Jump to content

భక్తి టీవీ

వికీపీడియా నుండి
భక్తి టీవీ
దేశంభారతదేశం
ప్రసారపరిధిభారతదేశం
కేంద్రకార్యాలయంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతి4:3 (576i, ఎస్ డి టి వి)
యాజమాన్యం
యజమానినరేంద్ర చౌదరి తుమ్మల
తుమ్మల రమాదేవి
సోదరి ఛానళ్లుఎన్ టీవీ
వనిత టీవీ
చరిత్ర
ప్రారంభం30 ఆగస్టు 2007; 18 సంవత్సరాల క్రితం (2007-08-30)
లభ్యత

భక్తి టీవీ అనేది హిందువుల అవసరాలను తీర్చగల 24 గంటల పాటు ప్రసారమయ్యే మొదటి తెలుగు ఉపగ్రహ భక్తి టీవీ ఛానల్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాలలో అత్యంత ప్రముఖ భక్తి టీవీలలో ఒకటి.

నరేంద్ర చౌదరి తుమ్మల 2007 ఆగస్టు 30న న్యూస్ ఛనల్ ఎన్ టీవీతో కలిపి భక్తి టీవీని ప్రారంభించాడు.

ఇది దక్షిణ భారతదేశపు మొదటి తెలుగు భక్తి ఛానల్. ఇది తెలుగు భాష మాట్లాడే సమాజానికి, ముఖ్యంగా భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో ప్రత్యేకమైన ప్రధాన పండుగలకు సంబంధించిన రోజువారీ భక్తి వార్తలు, వారపు ప్రత్యేక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.

భక్తి టీవీ భక్తి, ఆధ్యాత్మికత, మతం, నైతిక విలువలపై దృష్టి పెడుతుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. "NTV set for August 30 launch". 13 August 2007. Archived from the original on 29 April 2024. Retrieved 31 July 2018 – via www.thehindu.com.