భగవాన్ శంకర్ రావత్
| భగవాన్ శంకర్ రావత్ | |||
| పదవీ కాలం 1991 – 1999 | |||
| ముందు | అజయ్ సింగ్ చాహర్ | ||
|---|---|---|---|
| తరువాత | రాజ్ బబ్బర్ | ||
| నియోజకవర్గం | ఆగ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1940 డిసెంబర్ 4 రావత్‌పాడ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | శంకుంతల రావత్ (m.1965) | ||
| సంతానం | బ్రిజేష్ రావత్, అవదేశ్ రావత్, మనోజ్ రావత్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
భగవాన్ శంకర్ రావత్ (జననం 4 డిసెంబర్ 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]భగవాన్ శంకర్ రావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి జనతాదళ్ అభ్యర్థి అజయ్ సింగ్‌పై 63,126 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి బీఎస్‌పీ అభ్యర్థి ఎ.కె. మౌర్యపై 84568 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
భగవాన్ శంకర్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి స్వతంత్ర అభ్యర్థి రామేశ్వర్ సింగ్‌పై 48,423 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాజ్ బబ్బర్ చేతిలో 112982 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "लोकसभा चुनाव: ...जब 'राज' के ग्लैमर में ढह गया था भगवा किला, तीन बार के भाजपा सांसद को सवा लाख से हराया था". Amar Ujala. 1 April 2024. Retrieved 1 July 2025.
- ↑ "Agra Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 4 June 2024. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.