బ్లౌ స్మారక చిహ్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లౌ స్మారక చిహ్నాలు
The Blau Monuments, in the display about the "Evolution of Writing in Mesopotamia", British Museum
బ్రిటిష్ సంగ్రహశాలలోని బ్లౌ స్మారక చిహ్నాలు
పదార్థంహరశోఠం
పరిమాణం96.5 cm పొడవు
తయారైన కాలంక్రీ.పూ 3100–2700
ప్రస్తుతం ఉన్న చోటుబ్రిటిష్ సంగ్రహశాల, లన్డన్
Registration1928,0714.1
Uruk is located in Near East
Uruk
Uruk
Uruk is located in Iraq
Uruk
Uruk

బ్లౌ స్మారక చిహ్నాలు అనేవి వ్రాతలు చెక్కబడ్డ ఒక రాళ్ళ జత. మెసొపొటమియాకు చెందిన ఇవి నేడు బ్రిటిష్ సంగ్రహశాలలో ఉన్నాయి.[1] ఇవి ప్రాచీన కుడుఱ్ఱులు[గమనిక 1] అని భావిస్తున్నారు.[2]

నేపథ్యం[మార్చు]

ఎ.బ్లౌ అనే పేరు గల ఒక ఒస్ట్రియా వ్యక్తి 1886లో, ఉరుక్‌ (ఆధునిక ఇరాక్) దగ్గర వీటిని కొన్నాడు.[3] తరువాతి కాలంలో అవి బ్రిటిషు సంగ్రహశాల చేతికి వచ్చాయి.[4] ఇవి ఆంగ్లంలో షెయ్ల్ (Shale)గా పిలవబడే నీలం రంగు రాళ్ళు.[2] మొదట్లో ఇవి నకిలీ వస్తువులని అనుమానించిననూ,[5][6] తరువాత ఉరుక్ తవ్వకాల్లో బయటపడ్డ బసల్టూ ఫలకాలూ, వర్కా పాత్రలోని శైలితో వీటి శైలి సరిపోలడంతో, వీటి ప్రాచీనత నిరూపణ అయ్యింది. 1901 నుండే కొందరు అసిరియొలజిస్టులు[గమనిక 2] వీటి ప్రాచీనతను అంగీకరించిననూ, నాటికి ఈ విషయమై చాలా వ్యతిరేకత ఉండేది.[7][8] నేడు చాలామంది నిపుణులు వీటి ప్రాచీనతను ఒప్పుకున్ననూ, ఇంకనూ వీటిని వివాదాస్పద వస్తువులుగా పరిగణించేవారు కొందరు ఉన్నారు.

కాల నిర్ధారణ[మార్చు]

ఈ చిహ్నాలు మూడవ ఉరుక్ కాలం నుండి మొదటి ఆదివంశపు కాలం మధ్యలో చెక్కబడ్డాయని నిర్ధారించారు. వీటిలో ఇవి చెక్కబడ్డ సంవత్సరాలను కొంతమంది వీటిపైన వ్రాతలకు ఆదిమ శరాకార లిపితో ఉన్న పోలికలను బట్టి క్రీ.పూ 3100గా చెప్పగా, మరికొందరు మొదటి ఆదివంశపు కాలంలో ఇదే శైలిలో ఉండి, తేదీలతో ఉన్న ఇతర భూవిక్రయ శాసనాలను బట్టి క్రీ.పూ 2700గా చెప్పారు. చాలా సాంకేతిక రచనల్లో రెండు సంవత్సరాలూ చెప్పబడుతున్నాయి.

విషయం[మార్చు]

బ్లౌ స్మారక చిహ్నాల రేఖాచిత్రాలు.

ఈ చిహ్నాలు ఏమి చెబుతున్నాయి అనేదానిపై నేటికీ నిపుణుల్లో ఏకాభిప్రాయం లేదు. మామూలుగా అందరి అభిప్రాయం ఏమిటంటే ఇవి ఏదో ఒక లావాదేవీ వివరాలను తెలియజేస్తున్నాయని. బహుశా ఒక గుడి తరుఫున దానిని కట్టిన పనివాళ్ళకు ఇవ్వబడుతున్న బహుమతులు అయ్యుండవచ్చు.[9][5][6] ఈ మధ్యకాలంలో వీటిలో ఉన్నది, ఒక భూమికి యజమాని, అది కొన్న తరువాత ఇచ్చే సంప్రదాయ విందు అయ్యుండొచ్చనే అభిప్రాయానికి కూడా మద్దతు లభిస్తోంది.[2]

ఈ చిహ్నాలు రెండు. ఒకటి ఫలకం కాగా, మరొకటి కొనదేలిన గూటం

కొనదేలిన గూటం (బ్రిస 86261 [గమనిక 3] )[మార్చు]

గూటం పైన పురోహిత రాజు.

ఈ గూటానికి (18cm × 4.3cm × 1.3cm) రెండు అంకాలు ఉన్నాయి. పైదీ, కిందదీ. రెండిటిలోనూ పురుషుడు చెక్కబడి ఉన్నాడు. కింది దానిలో ఒక నగ్న పురుషుడు రోలూ, రోకలితో కనిపిస్తాడు. ఇతను వంట వండుతుండవచ్చు లేక ఏదైనా చేతిపని చేస్తుండవచ్చు. ఇదే తరహాలో మతకర్మలకై బుట్టల్లో తినుబండారాలను మోసుకెళుతున్న నగ్న పురుషులు వర్కా గిన్నెపై కూడా మనకి కనిపిస్తారు.[10]

పై అంకంలో ఒక నిలబడి ఉన్న గెడ్డపు అతను కనిపిస్తాడు. తలనాడాతో, చిన్న చిన్న చిల్లుల పావడా వేసుకుని ఉన్న ఇతని చేతిలో ఒక నాలుగు కాళ్ళ జంతువుని పట్టుకుని ఉన్నాడు. ఇది మేకో, గొర్రో అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి బొమ్మలు మెసొపొటెమియ పురావస్తు అవశేషాల్లో చాలానే కనిపిస్తుంటాయి. ఇవి అధికార హోదాలో ఉన్న పురుషుణ్ణి సూచించే బొమ్మలు. ఆ బొమ్మల్లో చూపించబడుతున్నది "పురోహిత రాజే" అని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.[10]

ఫలకం (బ్రిస 86260)[మార్చు]

ఫలకపు ప్రతిలోమ్యము (ఒక నాణెం లేదా ఫలకం మీద ముఖ్యమైన శాసనం ఉన్న పార్శ్వం) మీద కూడా, గూటం మీద ఉన్నట్టే, ఒక పెద్దమనిషీ, అతని చుట్టూ రకరకాల పనులు చేస్తున్న పనివాళ్ళూ ఉంటారు. ఇందులో కూడా ఆ పెద్దమనిషికి గెడ్డం ఉండి, ఒక పావడా వెసుకుని ఉంటాడు. ఎడమపక్క నుండి మొదటి బొమ్మగా ఉన్న ఆ పెద్దమనిషి చేతిలో ఒక పొడవైన వస్తువు ఉంటుంది. అది రోకలి కానీ లేదా

కుడివైపు మొదట ఉన్న బొమ్మ మహిళదని ప్రముఖ చరిత్రాకారుడు ఐ.జె.గెల్బ్ అభిప్రాయపడ్డాడు‌. దీనిని అనుసరించి చాలా పుస్తకాల్లో ఇదే వ్రాస్తుంటారు. ఐతే ఉషుమ్గల్ శిలాఫలకం వంటి వాటిలో ఉన్నట్లు ఆ కాలపు స్త్రీల వస్త్రాధారణ ఈ ఫలకంలో లేదు‌.

ఇక ఫలకానికి వెనుక వైపున నలుగురు మగవారు కనిపిస్తారు. వీరిలో ఇద్దరు నగ్న పురుషులు. వీరిద్దరూ మోకాళ్ళ మీద కూర్చుని, రోలూ రోకళ్ళతో ఉండగా, వారిద్దరి మధ్యలో చిల్లుల పావడా వే‌సుకుని ఉన్న ఒక బట్టతల అతను నిలబడి ఉంటాడు. ముందుపక్కలాగే ఇతను కూడా చేతిలో పొడవాటి వస్తువేదో పట్టుకుని ఉంటాడు. కుడి వైపున ఉన్న ఇంకో పురుషుడు కూడా మిగతా పనివాళ్ళలాగే ఉంటాడు కానీ అతని కాయం కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వీరందరూ విందుకై వంట పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.[2][10]

శాసనాలు[మార్చు]

బ్లౌ స్మారకంపై ఆదిమ శరాకార లిపి

ఉషుమ్గల్ ఫలకం, ఇంకా లభ్యమమైన ఆ కాలం నాటి ఇతర వ్రాతలు లాగే, ఈ స్మారకాలపైనున్న వ్రాతల అర్థం కూడా ఇంకా పూర్తిగా తెలియలేదు. కొన్ని గుర్తులు ఇప్పటికే అర్థాలు తెలిసినవి కాగా, కొన్నిటికి వేరే యేటితోనూ పోలిక లేదు.

వివాదాలు[మార్చు]

అపరిష్కృత వ్రాతలు ఉన్నందున ఈ స్మారకాలు ఏమి చెబుతున్నాయి అనేది కచ్చితంగా చెప్పడం కుదరదు. గెల్బ్ వీటిని, ఇంకో నాలుగింటినీ కలిపి, మొత్తం ఐదు పురావస్తు అవశేషాలను "ప్రాచీన కుడుఱ్ఱు"లుగా వర్గీకరించారు.[11] ఆ వర్గీకరణపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. మూడవ ఉర్ కాలం నాటి దానశాసనాలను "ప్రాచీన కుడుఱ్ఱులు" అంటారు.
  2. ప్రాచీన మెసొపొటెమియాపై అధ్యయనం చేసే చరిత్రాకారులు
  3. బ్రిటిష్ సంగ్రహశాలకు పొట్టిపదం

మూలాలు[మార్చు]

  1. British Museum Highlights
  2. 2.0 2.1 2.2 2.3 I. J. Gelb, P. Steinkeller, and R. M. Whiting Jr, "OIP 104. Earliest Land Tenure Systems in the Near East: Ancient Kudurrus", Oriental Institute Publications 104 Chicago: The Oriental Institute, 1989, 1991 ISBN 978-0-91-898656-6 Text Plates
  3. "Dr A Blau". The British Museum. Retrieved 13 April 2023.
  4. Reade, Julian E. (2000), “Early Carvings from the Mocatta, Blau, and Herzfeld Collections”, in: Nouvelles Assyriologiques Brèves et Utilitaires 2000/71, 81–8
  5. 5.0 5.1 Mallowan, Max E. L. (1961a). Early Mesopotamia and Iran. London: Thames & Hudson
  6. 6.0 6.1 1961b). The Birth of Written History. In: The Dawn of Civilization. Ed. by Stuart Piggott. London: Thames & Hudson, 65–96
  7. Barton, George A. “Some Notes on the Blau Monuments.” Journal of the American Oriental Society, vol. 22, 1901, pp. 118–25
  8. Barton, George A. “A New Collation of the Blau Monuments.” Journal of the American Oriental Society, vol. 24, 1903, pp. 388–89
  9. British Museum. Dept. of Western Asiatic Antiquities; Richard David Barnett; Donald John Wiseman (1969). Fifty masterpieces of ancient Near Eastern art in the Department of Western Asiatic Antiquities, the British Museum. British Museum. p. 41. ISBN 9780714110691
  10. 10.0 10.1 10.2 Collon, Dominique (1995). Ancient Near Eastern Art (in ఇంగ్లీష్). University of California Press. pp. 51–53. ISBN 9780520203075.
  11. Kathryn E. Slanski, "The Babylonian entitlement narûs (kudurrus) : a study in their form and function", Boston : American Schools of Oriental Research, 2003 ISBN 089757060X

మరింత సమాచారం కోసం[మార్చు]

  • Balke, Thomas E.. "The Interplay of Material, Text, and Iconography in Some of the Oldest “Legal” Documents". Materiality of Writing in Early Mesopotamia, edited by Thomas E. Balke and Christina Tsouparopoulou, Berlin, Boston: De Gruyter, 2016, pp. 73–94
  • Boese, Johannes (2010), “Die Blau’schen Steine und der Priesterfürst im Netzrock”, in: Altorien-talische Forschungen 37, 208–22

వెలుపలి లంకెలు[మార్చు]