బ్లైండ్ స్పాట్
బ్లైండ్ స్పాట్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామకృష్ణ వీరపనేని నిర్మించిన ఈ సినిమాకు రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు.[1] నవీన్‌చంద్ర, రాశీసింగ్, అలీరెజా, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 18న విడుదల చేసి,[2][3] సినిమాను మే 9న విడుదల చేశారు.
కథ
[మార్చు]హైదరాబాద్ వ్యాపారవేత్త జైరాం (రవి వర్మ) తన భార్య దివ్య (రాశీ సింగ్) కి తరచూ గొడవలు జారుతూ ఉంటాయి, ఒకరోజు గొడవ అయ్యాక దివ్య (రాశీ సింగ్) అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుటుంది. ఈ ఆత్మహత్య గురించి ఇంటి పనిమనిషి సరస్వతి సమీప పిల్స్ స్టేషన్ పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) సమాచారం ఇవవడంతో, రంగంలోకి దిగిన విక్రమ్ ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని చెబుతాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? ఆ ఇంట్లో వారే చేసారా ? లేక బయటవారు చేసారా? చివరికి హత్య చేసింది ఎవరు? వారిని ఎవరు పట్టుకున్నారు ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- నవీన్ చంద్ర
- రాశి సింగ్
- అలీ రెజా
- రవివర్మ
- గాయత్రి భార్గవి
- కిషోర్ కుమార్
- హారిక పెడాడ
- హర్ష్ రోషన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కో డైరెక్టర్: రామ్ ప్రసాద్ గొల్లపల్లి
- ఆర్ట్ డైరెక్టర్: ఉదయ్ ఉమా గోపాల్
- సౌండ్ డిజైన్: సతీష్ కుమార్ మండవ
- కాస్ట్యూమ్స్: హారిక పొట్ట
మూలాలు
[మార్చు]- ↑ "నిజమైన హంతకుడు ఎవరు?". NT News. 19 April 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
- ↑ "ఉత్కంఠకు గురిచేసే రాత్రి". Chitrajyothy. 19 April 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.
- ↑ "నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!". Sakshi. 18 April 2025. Archived from the original on 23 May 2025. Retrieved 23 May 2025.