భట్టిప్రోలు శాసనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

తెలుగులో లభ్యమయే తొలి శాసనాలలో భట్టిప్రోలు శాసనాలు మొదటివి అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇవి క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తోంది. వీటిని భట్టిప్రోలు బుద్ధ ధాతుపేటిక శాసనాలు అని కూడా అంటుంటారు.

చరిత్ర[మార్చు]

గుంటూరు జిల్లాలోని తెనాలి-రేపల్లె రహదారిలో రేపల్లె నుండి 10 కి.మీ. ల దూరంలో ఉంది భట్టిప్రోలు అనే చిన్న ఊరు. ఇక్కడ ఒక పాడు బడిన దిబ్బ ఉండేది. ఆ దిబ్బను అక్కడి స్థానికులు అవగాహన లోపం వలన పెద్దలంజదిబ్బ, చిన్నలంజదిబ్బ, విక్రమార్కుని కోట అని పిలిచేవారు. క్రీ.శ. 1870 లో బోస్వెల్, 1871 లో ఇల్లియట్, 1882 లో రాబర్ట్ సీవెల్ ఈ దిబ్బను పరిశీలించారు. అలెగ్జాండర్ రీ దిబ్బ వద్ద 1892లో తవ్వకాలు జరిపి, ఒక బౌద్ధధాతు పేటికను వెలికితీసాడు. అప్పుడు ఆ దిబ్బ ఒక బౌద్ధస్థూపమని నిర్ధారణ అయింది. అనేక మంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ ఎన్నో పరిశోధనలు జరిపారు. 1870 లో ఈ దిబ్బ దగ్గర జరిపిన చిన్నపాటి తవ్వకాల్లో ఒక స్ఫటికపు భరిణె, ముత్యాలుంచిన రాతిధాతుపేటికలు, అలెగ్జాండర్ రీ 1892లో జరిపిన తవ్వకాల్లో బ్రాహ్మీలిపిలో శాసనాలున్న మూడు ధాతుపేటికలు లభించాయి. 1969-70 ల్లో ఆర్. సుబ్రహ్మణ్యం స్థూపం దగ్గర జరిపిన తవ్వకాలలో ఒక విహారపు పునాదులు, సున్నంతో చేసిన బుద్ధుని తల లభించాయి.[1]

శాసనాల కాలనిర్ణయం[మార్చు]

పురావస్తు ఆధారాల ప్రకారం భట్టిప్రోలు స్థూప నిర్మాణం క్రీ.పూ. 3వ శతాబ్దంలోనే జరిగిందని, ఆ సమయంలో స్థానిక రాజైన కుబిరకుని ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్థూపంలో బుద్ధుని ధాతువులుగల రాయి, స్ఫటికంతో చేసిన పేటికలను ఉంచి వాటిలోను, పక్కన, బంగారు పూసలు, ముత్యాలు, రాగి, వెండితో చేసిన ఆకులు, పేటిక అడుగు భాగాన అమర్చిన 24 నొక్కుడు గుర్తులు గల నాణేలను కూడా ఉంచారు. ధాతుపేటికలపై చెక్కిన బ్రాహ్మీలిపిని పరిశీలించిన బూలర్, ఈ శాసనాలు క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందినవని తెలియచేసి భట్టిప్రోలు స్థూపం, శాసనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాడు.

శాసనాల వివరాలు[మార్చు]

ఈ శాసనాలలో ఆరిటిని పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది, కొన్ని శిథిలాలలో పాడవగా, కొన్ని చదవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఆ ఆరు శాసనాల వివరాలు:

  1. తల్లిదండ్రుల కోరిక మీద, కుర అనతుడు బుద్ధుని శరీరధాతువులనుంచటానికి ధాతుపేటిక, స్ఫటికపు భరిణెలను తయారు చేయించి, తండ్రి బనవునితో కలిసి బహూకరించాడు.
  2. పిఘని చిన్న కొడుకైన ఉత్తరుడు.
  3. నందపురానికి చెందిన స్త్రీలు, శ్రమణదేశానికి చెందిన స్వర్ణకారులు, గిలనగరానికి చెందిన గోష్టి చేసిన దానం.
    1. ఆ గోష్టిలో హిరణవఘవ, వుగలక, కలహ, విసక, తొరసిసి, శమన, ఓదల, అపక, అనుగహ, కుర, సతుఘపొతక, పొత, అలినక, వరున, పిగలవ, కొషకుని కొడుకు వపు, కుబీరక, శమనదాస, భరద, ఒడలొ, తొరతిసొ, తిస, గిలన, జంభ, పుదర, బుబొ...
    2. హిరణకరుని కొడుకైన బుబుడు, శమనుడు, కుబుడు
    3. సింహగోష్టి ప్రముఖుడైన కుబీరకరాజు, ఇంకా సంఘ ప్రముఖుల కొడుకులు కలిసి స్ఫటిక ధాతుపేటికలను, రాతిధాతుపేటికలను బహూకరించారు.

మొదటి శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౧
బ్రాహ్మీ లిపిలో పాఠ్యం తెలుగులో అర్ధం
1. కురపితునోచ కురమా
తుచకురస శివ సమజుసం పనతి
షాలిగ షముగంచ బుద్ధ శరీరానాం నిఖేతు
బుద్ధుని శరీర ధాతువులను
నిక్షిప్తం చేయుటకు 'కుర' అనే
అతడు తల్లిదండ్రుల
ఆజ్ఞమేరకు శివతో కలిసి
ధాతుకరండమును స్ఫటిక
పేటికను తయారు చేయించెను.
2. బసవ పుతస కురస పితుకస మజుస తండ్రి బసవనితో కలిసి కుర
అనే అతడు కరండాన్ని యిచ్చాడు.

రెండో శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౨

మూడో శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౩

నాల్గవ శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౪

ఐదో శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౫

ఆరో శాసనం[మార్చు]

రాజా కుబిరకుని భట్టిప్రోలు ధాతుపేటిక శాసనం ౬

మూలాలు[మార్చు]

  1. ది భట్టిప్రోలు ఇన్‍స్క్రిప్షన్, జె.ఎఫ్.ఫ్లీట్, ది జర్నల్ ఆఫ్ రోయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్, జనవరి ౧౯౦౮, పేజీలు ౯౯-౧౦౯