Jump to content

భద్రిరాజు కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
భద్రిరాజు కృష్ణమూర్తి
జననం19 జూన్, 1928
ఒంగోలు
మరణం2012 ఆగస్టు 11(2012-08-11) (వయసు 84)
హైదరాబాదు
మరణ కారణంఅనారోగ్యం
నివాస ప్రాంతంతార్నాక, హైదరాబాద్
వృత్తిద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు

ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (19 జూన్, 1928 - 11 ఆగష్టు, 2012). భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages) పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంథాలు, వ్యాసాలు రచించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో 1955లోమర్రీ బీ. ఎమెనో భాషాశాస్త్రంలో పరిశోధన గావించి పి.హెచ్.డీ. పట్టం పొందిన భద్రిరాజు కృష్ణమూర్తి 1928 జూన్ 19 తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించాడు. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలలో 1949-62 మధ్య లెక్చరర్ గాను, రీడర్ గానూ, 1962 నుంచి 1986 దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర శాఖలో తొలి ఆచార్యులుగానూ పనిచేసాడు. 1986 నుంచి 1993 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ గా ఉన్నాడు. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాలలోనూ, ఆస్ట్రేలియా, జపాన్ విశ్వవిద్యాలయాల్లోనూ ఆహుత ఆచార్యులుగా పనిచేసాడు. రష్యా, జర్మనీ, ప్రాన్స్, కజికిస్తాన్ మొదలైన దేశాల్లో పర్యటించాడు. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పరిశోధన సంస్థల్లో ప్రతిష్ఠాత్మకమైన పెలోషిప్‌లు, సభ్యత్వాలు పొందాడు. ఎమెనో గారి ప్రియ శిష్యుడు. అమెరికన్ లింగ్విస్టిక్ సొసైటీ గౌరవ సభ్యుడిగా 1985లో ఎన్నికయ్యాడు. భారత కేంద్ర సాహిత్య అకాడెమీ నిర్వాహక సభ్యుడుగా కూడా కొంతకాలం పనిచేసాడు. భద్రిరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.11.8.2012 న హైదరాబాదులో కన్నుమూశారు.

ప్రసిద్ధ రచనలు

[మార్చు]

ఈయన రచించిన ద్రవిడియన్ లాంగ్వేజెస్ (Dravidian Languages 2003) ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథం. కంపారిటివ్ ద్రవిడియన్ లింగిస్టిక్స్: కరెంటు పర్సెపెక్టివ్స్( 'Comparative Dravidian linguistics: Current perspectives' )అన్న పుస్తకం ఈయన 1955 నుంచి 1998 వరకూ ప్రచురించిన వ్యాసాల్లో ముఖ్యమైన 21 వ్యాసాల సంకలనం. కృష్ణమూర్తిగారి సిద్ధాంత గ్రంథం తెలుగు వెర్బల్ బేసెస్ ("Telugu Verbal Bases" -1961) ద్రావిడ భాషాధ్యయన రంగంలో ఒక మైలురాయిగా పండితులు భావిస్తారు. కొండా ఆర్ కూబి:ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్ ( 'Konda or Kubi: A dravidian language' -1969), జె.పి.ఎల్. గ్విన్ తో కలసి రాసిన ఎ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు ('A Grammar of Modern Telugu') డి. కోస్టిస్, ఏ మిట్టర్ తో కలిసి రాసిన ఎ షార్ట్ ఔట్లైన్ ఆఫ్ తెలుగు ఫొనెటిక్స్ ( 'A short outline of Telugu Phonetics' -1977), పేపర్స్ ఆన్ సోషియో లింగిస్టిక్స్ ( 'Papers on Socio-linguistics' -1998), తెలుగు వ్యాసాల సంకలనం "భాష, సమాజం, సంస్కృతి" కృష్ణమూర్తి గారి ముఖ్య గ్రంథాలు. ఇవిగాక అనేక ఆంగ్ల గ్రంథాలకు సంపాదకత్వం, సహ సంపాదకత్వం వహించారు.

తెలుగులో కృష్ణమూర్తి తయారు చేసిన వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలు మాండలిక పరిశోధనా రంగంలో కొత్త ద్వారాలు తెరిచాయి. ఆయన సంపాదకత్వం వహించిన "తెలుగు భాషా చరిత్ర"కు ఇప్పటివరకు ఏడు ముద్రణలు వచ్చాయి. మూడు భాగాలుగా వచ్చిన "తిక్కన పదప్రయోగ కోశా"నికి ఆయన సహసంపాదకులు. వయోజన విద్యకు సంబంధించిన వాచకాలు, ప్రవాసాంధ్రులకు తెలుగు నేర్పే వాచకాలు కూడా రాసాడు.

ఇవిగాకా ఈయన ఇంగ్లీష్‌లోనూ తెలుగులోనూ రచించిన తొంభై వ్యాసాలు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైనాయి. తను 24 యేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు వ్రాసిన ఛందోబద్ధ పద్యాలను "చిన్ననాటి పద్యాలు" అన్న పుస్తకంగా ప్రచురించారు.

తెలుగు పుస్తకాలు

[మార్చు]
భాష, సమాజం, సంస్కృతి
  1. 1962. మాండలిక వృత్తిపద కోశం (సం.) (వ్యవసాయం) vol. I: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. (పునర్ముద్రణ 1974).
  2. 1971. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. I. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
  3. 1972. మాండలిక వృత్తిపద కోశం (సం.) (వ్యవసాయం) vol. II: చేనేత పదకోశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
  4. 1974a. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. II. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
  5. 1974b. తెలుగు భాషా చరిత్ర(2వ ఎడిషన్ 1979; తెలుగు యూనివర్సిటీ చేత 7 మార్లు పునర్ముద్రణ).
  6. 1977. తిక్కన పదప్రయోగ కోశం (సం.) (అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వెంకటావధానితో కలిసి) vol. III. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
  7. 1980. 5 సంపుటాలుగా జనవాచకం (వయోజన విద్య) (ఈశ్వరరెడ్డితో కలిసి). వయోజన విద్యా డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  8. 1993. తేలిక తెలుగు వాచకం (Literacy Primer in Telugu, Parts I &II). విశాలాంధ్ర పబ్లిషర్స్.
  9. 1996. భారతీయ సాహిత్యం: సమకాలీన కథానికలు [in English] (బూదరాజు రాధాకృష్ణతో కలిసి). సాహిత్య అకాడమి.
  10. 1998. చిన్ననాటి పద్యాలు.
  11. 1999. భాష, సమాజం, సంస్కృతి - భద్రిరాజు కృష్ణమూర్తి, నీల్‌కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్.

ఇంగ్లీష్ పుస్తకాలు

[మార్చు]
రచయితగా
  1. Krishnamurti, Bhadriraju (1961). Telugu Verbal Bases: A Comparative and Descriptive Study (reprinted 1972). UCPL. Vol. 24. Berkeley and Los Angeles: University of California Press. ISBN 978-1258178437.
  2. Krishnamurti, Bhadriraju; P. Sivananda Sarma (1968). A Basic Course in Modern Telugu. Hyderabad: Department of Linguistics, Osmania University (reprinted in 2006 by Telugu Akademi, Himayatnagar, Hyderabad).
  3. Krishnamurti, Bhadriraju (1969). koṃḍa or Kūbi: A Dravidian Language. Tribal Cultural Research and Training Institute. Vol. 2. Hyderabad: Tribal Cultural Research and Training Institute, Govt. of Andhra Pradesh.
  4. Krishnamurti, Bhadriraju; Djordje Kostic', Alokananda Mitter (1977). A Short Outline of Telugu Phonetics. Calcutta: Indian Statistical Institute.
  5. Krishnamurti, Bhadriraju; J.P.L.Gwynn (1985). A Grammar of Modern Telugu. New Delhi: Oxford University Press. ISBN 978-0195616644.
  6. Krishnamurti, Bhadriraju; I. Ramabrahmam, C.R. Rao (1995). Evaluation of Total Literacy Campaigns: Chittoor and Nizamabad Districts of Andhra Pradesh. Hyderabad: Book Links Corporation. ISBN 9788185194356.
  7. Krishnamurti, Bhadriraju (1998). Language, Education and Society. New Delhi: Sage. ISBN 9788170366959.
  8. Krishnamurti, Bhadriraju (2001). Comparative Dravidian Linguistics: Current Perspectives. Oxford University Press, USA. ISBN 978-0198241225.
  9. Krishnamurti, Bhadriraju (2003). The Dravidian Languages. Cambridge Language Surveys (1 ed.). Cambridge: Cambridge University Press. ISBN 978-0521771115.
  10. Krishnamurti, Bhadriraju (2010). Studies in Telugu Linguistics. Hyderabad: C P Brown Academy. ISBN 9789380120997.
  11. 1977. A Short Outline of Telugu Phonetics. Calcutta: Indian Statistical Institute (co-authored with Djordje Kostic' and A. Mitter).
  12. 1984. Modernization of Indian Languages in News Media. (Ed. with Aditi Mukherji). Hyderabad: Department of Linguistics, Osmania University.
  13. 1992a. Dimensions of Sociolinguistics in South Asia (Papers in memory of Gerald Kelley).(Edited with Edward C. Dimock and Brah B.Kachru).Delhi: Oxford & IBH Publishing Co. P.Ltd.
  14. 1995. (co-authored with I. Ramabrahmam, C.R. Rao). Evaluation of Total Literacy Campaigns (Chittoor and Nizamabad Districts of Andhra Pradesh). Hyderabad: Book Links Corporation.
  15. 1998. Language, Education and Society. New Delhi: Sage India Private Ltd.
సంపాదకునిగా
  1. 1968a. (Ed.) Studies in Indian Linguistics (Professor M. B. Emeneau Ṣaṣṭ ipūrti Volume). Poona and Annamalainagar: Centres of Advanced Study in Linguistics.
  2. 1986. (Ed.) South Asian Languages: Structure, Convergence, and Diglossia (Proceedings of the Second International Conference of the South Asian Languages and Linguistics) (Assoc. eds. C. P. Masica and A. K. Sinha). Delhi: Motilal Banarsidass.
  3. 2004. (with Chaganti Vijayasree) eds. Gold Nuggets: An Anthology of Telugu Short Stories of the Post-Independence Period in Translation. New Delhi: Sahitya Akademi.

శిష్యవర్గం

[మార్చు]

భద్రిరాజు వద్ద ఆధునిక భాషాశాస్త్ర పద్ధతులలో శిక్షణ పొందిన వారిలో ప్రముఖులు కొందరు:

మూలాలు, వనరులు

[మార్చు]
  1. Comparative Dravidian linguistics: Current perspectives by Bhadriraju Krishnamurti. Oxford: Oxford University Press, 2001. ISBN 0198241224.
  2. DRAVIDIAN LANGUAGES by Krishnamurti, Bhadriraju. Cambridge University Press, 2003 ISBN 9780511060373.
  3. భాష, సమాజం, సంస్కృతి - భద్రిరాజు కృష్ణమూర్తి, నీల్‌కమల్ పబ్లికేషన్స్ ప్రై. లిమిటెడ్, 1999 ISBN 81-86804-46-3
  4. చందమామ పత్రిక బ్లాగు వ్యాసం

బయటి లింకులు

[మార్చు]