భక్త ప్రహ్లాద (1942 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భక్త ప్రహ్లాద
(1942 తెలుగు సినిమా)
Bhakta Prahlada 1942.jpg
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం వేమూరి గగ్గయ్య
గరికపాటి వరలక్ష్మి
రాజేశ్వరి
నారాయణరావు
భాష తెలుగు

భక్త ప్రహ్లాద 1942 లో వచ్చిన పౌరాణిక చిత్రం. శోభనాచల ప్రొడక్షన్స్ వారు చిత్రపు నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం విష్ణు భక్తుడైన ప్రహ్లాద కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు.

మొదటి భక్తప్రహ్లాద 1932 లో విడుదలైంది. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా.

కథ[మార్చు]

దానవ చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేని వ్యక్తి. అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు, ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడౌతాడు. పసిప్రాయం నుండే విష్ణుభక్తిని అలవరచుకుంటాడు. విద్యనేర్చుకోను గురువు చండామార్కుల వద్దకు పంపితే విష్ణుభక్తిని తోటి విద్యార్థులకు కూడా బోధిస్తాడు. నయానా భయానా విష్ణుభక్తిని పోగొట్టలేక, చివరికి కన్నకొడుకునే చంపించే ప్రయత్నాలు చేస్తాడు దానవ చక్రవర్తి. తండ్రి చేయించిన అనేక హత్యా ప్రయత్నాల నుండి విష్ణుమూర్తి కటాక్షం వలన చెక్కుచెదరకుండా బయట పడతాడు.

చివరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంవాదంలో విష్ణువు ఎక్కడుంటాడో చెప్పు అతడి సంగతి నేను చూస్తాను అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పగా, ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభాన్ని గదతో పగల గొడతాడు. ఆ స్తంభం నుండి విష్ణుమూర్తి రౌద్రమూర్తి అయిన నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు.

తారాగణం[మార్చు]