Jump to content

భరత్ సింగ్

వికీపీడియా నుండి
భరత్ సింగ్
భరత్ సింగ్


పదవీ కాలం
2014 – 2019
ముందు నీరజ్ శేఖర్
తరువాత వీరేంద్ర సింగ్ మస్త్
నియోజకవర్గం బల్లియా

పదవీ కాలం
1996 – 2007
ముందు బిక్రమ్ సింగ్
తరువాత సుభాష్ యాదవ్
నియోజకవర్గం దోబా
పదవీ కాలం
1991 – 1992
ముందు భోలా నాథ్
తరువాత బిక్రమ్ సింగ్
నియోజకవర్గం దోబా

వ్యక్తిగత వివరాలు

జననం (1948-09-15) 1948 సెప్టెంబర్ 15 (వయసు: 77)
నవ్కా తోలా, బల్లియా , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రాంచీజ్ సింగ్, రామస్వరో దేవి
జీవిత భాగస్వామి
షీలా సింగ్ ​
(m. 1972)
సంతానం 1 కుమార్తె
పూర్వ విద్యార్థి జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

భరత్ సింగ్ (జననం 15 సెప్టెంబర్ 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉత్తరప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బల్లియా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భరత్ సింగ్ 1988లో భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1991, 1996, 2002లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై 2006 నుండి 2007 వరకు మంత్రిగా పని చేశాడు. ఆయన 2014 జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బల్లియా లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి నీరజ్ శేఖర్‌పై 1,39,434 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి 16వ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంట్‌లో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం & న్యాయంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడిగా, నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "BHARAT SINGH". The Times of India. 2024. Archived from the original on 16 June 2025. Retrieved 16 June 2025.
  2. "The Rebel, Ballia, and Its Political Thinkers" (in ఇంగ్లీష్). The Wire. 31 May 2024. Archived from the original on 16 June 2025. Retrieved 16 June 2025.