ ఫుల్లర్‌లు సున్నితమైన భావయుక్తమైన నైరుతి ప్రాంత పిడ్‌మాంట్‌ బ్లూస్‌ సంప్రదాయాన్ని అనుసరించారు. ఇది రాగ్‌టైమ్‌ ఆధారితంగా గిటార్‌ను వేళ్లతో లాగడం అనే టెక్నిక్‌ను అనుసరించేది. జార్జియాలో కూడా స్లైడ్‌ సంప్రదాయం కనిపించేది. కర్లీ వీవర్‌,టంపా రీడ్‌, బార్బెక్యూ బాబ్‌, హిక్స్‌ మరియు జేమ్స్‌ కొకోమో ఆర్నాల్డ్‌లు ఈ స్టైల్‌కు ప్రతినిధులుగా చెప్పవచ్చు.[63]

ఎంతో ఉల్లాసంగా ఉండే మెఫిస్‌ బ్లూస్‌ స్టైల్‌ను టెన్నెసీకి దగ్గరగా ఉండే మెఫిస్‌లో 1920 మరియు 1930 ప్రాంతంలో అభివృద్ధి చేశారు. మెఫిన్‌ జగ్‌ బ్యాండ్‌లేదాగస్‌ క్యానన్‌ జగ్‌ స్టోఫర్స్‌ యొక్క ప్రభావం దీనిపై ఉంది. ఫ్రాంక్‌ స్టోక్స్‌,స్లీపీ జాన్‌ ఈట్స్‌, రాబర్ట్‌ విల్‌కిన్స్‌, జో మెకోనీ, కాశీ బిల్‌ వెల్డన్‌ మరియుమెఫిన్‌ మిన్నీవంటి వారు ఎన్నో అసాధారణమైన పరికరాలైన వాష్‌ బోర్డ్‌, ఫిడేల్‌, క్యాజు, మాండలిన్‌ వంటి వాటిని ఉపయోగించేవారు. మెఫిస్‌ మిన్నీ విర్చువస్‌ గిటార్‌ స్టైల్‌ ద్వారా ప్రసిద్ధి గాంచింది. పియానో వాద్యకారుడుమెఫిస్‌ స్లిమ్‌ తన యొక్క కెరీర్‌ను మెఫిస్‌లో ప్రారంభించాడు, కానీ ఆయన యొక్క విలక్షణమైన శైలి ఎంతో సున్నితంగా, ఒక ఊపు ఉండేది. మెఫిస్‌లోని చాలా మంది బ్లూస్‌ సంగీతకారులు1930 చివరల్లో మరియు 1940 తొలికాలంలో చికాగోకు వలస వెళ్లి, అర్బన్‌ బ్లూస్‌ ఉద్యమంలో భాగమయ్యారు. ఫలితంగా క్రంటీ మ్యూజిక్‌ మరియు ఎలక్ట్రికల్‌ బ్లూస్‌ సమ్మిళితమయ్యాయి.[64][65][66]

బెస్సీ స్మిత్‌ తొలితరం బ్లూస్‌ గాయకుడు, బలమైన స్వరం ద్వారా పరిచితుడు

సిటీ లేదా అర్బన్‌ బ్లూస్‌ స్టైల్స్‌ ఏకత్రపరిచేవి మరియు విస్రృతమైనవి. ప్రదర్శకునిగా తన యొక్క స్థానిక ప్రాంతాన్ని, తాను నివసించే ప్రాంతాన్ని కాకుండా విస్త్రతమైన,మరియు విభిన్నమైన శ్రోతల యొక్క కళా పిపాసను దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చేది.[67] సంప్రదాయ మహిళా అర్బన్‌మరియు వ్యూ డెవిల్లీ బ్లూస్‌ సింగర్లు 1920ల్లో చాలా ప్రసిద్ధి పొందిన వారు. వీరిలో మామీ స్మిత్‌, గెట్రూడ్‌ మా రియానీ, బెస్సీ స్మిత్‌మరియు విక్టోరియా స్పివేలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మామీ స్మిత్‌ను బ్లూస్‌ కళాకారురాల కంటే వాల్‌డెవిల్లీ ప్రదర్శకురాలినిగానే ఎక్కువగా చెప్పుకోవచ్చు.1902లో బ్లూస్‌ను రికార్డ్‌ చేసిన తొలి ఆఫ్రికన్‌ాఅమెరికన్‌ స్మిత్‌ పేరుగాంచింది. ఆమె యొక్క రెండో రికార్డు క్రేజీ బ్లూస్‌ తొలినెలలోని 75,000వేలకాపీలు అమ్ముడైంది.[68] మదర్‌ ఆఫ్‌ బ్లూస్‌ అయిన మా రియానీ మరియు బెస్సీ స్మిత్‌లు తమ యొక్క స్వరం రూమ్‌ యొక్క చివరకు కూడా తేలిగ్గా వెళ్లాలన్న ఉద్దేశంతో మధ్యమ స్వరాల్లో పాడేవారు. స్మిత్‌ పాటను ఒక అసాధారణ స్థాయిలో పాడేది. నోట్స్‌ను దిగువస్థాయికి తీసుకెళ్లడం, సాగదీయడంతోపాటు వాటిపై అసాధరణ పట్టుతో తన సొంత వ్యాఖ్యానానికి చోటు ఉండేవిధంగా ఆమె తన యొక్క కళారూపాన్ని ప్రదర్శించేది.[69] చెందిన టంపా రీడ్‌, బిగ్‌ బిల్‌ బ్రాంజీ, లెరాయ్‌ కార్ వంటివారు పట్టణ ప్రాంత బ్లూస్‌. రెండో ప్రపంచయుద్ధానికి ముందు టంపా రీడ్‌ను కొన్ని సార్లు గిటార్‌ మేధావి అని పిలిచేవారు. కార్‌ పియానోతోపాటు బ్లాకు వెల్ గిటార్‌ను వాయించేవాడు. ఈ విధానం 50ల వరకు కొనసాగింది. చార్లెస్‌ బ్రౌన్‌ మరియు నాట్‌ కింగ్‌ కోలే వంటి వారు కూడా అనుసరించేవారు.[61]

బూగీ వూగీ బేస్‌లైన్‌

1930 మరియు 1940ల్లో అర్బన్‌ బ్లూస్‌ అనుసరించే మరో ముఖ్యమైన శైలి బూగీవూగీ.[70] ఈ స్టైల్‌తరుచుగా సోలో పియానోను అనుసంధానమైనప్పటికీ, బూగీవూగీ బ్యాండ్స్, చిన్న కాంబ్లోల్లో సోలోపార్ట్ పాడేందుకు గాయకులకు సాయపడేది. మంద్ర స్వరం, ఎడమ చేతివైపు శ్రుతి స్థాయిలో అస్టినాటో లేదా అల్లరిచిల్లరగా అటూఇటూ మారుతూ ఉండటం, కుడివైపు ప్రతి శ్రుతిని విస్రృతపరిచి, కంపింపచేయడమే బూగీవూగీ యొక్క స్టైల్‌ అని చెప్పవచ్చు. బూగీవూగా చికాగోకు చెందిన జిమ్మీ యాన్సీ మరియు బూగీవూగీ త్రయం(అల్బర్‌ అమ్మన్స్, పీటీ జాన్‌సన్‌ మరియు మీడే లిక్స్‌ లూయిస్‌ ద్వారా ప్రాచుర్యం పొందింది.[71] చికాగోకు చెందిన బూగీ వూగీ ప్రదర్శకులు క్లారెన్స్ పిన్‌ టాప్‌ స్మిత్‌ మరియు ఎర్ల్‌ హైన్స్ వంటివారు రాగ్‌టైమ్‌ పియానిస్టుల యొక్క ఎడమచేతి రిథమ్స్‌ను మెలోడీ ఫిగర్‌గాను, ఇదేవిధంగా పోలి ఉండే ఆర్మ్‌స్ట్రాంగ్‌ కుడి చేతి ట్రఫెట్‌ను కలిసి ముందుకు నడిపించేవారు.[67] సున్నితంగా ఉండే లూసియానా స్టైల్‌లో ప్రొఫెసర్‌ లాంగ్‌హెయిర్‌ మరియు ఇటీవల తాజాగా డాక్టర్‌.జాన్‌ క్లాసికల్‌ రిథమ్‌ మరియు బ్లూస్‌ను బ్లూస్‌ స్టైల్‌లో మిళితం చేసేవారు.

ఆ సమయంలో మరో పెద్ద డెవలప్‌మెంట్‌ బిగ్‌ బ్యాండ్‌ బ్లూస్‌.[72] ద టెరటరీ బ్యాండ్‌ క్యాన్సస్‌ సిటీ కేందంగా పనిచేసేవి.బెన్నీ మెంటన్‌ఆర్కెస్ట్రా, జే మెక్‌షాన్‌ మరియు కౌంట్‌ బెసినీ ఆర్కెస్ట్రా వంటివి ఈ బ్లూస్‌పై దృష్టి కేంద్రీకరించాయి. బెసిల్‌ యొక్క ఒన్‌ ఓ క్లాక్‌ జంప్‌ మరియు జంపిన్‌ ఎట్‌ ద ఉడ్‌సైడ్‌ మరియు జిమ్మి రషింగ్‌ ద్వారా గోయింగ్‌ టు చికాగో మరియు సెంట్‌ ఫర్‌ యు ఎస్టర్‌డే వంటి పాటల్లో బయ్‌స్టర్స్‌ బ్లూస్‌ షౌంటింగ్‌ 12 బార్‌ బ్లూస్‌ను ఉపయోగించారు. అందరికి తెలిసిన బింగ్‌బ్యాండ్‌ బ్లూస్‌ యొక్క ట్యూన్‌ గ్లెన్‌ మిల్లర్‌ యొక్క ఇన్‌ ద మూడ్‌. 1940లో జంప్‌ బ్లూస్‌ స్టైల్‌ అభివృద్ధి చెందింది. జంప్‌బ్లూస్‌ బూగీవూగీ నుంచి ఎదిగింది. ఇది బింగ్‌ బ్యాండ్‌ మ్యూజిక్‌ ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఇది శాక్సాఫోన్‌ లేదా ఇతర బ్రాస్‌ పరికరాలు మరియు గిటార్‌ను రిథమ్‌ విభాగంలో ఉపయోగించడం ద్వారా జాజీని సృష్టించేది. అప్‌ టెంపో సౌండ్‌ను ఉపన్యాసం లేదా శబ్ద పాండిత్యంతో సృష్టించేవారు. మిస్సోరిలోని క్యాన్సస్‌ నగరానికి చెందిన లూయిస్‌ జోర్డాన్‌ మరియు బిగ్‌ జో టర్నర్‌ల యొక్క ట్యూన్లు తరువాతి కాలంలో రాక్‌ అండ్‌ రోల్‌ మరియు రిథమ్‌ అండ్‌ బ్లూస్‌లు అభివృద్ధి చెందడంలో ప్రభావాన్ని చూపాయి.[73] కాలిఫోర్నియా బ్లూస్‌ స్టైల్‌తో అనుబంధంగా ఉన్న డల్లాస్‌లో పుట్టిన టి బోన్‌ వాకర్‌, ఆల లనేజ్‌ జాన్సస్‌ మరియు లిరోయ్‌ కార్‌ యొక్క ఎర్లీ అర్బన్‌ బ్లూస్‌ నుంచి బ్లూస్‌ స్టైల్‌లోకి విజయవంతంగా పరివర్తన చెందాడు.1940ల్లో లాస్‌ఎంజెల్స్‌లో బ్లూస్‌ జాజ్‌లో ఆధిపత్యం సాధించాడు.[74][75]

1950ల్లో[మార్చు]

కంట్రీ నుంచి అర్బన్‌ బ్లూస్‌ వైపు పరివర్తన చెందడం 1920ల్లో ప్రారంభమైంది. ఆర్థిక సంక్షోభం, ఆర్థిక పురోభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్లాక్స్‌ పట్టణ ప్రాంతాలకు గ్రేట్‌ మైగ్రేషన్‌ పేరిట వలస రావడం ఇవన్నీ విజయవంతంగా ఈ పరివర్తనకు దోహదపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఏర్పడ్డ ఆర్థిక పురోగతి కారణంగా ఆఫ్రికన్‌ అమెరికన్ల జనాభా భారీగా వలస బాట పట్టారు. దీన్నే సెకండ్‌ గ్రేట్‌ మైగ్రేషన్‌ అని అంటారు. దీని ఫలితంగా అర్బన్‌ బ్లాక్స్‌ యొక్క వాస్తవ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ కొత్తవలసదారులు మ్యూజిక్‌ పరిశ్రమకు కొత్త మార్కెట్‌ను సృష్టించారు. రేస్‌ రికార్డు అదృశ్యమై, దాని స్థానంలో రిథమ్‌, బ్లూస్‌ సంగీతం వెలుగులోకి వచ్చాయి. క్రమేపీ ఎదుగుతున్న మార్కెట్‌ బిల్‌బోర్డ్‌ రిథమ్స్‌ మరియు బ్లూస్‌ ఛార్ట్‌లో ప్రతిబింబించాయి. ఈ మార్కెటింగ్‌ వ్యూహం వల్ల అర్బన్‌ బ్లూస్‌ వాద్యపరికరాల్ని విద్యుదీకరించండం, ఆంపిలిఫికేషన్‌ మరియు బ్లూస్‌ బీచ్‌ జనరలైజ్‌ చేయడం ఇలా బ్లూస్‌ ఆర్‌ అండ్‌ బి తరహాలో మారిపోయింది. ఈ వాణిజ్యపరమైన పంధా కారణంగా బ్లూస్‌ సంగీతంలో ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. బ్లూస్‌ మ్యూజిక్‌ బాజ్‌, గోస్పల్‌ సంగీతం కలిసి ఆర్‌ అండ్‌ బిలో భాగాలయ్యాయి.[76]

దస్త్రం:Muddy1.png
మోడ్రన్‌ బ్లూస్‌ స్కూలుకు ఓ టార్చ్‌లైట్‌ వాడని మడ్డీవాటర్‌ను వివరించేవారు.(1999), p. 79</ref>

రెండో ప్రపంచయద్ధం తరువాత 1950ల్లో చికాగో,[77] మెంఫిస్‌[78], డెట్రాయిట్‌[79][80] మరియు సెయింట్‌ లూయిస్[81]‌ వంటి నగరాల్లో కొత్త స్టైల్లో ఉండే ఎలక్ట్రిక్‌ బ్లూస్‌కు ప్రజాదరణ పెరిగింది. ఎలక్ట్రిక్‌ బ్లూస్‌ ఎలక్ట్రిక్‌ గిటార్లు, డబుల్‌ బ్రాస్‌( క్రమేపీ వీటి బదులు బాస్‌ గిటార్లను ప్రవేశపెట్టారు), డ్రమ్స్‌ మరియు హార్మోనికాను మెక్రోఫోన్‌ లేదా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ లేదా గిటార్‌ యాప్లిఫైయర్‌ ద్వారా ప్లే చేసేవారు. 1948లో మడ్డీ వాటర్‌ తన యొక్క మొదటి సక్సెస్‌ ఐ కాంట్‌ బీ శాటిస్ఫైడ్‌ను రికార్డ్‌ చేసినప్పటి నుంచి చికాగో ఎలక్ట్రికల్‌ బ్లూస్‌కు కేంద్రమైంది.[82] చాలా మంది ప్రదర్శకులు మిసిసిపి నుంచి వలసరావడంతో చికాగో బ్లూస్‌ మిసిసిపి బ్లూస్‌ స్టైల్‌ ద్వారా భారీగా ప్రభావితమైంది. హైలిమ్‌ వోల్ప్‌[83], మడ్డీ వాటర్స్‌[84], విల్లీ డిక్సన్[85] మరియు జిమ్మీ రీడ్‌[86], వీరంతా కూడా మిసిసిపిలో పుట్టి గ్రేట్‌ మైగ్రేషన్‌ సమయంలో చికాగోకు వలస వచ్చిన వారే. వీరు ఉపయోగించే ఎలక్ట్రికల్‌ గిటార్‌, కొన్ని సార్లు స్లైడ్‌ గిటార్‌, హార్మోనికా, బ్రాస్‌ మరియు డ్రమ్స్‌ యొక్కక రిథమ్‌ ద్వారా వీరి యొక్క శైలిని స్పష్టం చేయవచ్చు. ఎల్‌మెరా జేమ్స్‌ బ్యాండ్‌[87] లోనిజె.టి. బ్రౌన్‌ లేదా జె.బి. లీనోర్స్‌[88] కూడా శాక్సాఫోన్స్‌ను ఉపయోగించేవాడు. అయితే ఇది సోలో వాద్యపరికరంలాగా కాకుండా రిథమ్‌ సపోర్ట్‌కు మాత్రమే ఉపయోగించేవారు.

లిటిల్‌ వాల్టర్‌ మరియు సోనీ బాయ్‌ విలియమ్‌సన్‌(రైస్‌ మిల్లర్‌)లు ముందుతరం చికాగో బ్లూస్‌లో హార్మోనికా( తరువాత బ్లూస్‌ సంగీతకారులు దీన్ని హార్ప్‌ అని పిలిచేవారు)ను గణనీయంగా ఉపయోగించేవారు. బిగ్‌ వాల్టర్‌ హార్పటన్‌వంటివారు కూడా ఈ హార్మోనికాను ఉపయోగించాడు. మడ్డీ వాటర్‌ మరియు ఎల్‌మోర్‌ జేమ్స్‌లు స్టైడ్‌ గిటార్‌ను వైవిధ్యంగా ఉపయోగించడం ద్వారా చిరపరిచితులు. హాలిన్‌ వోల్ఫ్‌ మరియు మడ్డీ వాటర్‌లు తమ యొక్క లోతైన, మెరటు గొంతుతో ప్రసిద్ధి గాంచారు.

బెస్‌ గిటారిస్టు మరియు కంపోజర్‌ అయిన విల్టీ డిక్సన్‌ చికాగో బ్లూస్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ కాలంలో ఎన్నో బ్లూస్‌ పాటలను రాసి కంపోజ్‌ చేశాడు. వాటిలో హెచీ కూచీ మ్యాన్‌, ఐ జస్ట్‌ వాంట్‌ టు మేక్‌ లవ్‌ టు యు( మడ్డీ వాటర్స్‌ కోసం రాసినవి) మరియు వాంగ్‌ డాంగ్‌ డాడ్లీ మరియు హెలిన్‌ వోల్ఫ్‌ కోసం బ్యాక్‌ డోర్‌ మ్యాన్‌వంటివి ఉన్నాయి. చాలా మంది చికాగో బ్లూస్‌ స్టైల్‌ గాయకులు చికాగో కేంద్రంగా ఉండే చెస్‌ రికార్డ్స్‌ మరియు చక్కెర్‌ రికార్డ్స్‌ ద్వారా తమ రికార్డింగ్‌ జరిపేవారు. ఈ కాలంలో వీజే రికార్డ్‌ మరియు జె.ఓ.వి రికార్డ్స్‌ వంటి లేబుల్స్‌ చిన్నవిగా పరిగణించేవారు. 1950ల్లో చికాగోలో ఉన్న సంస్థలు మెంఫిస్‌ కేంద్రంగా పనిచేసే శ్యామ్‌ ఫిలిఫ్స్‌ సన్‌ రికార్డ్‌ సంస్థ ఛాలెంజ్‌ చేసింది. బి.బి. కింగ్‌ మరియు హెలిన్‌ వోల్ఫ్‌ 1960లో చికాగో వచ్చే వరకు కొనసాగింది.[89] ఆ తరువాత ఫిలిఫ్స్‌ 1954లో ఎల్విస్‌ ప్రెస్లీని కనుగొన్న తరువాత సన్‌ కంపెనీ మరింత మంది ఎక్కువ తెల్లజాతి శ్రోతులను సంపాదించుకొని రాక్‌ అండ్‌ రోల్స్‌ను అధికంగా రికార్డ్‌ చేయడం ప్రారంభించింది.[90]

1950ల్లో బ్లూస్‌ అమెరికన్‌ ప్రధాన స్రవంతిలో ప్రజాదరణ పొందిన సంగీతంపై తీవ్ర ప్రభావం చూపింది. చెస్‌ కంపెనీకి రికార్డింగ్‌ జరిపే ప్రముఖ మ్యుజిషియన్లు బో డిడ్లీ[79], [[చక్‌ బెర్రీ{/0){2/}]]లు ఇద్దరూ చికాగో బ్లూస్‌ ద్వారా ప్రభావితమయ్యారు. బ్లూస్‌లో ఉండే విషాదకర సంగీతతరహాలోనే వీరి ప్లేయింగ్‌ స్టైల్‌ ఉండేది. చికాగో బ్లూస్‌ లూసియానా జైడికో [91] సంగీతంపైనా తన ప్రభావం చూపింది. క్లిఫ్టన్‌ చెనీయర్‌[92] బ్లూస్‌ యాకెంట్స్‌ను ఉపయోగించేవాడు. జైడికో మ్యుజీషియన్లు బ్లూస్‌ ప్రమాణాలను అందుకోవడం కోసం సోలో గిటార్‌తోపాటు కాజున్‌ ఏర్పాట్లను ఉపయోగించుకునేవారు.

ఓటిస్‌ రష్‌, వెస్ట్‌ సైడ్‌ సౌండ్‌ యొక్క ప్రముఖుడు

1950ల్లో చికాగో పశ్చిమ ప్రాంతంలో కొత్త బ్లూస్‌ స్టైల్‌ ఆవిర్భవించింది. మ్యాజిక్‌ శామ్‌, బడ్డీ గై మరియు ఓటిస్‌ రష్‌లు వీటిని కోబ్రా రికార్డ్స్‌ కోసం రూపొందించారు.[93] వెస్ట్‌సైడ్‌ సౌండ్‌కు రిథమ్‌ గిటార్‌, బాస్‌ గిటార్‌, డ్రమ్స్‌ ద్వారా గై, ఫెడ్రిక్‌ కింగ్‌, మ్యాజిక్‌ శామ్‌లు బలమైన మద్దతు ఇచ్చేవారు. లూథర్‌ అలీసన్‌ యాఫ్లిఫైడ్‌ ఎలక్ట్రిక్‌ లీడ్‌ గిటార్‌తో ఆధిపత్యం సాధించేవాడు.[94][95]

జాన్‌ లీ హకర్‌ తనదైన శైలిని సృష్టించుకొని తన కెరీర్‌లో నిరంతరం మెరుగులు దిద్దాడు.

జాన్‌ లీ హకర్‌ చికాగో స్లైల్‌ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కాలేదు. జాన్‌లీ హAకర్‌ బ్లూస్‌ కేవలం వ్యక్తిగతంగా, హAకర్‌ యొక్క మెరటు స్వరం, దానికి సింగిల్‌ ఎలక్ట్రిక్‌ గిటార్‌ తోడయ్యేది. బూగీవూగీ ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పటికీ, మెరటు స్టైల్‌ కారణంగా కొన్నిసార్లు గిటార్‌ బూగీ అని పిలిచేవారు. ఇతని మొదటి హిట్‌ రికార్డ్‌ బూగీ చిలిన్‌. 1949 ఆర్‌ అండ్‌ బి ఛార్ట్స్‌ ఇది మొదటిస్థానాన్ని ఆక్రమించింది.[96]

1950 చివరల్లో బోల్టన్‌ రఫ్‌ వద్ద లైట్‌మెన్‌ స్లిమ్‌[97], స్లిమ్‌ హార్ప్‌[98], శ్యామ్‌ మైయర్స్‌, జెర్రీ మెక్‌కాన్‌ ద్వారాశ్యామ్‌ప్‌ బ్లూస్‌ అభివృద్ధి చెందింది. వీటిని జె.డి. జే మిల్లర్‌ ప్రొడ్యుస్‌ చేయగా, ఎక్సెల్లో లేబుల్‌ రికార్డ్‌ చేసింది. జిమ్మీ రీడ్‌ ద్వారా ప్రభావితమైన శ్యామ్‌ప్‌ బ్లూస్‌ తక్కువ వేగాన్ని కలిగి ఉండి చికాగో బ్లూస్‌లోని స్టైలిష్‌ ప్రదర్శకులు లిటిల్‌ వాల్టర్‌ లేదా మడ్డీ వాటర్స్‌ కంటే హారోనికాను తక్కువగా ఉపయోగించే వారు. ఈ బ్లూస్‌ నుంచి స్క్రాచ్‌ మై బ్యాక్‌, సీ ఈజ్‌ టఫ్‌ మరియు, ఐయామ్‌ ల కింగ్‌ బీ వంటి పాటలు వచ్చాయి.

1960 మరియు 1970[మార్చు]

1960 ప్రారంభం నాటికి ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంగీత ప్రభావం ఉన్న రాక్‌ అండ్‌ రోల్‌ మరియు సోల్‌ మ్యూజిక్‌లు మెయిన్‌స్ట్రీమ్‌ పాపులర్‌ మ్యూజిక్‌గా అవతరించాయి. తెల్లజాతి ప్రదర్శకులు ఆఫ్రికన్‌ -అమెరికన్‌ సంగీతానికి అమెరికాలోను, అమెరికా వెలుపల కొత్త శ్రోతలను తీసుకొచ్చారు. మడ్డీ వాటర్స్ వంటి వారు తీసుకొచ్చిన బ్లూస్‌ వేవ్‌ ఆగిపోయింది. బ్లూస్‌ గాయకులు బిగ్‌ బిల్‌ బ్రాంజీ మరియు విల్లీ డిక్సన్‌లో యూరోప్‌లో కొత్తమారెట్లను చూసుకోవడం మొదలు పెట్టారు. డిక్‌ వాటర్‌మెన్‌, అదేవిధంగా యూరోప్‌లో వాటర్‌మెన్‌ ఏర్పాటు చేసిన బ్లూస్‌ ఫెస్టివల్స్‌ బ్లూస్‌ సంగీతాన్ని విదేశాల్లో ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. యుకేలోని బ్యాండ్స్ అమెరికాలోని బ్లూస్‌ సూపర్‌స్టార్స్ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించాయి.1960ల్లో యుకే బ్లూస్‌ రాక్‌ బేస్డ్‌ బ్యాండ్‌లు ప్రభావశీల పాత్రను పోషించాయి.[99]

ల్యూసెల్లీ గిటార్‌తో బ్లూస్‌ స్టార్‌ బి.బి.కింగ్‌

జాన్‌లీ హకర్‌,మడ్డీ వాటర్స్ వంటి వారు ఔత్సాహికులైన శ్రోతల కోసం ప్రదర్శనలు ఇవ్వడం కొనసాగించారు. తద్వారా న్యూయార్క్‌లో పుట్టిన తాజ్‌మహల్‌ వంటి కొత్త ఆరిస్టులు సంప్రదాయ బ్లూస్‌ వైపు చూడటానికి స్ఫూర్తిగా నిలిచారు. జాన్‌ లీ హకర్‌ బ్లూస్‌ స్టైల్‌కు రాల్‌ను సమ్మిళితం చేసి యువకులైన తెల్లజాతి సంగీతకారులతో కలిసి ప్రదర్శించి, ఒక కొత్త మ్యూజిక్‌ స్టైల్‌ను సృష్టించాడు. 1971లో విడులైన ఆల్బమ్‌ ఎండ్‌లెస్‌ బూగీలో ఈ రకమైన మ్యూజికల్‌ స్టైల్‌ కనిపిస్తుంది. బి.బి.కింగ్‌ యొక్క విర్టియోస్‌ గిటార్‌ టెక్నిక్‌ల ద్వారా కింగ్‌ ఆఫ్‌ ద బ్లూస్‌ అనే టైటిల్‌ను దక్కించుకున్నాడు. చికాగో స్టైల్‌కు భిన్నంగా కింగ్‌ యొక్క బ్యాండ్‌ స్లైడ్‌ గిటార్‌ లేదా హార్స్‌కు బదులుగా శాక్సాఫోన్‌, ట్రంఫెట్‌, ట్రమ్‌బోర్‌ ద్వారా బలమైన బ్రాస్‌ సపోర్ట్‌ను పొందేది. టెన్నెసీలో పుట్టిన బాబీ బ్లూస్‌ బ్లాండ్‌, బి.బి. కింగ్‌ తరహాలో ఆర్‌ అండ్‌ బి సరసన బ్లూస్‌ను నడిపించాడు. ఈ కాలంలో ఫెడ్రిక్‌ కింగ్‌, అల్బర్ట్ కింగ్‌ రాక్‌ మరియు సోల్‌ మ్యూజిషియన్స్( ఎరిక్‌ క్లాప్టన్‌, బూకర్‌ టి మరియు ఎమ్‌జి)తో కలసి తరచుగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ తరహా మ్యూజిక్‌పై వీరి ప్రభావం గణనీయంగా ఉండేది.

అమెరికాలో పౌర హక్కులు మరియు ఫ్రీ స్పీచ్‌ ఉద్యమాల కారణంగా అమెరికన్‌ రూట్‌ మ్యూజిక్‌తో పాటు తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ పట్ల తిరిగి ఆసక్తి నెలకొంది.[100] దీనితోపాటు న్యూపోర్ట్ ఫ్లోక్‌ ఫెస్టివల్స్[101] అయిన జిమ్మీ బ్రాస్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్స్ సంప్రదాయ బ్లూస్‌ సంగీతానికి కొత్త శ్రోతలను తెచ్చింది. యుద్ధం ముందున్న ఆక్వాస్టిక్‌ బ్లూస్‌ పట్ల ఆసక్తి పునరుద్ధరించడానికి సాయపడింది. గాయకులు శాన్‌ హౌస్‌,మిసిసిపి జాన్‌ హర్ట్‌, స్కిప్‌ జేమ్స్, రెవరెండ్‌ గ్యారీ డెవిస్‌ వంటి వారు కూడా ఇందుకు సాయపడ్డారు.[100] యుద్ధానికి ముందున్న క్లాసికల్‌ బ్లూస్‌కు సంబంధించిన ఎన్నో స్వరరచనలు యాజూ రికార్డ్ తిరిగి పబ్లిష్‌ చేసింది. చికాగో బ్లూస్‌ మూమెంట్‌కు చెందిన జె.బి లెనోర్‌,1950ల్లో ఆక్వాస్టిక్‌ గిటార్‌ను ఉపయోగించి, కొన్ని సమయాల్లో విల్లీ డిక్సస్‌ సాయంతో ఆక్వాస్టిక్‌ బ్రాస్‌ మరియు డ్రమ్స్ సాయంతో ఎన్నో ఎల్‌పీలను రికార్డ్ చేశాడు. ఈయన పాటు కేవలం యూరోప్‌లో మాత్రమే పంపిణీ జరిగే[102] వీటిలో రాజకీయ అంశాలైన జాతి వివక్ష లేదా వియత్నాం యుద్ధ వ్యవహారం వంటి అప్పటి కాలంలోని అసాధారణ విషయాలపై వ్యాఖ్యలుండేవి. తన యొక్క అలబామా బ్లూస్‌లో ఒక పాటలో ఈ విధంగా ఉంటుంది.

నేను అలబామాకు ఎప్పటికీ తిరిగి వెళ్లను. ఎందుకంటే అక్కడ నాకు ఏ మాత్రం స్థానం లేదు( 2 ఎక్స్‌)
నీకు తెలుసు, వాళ్లు నా సోదరిని, నా సోదరుడిని చంపేశారు.
ప్రపంచంలోని ప్రజలు మొత్తం తమ స్వేచ్ఛను కోల్పోండి.

చికాగో కేంద్రంగా పనిచేసే పౌల్‌ బటర్‌ఫ్లై బ్లూస్‌మరియు బ్రిటిష్‌ బ్లూస్‌ ఉద్యమం కారణంగా 1960ల్లో తెల్లజాతి ఆడియన్స్‌ బ్లూస్‌ సంగీతం పట్ల ఆసక్తి కనపరిచారు. ద యానిమల్స్ ఫ్లీట్‌వుడ్‌ మ్యాక్‌, జాన్‌ మేయల్‌ మరియు ద బ్లూస్‌ బ్రేకర్‌,ద రోలింగ్‌ స్టోన్స్, ద యార్డీ బర్డ్స్ మరియు క్రీమ్‌ అండ్‌ వంటి బ్యాండ్లు, ఐరిస్‌ సంగీతకారుడు రోరీ గాలగేర్‌ వంటి వారు డెల్టా లేదా చికాగో బ్లూస్‌ సంప్రదాయంలోని క్లాసిక్‌ బ్లూస్‌ సాంగ్స్‌ను ప్రదర్శించేవారు.[103] లెడ్‌ జిప్పాలిన్‌ యొక్క తొలినాటి హిట్స్ అన్నీ కూడా సంప్రదాయ బ్లూస్‌ పాటలే.{1/}

1960ల నాటి బ్రిటిష్‌ మరియు బ్లూస్‌ సంగీతకారులు అమెరికన్‌ బ్లూస్‌ రాక్‌ ఫ్యూజన్‌ ప్రదర్శకులైన కేన్డ్‌ హీట్‌, ద ఎర్లీ జఫర్‌సన్‌ ఏరోప్లేన్‌,జానిస్‌ జోప్లిన్‌, జానీ వింటర్‌, ద జె.గ్లైస్‌ బ్యాండ్‌, రే కూడర్‌మరియు ఆల్‌మెన్‌ బ్రదర్స్ బ్యాండ్‌ వంటి వాటిని ప్రభావితం చేశాయి. జిమ్మీ హాండ్రిస్స్ అనే బ్లూస్‌రాక్‌ ప్రదర్శకుడు,ఈ రంగంలో అతి అరుదుగా కనిపించే వ్యక్తిగా చెప్పుకునే వారు. నల్లజాతీయుడైన ఇతడు సైకీడెలిక్‌ రాక్‌ను ప్రదర్శించేవాడు. హెండ్రిక్స్ ఒక నిపుణుడైన గిటారిస్ట్ మరియు అంతరాయాల్ని మరియు ఫీడ్‌ బ్యాక్‌ను తన యొక్క మ్యూజిక్‌లో వినూత్నంగా వినియోగించడంలో దిట్టగా ప్రసిద్ధి చెందాడు.[104] ఇలాంటి కళాకారులకు బ్లూస్‌ మ్యూజిక్‌ ప్రభావితం చేయడం ద్వారా రాక్‌ మ్యూజిక్‌ మరింత అభివృద్ధి చెందింది.[105]

1970ప్రాంతాల్లో టెక్సాస్‌ రాక్‌-బ్లూస్‌ స్టైల్‌వృద్ధి చెందింది. ఇవి గిటార్‌ను సోలో మరియు రిథమ్‌ కోసం ఉపయోగించేవి. వెస్ట్‌సైడ్‌ బ్లూస్‌కు విభిన్నంగా ఈ టెక్సాస్‌ స్టైల్‌ బ్రిటిష్‌ రాక్‌ బ్లూస్‌ఉద్యమం ద్వారా ప్రభావితమైంది. టెక్సాస్‌ స్టైల్‌లో జానీ వ్టిర్‌, స్టీవ్‌ రే వాఘన్‌, [[ద ఫ్యాబులస్‌ థండర్‌ బోల్డ్/0}మరియు జడ్‌జడ్‌ టాప్‌|ద ఫ్యాబులస్‌ థండర్‌ బోల్డ్/0}మరియు జడ్‌జడ్‌ టాప్‌]] వంటి వారు, బ్యాండ్స్‌ ప్రముఖమైనవి. ఆ తరువాత దశాబ్దం వరకు వీరు అంతర్జాతీయ స్థాయిలో గణనీయమైన విజయాన్ని సాధించలేకపోయారు.[106]

1980 నుంచి 2000 వరకు[మార్చు]

1980ల నుంచి ఆఫ్రికన్‌-అమెరికన్‌ జనాభా ఉన్న కొన్ని ప్రాంతాల్లో బ్లూస్‌ పట్ల మళ్లీ ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ముఖ్యంగా జాక్‌సన్‌, మిసిసిపి మరియు సుదూర దక్షిణ ప్రాంతాల్లో ఈ ఆసక్తి కనిపించింది. సోల్‌ బ్లూస్‌ లేదా సదరన్‌ సోల్‌ అనే ఈ మ్యూజిక్‌, జాక్సన్‌ స్థావరంగా ఉన్న మలాకో రూపొందించిన జడ్‌. జడ్‌.హిల్స్, డౌన్‌ హెబ్లూస్‌(1982),లిటిల్‌ మిల్టన్‌ ద బ్లూస్‌ ఈజ్‌ ఆల్‌రైట్‌ (1984)లో ఊహించని విధంగా విజయవంతమైన ఈ రెండు రికార్డులు ఉద్యమానికి కొత్త ఊపును ఇచ్చింది. బ్లూస్‌లోని ఈ విభాగాన్ని బాబీ రష్‌, డెన్నిసీ లా సాలే, సర్‌ ఛార్లెస్‌ జోన్స్, బ్రెట్టీ లాబెట్టీ, మార్విన్‌ సీజ్‌, పెగ్రీ స్కాట్‌ ఆడమ్స్ వంటి ఆధునిక ఆఫ్రికన్‌ అలమెరికన్‌ ప్రదర్శకులు అనుసరించారు.

టెక్సాస్‌ బ్లూస్‌ గిటారిస్ట్‌ స్టీవ్‌ రే వాఘన్‌

1980ల్లో బ్లూస్‌ సంప్రదాయ,ఆధునిక రూపాల్లో కొనసాగారు. 1986లో స్ట్రాంగ్‌ పెర్‌స్యూడర్‌ ద్వారా రాబర్ట్ క్లేకు పెద్ద బ్లూస్‌ కళాకారునిగా గుర్తింపు లభించింది.[107] స్టీవ్‌ రే వాఘన్‌ యొక్క మొదటి రికార్డ్ టెక్సాస్‌ ఫ్లడ్‌ 1983లో విడుదలైంది. తద్వారా టెక్సాస్‌కు చెందిన ఈ గిటారిస్ట్ అంతర్జాతీయ వేదికపై వెలుగులోకి వచ్చాడు. ద హీలర్‌ ద్వారా 1989లో జాన్‌ లీ హAకర్‌ తన పాపులారిటీని బలోపేతం చేసుకున్నాడు. బ్లూస్‌ బ్రేకర్స్ మరియు క్రీమ్‌తో పనిచేసిన ఎరిక్‌ క్లాప్టన్‌ 1990లో అన్‌ఫ్లగ్డ్‌తో తిరిగి ఇందులోకి ప్రవేశించాడు. ఆక్వాస్టిక్‌ గిటార్‌పై ఆయన కొన్ని స్టాండర్‌ బ్లూస్‌ పాటలను పాడాడు. అయితే 1990 ప్రారంభంలో డిజిటల్‌ మల్టీ ట్రాక్‌ రికార్డింగ్‌తోపాటు టెక్నాలజీలో ఆధునికత, కొత్త మార్కెటింగ్‌ వ్యూహాల్లో భాగంగా వీడియో క్లిప్‌ను జత చేయడం ద్వారా ధరలు పెరగడంతోపాటు బ్లూస్‌ సంగీతంలో కీలకాంశాలైన క్షణాల్లో స్పందించడం మరియు ఆశువుగా పాట కట్టడం, పాడటం వంటివి ప్రశ్నార్థకాలయ్యాయి.[108]

1980 మరియు 1990ల్లో బ్లూస్‌ లివింగ్‌ బ్లూస్‌ మరియు బ్లూస్‌ రెవ్యూ వంటి వాటిని వెలువరించి పంపిణీ చేయడంతోపాటు,ప్రధాన నగరాల్లో బ్లూస్‌ సొసైటీల ఏర్పాటవ్వడం మొదలయ్యాయి. అవుట్‌డోర్‌ బ్లూస్‌ ఫెస్టివల్స్ మరింత సామాన్యమయ్యాయి.[109] బ్లూస్‌ కోసం మరిన్ని నైట్‌ క్లబ్స్ మరియు వేదికలు ఏర్పడ్డాయి.[110]

1990ల్లో బ్లూస్‌ ప్రదర్శకులు ఈ సంగీతకళారూపాన్ని విస్రృతపరచడం మనం చూడవచ్చు. ఉదాహరణకు ఏటా బ్లూస్‌ మ్యూజిక్‌ అవార్డుల (గతంలో దీన్ని డబ్యు. సి. హ్యాండీ అవార్డులనే వారు) నామినేషనల్లో లేదా ఆధునిక మరియు సంప్రదాయ బ్లూస్‌ ఆల్బమ్‌కు సంబంధించిన బెస్ట్ గ్రామీ అవార్డుకు సంబంధించిన నామినేషన్లను గమనిస్తే[111] ఆధునిక బ్లూస్‌ మ్యూజిక్‌ను పరిరక్షిస్తున్న ఎన్నో బ్లూస్‌ కంపెనీలు కనిపించాయి. ఉదాహరణకు అలిగేటర్‌ రికార్డ్స్,రఫ్‌ రికార్డ్స్, , చెస్‌ రికార్డ్స్,(ఎమ్‌సిఏ), డెల్‌మార్క్ రికార్డ్స్,నార్తన్‌ బ్లూస్‌ మ్యూజిక్,‌మరియు వాన్‌గార్డ్ రికార్డ్స్,‌(ఆర్థమిస్‌ రికార్డ్స్) ఉన్నాయి. ఇందులో ఆర్థహలీ రికార్డ్స్, స్మిత్‌ సోనియన్‌ ఫ్లోక్‌ రికార్డింగ్స్(ఫ్లోక్‌వేస్‌ రికార్డ్ యొక్క వారసత్వ సంస్థ) మరియు యాజూ రికార్డ్స్( షాన్‌చిలీ రికార్డ్స్) వంటివి బ్లూస్‌లో అతి అరుదైన గీతాలను వెతికిపట్టుకొని వాటిని తిరిగి రూపొందించి, అందించాయి.[112]

ఇప్పటి యువ బ్లూస్‌ కళాకారులు బ్లూస్‌లోని అన్ని అంశాలను, సంప్రదాయ డెల్టా క్లాసిక్‌ నుంచి రాక్‌ ఓరియెంటెడ్‌ బ్లూస్‌ వరకు అన్నింటి ప్రదర్శించగలుగుతున్నారు. 1970 తరువాత పుట్టిన బ్లూస్‌ గాయకులు జాన్‌ మేయర్‌, కెన్నీ వైనీ షెప్పర్డ్, సీయన్‌ కాస్టెలో, షానన్‌ కర్ఫ్‌మెన్‌, ఆంథోని గోమ్స్‌, షీమెకీయా కోప్‌లాండ్‌, జానీ లాంగ్‌, కోరీ హ్యరిస్‌,సుసాన్‌ టెడిష్చి, జే డబ్యు-ఓజోన్స్‌, జో బోనామసా, మిచిలీ మలోనీ, నార్త్ మిసిసిపి ఆల్‌స్టార్స్, ఎవర్‌లాస్ట్‌, ద బ్లాక్‌ కీస్‌, బాబ్‌ లాగ్‌3, జోస్‌పి మరియు హిల్‌ స్టామ్‌లు తమదైన శైలిని అభివృద్ధి చేసుకున్నారు.[113] బ్లూ బాయ్‌ విల్లీగా పిలవబడే మెంఫిస్‌, టెక్సాస్‌కు చెందిన విలియన్‌ డేనియల్‌ మెక్‌ఫాల్స్‌ సంప్రదాయ బ్లూస్‌ గాయకుడు.

సంగీత ప్రభావం[మార్చు]

బ్లూస్‌ మ్యూజిక్‌ స్టైల్స్‌ అయిన ఫామ్స్‌(12 బార్‌ బ్లూ), మెలోడీలతోపాటు బ్లూస్‌ స్కేల్‌ ఇతర సంగీత రూపకాలలైన రాక్‌ అండ్‌ రోల్‌, జాజ్‌ ప్రభావం చూపాయి.[114] ప్రఖ్యాత పాప్‌,ఫ్లోక్‌లేదా రాక్‌ ప్రదర్శకులైన లూయిస్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌,డ్యూక్‌ ఎలింగ్‌టన్‌, మైల్స్‌, డేవిస్‌ మరియు బాబ్‌ డైలన్‌లు బ్లూస్‌ రికార్డింగ్స్‌ను పాడేవారు. ్లూస్‌ స్కేలును బాగా పాపులర్‌ అయిన బ్లూస్‌ ఇన్‌ద నైట్‌, బ్లూస్‌ ఇన్‌ ద నైట్‌, బ్లూస్‌ బలార్డ్‌కు సంబంధించిన సిన్స్‌ ఐ ఫెల్‌ ఫర్‌ యు, ప్లీజ్‌ సెండబ్‌ మీ సమ్‌వన్‌ టూ లవ్‌ మరియుజార్జి గెర్‌షిన్‌ వంటి ఆర్కెస్ట్రాకు సంబంధించిన రాప్‌సోడీ ఇన్‌ బూ మరియు కన్సర్ట్‌ ఇన్‌ ఎఫ్‌ వంటి వాటిలో తరుచుగా ఉపయోగించారు. గెర్షవాన్‌ యొక్క సోలో పియానో సెకండ్‌ ప్రీల్యూడ్‌ అనేది ఒక రకమైన నియమంతో బ్లూస్‌ ఫామ్‌ను కొనసాగించిన క్లాసికల్‌ బ్లూస్‌కు ఆసక్తికర ఉదాహరణ బ్లూస్‌ స్కేల్‌ ఆధునిక పాపులర్‌ సంగీతంలో అంతర్ణీమైపోయి, ఎన్నో ఆధునిక కోణాలను సంతరించుకుంది. రాక్‌ మ్యూజిక్‌లోని ఎగువ మూడోఅవధి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.( ఉదాహరణ; ఏ హార్డ్‌ డేస్‌ నైట్‌). బ్లూస్‌ ఫామ్స్‌ను టెలివిజన్‌ కార్యక్రమాలైన బ్యాట్‌మెన్ ‌, టీన్‌ ఐడల్‌ ఫాబియన్‌ హిట్‌ టర్న్‌ మీ లూస్‌, కంట్రీ మ్యూజిక్‌ స్టార్‌ జిమ్మీ రోడ్రిగ్స్‌ మ్యూజిక్‌ మరియు గిటారిస్టు మరియు ఒకలిస్టు అయిన ట్రేసీ ఛాంప్‌మెన్‌ సంగీతాన్ని గివ్‌ మీ వన్‌ రీజన్‌లో ఉపయోగించారు.

ఆర్‌ అండ్‌ బి మ్యూజిక్‌ను స్పిరుచ్యువల్స్‌ మరియు బ్లూస్‌లో గమనించవచ్చు. స్పిరుచ్యువల్స్‌ అనేవి న్యూ ఇంగ్లండ్‌ క్లోరల్‌ సంప్రదాయానికి వారసత్వంగా వచ్చిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఇసాక్‌ వాట్స్‌ హైమ్స్‌ను ఆఫ్రికన్‌ హైమ్స్‌ మరియు కాల్‌ అండ్‌ రెస్పాన్స్‌ ఫామ్స్‌ను సమ్మిళితం చేయడం వల్ల ఏర్పడినవి. స్పిరుచ్యువల్స్‌ లేదా మతపరమైనవి ఆఫ్రికన్‌ అమెరికన్‌ సమాజంలో బ్లూస్‌ కంటే చక్కటి రూపాన్ని కలిగి ఉన్నాయి. ఆఫ్రికన్‌ అమెరికన్‌ సమాజాలు సాముహికంగా ప్రార్థనలు చేయడానికి క్యాంప్‌ మీటింగ్స్‌ పేరిట ఒక చోట చేరడం ప్రారంభించడం వల్ల స్పిరుచ్యువల్స్‌ గీతాలు అభివృద్ధి చెందాయి.

ంట్రీ బ్లూస్‌ అయిన స్కిప్‌ జేమ్స్‌, చార్లీ పాట్రన్‌,జార్జియా టామ్‌ డోర్సెలు స్పిరుచ్యువల్‌ సింగింగ్‌ నుంచి ప్రభావితమై కంట్రీ, అర్బన్‌ బ్లూస్‌ను ప్రదర్శించారు. డోర్సె గాస్పల్‌ మ్యూజిక్‌ ప్రజాదరణ పొందేందుకు సాయపడ్డాడు.[115] గోల్డెన్‌ గేట్‌ క్వాట్రెట్‌ ద్వారా 1930ల్లో గాస్పల్‌ మ్యూజిక్‌ అభివృద్ధి చెందింది. 1950ల్లో శామ్‌ కుకీ, రే చార్లెస్‌ మరియు జేమ్స్‌ బ్రౌన్‌లు తమ సోలో మ్యూజిక్‌లో గాస్పల్‌ మరియు బ్లూస్‌ మ్యూజిక్‌ ఎలిమెంట్స్‌ను ఉపయోగించుకున్నారు. 1960,1970ల్లో గాస్పల్‌ మరియు బ్లూస్‌లు కలిసి సోల్‌ బ్లూస్‌ మ్యూజిక్‌ ఏర్పడింది. 1970ల్లోనిఫంక్మ్యూజిక్‌ సోల్‌ మ్యూజిక్‌ ద్వారా ప్రభావితమైంది. ఫంగ్‌ మ్యూజిక్‌ని పురాతన హిప్‌, ఆధునిక ఆర్‌ అండ్‌ బిగా చూడవచ్చు.

డ్యూగ్‌ ఎలింగ్టన్‌ బింగ్‌బ్యాండ్‌ మరియు బీహాప్‌ కళలను కలిపాడు ఎలింగ్టన్‌ బ్లూస్‌ఫామ్‌ను విస్త్రతంగా ఉపయోగించేవాడు.[116]

రెండో ప్రపంచయుద్ధానికి ముందు బ్లూస్‌, జాజ్‌కు మధ్య ఉన్న సరిహద్దులు అస్పష్టంగా ఉండేవి. సాధారణంగా జాజ్‌లో స్వర నిర్మాణం బ్రాస్‌ బ్యాండ్‌ల నుంచి అల్లుకునేది. బ్లూస్‌ విషయానికి వస్తే అది బ్లూస్‌ ఫామ్స్‌ అయిన 12 బార్‌ బ్లూస్‌లా ఉండేది. అయితే 1940నాటి జంప్‌బ్లూస్‌ ఈ రెండు స్టైల్స్‌ను కలిపేసింది. రెండో ప్రపంచయుద్ధం తరువాత బ్లూస్‌ జాజ్‌పై అసాధారణమైన ప్రభావాన్ని చూపింది. బీబాప్‌ క్లాసికైన చార్లెస్‌ పార్కర్‌యొక్క నౌ ద టైమ్‌ బ్లూస్‌ ఫామ్‌ను పెంటాటోనిక్‌ స్కేలు మరియు బ్లూ నోట్స్‌ ద్వారా ఉపయోగించుకుంది. బీబాప్‌ జాజ్‌ను డాన్సింగ్‌ కోసం ఉన్న పాపులర్‌ మ్యూజిక్‌ అన్న భావన నుంచి అత్యున్నత కళాత్మక విలువలున్న దానికి మార్చ గలిగింది. శ్రోతలు జాబ్‌ మరియు బ్లూస్‌ అభిమానులుగా విడిపోయారు. దీంతో ఈ రెండింటి మధ్య ఉన్న సరిహద్దును చక్కగా నిర్వచించగలిగారు. కళాకారులు ఏవరైతే జాజ్‌ మరియు బ్లూస్‌ మధ్య ఉన్న సరిహద్దును అంతరాన్ని పాటిస్తూ వచ్చారో, వారిని జాజ్‌ బ్లూస్‌ సబ్‌ జనరీ అన్నారు.[116][117]

బ్లూస్‌ యొక్క 12 బార్‌ నిర్మాణం అదే విధంగా బ్లూస్‌ స్కేలులు, రాక్‌ అండ్‌ రోల్‌ మ్యూజిక్‌నుతీవ్ర ప్రభావితం చేశాయి. రాక్‌ అండ్‌ రోల్‌ను బ్లూస్‌ విత్‌ ఏ బ్లాక్‌ బీట్‌ అని పిలిచేవారు. క్లార్‌పెర్కిన్‌ రాకాబిల్లీ (కంట్రీ బీట్‌లో పాడే బ్లూస్‌ను రాకాబిల్లీ అంటారు)అని పిలిచాడు. 12బార్‌ బ్లూస్‌ను బ్లూగ్రాస్‌ బీట్‌లో పాడే వారినికూడా రాకాబిల్లీస్‌ అని అంటారు. హూండ్‌ డాగ్‌లో 12 బార్‌ నిర్మాణాన్ని ఏ మాత్రం మార్చకుండా( శ్రుతి మరియు లిరిక్స్‌) మెలలోడీ కేంద్రంగా ఫ్లాట్‌2 టోనిక్‌( సబ్‌డామినెంట్‌లో ఫ్లాట్‌7)తో సాగే ఈ బ్లూస్‌ పాట రాక్‌ అండ్‌ రోల్‌ పాట మారిపోయింది. జెర్రీ లీ లూయిస్‌ యొక్క రాక్‌ అండ్‌ రోల్‌ స్టైల్‌ బ్లూస్‌ ప్రభావానికి తీవ్రంగా గురైంది. ఫలితంగా బూగీవూగీని కనుగొనడానికి దారితీసింది. ఇతని సంగీతం రాబాబిల్లీ మాదిరిగా లేనప్పటికీ తరచుగా దీన్ని రాక్‌ మరియు రోల్‌ అనేవారు(చాలా మంది ఆఫ్రికన్‌ అమెరికన్‌ రాక్‌ అండ్‌ రోల్‌ ప్రదర్శకులతో కలిసి ఈ పేరును పంచుకున్నాడు).తొలినాళ్లలో కంట్రీ మ్యూజిక్‌ బ్లూస్‌ వల్ల చిన్నాభిన్నమైంది.[118][119]

జిమ్మీ రోగర్స్‌, మూన్‌ ములికన్‌, బాబ్‌ విల్స్‌, బిల్‌ మెన్రో మరియు హాంక్‌ విలియన్‌స తమను తాము బ్లూస్‌ సింగర్స్‌గా వర్ణించుకునేవారు. వారి సంగీతంలో బ్లూస్‌ అనుభూతి కలిగించేంది అయితే ఎడ్డీ ఆర్నాల్డ్‌ యొక్క కంట్రీ పాప్‌కంటే ఇది భిన్నమైంది. 1970ల్లో వచ్చిన విల్లీ నీల్సన్‌ మరియువైలాన్‌ జెన్సింగ్‌ల కంట్రీ మ్యూజిక్‌ బ్లూస్‌ నుంచి అరువు తెచ్చుకున్నదే. 1950నాటికి రాక్‌ అండ్‌ రోల్‌ స్టైల్‌కు ఆదరణ తగ్గిపోవడంతోజెర్రీ లీ లూయిస్‌ తిరిగి కంట్రీ సంగీతానికి వచ్చాడు. తన ఆల్బమ్స్‌లో బ్లూస్‌ ఫీల్‌, బ్లూస్‌ ప్రమాణలుండేట్లుగా కంట్రీ మ్యూజిక్‌ను పాడేవాడు. ఎన్నో రాక్‌ అండ్‌ రోల్‌ పాటలు బ్లూస్‌ ఆధారితమైనవి. దట్స్‌ ఆల్‌ రైట్‌ మామా, జానీ బి.గోడే, బ్లూస్‌ స్కూడీ షూస్‌, హెల్‌ లాట్‌ షెకెన్‌ గోఇన్‌ ఆన్‌,షేక్‌, రాటెల్‌ అండ్‌ రోల్‌, మరియు లాంగ్‌ టాల్‌ సాలీ వంటివి. ముందుతరం ఆఫ్రికన్‌ అమెరికన్‌ రాక్‌ మ్యుజిషియన్లు సెక్యువల్‌ థీమ్స్‌తోపాటు బూతును బ్లూస్‌ మ్యూజిక్‌లో చొప్పించారు. గాట్‌ ఏ గర్ల్‌ నేమ్డ్‌ స్యూ, నోస్‌ జస్ట్‌ వాట్‌ టూ డూ(ట్యూటీ ఫ్రూటీ, లిటిల్‌ రిచర్డ్స్‌) లేదా సీ ద గర్ల్‌ విత్‌ ద రెడ్‌ డ్రెస్‌ ఆన్‌, సీ కెన్‌ డూ ద బర్డ్‌ల్యాండ్‌ ఆల్‌ నైట్‌ ఎలోన్‌. (వాట్‌ ఐ సే, రే చార్లెస్‌ )లాంటివి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 12 బార్‌ బ్లూస్‌ మ్యూజిక్‌ నిర్మాణం నావెల్టీ పాప్‌ గీతాలైన బాబ్‌ డైన్స్‌ పాడిన ఆబ్యియస్‌లీ ఫైవ్‌ బిలీవర్స్‌, ఏస్తర్‌ అండ్‌ అబి ఓఫ్రామ్‌ యొక్క సిండ్రెల్లా రాకీఫెల్లాలో చూడవచ్చు.

జనరంజక సంస్కృతిలో[మార్చు]

దస్త్రం:Tajmahalblues.jpg
1972లో సౌండర్‌ చిత్రంలో తాజ్‌మహల్‌ యొక్క మ్యూజిక్‌ను వాడటం ద్వారా ఆక్వాస్టిక్‌ బ్లూస్‌ పట్ల ఆసక్తి తిరిగి పెరిగింది

జాజ్‌, రాక్‌ అండ్‌ రోల్‌, హెవీ మెటల్‌ మ్యూజిక్‌, హిప్‌ హాప్‌ మ్యూజిక్‌, రెగ్గీ, కంట్రీ మ్యూజిక్‌, పాప్‌ మ్యూజిక్‌తరహాలోనే బ్లూస్‌ డెవిల్‌ మ్యూజిక్‌గాను, హింసను, ఇంకా చిల్లర ప్రవర్తనను కలిగి ఉందని దూషించబడేది.[120] 20వ శతాబ్ద ప్రారంభంలో తెల్లజాతి వారు బ్లూస్‌ సంగీతాన్నివినడం ప్రారంభించిన తరువాత బ్లూస్‌ను పోకిరీలుగా భావించేవారు.[59] 20వ శతాబ్ద ప్రారంభంలో డబ్యు.సి. హ్యాండీ అమెరికాలో నల్లజాతీయేతరుల్లో బ్లూస్‌ సంగీతానికి ప్రాచుర్యం కల్పించిన మొట్టమొదటి వ్యక్తి.

1960 మరియు 70ల్లో బ్లూస్‌ యొక్క పునరాగమనం సమయంలో, అక్వాస్టిక్‌ బ్లూస్‌ కళాకారుడు తాజ్‌మహల్‌ మరియు టెక్సాస్‌కు చెందిన ప్రఖ్యాత బ్లూస్‌ కళాకారుడు లైట్‌నిన్‌ హాపికిన్స్‌ రాసి ప్రదర్శించిన సంగీతాన్ని, ప్రజాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం సౌండర్‌ (1970)లో ప్రముఖంగా ఉపయోగించారు. ఈ చిత్రం ద్వారా తాజ్‌మహల్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలోగ్రామీ నామినేషన్‌తోపాటు బాఫ్టా నామినేషన్‌ పొందాడు.[121] దాదాపు 30ఏళ్ల తరువాత తాజ్‌మహల్‌, అపలాచియా సంగీతం యొక్క మూలాల్ని పరిరక్షించాలన్న అంశంపై దృష్టి సారించిన 2001లో విడుదలైన చిత్రం సాంగ్‌ క్యాచర్‌ కోసం బ్లూస్‌ను రాసి క్లా హ్యామర్‌ స్టైల్‌లో బాంజోతో స్వరకల్పన చేశాడు.

20వ శతాబ్ద చివర కాలంలో బ్లూస్‌ స్టైల్‌ మ్యూజిక్‌కు మంచి ఉదాహరణ 1980లో డాన్‌ ఆర్క్యాండ్‌ మరియు జాన్‌ ల్యాండిస్‌ విడుదల చేసిన ద బ్లూస్‌ బ్రదర్స్ ద్వారా లభించింది. ఈ చిత్రం రిథమ్‌ మరియు బ్లూస్‌ కళలో ఉద్ధండ పిండాలైన వీరిలో రే చార్లెస్‌,జేమ్స్ బ్రౌన్‌,క్యాబ్‌ కాలోవే,ఆర్థా ఫ్రాంక్లిన్‌ మరియు జాన్‌ లీ హకర్‌వంటి వారిని ఒక్క చోటకు చేర్చింది. ఒక బ్యాండ్‌గా ఏర్పడి బ్లూస్‌ బ్రదర్స్‌పేరిట విజయవంతమైన టూర్‌ను సైతం ప్రారంభించారు. 1998లో దీనికి సీక్వెల్‌ బ్లూస్‌ బ్రదర్స్‌ 2000 విడుదలైంది. ఇది విమర్శకుల మనస్సును దోచులేకపోయింది, అదేవిధంగా ఆర్థికంగానూ లాభాలు అర్జించలేకపోయింది. అయితే అధిక సంఖ్యలో బ్లూస్‌ కళాకారులు, బి.బి. కింగ్‌, బో డిడ్లీ, ఎరిక్‌యా బాడు, ఎరిక్‌ క్లాప్టన్‌, స్టీవ్‌ వైన్‌వుడ్‌, చార్లీ ముసెల్‌ వైట్‌, బ్లూస్‌ ట్రావెలర్‌, జిమ్మీ వాఘన్‌, జెఫీ బాక్టర్‌లు ఇందులో కనిపిస్తారు.

బ్లూస్‌కు విస్త్రతమైన శ్రోతలకు కల్పించేందుకు 2003లో మార్టిన్‌ స్కోర్‌సీ విశేషమైన కృషి చేశాడు. పిబిసి కోసం రూపొందించిన ద బ్లూస్‌ సీరిస్‌ డాక్యుమెంటరీల్లో పాల్గనేందుకు ప్రముఖ దర్శకులు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌,విమ్‌ వెండర్స్‌తోపాటు పలువురు ప్రముఖ దర్శకులను కోరాడు.[122] ప్రముఖ బ్లూస్‌ కళాకారుల యొక్క స్వరరచనలను అత్యాధునిక క్వాలిటీ సీడీలుగా మార్చే కార్యక్రమంలోనూ ఆయన పాల్గన్నాడు. బ్లూస్‌ గిటారిస్ట్ మరియు గాయకుడు కెబ్‌మో 2006లో టెలివిజన్‌ సిరీస్‌ ద వెస్ట్ వింగ్‌ ముగింపు కార్యక్రమంలో అమెరికా ద బ్యూటిఫుల్‌ పేరిట బ్లూస్‌యొక్క ఆల్‌టైమ్‌ హిట్స్‌ను ప్రదర్శించాడు.

ఇది కూడా చూడండి[మార్చు]

మూస:African American topics sidebar

నోట్స్[మార్చు]

 1. "The Evolution of Differing Blues Styles". How To Play Blues Guitar. మూలం నుండి 2010-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-11. Cite web requires |website= (help)
 2. ద ట్రెజర్‌ డీ లా లాంగ్వే ప్రాసిసీ ఇన్‌ఫర్‌మెటైసి బ్లూస్‌ అనే పదానికి సంబంధించిన అర్థాన్ని ఇస్తుంది. జార్జి కాల్‌మన్‌ యొక్క ఫార్స్‌లో ఇంగ్లిష్‌ భాషలోమొదటి సారి ఈ పదం వాడినట్లు ఉంది.చూడండి http://atilf.atilf.fr/dendien/scripts/fast.exe?mot=blues Archived 2010-01-18 at WebCite
 3. ఎరిక్‌,ప్యాట్రిడ్జ్‌, ఏ డిక్షనరీ ఆఫ్‌ స్లాంగ్‌ అండడ్‌ అన్‌ కన్వెన్షనల్‌ ఇంగ్లిష్‌ , 2002, రూట్‌రెడ్జ్‌(యుకె), ఐఎస్‌బిఎన్‌ 0 -415-29189-5
 4. డెవిస్‌, ఫ్రాన్సిస్‌. ద హిస్టరీ ఆఫ్‌ ద బ్లూస్‌ న్యూయార్క్, హైపారియన్‌, 1995 .
 5. టోనీ బోల్డన్‌, ఆఫ్రోాబ్లూస్‌: ఇంప్రొవిజన్స్‌ ఇన్‌ ఆఫ్రికన్‌ అమెరికన్‌ పొయిట్రీ అండ్‌ కల్చర్‌, 2004,యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ ప్రెస్‌, ఐఎస్‌బిఎన్‌ 0-252-02874-0
 6. Bob Brozman (2002). "The evolution of the 12-bar blues progression,". Retrieved 2009-05-02. Cite web requires |website= (help)
 7. శ్యామూల్‌ ఛార్టర్స్ ఇన్‌ నథింగ్‌బట్‌ ద బ్లూస్‌, పేజీ.20 20
 8. "Ellen Fullman, "The Long String Instrument", MusicWorks, Issue #37 Fall 1987" (PDF). మూలం (PDF) నుండి 2008-06-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-27. Cite web requires |website= (help)
 9. "A Jazz Improvisation Almanac, Outside Shore Music Online School". మూలం నుండి 2012-09-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-27. Cite web requires |website= (help)
 10. ఈవెన్‌, పేజీ.143 143
 11. బరోక్క్యు మరియు క్లాసిక్‌ పిరియడ్‌లో గ్రేస్‌నోట్స్‌ సర్వసాధారణంగా కనిపించేవి. ఇవి శ్రుతి నిర్మాణం కంటే ఆర్మమెంటేషన్‌కు ఎక్కువగా ఉపయోగపడేవి. ఉదాహరణకు వోల్ఫ్‌గ్యాంగ్‌ ఆమడేజ్‌ మెర్జట్‌ యొక్క పియానో కచ్చేరి నెం 21 లో డామినెట్‌లో ఫ్టాట్‌ 5ను ఉపయోగించారు. . ఆ కాలంలో ఫరఫెక్ట్‌5 వద్ద ఉండే ఒత్తిడిని తగ్గించడానికి ఈ టెక్నిక్‌ను వాడేవారు. దీనికి విరుద్ధంగా బ్లూస్‌ మెలోడిలో స్కేలులో భాగంగా ఫరఫెక్ట్‌ ప్లాట్‌ 5ను వాడేవారు.[ఉల్లేఖన అవసరం]
 12. కుంజ్‌లర్‌,పేజీ. 1065
 13. డేవిడ్‌ హాంబర్గర్‌, ఆక్వాస్టిక్‌ గిటార్‌ స్లైడ్‌ బేసిక్స్‌ , 2001, ఐఎస్‌బిఎన్‌ 1ా890490ా38ా5
 14. "Lesson 72: Basic Blues Shuffle by Jim Burger". మూలం నుండి 2011-07-20 న ఆర్కైవు చేసారు. Retrieved November 25, 2005. Cite web requires |website= (help)
 15. విల్‌బర్గ్‌ ఎమ్‌, సావిడ్జ్‌, ర్యాండీ ఎల్‌,వ్యాండన్‌బర్గ్‌, ఎవ్విథింగ్‌ ఎబౌట్‌ ప్లేయింగ్‌ ద బ్లూస్‌ ,మ్యూజిక్‌ సేల్స్‌ డిస్ట్రిబ్యూటెడ్‌, ఐఎస్‌బిఎన్‌ 1- 884848-09-5, పేజీ. 35
 16. ఫెరిస్‌, పేజీ. 230
 17. ఫెథర్‌ ఆఫ్‌ ద బ్లూస్‌, యాన్‌ ఆటోబయోగ్రఫీ బై డబ్యు.సి. హ్యాండీ, ఎడిట బై ఆర్నా బన్టెపస్‌: ఫార్వాడెడ్‌ బై అబీ నీల్స్‌, మ్యాక్‌మిలన్‌ కంపెనీ, న్యూయార్క్‌, (1941), పేజీ 143, ఫస్ట్‌ ప్రింటింంగ్‌కు ఐఎస్‌బిఎన్‌ లేదు.
 18. ఎవిన్‌, పేజీలు 142–143
 19. కొమరా పేజీ 476
 20. Allan F. Moore (2002). The Cambridge companion to blues and gospel music. Cambridge University Press. p. 32. ISBN 0521001072.
 21. ఆలివర్‌, పేజీ 281
 22. 22.0 22.1 మోరాల్స్‌, పేజీ. 277
 23. 23.0 23.1 మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు 107-149
 24. Calt, Stephen; Nick Perls, Michael Stewart. Ten years of black country religion 1926–1936 (vinyl back cover). New York: Yazoo Records. L-1022. http://www.wirz.de/music/yazoo/grafik/1022b4.jpg. 
 25. "Reverend Gary Davis". Reverend Gary Davis. 2009. మూలం నుండి 2009-02-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-03. Cite web requires |website= (help)
 26. Michael Corcoran. "The Soul of Blind Willie Johnson". Austin American-Statesman. Retrieved 2009-02-03. Cite web requires |website= (help)
 27. డేవిడ్‌ ఇవాన్స్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ. 33
 28. 28.0 28.1 కున్‌జ్‌లర్‌, పేజీ 130
 29. బ్రూస్‌ బాస్టిన్‌ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ. 206
 30. డేవిడ్‌ ఇయాన్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు 33-35
 31. జాన్‌ హెచ్‌, క్రౌనీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ. 265
 32. జాన్‌ హెచ్‌, క్రౌనీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు 268-269
 33. "Lead Belly foundation". మూలం నుండి 2010-01-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-26. Cite web requires |website= (help)
 34. Dave Oliphant. "Henry Thomas". The handbook of texas online. Retrieved 2008-09-26.
 35. గారోఫాలో, పేజీలు. 46–47
 36. ఆలివర్‌, పేజీ 3
 37. ఫిలిఫ్‌ వి.బోమన్‌, ఇమిగ్రెంట్‌, ఫ్లోక్‌ అండ్‌ రీజనల్‌ మ్యూజిక్‌ ఇన్‌ ద ట్వంటీయత్‌ సెంచురీ, ఇన్‌ ద కేంబ్రిడ్జ్‌ హిస్టరీ ఆఫ్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ , ఎడిట్‌. డెవిడ్‌ నికోలస్‌, 1999, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఐఎస్‌బిఎన్‌ 0-521-454298-8 పేజీ 285
 38. Oliver, Paul (1984). Blues Off the Record:Thirty Years of Blues Commentary. New York: Da Capo Press. pp. 45–47. ISBN 0-306-80321-6.
 39. లారెన్స్‌ డబ్యు, బ్లాక్‌ కల్చర్‌ అండ్‌ బ్లాక్‌ కాన్షియస్‌నెస్‌, ఆఫ్రో-అమెరికన్‌ ఫ్లోక్‌ థాట్‌ ఫ్రమ్‌ స్లెవరీ టూ ఫ్రీడమ్‌ , ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ 1977, ఐఎస్‌బిఎన్‌ 0-19-502374, పేజీ. 223
 40. సదరన్‌, పేజీ 333
 41. గాల్‌ఫాలో, పేజ 44
 42. ఫెరిస్‌, పేజీ. 229
 43. "Call and Response in Blues". How To Play Blues Guitar. మూలం నుండి 2008-10-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-11. Cite web requires |website= (help)
 44. మోరాల్స్‌ పేజీ-276 మెరాల్స్‌ పేజీ, బ్లాక్‌ మ్యూజిక్‌ ఆఫ్‌ టూ వరల్డ్ ‌లో జాన్‌ స్ట్రోమ్‌ రాబర్ట్‌ చేసిన వ్యాఖ్యలపైవివరణ ఇస్తూ, తన యొక్క చర్చను రాబర్ట్‌ కోట్‌ చేసిన విషయంతో ప్రారంభించాడు. బ్లూస్‌ ఫామ్స్‌లో ఆఫ్రికన్‌ క్వాలిటీ కనిపించనప్పటికీ, కరేబియన్‌ మ్యూజిక్‌ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
 45. అలివర్‌,పేజీ 4
 46. శామ్యూల్‌ ఛాప్టర్స్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌,పేజీ 25
 47. Barbara Vierwo, Andy Trudeau. The Curious Listener's Guide to the Blues. Stone Press. p. 15. ISBN 0-399-53072-X.
 48. From the Erotic to the Demonic: On Critical Musicology. Oxford University Press. 2003. p. 182. A blues idiom is hinted at in "A Negro Love-Song", a pentatonic melody with blue third and seventh in Colridge-Taylor's African Suit of 1898, many years before the first blues publications.
 49. Bill Steper (1999). "African-American Music from the Mississippi Hill Country: "They Say Drums was a-Calling"". The APF Reporter. మూలం నుండి 2008-09-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-10-27. Cite web requires |website= (help)
 50. శామ్యూల్‌ ఛాప్టర్స్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు 14-15
 51. శామ్యూల్‌ ఛాప్టర్స్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ 16
 52. గార్‌ఫాలో, పేజీ 44 పెరుగుతున్న క్రాస్‌ కల్చర్‌ సంబంధాలు ప్రతిబింబించే విధంగా క్రమేపీ వాద్యపరికరాలు, శ్రుతికి స్ధానం కల్పించారు. ఇతర రచయితలు కూడా ఇథోపియన్‌ ఎయిర్స్‌ మరియు నీగ్రో స్పిరుచ్యువల్స్‌ గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు.
 53. ఘులర్‌ గారఫాలోలో పేర్కొన్నాడు పేజీ.27
 54. చార్లెస్‌ వోల్‌ఫీ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు . 233-263
 55. గార్‌ఫాలో, పేజీ 44–47 మార్కెటింగ్‌ కేటగిరీల ప్రకారం రేస్‌ మరియు హిల్‌బిల్లీలను ఉద్దేశ్యపూర్వకంగానే వారి యొక్క జాతి ఆధారంగా వేరుచేశారు. వారి సంగీతం పరస్పరం విరుద్ధ మార్గాల ద్వారా వచ్చిందనన్నభావనను సౌలభ్యం కోసం వాడారు. సాంస్కృతిక పరంగా బ్లూస్‌ మరియు కంట్రీ మ్యూజిక్‌ అవి విడదీసిన దానికంటే కూడా ఆ రెండూ సమానమే. కొన్ని సార్లు రికార్డ్‌ కంపెనీల యొక్క కేటలాగ్‌ల్లో ఆరిస్టుల యొక్క జాతిని తప్పుగా పేర్కొనే వారని గార్‌ఫాలో పేర్కొన్నాడు.
 56. Golding, Barrett. "The Rise of the Country Blues". NPR. Retrieved 2008-12-27. Cite web requires |website= (help)
 57. మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ 110
 58. గారోఫాలో, పేజీ గార్‌ఫాలో బార్‌ లో గుర్తించి వివరణ ఇస్తూ హ్యాండీకు ఆకస్మికంగా విజయం రావడంతో బ్లూస్‌లో ఉన్న వాణిజ్య పరమైన సత్తా బయటపడింది. దీంతో ఆ కళ టిన్‌పాన్‌ అలే హాక్స్‌కు మరింత ఆసక్తికరంగా మార్చింది( గార్‌ఫాల్‌ యొక్క వివరణలు)
 59. 59.0 59.1 క్లార్క్‌, పేజీ.141 27
 60. "Kentuckiana Blues Society". Retrieved 2008-09-26. Cite web requires |website= (help)
 61. 61.0 61.1 గారోఫాలో, 138
 62. క్లార్క్‌‌, పేజీ 141
 63. Calt, Stephen; Nick Perls, Michael Stewart. The Georgia Blues 1927–1933 (vinyl back cover). New York: Yazoo Records. L-1012. http://www.wirz.de/music/yazoo/grafik/1012b4.jpg. 
 64. Phoenix Delray (2008-08-17). "The history of Memphis blues music". Retrieved 2008-08-27. Cite web requires |website= (help)
 65. Kent, Don (1968). 10 Years In Memphis 1927–1937 (vinyl back cover). New York: Yazoo Records. L-1002. http://www.wirz.de/music/yazoo/grafik/1002b4.jpg. 
 66. Calt, Stephen; Nick Perls, Michael Stewart (1970). Memphis Jamboree 1927–1936 (vinyl back cover). New York: Yazoo Records. L-1021. http://www.wirz.de/music/yazoo/grafik/1021b4.jpg. 
 67. 67.0 67.1 గారోఫాలో, పేజీ. 47
 68. హాకీ హార్‌మన్‌, జనరల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఆన్‌ ఆఫ్రికన్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ , బ్లూస్‌ ఫౌండేషన్‌, ఎస్సేలు: వాట్‌ ఈజ్‌ ద బ్లూస్‌ http://www.blues.org/blues/essays.php4?Id=3 Archived 2008-12-10 at the Wayback Machine.
 69. క్లార్క్‌, పేజీ. 137
 70. Piero Scaruffi (2005). "A brief history of Blues Music". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 71. Oliver, Paul. Boogie Woogie Trio (vinyl back cover). Copenhagen: Storyville. SLP 184. 
 72. Piero Scaruffi (2003). "Kansas City: Big Bands". Retrieved 2008-08-27. Cite web requires |website= (help)
 73. గారోఫాలో, పేజీ 76
 74. కొమరా, పేజీ 120
 75. మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీలు 175-177
 76. బ్యారీ పియర్‌సన్‌ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌ , పేజీలు 313-314
 77. కొమరా, పేజీ, 118
 78. మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజ 179
 79. 79.0 79.1 హర్జ్‌హాఫ్ట్‌, పేజీ. 53
 80. Pierson, Leroy (1976). Detroit Ghetto Blues 1948 to 1954 (vinyl back cover). St. Louis: Nighthawk Records. 104. http://www.wirz.de/music/nighthaw/grafik/104b4.jpg. 
 81. Piero Scaruffi (2003). "A brief history of Rhythm'n'Blues". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 82. మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ 180
 83. Piero Scaruffi (1999). "Howlin' Wolf". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 84. Piero Scaruffi (1999). "Muddy Waters". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 85. Piero Scaruffi (1999). "Willie Dixon". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 86. Piero Scaruffi (1999). "Jimmy Reed". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 87. Piero Scaruffi (1999). "Elmore James". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 88. Piero Scaruffi (2003). "J. B. Lenoir". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 89. మార్క్‌ ఎ. హంఫ్రీ, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌, పేజీ 187
 90. బ్యారీ పియర్‌సన్‌ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌ , పేజ 342
 91. హర్జ్‌హాఫ్ట్‌, పేజ 236
 92. హర్జ్‌హాఫ్ట్‌, పేజీ. 35
 93. కొమరా, పేజ 49
 94. "Blues". Encyclopedia of Chicago. Retrieved 2008-08-13.
 95. C. Michael Bailey (2003-10-04). "West Side Chicago Blues". All about Jazz. Retrieved 2008-08-13.
 96. లార్స్‌ బోజాన్‌, బిఫోర్‌ మోటౌన్‌ , 2001, యూనివర్సిటీఆఫ్‌ మిచిగాన్‌ ప్రెస్‌ ఐఎస్‌బిఎన్‌ 0-472-06765-6, పేజీ. 175
 97. హర్జ్‌హాఫ్ట్‌, పేజీ.116
 98. హర్జ్‌హాఫ్ట్‌, పేజీ. ; [188]
 99. జిమ్‌ ఓ నీల్‌ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌,పేజీలు 347-387
 100. 100.0 100.1 కొమరా, పేజీ 122
 101. కొమరా, పేజీ 388
 102. జిమ్‌ ఓ నీల్‌ ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌ 380
 103. "A Short Blues History". History of Rock. Retrieved 2008-08-14.
 104. గార్‌ఫాలో, పేజీలు, 224–225
 105. "History of heavy metal: Origins and early popularity (1960s and early 1970s)". 2006-09-18. Retrieved 2008-08-13. Cite web requires |website= (help)
 106. కొమరా, పేజీ 50 50
 107. Piero Scaruffi (2005). "The History of Rock Music: 1976–1989, Blues, 1980-81". Retrieved 2008-08-14. Cite web requires |website= (help)
 108. మ్యారీ కాథరిన్‌ ఆల్‌డిన్‌, ఇన్‌ నథింగ్‌ బట్‌ ద బ్లూస్‌,పేజీ 130
 109. ఎ డిక్షనరీ ఆఫ్‌ ద మోస్ట్‌ సిగ్నిఫికెంట్‌ బ్లూస్‌ ఫెస్టివల్‌ను ఈ దిగువ వెబ్‌సైట్‌లో గమనించవచ్చు. http://blues.about.com/od/bluesfestivals/ Archived 2006-10-13 at the Wayback Machine.
 110. ఏ లిస్ట్‌ ఆఫ్‌ ఇంపార్టెట్‌ బ్లూస్‌ వెన్యూస్‌ ఇన్‌ ద యు.ఎస్‌ను ఈ వెబ్‌సైట్‌లో గమనించవచ్చు.http://blues.about.com/cs/venues/
 111. "Blues Music Awards information". మూలం నుండి 2006-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved November 25, 2005. Cite web requires |website= (help)
 112. ఏ కంప్లీట్‌ డిక్షనరీ ఆఫ్‌ కంటెంపరీ బ్లూస్‌లేబుల్‌ను ఈ వెబ్‌సైట్‌లో గమనించవచ్చు http://blues.about.com/cs/recordlabels/
 113. Blues Babies.741.com
 114. Jennifer Nicole (2005-08-15). "The Blues: The Revolution of Music". మూలం నుండి 2008-09-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
 115. Phil Petrie. "History of gospel music". Retrieved 2008-09-08. Cite web requires |website= (help)
 116. 116.0 116.1 [177]
 117. Peter Van der Merwe (2004). Roots of the classical: the popular origins of western music. Oxford University Press. p. 461. ISBN 0198166478.
 118. "The Blues Influence On Rock & Roll". Retrieved 2008-08-17. Cite web requires |website= (help)
 119. "History of Rock and Roll". Zip-Country Homepage. మూలం నుండి 2008-08-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-02.
 120. ఎస్‌ఎఫ్‌ గేట్‌
 121. సౌండర్‌, ఇంటర్‌నెట్‌ మూవీ డేటాబేస్‌, 11-14, 2007 నాడు తీయబడింది.
 122. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో "The Blues" (2003) (mini)

సూచనలు[మార్చు]

 • Barlow, William (1993). "Cashing In". Split File: African Americans in the Mass Media: 31.
 • బ్రాడ్‌ఫోర్డ్,స్టీవ్‌ బ్లూస్‌ ఇన్‌ ద లోవర్‌ చట్టరూచీ వ్యాలీ, సదరన్‌ స్పేసెన్‌ 2004
 • Clarke, Donald (1995). The Rise and Fall of Popular Music. St. Martin's Press. ISBN 0-312-11573-3.
 • Lawrence Cohn, సంపాదకుడు. (1993). Nothing But the Blues: The Music and the Musicians. Abbeville Press. ISBN 1558592717. Unknown parameter |publisherlink= ignored (help)
 • Dicaire, David (1999). Blues Singers: Biographies of 50 Legendary Artists of the Early 20th Century. McFarland. ISBN 0-7864-0606-2.
 • Ewen, David (1957). Panorama of American Popular Music. Prentice Hall. ISBN 0-13-648360-7.
 • Ferris, Jean (1993). America's Musical Landscape. Brown & Benchmark. ISBN 0-697-12516-5.
 • Garofalo, Reebee (1997). Rockin' Out: Popular Music in the USA. Allyn & Bacon. ISBN 0-205-13703-2.
 • Herzhaft, Gérard, Paul Harris and, Brigitte Debord (1997). Encyclopedia of the Blues. University of Arkansas Press. ISBN 1-557-28452-0.CS1 maint: multiple names: authors list (link)
 • Komara, Edward M. (2006). Encyclopedia of the blues. Routledge. ISBN 0-415-92699-8.
 • Kunzler, Martin (1988). Jazz Lexikon (German లో). Rohwolt Taschenbuch Verlag. ISBN 3-499-16316-0.CS1 maint: unrecognized language (link)
 • Morales, Ed (2003). The Latin Beat. Da Capo Press. ISBN 0-306-81018-2.
 • Oliver, Paul and Richard Wright (1990). Blues fell this morning: Meaning in the blues. Cambridge University Press. ISBN 0-521-37793-5.
 • Schuller, Gunther (1968). Early Jazz: Its Roots and Musical Development. Oxford University Press. ISBN 0-19-504043-0.
 • Southern, Eileen (1997). The Music of Black Americans. W. W. Norton & Company, Inc. ISBN 0-393-03843-2.
 • "Muslim Roots of the Blues". SFGate. Retrieved August 24, 2005.

అధిక సమాచారం[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

Blues music గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

మూస:Americanrootsmusic మూస:Blues మూస:United States topics

"https://te.wikipedia.org/w/index.php?title=బ్లూస్&oldid=2815668" నుండి వెలికితీశారు