భట్టుపల్లె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భట్టుపల్లె(Bhattupalle) వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామము.

[1]వీరబల్లె మండల కేంద్రానికి 1.5కి.మీ ఆగ్నేయముగా ఉన్న దాదాపు 40 కుటుంబాల సమూహం. ఈ పల్లె చిన్నదే ఐనా, ఒక పద్ధతి ప్రకారం వీధులుగా విభజించబడి ఉన్నది. ఈ పల్లెలో మంగలి, చాకలి, కంసలి, బోయ, బెస్త, కల్లుగీత వృత్తుల వారు, హరిజనులు, మహమ్మదీయులు, అగ్రవర్ణాలుగా చెప్పబడినవారూ పొరపొచ్చాలేవీ లేకుండా జీవిస్తున్నారు. వృత్తి పనులు లేని సమయంలో వీరు ప్రధానంగా వ్యవసాయ కూలీలు. వీరబల్లె పట్టణానికి అతి సమీపములోనే ఉన్నా ఇటీవలే మంచి నీరు, విద్యుత్ సౌకర్యాలు పొందినది.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు