భరత్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భరత్ నగర్
సమీప ప్రాంతాలు
భరత్ నగర్ ప్లైఓవర్, మెట్రో స్టేషన్
భరత్ నగర్ ప్లైఓవర్, మెట్రో స్టేషన్
భరత్ నగర్ is located in Telangana
భరత్ నగర్
భరత్ నగర్
Location in Telangana, India
భరత్ నగర్ is located in India
భరత్ నగర్
భరత్ నగర్
భరత్ నగర్ (India)
అక్షాంశ రేఖాంశాలు: 17°27′48″N 78°25′44″E / 17.46333°N 78.42889°E / 17.46333; 78.42889Coordinates: 17°27′48″N 78°25′44″E / 17.46333°N 78.42889°E / 17.46333; 78.42889
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్ కోడ్
500018
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

భరత్ నగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ లోని కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఈ భరత్ నగర్ ఉంది. పూణే హైదరాబాద్ మచిలీపట్నం జాతీయ రహదారి పై ఉన్న ఈ భరత్ నగర్, ద్వారా ఉంది. మోతీనగర్ ఎన్నికల వార్డుకి తూర్పు భాగంలో ఉంది # 38290.[1]

పేరు వెనుక కథ[మార్చు]

1978కి ముందు ఇది ఫతేనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. వేరొక పేరుతో ఈ ప్రాంతానికి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ప్రజల తరపున అసోసియేషన్‌ సభ్యులు యం.వెంకటేశం, మధుసూదన్‌రాజు ఆధ్వర్యంలో దేశభక్తికి నిదర్శనంగా 1978లో భరత్‌నగర్‌ కాలనీగా పేరు మార్చుకున్నారు.[2]

మెట్రో స్టేషన్[మార్చు]

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ఆధ్వర్యంలో భరత్ నగర్ లోని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌, కూరగాయల మార్కెట్‌, భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి మధ్యలో మెట్రో స్టేషన్ ఏర్పాటుచేయబడింది. అన్ని స్టేషన్‌ల కంటే ఇది ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో వికారాబాద్, తాండూర్‌, పరిగి, శంకర్‌పల్లి ప్రాంతాలకు రైలు మార్గంలో ప్రయాణిస్తున్నారు.[2]

స్టేషన్ నిర్మాణం కారణంగా స్థానిక రైతుబజార్‌ను తొలిగించి , మెట్రో స్టేషన్‌ను రైతుబజార్‌గా మార్చేశారు. ప్రయాణికులు కూరగాయలను కొనుగోలు చేసుకోవడానికి రైతు బజార్‌లో ఉపయోగపడుతుంది. ఈ మెట్రో స్టేషన్ నుంచి భరత్‌నగర్ ఎంఎంటీఎస్ స్టేషన్‌కు, భరత్‌నగర్ ఫైఓవర్ బ్రిడ్జిలను అనుసంధానం చేస్తూ స్కైవాక్‌లు కూడా ఏర్పాటుచేబోతున్నారు.[3]

రవాణా వ్యవస్థ[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో భరత్ నగర్ మీదుగా కోఠి నుండి 225, 218D, ఉప్పల్ నుండి 113K, సికింద్రాబాద్ నుండి 10K, 10K/L,10K/18 నంబరు గల వివిధ బస్సులు నడుపబడుతున్నాయి. సమీపంలోనే భరత్ నగర్ రైల్వే స్టేషను కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Map: Delimitation of Election Wards: West Zone: Kukatpally: Circle-XIV". Greater Hyderabad Municipal Corporation (GHMC). మూలం నుండి 25 ఏప్రిల్ 2013 న ఆర్కైవు చేసారు. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. 2.0 2.1 ఆంధ్రజ్యోతి (11 December 2017). "భరత్‌నగర్‌.. రవాణా వ్యవస్థకు తలమానికం..!". మూలం నుండి 4 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 4 September 2018. Cite news requires |newspaper= (help)
  3. నమస్తే తెలంగాణ (29 June 2015). "ఆధునిక హంగులతో మెట్రో రైతుబజార్". మూలం నుండి 4 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 4 September 2018. Cite news requires |newspaper= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=భరత్_నగర్&oldid=2560497" నుండి వెలికితీశారు