బ్లెక్ లైవ్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Blake Lively
Blake Lively.jpg
At The CW Upfront Presentation in May 2009
జననం (1987-08-25) 1987 ఆగస్టు 25 (వయస్సు: 32  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1998; 2005–present

బ్లెక్ లైవ్లీ (1987, ఆగష్టు 25న పుట్టింది) అమెరికన్ టీవీ, సినిమా నటి. ఈవిడ నవల ఆధారిత టీవీ కార్యక్రమం గాసిప్ గర్ల్లో తన పాత్ర సెరెనా వాన్ డెర్ వుడ్సెన్‌తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈమె యాక్సెప్టడ్, ది సిస్టర్ హుడ్ ఆఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ అలానే దాని తరువాతి భాగం ది సిస్టర్ హుడ్ ఆఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ 2 వంటి సినిమాలలో నటించింది.

బాల్య జీవితం[మార్చు]

లైవ్లీ నటులు ఎర్నీ మరియు ఎలయ్న్ లైవ్లీ దంపతులకు లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఈమె సథరన్ బాప్టిస్ట్‌గా పెరిగింది.[1] ఈమె ఐదుగురు సహోదరులలో చిన్నది,[2] లైవ్లీకి ఒక అన్న ఎరిక్, ఇద్దరు అక్కలు లోరీ, రోబిన్, ఒక అన్న జాసన్ ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు, సహోదరులందరూ వినోద పరిశ్రమలోనే ఉన్నారు.[3] లైవ్లీ చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు ఆమెని తమతోపాటు వారు నేర్పే నట శిక్షణా తరగతులకి తీసుకు వెళ్ళేవారు, ఎందుకంటే వారికీ ఆమెని ఆయా దగ్గర వదలడం ఇష్టం లేకపోవడం వలన.[3] తన తల్లిదండ్రులు నటనా తరగతులని బోధించడాన్ని చూడడం నటనా "వ్యాయామాలు" నేర్చుకోవడానికి ఉపకరించిందని, ఇది తను పెద్దయ్యాక ఆత్మవిశ్వాసం పొందడానికి సహాయపడిందని లైవ్లీ చెప్పింది.[2][3] చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమెని వారంలో రెండుసార్లు డిస్నీల్యాండ్కి "కొంచెం ఎక్కువ సమయం గడపడానికి;" తీసుకువచ్చేదని లైవ్లీ చెప్పింది, ఎక్కువ సమయం అక్కడ గడపడంవలన ఆమె "తను డిస్నీ ల్యాండ్ లోనే పెరిగినట్లు" భావించేదానినని లైవ్లీ చెప్పింది.[2]

లైవ్లీ తల్లి జార్జియా నుంచి వచ్చిన మాజీ మోడల్, ఈమె లైవ్లీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకి బట్టలమీద మంచి శ్రద్ధ రావడానికి స్ఫూర్తిగా నిలిచింది.[4] లైవ్లీ చిన్నతనంలో ఆమె తల్లి ఆమె దుస్తుల్ని బోటిక్లు, వింటేజ్ స్టోర్ ల నుంచి తెప్పించి వేసేది. ఆమెకి సరిపోయేలా పెద్దవాళ్ళ బట్టలని కూడా కుట్టించేది. లైవ్లీ, "ఆమె చాలా సృజనాత్మకత కలది కాబట్టే అలా చేసేది ఎందుకంటే ఆమెకి నేను మిగత పిల్లలలాగా పెద్ద టీ-షర్ట్స్ ని ప్లాస్టిక్ క్లిప్ తో కలిపి ధరించడం ఇష్టం ఉండేదికాదు."[4] లైవ్లీ ఇంకా ఆమె బట్టల అల్మారా కారణంగా ఆమె లాస్ ఏంజిల్స్ లోని ఒక ప్రైవేట్ స్కూలులో రెండవ తరగతిలో తన జీవితంలో మొదటి మరియు ఒకేసారి చేరినపుడు ఇమడలేకపోయింది అని చెప్పింది." నన్ను జనాలు వింతగా చూసిన ఏకైక బడి అది [...] వారు నా బట్టలని ఎగతాళి చేసేవారు ఎందుకంటే నేను మిగతా పిల్లల కంటే భిన్నంగా బట్టలు వేసుకొనేదానిని."[4]

లైవ్లీ చిన్నతనంలో ఆమె 13 వేర్వేరు బడులలో చేరింది. ఆమె మూడేళ్ళ వయస్సులో ఆమె తల్లి ఆమెని ఒకటో తరగతిలో చేర్చింది ఎందుకంటే లైవ్లీ అన్నయ్య ఒంటరిగా బడికి వెళ్ళడానికి ఇష్టపడకపోవడంవలన. ఆమె తల్లి బడివాళ్ళకి "ఆమె బాగా పొడుగ్గా ఉన్న కారణంగా" లైవ్లీ ఆరేళ్ళది అని చెప్పింది.[2] కొన్నివారాల తరువాత ఆమె ఉపాధ్యాయులు "నన్ను మానసిక వికలాంగుల తరగతులలో పెడతామని చెప్పారు ఎందుకంటే నేను మిగతా విద్యార్థుల స్థాయికి తగనని," ఇంకా వాళ్ళు ఆమె "చాలా నెమ్మది, మిగతా పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్స్ చేస్తుంటే నేను నిద్రపోవడానికి ఇష్టపడేదాన్నని" వాళ్ళు అనుకొనేవారు. కొద్దికాలం తరువాత లైవ్లీ తల్లి ఆమెని బడి నుంచి బయటికి తీసుకువచ్చింది.[2] లైవ్లీ బుర్బ్యాంకు లోని బుర్ బ్యాంకు ఉన్నత పాఠశాలలో చదివింది; బడిలో ఉన్నప్పుడు లైవ్లీ బుర్ బ్యాంకు ఉన్నత పాఠశాల ప్రదర్శక మేళ పాటలలో, చీర్ లీడర్ గానూ పాల్గొంది.[5] నిజానికి లైవ్లీ నట వృత్తిలోకి అడుగు పెట్టకముందు, తన ఉన్నత పాఠశాల చదువు ముగిసిన తరువాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాలని అనుకొంది.[3] బ్లేక్ పదిహేనేళ్ళ వయస్సప్పుడు ఆమె అన్నయ్య ఎరిక్ ఆమెని యూరోప్ యాత్రకి వెళ్ళడంకోసం బడి నుంచి రెండు నెలలకిగానూ బయటకి తీసుకువచ్చాడు. ఈయాత్రలో ఎరిక్ చాలా వరకు లైవ్లీని నట వృత్తి వైపు మళ్ళించడానికి చూశాడు.[3]

బ్లేక్ లైవ్లీకి నటన మీద ఏమాత్రం ఆసక్తి లేదు కానీ ఆమె జూనియర్ మరియు సీనియర్ సంవత్సరాల మధ్యకాలంలోని వేసవిలో ఆమె అన్న ఎరిక్ తన కార్యదర్శిని ఆమెతోపాటు బయటికి పంపి కొన్ని నెలల పాటు కొన్ని పరీక్షలలో పాల్గొనేలా చేశాడు; ఆకొన్ని పరీక్షలలోనే ఆమెకి ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్లో బ్రిడ్జట్ పాత్ర దక్కింది.[6] లైవ్లీ ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ లోని తన సన్నివేశాలను బుర్ బ్యాంకు ఉన్నతలో తన జూనియర్ మరియు సీనియర్ మధ్య సమయంలో పూర్తిచేసింది.[6] 2008లో తన గాసిప్ గర్ల్ ఒప్పందం మూలంగా స్టాన్ఫోర్డ్ తన తదుపరి భవిష్యత్తు కాలేకపోయిందని లైవ్లీ చెప్పింది, ఆమె తన కళాశాల విద్య ఆలోచనని పూర్తిగా పక్కకు పెట్టలేదు.[6] కొలంబియా యూనివర్సిటీలో వారానికి ఒకరోజు వెళ్ళడం అనేది ఒక అవకశం మాత్రమే అని అది కూడా తను గాసిప్ గర్ల్లో పాత్రని అంగీకరించడం వలన ఏర్పడిన అవక్షమని ఆమె చెప్పింది; ఏమైనా ఆమె ఇప్పటికి ఏ తరగతులలో నమోదుచేసుకోలేదు.[6]

వృత్తి[మార్చు]

A young blonde female wearing an orange dress. The female is making a hand gesture with her right hand.
2008 ఆగష్టు 8 న్యూయార్క్ నగరంలో ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ యొక్క ప్రదర్శన చాల చక్కగా ఉంది.చిత్రంలో అద్భుతమైన ప్రదర్శనలకు విమర్శకుల నుండి ప్రసంశలు వచ్చాయి.

లైవ్లీ తన నట వృత్తిని 11 ఎల్ల వయస్సులో మొదలుపెట్టింది, లైవ్లీ తండ్రి దర్శకత్వం వహించిన సాండ్ మాన్ సినిమాలో 1998 లో తను కనిపించింది. లైవ్లీ ఈ సినిమాలో తన పాత్రని "చిన్న భాగంగా" అభివర్ణించింది.[7] దాదాపు ఏడేళ్ళపాటు నటనతో ఎటువంటి సంబంధం లేకుండా గడిపిన తరువాత లైవ్లీ 2005లో అదే పేరుతో తీసుకున్న నవల ఆధారిత సినిమా ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్లో కనిపించింది. లైవ్లీ అమెరికా ఫేర్రేరా, అంబర్ టాంబ్లిన్, అలెక్సిస్ బ్లేడేల్ లతోపాటు నలుగురు ప్రధాన స్త్రీ పాత్రలలో ఒకటైన బ్రిడ్జట్ గా నటించింది. ఈ సినిమాలో లైవ్లీ అభినయం "ఛాయిస్ మూవీ బ్రేకవుట్-ఫిమేల్" టీన్ ఛాయిస్ అవార్డ్ ప్రతిపాదన సంపాదించిపెట్టింది." $42 మిలియన్ల బాక్సాఫీస్ ఆదాయంతో, ఈ సినిమా దాని తరువాయి భాగంతో అధిగమించబడనంతవరకు లైవ్లీ వృత్తిలో పెద్ద వ్యాపారాత్మక విజయం సాధించిన చిత్రం.[8]

2006లో ఈమె జస్టిన్ లాంగ్ తో యాక్సేప్టేడ్ చిత్రంలో నటించింది, లైవ్లీ తన అన్నా,అక్కలు రాబిన్, ఎర్నీ, లోరీలతో వారు చిన్న చిన్న పాత్రలలో సిమోన్ సేస్ అనే భయోత్పాదక సినిమాలో నటించింది. యాక్సేప్టేడ్ విమర్శకుల ప్రశంసలు అందుకోలేదు, లైవ్లీ అభినయానికి మాత్రం హాలివుడ్ లైఫ్ నుంచి 'బ్రేక్ త్రూ అవార్డ్' విభాగంలో బహుమతి సంపాదించిపెట్టింది. 2007లో లైవ్లీ ఎల్విస్ అండ్ అనబెల్లె లోని రెండు ప్రధాన పాత్రలలో అనబెల్లెగా నటించింది, ఈ పాత్ర ఎక్కువగా ఆహారం తీసుకొనే అమ్మాయి అందాలపోటిలో గెలవాలనుకుంటుంది. లైవ్లీ పాత్ర యొక్క స్వభావంలోకి వెళ్ళడం కోసం ఆమె ఎత్తుకి 'బరువు విపరీతంగా తగ్గించింది'. లైవ్లీ: "అందాల రాణులు ఇప్పటికీ మంచి బిగువు కలిగిఉంటారని [...] అందుకని నేను బరువు తగ్గించాను కానీ బిగువు పొందాను. ఇదే నేను మంచి ఆరోగ్యంగా ఉన్న సమయం. నేను జార్జ్ ఫోర్మేన్ గ్రిల్ నుంచి కోడి గుండెలను ఆస్పరాగస్ బ్రోకోలిలతో కలిపి తినేదాన్ని."[9] లైవ్లీ ఈ పద్ధతి తనకి చాల క్లిష్టమైనదని ఎందుకంటే "ఆమె జీవితంలో మొదటగా ప్రేమించేది" తిండినే కాబట్టి.[9] మూవీలైన్.కాం ఈ సినిమాలో ఆమె అభినయాన్ని ప్రశంసించి ఆమెని "బ్రేక్ త్రూ రోల్" బహుమతితో సత్కరించింది.[10]

లైవ్లీ 2007 సెప్టంబర్ లో మొదలైన CW's భాగాలు గాస్సిప్ గర్ల్లో నటించింది. ఈమె ఈ యువ నాటకంలో సెరెనా వాండర్ వుడ్సన్ గా నటించింది.[11] గాసిప్ గర్ల్ సహా-నటుల మధ్య గొడవల గురించి టాబ్లాయిడ్స్ పుకార్లను ప్రచురించాయి, లైవ్లీ సెట్ మిద అస్నేహ పోటీని ఖండించింది.

"మీడియా ఎప్పుడూ మా మధ్య గొడవలని పెట్టటానికి చూస్తుంది," అని చెప్పింది, "ఇది చెప్పటానికి ఆసక్తిని కలిగించకపోయినా చెప్తాను 'మేమంతా 18 గంటలు పని చేసి నిద్ర పోవడానికి ఇంటికి వెళతాము.' నేననుకోవడం అది హాస్యం కోసం చదవడం కాదు."[3] ఆమె మొదటి మాగజిన్ ముఖచిత్రం నవంబరు 2007 కాస్మో గర్ల్ సంచిక, ఇందులో ఆమె తన ఉన్నత విద్య రోజులు, గాసిప్ గర్ల్తో వృత్తి వైపు మళ్ళటం వంటివి ఉన్నాయి.[12]

2008లో లైవ్లీ ఫేర్రేరా, బ్లేడేల్, టంబ్లిన్ తోపాటు ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ 2008 తరువాయి భాగంలో తన పాత్రని తిరిగి పోషించింది. మొదటి సినిమాకి సమాంతరంగా లైవ్లీ ఆమె ముగ్గురు సహా-నటులు, సినిమా అన్ని విమర్శకుల నుంచి మంచి స్పందనని పొందాయి.[13][14] 2009 నవంబరు న ఈ సినిమా $44 మిలియన్లు బాక్సాఫీస్ వద్ద సంపాదించింది, దీని ముందు భాగంకన్నా కొంచెం ఎక్కువగా సంపాదించి ఈ సినిమా లైవ్లీ వృత్తిలో ఇప్పటివరకు వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించిన సినిమాగా నిలిచింది.[15] 2009లో లైవ్లీ గాబ్రియల్లె డిమార్కోగా ఒక చిన్న పాత్రలో శృంగార హాస్య చిత్రంలో కనిపించింది, 2006 సినిమా పారిస్, జే టేమేకి వరుసగా వచ్చిన న్యూయార్క్, ఐ లవ్ యు, దాదాపు అదే నటవర్గంతో వచ్చింది. ఈ నటవర్గంలో షియా లాబెవోఫ్, నటాలియే పోర్ట్ మాన్, హేడన్ క్రిస్తేన్సన్, రాచెల్ బిల్సన్, ఓర్లాండో బ్లూం ఉన్నారు. ముందటి భాగానికి వలెనే ఈసినిమా కూడా ప్రామాని వెతుక్కొనే చిన్న చిన్న భూమికలతో స్వల్ప నిడివి చిత్రాలతో కూర్చింది.[16] విమర్శకుల మంచి స్పందన తరువాత కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడలేదు.[16][17]

ఇప్పటివరకు లైవ్లీ చేసిన గుర్తుంచోకోదగిన పాత్ర ఆమె సహాయ పాత్ర చేసిన ది ప్రైవేట్ లైవ్స్ ఆఫ్ పిప్పాలీ (2009) లో ప్రధాన పాత్ర యువ భాగం.[18] బ్రిస్బేన్ టైమ్స్కు చెందిన పాల్ బైర్న్స్ ఈ సినిమాలో లైవ్లీ అభినయాన్ని "సంచలనాత్మకంగా" అభివర్ణించాడు.[19] ఈసినిమాలో కీను రీవ్స్, వినోనా రీడర్, రోబిన్ రైట్ పెన్ కూడా ఉన్నారు, ఇది తొలి ప్రదర్శన టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జరిగిన తరువాత నవంబరు 27న యునైటెడ్ స్టేట్స్ లో తక్కువ ప్రతులతో విడుదలయ్యింది.[20] 2009 అక్టోబరులో లైవ్లీ 2010లో రాబోతున్న చక్ హోగన్ నవల ప్రిన్స్ అఫ్ థీవ్స్ నవల ఆధారిత సినిమా ది టౌన్లో తన పాత్ర క్రిస్టా కౌహ్లిన్ దృశ్యాలను చిత్రీకరించడంలో నిమగ్నమయ్యింది.[21] ఈ సినిమాలో లైవ్లీ పాత్ర "జెమ్ సోదరి మరియు 19-నెలల కూతురు గల డ్రగ్స్ మాజీ-ప్రేయసి షైన్"గా అభివర్ణించబడింది.[22] బెన్ అఫ్లేక్ కూడా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణకార్యక్రమాలలో ఉండి 2010, సెప్టంబర్ 10న విడుదల అవడానికి సిద్ధమవుతుంది. మేరి క్లెయిర్తో ముఖాముఖిలో లైవ్లీ తను నటిగా వృత్తిని కొనసాగించదలచుకోలేదని, తన సొంత గృహ-అలంకరణ వ్యాపార సంస్థ ప్రత్యామ్నాయంగా ఉంచుకోన్నానని, తనకి రంగులు మరియు అల్లికలు ఎంతో ఇష్టమైనవని" చెప్పింది.[2][23] 2010 జనవరిలో రాబోతున్న 2011 సూపర్ హీరో సినిమా గ్రీన్ లాంతేన్లో లైవ్లీ కారోల్ ఫెర్రిస్ గా నటించబోతున్నదని ప్రకటించబడింది.[24]

వ్యక్తిగత జీవితం[మార్చు]

బ్లేక్ లైవ్లీ తన చిన్ననాటి స్నేహితుడైన నటుడు కెల్లీ బ్లాట్జ్ తో 2004 నుండి 2007 వరకు స్నేహం చేసింది.[25] 2007 చివరిలో లైవ్లీ తన గాసిప్ గర్ల్ సహా-నటుడు, చిన్నప్పటి సహాధ్యాయి పెన్న్ బాడ్జిలీతో స్నేహం చేస్తుందని పుకార్లు వ్యాపించాయి.[26] 2008 మేలో పీపుల్ పత్రిక మెక్సికోలో[27] ఒక సందర్భంలో వారిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న చిత్రాలను ప్రచురించటంతో వారు తమ సంబంధాన్ని గురించి బహిరంగంగా బయటపెట్టడం మొదలుపెట్టారు.[28] వారిద్దరూ 2007 డిసెంబరు నుంచి స్నేహం చేస్తున్నారు. లైవ్లీ తన భర్తకోసం వంట చేయడాన్ని ఇష్టపడతానని చెప్పింది.[4][7] లైవ్లీ 2009 నవంబరు న పెన్నీ అను పేరు గల ఒక రాగి రంగు మల్టిపో కుక్కని కొన్నది.[3][4]

లైవ్లీ ప్రతి సంవత్సరం బహు ముఖ్య పత్రికల ముఖచిత్రంగా కనిపిస్తుంది. 2007 కాస్మో గర్ల్ (నవంబరు) కూడా ఈ పట్టికలో ఉంది.[5] 2008 పట్టిక ఈ క్రిందివిధంగా ఉంది: లక్కీ (జనవరి), టీన్ వోగ్ (మార్చి), నైలాన్ (మే; గాసిప్ గర్ల్ సహా-నటుడు మిస్టార్ తో కలిసి), సేవన్టిన్ (ఆగస్ట్), గర్ల్స్ లైఫ్ (ఆగస్ట్: ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ సహా-నటులు టాంబ్లిన్, బ్లేడేల్, ఫెర్రేరతో కలిసి), వానిటి ఫెయిర్ (ఆగస్ట్; క్రిస్టీన్ స్టివార్ట్, అమండా సెయ్ ఫ్రిడ్, ఎమ్మా రాబర్ట్స్ తో కలిసి)[29], కాస్మోపాలిటన్ (సెప్టెంబరు).[5] 2009 పట్టికలో వోగ్ (ఫిబ్రవరి ముఖచిత్రం), ఎల్ల్యుర్ (మే), రోలింగ్ స్టోన్ (ఏప్రిల్), గ్లామర్ యూకే (ఆగస్ట్), నైలాన్ (నవంబరు), మేరి క్లారీ (డిసంబర్)లు ఉన్నాయి. 2009 జనవరిలో గ్లామర్ యూకే ద్వారా లైవ్లీ టాప్ "35 అతి దివ్యమైన చూడడానికి ఇష్టపడే మహిళలలో" ఒకరిగా నిలించింది.[30] లైవ్లీ మాక్జిం 2009 హాట్ 100 పట్టికలో 33వ స్థానం,[31] 2010లో 4వ స్థానం పొందింది.

2008 యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలలో లైవ్లీ జాన్ మెక్ కెయిన్ కన్నా బరాక్ ఒబామాకి తన మద్దతుని ప్రకటించింది. లైవ్లీ, బాడ్జిలి మూవ్-ఆన్స్ యువ ఓటింగ్ కార్యక్రమంలో భాగంగా బరాక్-ఒబామా ప్రకటనలో కనిపించారు. ఈ ప్రకటన డోగ్ లిమోన్ చేత దర్శకత్వం వహించబడింది, CW, MTV గాసిప్ గర్ల్ మధ్యలో ప్రదర్శించబడింది.[32] లైవ్లీ తనను పారిస్ హిల్టన్తో పోల్చడం "పస లేనివి"గా తెలిపింది. లైవ్లీ తనకి హిల్టన్ కి ఉన్న పోలిక రాగి జుట్టు, చిన్న కుక్క ఉండడం అంతకు మించి సారూప్యంగా ఏవీ లేవని ఎందుకంటే తనకి క్లబ్స్, పార్టీలు, బల్ల మీద నాట్యం చేయడం, సెక్స్ టేపులలో కనిపించడం ఇష్టం లేదని చెప్పింది.[33] లైవ్లీ తననితాను ఇతరులని "ప్రేమించే", "నమ్మదగిన" వ్యక్తిగా అభివర్ణించింది; ఇవి కొన్ని గాసిప్ గర్ల్లో తన పాత్ర సెరెనాకి సమానంగా ఉంటాయని చెప్పింది.[33]

లైవ్లీ 2009 ఆగస్టులో గ్లామర్ యూకే ముఖాముఖిలో తను తన శరీరం మరియు రంగు గురించి భయపడతానని-ముఖ్యంగా బట్టలు విప్పే దృశ్యాలలో-ఆమె పత్యం చెయ్యదు అని చెప్పింది. "నేను ఒంటికి హత్తుకొనే బట్టలని వేసుకోవాలంటే వణికిపోతాను, కానీ నాకు నిగ్రహ శక్తి లేదు," అని యూకే గ్లామర్ ఆగస్ట్ సంచికకి చెప్పింది. "రెండేళ్లలో మొదటిసారిగా నేను బ్రా మరియు చిన్న చడ్డితో నటించవలసిన దృశ్యం వచ్చింది [...] ఆ చిత్రీకరణ రోజు నేను పంది మాంసం, చిప్స్ తిన్నాను, కోక్ తాగను. తరువాత 'నేను అది చేయకుండా ఉండాల్సింది' అనుకున్నాను. కానీ ఏమైనా."[34] ఇంకా లైవ్లీ అదే ముఖాముఖిలో "తానెప్పుడు వ్యాయామం చేయనని", కానీ ఒకవేళ చేస్తే "బాగుంటుంది" అని అనుకుంటానని కూడా చెప్పింది, ఆమె "ఒక శిక్షకుడిని పెట్టుకొనే ఆలోచనలో ఉన్నానని" చెప్పింది.[34]

== చలనచిత్రపట్టిక

==
చలనచిత్రం
సంవత్సరం చలనచిత్రం పాత్ర సూచనలు
2005 ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ బ్రిద్గేట్ వ్రీల్యాండ్
2006 యాక్సెప్ట్డ్ మోనికా మోర్ల్యాండ్
సైమొన్ సేస్ జెన్నీ
2007 ఎల్విస్ అండ్ అనబెల్లె అనబెల్లె లే
2008 ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్ 2 బ్రిద్గేట్ వ్రీల్యాండ్
2009 న్యూయార్క్, ఐ లవ్ యు గాబ్రిల్లి డిమార్కో
ది ప్రైవేట్ లైవ్స్ అఫ్ పిప్ప లీ యంగ్ పిప్ప లీ
2010 ది టౌన్ క్రిస్ట కౌలిన్ చిత్రీకరణ పూర్తి
2011 గ్రీన్ లేట్రన్ క్యారోల్ ఫెర్రిస్ నిర్మాణానంతరం
టెలివిజన్
సంవత్సరం బిరుదు పాత్ర సూచనలు
2007—ఇప్పటివరకు గొస్సిప్ గర్ల్ సెరీన వాన్ డర్ వుడ్సన్
2009 సాటర్డే నైట్ లైవ్ ఆమె లాగానే అతిధేయుడు

పురస్కారాలు[మార్చు]

పురస్కారాలు
సంవత్సరం ఫలితం పురస్కారం విభాగం ప్రతిపాదనకు కారణం
2005 మూస:Nominatedరోస్పాన్="2" టీన్ ఛాయిస్ అవార్డు ఛాయస్ మూవీ బ్రేక్అవుట్ ఫిమేల్ ది సిస్టర్ హుడ్ అఫ్ ది ట్రావెలింగ్ పాంట్స్
2008 ఛాయస్ Fimael హొటి ఆమె లాగానే
విజేత ఛాయస్ TV యాక్ట్రస్ డ్రామా గొస్సిప్ గర్ల్
ఛాయస్ టీవీ బ్రేక్అవుట్ స్టార్- ఫిమేల్
న్యూపోర్ట్ బీచ్ ఫిలిం ఫెస్టివల్ అచీవ్మెంట్ అవార్డ్ -బ్రేక్అవుట్ పెర్ఫోర్మెన్స్ ఎల్విస్ అండ్ అనబెల్లె
2009 రోస్పాన్="4"మూస:Nominated ప్రిసం అవార్డ్స్ పెర్ఫోర్మెన్స్ ఇన్ ఏ డ్రామా ఎపిసోడ్ గొస్సిప్ గర్ల్
టీన్ ఛాయిస్ అవార్డు ఛాయస్ TV యాక్ట్రస్ డ్రామా
2010 పీపుల్స్ ఛాయస్ అవార్డులు ఫావ్రేట్ TV యాక్ట్రస్ డ్రామా
టీన్ ఛాయిస్ అవార్డు ఛాయస్ TV యాక్ట్రస్ డ్రామా

మూలాలు, వనరులు[మార్చు]

 1. "ది టాక్ అఫ్ ది టౌన్" నైలాన్ (మే 2008) పత్రిక
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Miller, Rebecca (2009-12). "Blake Lively Grows Up". Marie Claire. Retrieved 2009-11-13. Check date values in: |date= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 Wood, Dana (2008-12). "Blake Lively's After School Activities (p. 1)". W. మూలం నుండి 2010-12-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-15. Check date values in: |date= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "Blake Lively" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 4. 4.0 4.1 4.2 4.3 4.4 Stanley, Alessandra (2009-02). "East Side Story". Vogue. Retrieved 2009-11-13. Check date values in: |date= (help)
 5. 5.0 5.1 5.2 "Blake Lively: Bibliography". People. Retrieved 2009-11-14.
 6. 6.0 6.1 6.2 6.3 Dana Wood (2008-12). "Blake Lively's After School Activities (Page 2)". W. మూలం నుండి 2009-03-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-15. Check date values in: |date= (help)
 7. 7.0 7.1 అల్లుర్ పత్రిక. "ది యాంటి-గొస్సిప్ గాళ్". మే 2009
 8. "The Sisterhood of the Traveling Pants". Box Office Mojo. Retrieved 2009-11-13.
 9. 9.0 9.1 Wood, Dana (2008-12). "Blake Lively's After School Activities (Page 4)". W. మూలం నుండి 2009-03-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-15. Check date values in: |date= (help)
 10. Adams, Michael (2009-09-09). "Remembering Elvis and Anabelle: Blake Lively's Real Breakthrough". Movie Line. మూలం నుండి 2009-10-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-13.
 11. "Showbiz people briefs". Reuters. |access-date= requires |url= (help)
 12. కాస్మో గాళ్ పత్రిక (నవంబర్ 2007).
 13. Tabouring, Franck (2008-08-08). "Review: "The Sisterhood of the Traveling Pants 2"". Screening Blogs. మూలం నుండి 2008-08-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-13.
 14. Lumenick, Lou (2008-08-06). "Sequels Wear Well". NY Post. Retrieved 2009-11-13.
 15. "The Sisterhood of the Traveling Pants 2". Box Office Mojo. Retrieved 2009-11-14.
 16. 16.0 16.1 Loder, Kurt (2009-10-16). "'New York, I Love You': Out-Of-Towners". MTV. Retrieved 2009-11-13. More than one of |author= and |last= specified (help)
 17. Tabouring, Franck (2009-10-12). "Movie Review: 'New York, I Love You'". Screening Blogs. మూలం నుండి 2009-10-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-13.
 18. Pomeranz, Margaret (2009-10). "The Private Lives of Pippa Lee". ABC News. Retrieved 2009-11-13. Check date values in: |date= (help)
 19. Byrnes, Paul (2009-10-20). "The Private Lives Of Pippa Lee". Brisbane Times. Retrieved 2009-11-13.
 20. Durbin, Karen (2009-09-10). "Dazzling Performances to Gild the Résumés". New York Times. Retrieved 2009-11-14.
 21. "Blake Lively Goes to 'Town' for Ben Affleck". Film School Rejects. 2009-09-05. Retrieved 2009-11-13.
 22. Kit, Borys (2009-08-26). "Blake Lively going to 'Town' for WB, Legendary". The Hollywood Reporter. Retrieved 2009-09-16.
 23. "Lively Wants To Become Interior Decorator". IMDb. 2009-11-13. Retrieved 2009-11-14.
 24. "Blake Lively Brightens Up Green Lantern". E! Online. Retrieved 2010-03=27. Check date values in: |accessdate= (help)
 25. "Blake Lively Biography". People. Retrieved 2009-11-13.
 26. "Blake Lively Match Isn't Just 'Gossip'". New York Daily News. 2007-12-24. Retrieved 2009-11-13.
 27. "Exclusive: Blake & Penn's Romantic Getaway". People. May 13, 2008.
 28. "Give Her A Hand". People. 2008-07-08. Retrieved 2009-11-13.
 29. Park, Michael Y. (2008-06-30). "Blake Lively Spearheads Hollywood's New Wave". People. Retrieved 2009-11-14.
 30. "35 Most Stylish Women For 2009". Glamourl. మూలం నుండి 2010-01-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-13.
 31. "2009 Hot 100". Maxim. మూలం నుండి 2009-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-13.
 32. "Blake Lively & Penn Badgley Go for Laughs in Pro-Obama Ad". People. 2008-10-14. Retrieved 2009-11-13.
 33. 33.0 33.1 Park, Michael Y. (2008-07-03). "Blake Lively: I'm No Paris Hilton". People. Retrieved 2009-11-13.
 34. 34.0 34.1 Helling, Steve (2009-07-07). "Blake Lively Doesn't Have the Willpower to Diet". People. Retrieved 2009-11-13.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.