భగవాన్ మహావీర్ ప్రభుత్వ మ్యూజియం
![]() | |
| Established | 1982 |
|---|---|
| Location | కడప, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
భగవాన్ మహావీర్ ప్రభుత్వ మ్యూజియం అనేది ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో ఉన్న ఒక పురావస్తు మ్యూజియం.[1] కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమైన పురాతన వస్తువులను ఈ పురావస్తు ప్రదర్శనశాలలో సందర్శకుల కోసం భద్రపరిచారు.
ఏర్పాటు
[మార్చు]పురావస్తు ప్రాముఖ్యత కలిగిన పురాతన కళాఖండాలను రక్షించడానికి ప్రభుత్వం దీనిని 1982 లో స్థాపించింది.[2] ఈ స్థాపనకు ఒక జైన వ్యాపారవేత్త నిధులు సమకూర్చాడు, అందుకే వారి ఆరాధ్యదైవం మహావీరుడి పేరు పెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ప్రారంభించాడు.
విగ్రహాలు
[మార్చు]ఇందులోని నాలుగు గ్యాలరీల్లో చరిత్రకారుల విగ్రహాలు, శాసనాలు, రాజుల కాలం నాటి ఖడ్గాలు, నాణేలు, పంచలోహ విగ్రహాలు, ఆదిమానవులు ఉపయోగించిన రాళ్లు, కర్రలు ఇక్కడ దర్శనమిస్తాయి. మొత్తం 333 విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. మ్యూజియం లోపల గణేశుడు, విష్ణువు, హనుమంతుడు, శివుడి విగ్రహాలు ఉన్నాయి. ఇవి 5వ -18వ శతాబ్దాల మధ్య కాలం నాటివి. గ్రానైట్, డోలమైట్, సున్నపురాయి, కాంస్య చిహ్నాలతో తయారు చేయబడిన ఈ పురాతన వస్తువులన్నీ కడప, హైదరాబాద్, కర్నూలు జిల్లాల్లోని వివిధ ప్రదేశాలలో జరిపిన తవ్వకాలలో కనుగొనబడ్డాయి.[3]
వివరాలు
[మార్చు]- క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోకుని కాలపు స్తూపం
- 10వ శతాబ్దానికి చెందిన నటరాజు విగ్రహం
- 12వ శతాబ్దానికి చెందిన విష్ణువు విగ్రహం
- 14వ శతాబ్దానికి చెందిన కృష్ణుని విగ్రహం
సందర్శన స్థలం
[మార్చు]ఈ మ్యూజియం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు తెరిచి ఉంటుంది. ఇది ప్రభుత్వ సెలవు దినాలలో మూసివేయబడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Sri Bhagavan Mahavir Government Museum". beta.museumsofindia.org. Retrieved 2025-02-04.
- ↑ Bharat, E. T. V. (2023-01-19). "అయ్యో..! శ్రీ భగవాన్ మహావీర్ మ్యూజియం.. నిధుల లేక శిథిలావస్ధకు చేరిక". ETV Bharat News. Retrieved 2025-02-04.
- ↑ "Kadapa Tour - Kadapa Sightseeing Tours, Tour to Cuddapah Andhra Pradesh".
