బ్లేజ్ పాస్కల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లైసీ పాస్కల్
Blaise pascal.jpg
జననంజూన్ 19, 1623.
మరణంఆగష్టు 19, 1662
పారిస్, ఫ్రాన్స్
జాతీయతఫ్రెంచ్
శకం17 వ శతాబ్ద తత్వశాస్త్రము
సుపరిచితుడుTheology, గణిత శాస్త్రము, తత్వ శాస్త్రము, భౌతిక శాస్త్రము
Notable work
Pascal's Wager
Pascal's triangle
Pascal's law
Pascal's theorem

పాస్కల్ (జూన్ 19, 1623 - ఆగష్టు 19, 1662) పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త.

బాల్యం[మార్చు]

ఫ్రాన్స్ కి చెందిన పాస్కల్ 7 యేండ్ల వయస్సు నుండే జామెట్రీ పట్ల విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరచేవాడట, తమాషా ఏమిటంటే 12 ఏళ్ళ వయస్సులోనే ఒక త్రిభుజం లోని మూడు కోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తానికి సమానంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఈయన తండ్రి పాస్కల్ ను గణితం చదవడానికి ఎక్కువగా అనుమతించటం మొదలు పెట్టాడు. ఈ వేళ అందరూ వేనోళ్ళ కొనియాడుతున్న "యూనివర్సల్ ధీరం ఆఫ్ జామెట్రీ" పాస్కల్ రూపొందించినదే కదా. ఈయనకు 17 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డెస్ కార్టెస్ ఆ యనలో ఒక గొప్ప మేధావిని చూసి ప్రశంసించాడు. అంతటి సమర్థుడు బ్లెయిసీ పాస్కల్.

కాలిక్యులేటింగ్ మెషీన్ ఆవిష్కరణ[మార్చు]

పాస్కల్ జీవితమంతా ఫ్రాన్స్ లోనే గడిచింది. ఈయన తండ్రి అక్కౌంటెంట్ గా పనిచేసేవాడు. రాత్రీ పగలూ లెక్కలు చేసేవాడు. తండ్రి పడుతున్న ఈ కష్టం చూచి పాస్కల్ లెక్కలు చేసే యంత్రాన్ని రూపొందించాడు. ఈ కాలిక్యులేటింగ్ మెషిన్ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు వంటివి చేసిపెట్టేది. ఈ మెషీన్ పాస్కల్ తండ్రికి ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఈ యంత్రాన్ని తయారు చేయటానికి ఎవరూ ముందుకు వాలేదు. ఎందుకంటే దీనికయ్యే ఖర్చు మరీ ఎక్కువ కావటమే. అయినప్పటికీ చాలా కాలం తరువాత 1892 విల్లియం బరగ్బ్ అనే అమెరికన్ ఈ పాస్కల్ నమూనాను ఆధారంగా చేసుకునే ఓ కాలిక్యులేటింగ్ మెషీన్ రూపొందించారు.

ఆవిష్కరణలు[మార్చు]

పాస్కల్ సూత్రం తెలియని వారు ఎవరూ ఉండరు. ద్రవ పదార్థంలో ఏదైనా ఒక బిందువు వద్ద పీడనాన్ని ఉపయోగించడం జరిగితే ఆ పీడన ప్రభావం ఆ ద్రవ పదార్థం అన్ని పైపులకు సమానంగా విస్తరిస్తుంది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని సిరెంజ్ని, హైడ్రాలిక్ ప్రెస్ ను, హైడ్రాలిక్ బ్రేక్ను రూపొందించటం జరిగింది. పాస్కల్ ఒక త్రిభుజాన్ని కూడా నిర్మించాడు. దీన్ని పాస్కల్ త్రిభుజం అంటారు. ఈ త్రిభుజం సహాయంతో ప్రాబబిలిటీ సమస్యలను నునాయాసంగా చేయవచ్చు.

తత్వవేత్త[మార్చు]

పాస్కల్ శాస్త్రవేత్త మాత్రమే కాదు. తత్వవేత్త కూడా. రచయిత కూడ, మతపరమైన పుస్తకాలను ఎన్నింటినో రాసాడు. జామెట్రీ, ప్రాబబిలిటీ, హైడ్రోస్టాటిక్స్, ఎంటగ్రల్ కాలిక్యులస్ -- అంశాల మీద ఎన్నో విలువైన పరిశోధనలు చేశాడు.

అస్తమయం[మార్చు]

1659 లో తీవ్రంగా జబ్బుపడి పాస్కల్ 1662 లో కన్ను మూసినా ఆయన వెలువరించిన శాస్త్రీయ వాస్తవాలు మాత్రం ఎంతో మందికి కళ్ళు తెరిపిస్తున్నాయి.