Jump to content

భరంపూర్ - శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

వికీపీడియా నుండి
భరంపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
పేరు
ఇతర పేర్లు:శ్రీ వేంకటేశ్వర ఆలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్ జిల్లా
ప్రదేశం:తలమడుగు మండలంలోని భరంపూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ వేంకటేశ్వర స్వామి
ఉత్సవ దైవం:శ్రీ వేంకటేశ్వరుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:6
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1992

భరంపూర్ - శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలంలోని భరంపూర్ సమీపంలోని చుట్టూ పచ్చని పంట పొలాలు,కొండల మధ్యలో ఎత్తైన కొండ పైన ఉంది. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది[1][2].

స్థలపురాణం

[మార్చు]

తలమడుగు మండలంలో భరంపూర్ శివారులో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ గుట్ట ప్రక్క నుండి వెళ్ళే వారికి గంట నాదాలు,భజన శబ్దాలు వినిపించేవి అని గ్రామ పెద్దలు చెబుతారు. ఒక సారి ఒక పశువుల కాపరులు కొండపైకి వేళ్ళరట ఐతే వాళ్ళకు శంఖు చక్రాలు దర్శనమీవ్వడంతో వారు సాయింత్రం గ్రామానికి వెళ్ళి గ్రామ పేద్దలతో జరిగిన విషయాన్ని చెప్పడంతో మరుసటి రోజున గ్రామస్థులందరు కలిసి ఆ గుట్ట పైకి వేళ్ళి పండితులకు వివరించారు. పండితుల సూచన మేరకు ఇచ్చట చిన్న గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారుని అంటారు.

బ్రహ్మోత్సవాలు

[మార్చు]

శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా వేడుకగా కొనసాగుతాయి. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య దంపతులతో మహాయాగం నిర్వహిస్తారు. మహిళలు భజన సంకిర్తనల మధ్య వేంకటేశ్వర స్వామి పల్లకి శోభాయాత్ర చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దీక్షపరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. వేంకటేశ్వరుడి పల్లకీ ఊరేగింపులో వేద పండితులు అధిక సంఖ్యలో హాజరవుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తలమడుగు మండలం భరంపూర్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తేది: 02 మార్చి 2025 నుంచి జరుగును. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. రెండు రోజున శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణం, మూడో రోజున దర్శన హవనం తిరుమంజనం, నాల్గో రోజున రథోత్సవం, లడ్డూ వేలం నిర్వహిస్తారు. మందిరాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యంత పురా తన ఆలయంగా ప్రసిద్ధి పొందింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తు లకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు మూడు రోజుల పాటు కొండపై భోజన వసతిని సైతం ఏర్పాటు చేశారు.

ఇతర ఆలయాలు

[మార్చు]

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల ప్రాంగణంలో వాల్మీకి ఆలయం, కాలభైరవ స్వామి, నవ నాగుల మండపం,వకుల దేవి ఆలయం, గణపతి, నవగ్రహ మండపం తదితర ఆలయాలు ఉన్నాయి.

విశేషాలు

[మార్చు]

పూర్వ కాలంలో ఈ గుట్ట సమీపం నుంచే వేళ్ళే వ్యవసాయదారులకు, భజన ,కీర్తనలు చేస్తున్నట్లు నాదాలు వినిపించడం ఇక్కడి ప్రత్యేకత.

మూలాలు

[మార్చు]
  1. "నీలో బందీ కావాలి.. లోకం చూడాలి". EENADU. Retrieved 2025-08-20.
  2. "పశువుల కాపరుల కంట పడ్డ అద్భుతం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే." telugu.news18.com. 2024-09-22. Retrieved 2025-02-18.