Jump to content

భలే మంచి చౌకబేరమ్

వికీపీడియా నుండి
సినిమా పోస్టర్

భలే మంచి చౌకబేరమ్‌ 2018లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె. రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో నవీద్‌, యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2018 అక్టోబరు 5న విడుదలైంది.[1]

ఉద్యోగం కోసం బ్రోకర్ల సాయంతో దుబాయ్ వెళ్లిపోదామని సొంతూరు నుంచి హైదరాబాదు వచ్చిన పార్థు (నవీద్), సలీమ్ (నూకరాజు) ఓ దళారీ చేతిలో మోసపోతారు. గత్యంతరం లేక హైదరాబాదులో చిన్న ఉద్యోగాలు చేస్తూ గడిపేస్తుంటారు. మరో పక్క మాజీ ఆర్మీ మేజరైన అయిన (రాజా రవీంద్ర) భారతదేశ రహస్యాల ఫైలును అమ్మేయాలని చూస్తాడు. అనుకోకుండా ఓ సంఘటన కారణంగా ఆ ఫైలి కొరియర్ బాయ్ అయిన సలీమ్ (నూకరాజు) కి దొరుకుతుంది. అతడు ఆ ఫైలును తెరిచి సగం చదివి.. దేశ రహస్యాలను పాకిస్తాన్‌కు అమ్ముదామని చూస్తాడు.

అయితే, మొదట్లో దీనికి ఒప్పుకోని పార్థు, ఆర్థిక సమస్యల కారణంగా చివరికి ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. ఈ క్రమంలో పాకిస్తానీ టెర్రరిస్టు అస్లామ్ భాయ్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. అంతలో తన ఫైలు కోసం వెతుకుతున్న రాజా రవీంద్రకి అది పార్థు, సలీమ్ ల దగ్గర ఉందని తెలుస్తుంది. మరి వారి నుండి తన ఫైల్ ను తిరిగి సంపాదిస్తాడా, లేదా? అసలు ఆ ఫైల్ ను పార్థు, సలీమ్ తీవ్రాదులకు అమ్ముతారా? అయినా ఆ ఫైలులో అంతగా రహస్యాలు ఏమున్నాయి అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • మూల భావన: మారుతి దాసరి
  • నిర్మాత: అరోళ్ళ సతీష్‌కుమార్‌
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ ముడిదాని
  • కథ, మాటలు: రవి నంబూరి
  • సంగీతం: హరి గౌర
  • బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి
  • పాటలు: పూర్ణాచారి
  • సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి
  • ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి
  • ఆర్ట్‌: మురళి ఎస్‌.వి
  • సమర్పణ: కె.కె.రాధామోహన్‌ (శ్రీసత్యసాయి ఆర్ట్స్‌)
  • సహ నిర్మాతలు: గుడ్ సినిమా గ్రూప్

మూలాలు

[మార్చు]
  1. Suryaa (26 September 2018). "'భలే మంచి చౌకబేరమ్' ట్రైలర్ రిలీజ్". cinema.suryaa.com. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
  2. Andhrabhoomi (6 October 2018). "మంచి.. చౌక భారమ్! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.