బ్లెస్సింగ్ ముజరబానీ
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1996 అక్టోబరు 2 మురేవా, జింబాబ్వే[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 6 ft 8 in (203 cm)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 105) | 2017 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 అక్టోబరు 20 - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 134) | 2018 జనవరి 15 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 2025 ఆగస్టు 31 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్డేల్లో చొక్కా సంఖ్య. | 40 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 48) | 2018 ఫిబ్రవరి 5 - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 29 October - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 40 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2017–2018 | రైజింగ్ స్టార్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019–2020 | నార్తాంప్టన్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2019–ప్రస్తుతం | మషోనాలాండ్ ఈగల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2021–2022 | ముల్తాన్ సుల్తాన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2026 జనవరి 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్లెస్సింగ్ ముజారబాని (జననం 1996 అక్టోబరు 2) జింబాబ్వే క్రికెటర్ . [3] అతను 2017 అక్టోబరు 4 న 2017–18 లోగాన్ కప్‌లో రైజింగ్ స్టార్స్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[4]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]బ్లెస్సింగ్ జింబాబ్వేలోని మురేవా అనే చిన్న పట్టణంలో జన్మించాడు. తరువాత అతని కుటుంబం హరారేలోని శివారు ప్రాంతమైన హైఫీల్డ్కు వెళ్లింది. ఏడేళ్ల వయసులో, అతను తకాషింగా క్రికెట్ క్లబ్లో క్రికెట్ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడే అతని ప్రతిభను కోచ్‌లు గుర్తించారు. 2017 లో మూడు నెలల పాటు ఇంగ్లాండ్‌లో పర్యటించడానికి అతన్ని రైజింగ్ స్టార్స్ అకాడమీ లోకి తతెందా తైబు ఎంపిక చేశాడు. [5]
దేశీయ కెరీర్
[మార్చు]2020 డిసెంబరులో అతను 2020–21 లోగాన్ కప్‌లో సదరన్ రాక్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు. [6] [7]
2021 జూన్‌లో, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ 2021 PSL ఎడిషన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఒబెద్ మెక్కాయ్ స్థానంలో ముజారబానీని తమ జట్టులోకి తీసుకుంది.[8] అతను ఆరు మ్యాచ్‌లు ఆడి తన జట్టు తరపున పది వికెట్లు పడగొట్టాడు. ముల్తాన్ సుల్తాన్స్ తన మొదటి PSL టైటిల్ గెలుచుకుంది. [9]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2017 డిసెంబరులో, దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం జింబాబ్వే టెస్ట్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. [10] 2017 డిసెంబరు 26 న బాక్సింగ్ డే టెస్ట్‌తో తన టెస్ట్ క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టాడు.[11]
2018 జనవరిలో అతను, బంగ్లాదేశ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్ కోసం జింబాబ్వే వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో చోటు దక్కించుకున్నాడు. [12] అతను 2018 జనవరి 15 న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి వన్డే ఆడాడు.[13]
2018ఫిబ్రవరిలో, UAEలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం జింబాబ్వే ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) జట్టులోకి అతన్ని తీసుకున్నారు.[14] 2018 ఫిబ్రవరి 5 న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరపున తన టి20 రంగప్రవేశం చేశాడు.[15]
2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), ముజారబానిని జింబాబ్వే జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది. [16]
2018 ఆగస్టులో ముజారబాని జింబాబ్వే తరఫున జాతీయ ఎంపికకు అందుబాటులో లేకుండా పోయాడు. ఇంగ్లాండ్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలని కోరుకున్నాడు. [17] [18] మరుసటి నెలలో, అతను ఇంగ్లీష్ జట్టు నార్తాంప్టన్‌షైర్‌తో కోల్పాక్ ఆటగాడిగా మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాడు.[19]
కౌంటీ క్రికెట్లో కొన్నాళ్ళు ఆడిన తర్వాత బ్లెస్సింగ్, జింబాబ్వే తరపున ఆడటానికి తిరిగి వచ్చాడు. 2020 నవంబరు 3 న పాకిస్థాన్‌తో జరిగిన మూడవ మ్యాచ్‌లో, ముజారబాని వన్డే క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. అదే మ్యాచ్ సూపర్ ఓవర్లో అతను మరో రెండు వికెట్లు తీసుకున్నాడు.[20]
మూలాలు
[మార్చు]- ↑ "How Blessing Muzarabani became Zimbabwe's great new hope". The Cricket Monthly. Retrieved 30 April 2021.
- ↑ "6 ft 8 and full of energy". ICC Official Twitter. Retrieved 11 February 2022.
- ↑ "Blessing Muzarabani". ESPN Cricinfo. Retrieved 4 October 2017.
- ↑ "Logan Cup at Kwekwe, Oct 4-7 2017". ESPN Cricinfo. Retrieved 4 October 2017.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "Logan Cup starts in secure environment". The Herald. Retrieved 9 December 2020.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "Zimbabwe pick uncapped Muzarabani, Burl for South Africa Test". ESPN Cricinfo. Retrieved 11 December 2017.
- ↑ "Only Test (D/N), Zimbabwe tour of South Africa (Dec 2017) at Port Elizabeth, Dec 26-29 2017". ESPN Cricinfo. Retrieved 26 December 2017.
- ↑ "Uncapped Mavuta and Murray in Zimbabwe ODI squad". ESPN Cricinfo. Retrieved 7 January 2018.
- ↑ "1st match (D/N), Bangladesh Tri-Nation Series at Dhaka, Jan 15 2018". ESPN Cricinfo. Retrieved 15 January 2018.
- ↑ "Formidable Afghanistan eye more T20I success". Wisden India. Archived from the original on 4 February 2018. Retrieved 4 February 2018.
- ↑ "1st T20I (N), Zimbabwe tour of United Arab Emirates at Sharjah, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 5 February 2018.
- ↑ "CWCQ 2018 Report Card: Zimbabwe". International Cricket Council. Retrieved 24 March 2018.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.
- ↑ "Logan Cup starts in secure environment". The Herald. Retrieved 9 December 2020.
- ↑ "From Takashinga to Northants: The hunger of Blessing Muzarabani". Cricbuzz. Retrieved 23 September 2018.